• Follow NativePlanet
Share
» »మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

కేరళలోని కుమ్లీ పట్టణానికి 4 కి. మీ. దూరంలో ఉంది ఈ తెక్కడి. ప్రకృతిని ఆశ్వాదించే పర్యాటకులకి తెక్కడి భూలోక స్వర్గమనే చెప్పాలి. తమిళనాడులోని మధురైకి 120 కి. మీ. దూరంలోను, కేరళలోని కొచ్చికి 180 కి. మీ. దూరంలోను, కొట్టాయం రైల్వే స్టేషన్‌కు 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'తెక్కడి' ప్రాంతం వన్యప్రాణుల నిలయంగా ప్రసిద్డికెక్కింది. ఆహ్లాదం, ఆనందం పొందాలనుకునేవారు జీవితకాలంలో ఒక్కసారైనా 'తెక్కడి' అందచందాలను వీక్షించాల్సిందే.

ఆధ్యాత్మిక చింతననీ, ప్రకృతి సోయాగాన్ని ఏకకాలంలో ఆశ్వదించాలనుకుంటున్నారా?? అయితే తెక్కడిని సందర్శించాల్సిందే !!...వృత్తిరీత్యా క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్ళకి 3-4 రోజుల సెలవులు వస్తే విహారయాత్రగా తెక్కడిని ఎంచుకొనవచ్చు. అయితే దీని గురించి తెలుసుకుందామా మరి !.

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

ఏనుగు స్వారీ

తెక్కడికి వెళితే ముందుగా ఏనుగు స్వారీ చేయవలసిందే!!. మావటి చెప్పిన ప్రతి మాటా ఆది వినటం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత పెద్ద ఏనుగు ముందు మనిషి ఎంత?? అని మనకు అనిపిస్తున్నాకూడా మావటి చెప్పే మాటలని ఆది తూ. చా. తప్పకుండా పాటిస్తుంది.

Photo Courtesy: Liji Jinaraj

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

గ్రీన్ పార్క్

ఏనుగు స్వారీ చేసిన తరువాత, అక్కడి నుంచి 3 కి. మీ. దూరంలో గ్రీన్ పార్క్ ఉంది. ఇక్కడ సుగంధ ద్రవ్యాల మొక్కలు, ఆయుర్వేద ఔషధ మొక్కలూ మరియు రకరకాలైన పండ్ల మొక్కలూ ఇక్కడ తారసపడతాయి. అంతే కాదు మీకు కుందేళ్ళు కూడా కనిపిస్తాయి.

Photo Courtesy: Thierry Leclerc

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

కడతవందన్ కలరి కేంద్రం

కేవలం ఈ కళను ప్రదర్శించేందుకే దీన్ని నిర్మించారా??అనిపిస్తుంది. సుమారు 3000 సంవత్సరాల కాలం నాటి విద్య ఇది. కత్తి, డాలు, ఈటె... వంటి పరికరాలతో చేసే విన్యాసాలు నాయణానందాకరంగా ఉంటాయి. ఆయుధం ఉన్న వీరుదిని చిన్న తాడుతో మరో వీరుడు ఓడించడం, మండుతున్న చక్రం నుంచి ఒకేసారి ఇద్దరు వీరులు దూకడం వంటి విద్యలను కళ్ళతో చూడవలసిందేకానీ, వర్ణించడానికి వీలుకానిది.

Photo Courtesy: Simply CVR

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

తెక్కడి కథాకళి నృత్య కేంద్రం

మామూలు నృత్యాల వలె కాకుండా కథాకళిలో కళ్ళు, కనుబొమ్మలూ, చెంపలు, నోరు, నుదురుతో చేసే అభినయమే ఎక్కువ. కేరళ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కథాకళి చూడవలసిందే!!.

Photo Courtesy: Appaiah

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

పెరియర్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

ప్రశాంతమైన సరస్సులో గజరాజుల జలకాలాటలు.. ఎటు చూసినా ఏపుగా పెరిగిన కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల వృక్షాలు.. దట్టమైన అడవుల్లో చూపరులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే వన్యప్రాణులు.. ఆనందలోకాలకు తీసుకెళ్లే బోటు షికారు.. ఇంద్రధనుస్సులోని వర్ణాలన్నీ ఒకే చోట కలబోసినట్లు కట్టిపడేసే అందాలు.. ఇది దేశంలోకెల్లా పెద్దది. పశ్చిమ కనుమల్లో యాలకుల కొండలు, పాండలమ్ కొండలమీద విస్తరించి ఉన్నది. 777 చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో 25 చదరపు కిలోమీటర్ల ఒక సరస్సును నిర్మించినారు. కొండల మధ్యలో ఈ సరస్సు అందాలనూ చూడటానికి రెండుకళ్లూ చాలవనుకోండి!! కేరళలోకెల్ల పెద్దదైన పంపానది పుట్టినది ఇక్కడే మరి. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోనే ట్రెక్కింగ్, పడవ బోటింగ్, మ్యూజియం వంటివి ఏర్పాటు చేశారు. ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 1000 రూపాయలు. అందులోనే టిఫిన్, భోజనం పెడతారు. గైడ్ ని కూడా ఏర్పాటుచేస్తారు. ఇక్కడ అడవి ఏనుగులు, మలాబార్ జెయింట్ ఉడుత, అడవి దున్నలూ, దుప్పలూ చూడవచ్చు. ఇక్కడ పులులూ,ఎలుగుబంటీలూ వేశవికాలంలోనే ఎక్కువగా కనిపిస్తాయి.

Photo Courtesy: Thierry Leclerc

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

ట్రెక్కింగ్

గంటనా, రెండు గంటలా, మూడుగంటలా ఇలా ఏదైన మనమే ఎంచుకొనవచ్చు. కొండ ఎక్కగానే మనకు శబరిమలై అయ్యప్ప దేవాలయం కనిపిస్తుంది,ఇక్కడినుంచి దేవాలయం 6 కి. మీ. మాత్రమే!! ప్రయాణీకులు అభయారణ్యం ద్వారా అధికారులు ట్రెక్ అనుమతి పొందాలి. కేరళ అటవీ శాఖ, ప్రతి రోజు ట్రెక్ పర్యటనలు నిర్వహిస్తుంది.

Photo Courtesy: Kir360

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

మనసు ... ఒళ్ళు ఇక తుల్లింతే !!

పడవ విహారం

ఇక్కడ పడవ విహారానికో ప్రత్యేకత ఉంది. ఊటీ, నైనిటాల్ మాదిరిగా ఇక్కడ చుట్టూ జనాలు, భవనాలు కనిపించవు. ఇక్కడ సరస్సు కొండల మధ్యలో ఉండటం వల్ల ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఈ సరస్సు చివర గవి వాటర్ ఫాల్స్ మిమ్మలనుకనువిందు చేస్తాయి. అక్కడ రకరకాల జంతువుల ఎముకలను ప్రదర్శించే మ్యూజియం ఒకటి ఉన్నది. ఈ ప్రాంతంలో మనం ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా కోతులు మన సామాన్లను గల్లంతు చేసే అవకాశం ఉంది. ఇక్కడి కోతుల అల్లరి చేష్టలు పర్యాటకుల్ని నవ్విస్తుంటాయి.

Photo Courtesy: Appaiah

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి