» »నీటిపై తేలియాడుతున్న వేయి శివలింగాలు, వేయి నందులు

నీటిపై తేలియాడుతున్న వేయి శివలింగాలు, వేయి నందులు

Written By: Venkatakarunasri

సిర్సి సందర్శించేవారు సహస్ర లింగ ప్రదేశాన్ని చూడవలసిందే. దీని అర్ధం వేయి లింగాలని చెపుతారు. ఈ ప్రదేశం సిర్సి పట్టణానికి 10 కి.మీ. దూరంలో శాలమాల నది ఒడ్డున ఉంది. దట్టమైన అడవులు గుండా ఈ నది ప్రవహిస్తుంది. ఈ ప్రదేశానికి వేడుకలు లేదా మహా శివరాత్రి పండుగలు తప్పితే, సాధారణంగా యాత్రికులు ఇచ్చటకు రారు. పండుగలలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి శివ భక్తులు అధికంగా వస్తారు. పూజలు చేయటమే కాక పర్యాటకులు ఈ దేవాలయంలోని ప్రవహించే నదిలోని సహస్ర శివలింగాలను దర్శించేందుకు కూడా వస్తారు. ప్రతి లింగానికి ఎదురుగా ఒక నంది కూడా ఉంటుంది.

మానవుడు ఏవిధంగానైతే ప్రశాంతంగా, ఆనందకరమైన జీవితం జీవించాలనుకుంటారో ఆ పరమశివుడు కూడా ఏకాంతప్రదేశాలలో నివసించటానికి ప్రకృతితో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు.
మనం బాగా గమనిస్తే మనదేశంలోని శివుడు పుణ్యక్షేత్రాలన్నీ అటువంటి ప్రశాంతవాతావరణంలోనే వున్నాయి. అటువంటి మరోశైవ క్షేత్రమే సహస్రలింగాల క్షేత్రం.శివుడు లింగాకారరూపంలో దర్శనమిచ్చే నిరాడంబరుడు.అందుకే ప్రక్రుతిఒడిలో,పచ్చనిఅరణ్యాల మధ్య,గల గలమంటూ జలజలపారే నీటి ప్రవాహంలో ఆ గంగమ్మ లయ బద్ధంగా సంగీతం చేస్తుంటే నీటి ప్రవాహంలో నుండీ నందితోకలిసి లింగాకారరూపంలో దర్శనమిస్తాడు శివుడు.

సంతానం కలిగినందుకు వేయి శివలింగాలు, వేయి నందులు

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

ఉత్తర కర్ణాటకలోని సిర్సీకి 15 కి.మీల దూరంలో సెల్మలా అనే నది ప్రవహిస్తూవుంటుంది.

ఇక్కడ వున్న రహస్యం ఏమిటి?

ఇక్కడ వున్న రహస్యం ఏమిటి?

ఆ నదిలోపలి రాళ్ళపై చెక్కబడిన 1000 నందులు,1000 శివలింగాలు భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తాయి.

ఏ సమయంలో శివుడు భక్తులకు దర్శనమిస్తాడు?

ఏ సమయంలో శివుడు భక్తులకు దర్శనమిస్తాడు?

సాధారణంగా ఇక్కడ నీటిప్రవాహం ఎక్కువగా వుంటుంది.అయితే శివరాత్రిసమయంలో మాత్రం నీటిప్రవాహం తగ్గిపోయి భక్తులకు శివుడు దర్శనమిస్తాడు.

మహా శివరాత్రి వుత్సవాలు ఎలా జరుపుకుంటారు?

మహా శివరాత్రి వుత్సవాలు ఎలా జరుపుకుంటారు?

చాలా సంబరంగా మహా శివరాత్రి వుత్సవాలను సహస్రలింగాలతో జరుపుకుంటారు భక్తులు.

సహస్రలింగాలను ఎవరు నిర్మించారు?

సహస్రలింగాలను ఎవరు నిర్మించారు?

ఇక్కడ స్థల పురాణంప్రకారం 1678,1718ప్రాంతాలలో విజయనగర సామ్రాజ్యానికి సామంతుడైన సదాశివరాయలు అనే రాజు సిరిసీప్రాంతాన్ని పాలించేవారు. ఆయనే ఇక్కడ సహస్రలింగాలు నిర్మించారని చెబుతున్నారు.

మొక్కు

మొక్కు

ఎటువంటి సంతానం లేని ఆ రాజు సంతానం కోసం ఆ పరమశివుడిని ప్రార్ధించి తనకు సంతానం కలిగితే సహస్ర లింగాలను నిర్మిస్తానని శివుడ్ని మొక్కు కోరుకుంటాడు.

వేయి శివలింగాలు, వేయి నందులు

వేయి శివలింగాలు, వేయి నందులు

కొన్నిరోజుల తర్వాత సదా శివరాయలకు కూతురు పుట్టడంతో వెంటనే ఆ పరమ శివుడ్ని ప్రార్ధిస్తూ ఇక్కడి రాళ్ళపై చిన్న చిన్న శివలింగాలను వాటికి ఎదురుగా నందులను చెక్కించాడు.

1000శివ లింగాలు

1000శివ లింగాలు

సహస్రశివలింగాలు అంటే 1000శివ లింగాలు అని అర్ధం కానీ అంతకంటే ఎక్కువ శివలింగాలు ఇక్కడ వుంటాయి.

కనువిందు చేసే సుందరశిల్పాలు

కనువిందు చేసే సుందరశిల్పాలు

అయితే ఇక్కడ కేవలం సహస్రశివలింగాలే కాకుండా అందంగా చెక్కబడిన సుందరశిల్పాలు కనువిందు చేస్తాయి.

రాత్రి సమయంలో నదీప్రవాహం

రాత్రి సమయంలో నదీప్రవాహం

సాధారణంగా నదీ ప్రవాహం ఇక్కడ ఎక్కువగా వుంటుంది.అదే శివ రాత్రి సమయంలో నదీప్రవాహం తగ్గుతుంది కాబట్టి ఆ శివ లింగాల దగ్గరకు భక్తులు వెళ్లి పూలమాలలు, మామిడి
తోరణాలతో పూజలు చేస్తూ డప్పులు వాయిస్తూచప్పుడు చేస్తూ నృత్యం చేస్తారు.

 ఇక్కడ దగ్గరలో చూడాల్సిన ప్రదేశాలు

ఇక్కడ దగ్గరలో చూడాల్సిన ప్రదేశాలు

మరికాంబ దేవాలయం, సిర్సి

17వశతాబ్దానికి చెందిన శ్రీ మరికాంబ దేవాలయం పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడ గల 7 అడుగుల చెక్క విగ్రహ దేవత మరికాంబను దర్శించేందుకు భక్తులు తరలి వస్తారు.

మరికాంబ దేవాలయం, సిర్సి

మరికాంబ దేవాలయం, సిర్సి

ఈ విగ్రహం ఒకప్పుడు సిర్సి పట్టణ పొలిమేరలలో ఒక నీటి సరస్సులో లభించినట్లు స్ధానికులు చెపుతారు. 1611 సంవత్సరంలో సోండా రాజు రెండవ సదాశివ రావు ఆ చెక్క విగ్రహాన్ని ఈ ప్రదేశంలో ప్రతిష్టించారు. అప్పటినుండి ఆ దేవి ఇక్కడ పూజలు అందుకుంటోంది. భక్తుల కోరికలు తీరుస్తోంది.

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

ఊంఛల్లి జలపాతాలను లషింగ్టన్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి సిర్సికి 30 కి.మీ. దూరంలో సిద్దాపూర్ తాలూకాలో ఉన్నాయి. 1845 లో అప్పటి బ్రీటీష్ ప్రభుత్వ జిల్లా కలెక్టర్ జె.డి. లషింగ్టన్ ఈ జలపాతాలు కనిపెట్టాడు. కనుక దానికి ఆయనపేరు పెట్టారు.

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

ఊంఛల్లి జలపాతాలు, సిర్సి

ఊంఛల్లి జలపాతాలను అక్కడి స్ధానికులు కెప్ప జోగ్ అంటారు. ఈ జలపాతం 381 అడుగుల ఎత్తునుండి పడుతుంది. ఈ జలపాతాలను సంవత్సరంలో ఏ సమయంలోఅయినా సరే చూడవచ్చు. ఇక్కడి పరిసరాలు పచ్చటి ప్రదేశాలు, నీటితో ఎత్తైన కొండల ఎత్తు పల్లాలతో ఆహ్లాదంగా ఉంటాయి.

గోపాల క్రిష్ణ దేవాలయం, సిర్సి

గోపాల క్రిష్ణ దేవాలయం, సిర్సి

మహాగణపతి దేవాలయం, మరికాంబ దేవాలయం ఉన్న చోటకు వచ్చే భక్తులు గోపాలక్రిష్ణ దేవాలయం కూడా తప్పక సందర్శిస్తారు. ఈ దేవాలయం 1886 లో ప్రతిష్టించబడింది. దీనిని శ్రీ క్రిష్ణ వాసుదేవ్ అనే స్వామిజీ భగవానుడికి నిర్మించారు. పై రెండు దేవాలయాలు చూసేవారు దీనిని తప్పక చూస్తారు.

గోపాల క్రిష్ణ దేవాలయం, సిర్సి

గోపాల క్రిష్ణ దేవాలయం, సిర్సి

ప్రతి గురువారం ప్రశ్న సేవ ఉంటుంది. దీనిలో భక్తులు తమ సందేహాలు, ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు తెలుసుకుంటారు. సమాధానాలు శ్రీ విఠలాచార్య అనే అర్చకులు ఇస్తారు. వేలాది భక్తులు శ్రీ క్రిష్ణ జయంతి, అనంత వ్రత, అర్చన పూజ లకు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు వస్తారు.

మహా గణపతి దేవాలయం, సిర్సి

మహా గణపతి దేవాలయం, సిర్సి

సమయం లభిస్తే పర్యాటకులు మరికాంబ దేవాలయం పక్కనే ఉన్న మహా గణపతి దేవాలయం కూడా తప్పక చూడాలి. ఇక్కడి అర్చకులు భక్తుల జాతకాలు చూసి వారి భవిష్యత్ చెపుతారు.

గణేశుడి ఆశీర్వాదం

గణేశుడి ఆశీర్వాదం

గణేశుడి ఆశీర్వాదంగా భావిస్తారు. వారు తమ భవిష్యత్ పై సందేహాలు, ప్రశ్నలు కూడా వేస్తారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రూట్ - 1

హైదరాబాద్ నుండి రాయచూర్ మీదుగా సిర్సీకి 11గంటలు పడుతుంది.

హైదరాబాద్ నుండి అనంతపూరు మీడుగానైతే 12గంలు పడుతుంది.

pc:google maps

బెంగుళూరు నుండి అయితే?

బెంగుళూరు నుండి అయితే?

సిరిసీ నుండి ఎల్లాపూర్ కు మార్గంలో 17కిమీ ల దూరంలో వుండే ఈ సహస్రలింగాల క్షేత్రం బెంగుళూరుకు సుమారు 500కి.మీల దూరంలో కలదు.

pc:google maps