Search
  • Follow NativePlanet
Share
» » భూత, ప్రేత పిశాచాలను దూరంగా ఉంచే పుణ్యక్షేత్రం ఇదే

భూత, ప్రేత పిశాచాలను దూరంగా ఉంచే పుణ్యక్షేత్రం ఇదే

పూనేకు దగ్గరగా ఉన్న జూజేరిలోని ఖండోబ దేవాలయం గురించి కథనం.

By Kishore

భారత దేశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం కుల, మత, ప్రాంతం, వర్గం ప్రతిపాదికన దైవ పూజ ఉంటుంది. అంటే హిందువుల విష్ణువు, ఈశ్వరుడిని పూజిస్తే, ముస్లీంలు అల్లాను ఆరాధిస్తారు. అయితే ఈ హిందూ , ముస్లీంలు ఒక్కరినే ఆరాధించడం చాలా అరుదైన విషయం. ఈ అరుదైన ఆరాధనకు మహారాష్ట్రలోని పూనే నగరానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూజేరిలోని ఖండోబా ఆలయం వేదిక అవుతోంది. ఇక్కడ కేవలం హిందూ ముస్లీంలే కాకుండా జైనులు కూడా పూజాది కార్యక్రమాలను నిర్వహించడం విశేషం. ప్రతి మతానికి చెందిన వారు ఖండోబ తమ వాడేనని చెప్పడమే కాకుండా అందుకు రుజువుగా జానపథ కథలను కూడా వినిపిస్తారు. ఈ ఖండోబ గురించి ఆయన లీలల గురించి మల్హరి మహత్మ్య గ్రంథంతో పాటు ఆయా రాష్ట్రాల జానపద కథల్లో కూడా వివరించారు. ఇక పూనే నుంచి నిత్యం జూజేరికి బస్సులు ఉంటాయి.

1. శివుడికి ప్రతి రూపంగా

1. శివుడికి ప్రతి రూపంగా

P.C: You Tube

శివుడి ప్రతిరూపంగా ఖండోబాను భావిస్తారు. ఆయకు కులమతాల పట్టింపులు లేవు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని కొంత భాగంలోని ప్రజలకు ఆయన కులదైవం. ఇందులో బ్రాహ్మణుల నుంచి ముస్లీం సోదరుల వరకూ ఉన్నారు. అంతేకాకుండా అనేక గిరిజన తెగలకు చెందిన వారు కూడా ఖండోబాను తమ కులదైవంగా భావిస్తుంటారు.

2. మల్హరి మహత్మ్య గ్రంథం

2. మల్హరి మహత్మ్య గ్రంథం

P.C: You Tube

ఖండోబా గురించి మల్హరి మహత్మ్య గ్రంథంతో పాటు ఆయా రాష్ట్రాల జానపద కథల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కండోబాను బైరవునిగా, సూర్యుడిగానే కాకుండా పరమశివుడి కుమారుడైన కార్తికేయుడిగా కూడా కొన్ని చోట్ల పూజిస్తారు. దక్కను పీఠభూమి ప్రాంతాల్లో ఈ ఖండోబా ఆరాధన 2 నుంచి 10 వశతాబ్దం వరకూ పెద్ద ఎత్తున సాగింది.

ఇద్దరు రాక్షసులు

ఇద్దరు రాక్షసులు

P.C: You Tube

పురాణాలను అనుసరించి మల్ల, అతని తమ్ముడైన మణి అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ దేవుడి నుంచి అనేక వరాలు పొందుతారు. వర గర్వంతో ఈ ఇద్దరు రాక్షసులు ప్రజలను, మునులను నిత్యం హింసిస్తూ ఉంటారు. ముఖ్యంగా లోక కళ్యాణం కోసం నిర్వహించే యాగాను ఎప్పుడూ ధ్వంసం చేస్తూ ఉంటారు.

 బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్లి

బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్లి

P.C: You Tube

వీరి బాధలను భరించలేక సప్త బుుషులంతటివారే బ్రహ్మ, విష్ణువు వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకొంటారు. అయితే వారికి ఉన్న వరం వల్ల తాము ఏమీ చెయ్యలేమని బ్రహ్మ, విష్ణవులు చెబుతారు. దీంతో వారంతా కలిసి పరమ శివుడి వద్దకు వెళుతారు.

 మార్తాండ భైరవ అవతారన్ని ఎత్తి

మార్తాండ భైరవ అవతారన్ని ఎత్తి

P.C: You Tube

వారి బాధలను విన్న పరమశివుడు మార్తాండ భైరవ అవతారాన్ని ఎత్తి మల్ల, మణి రాక్షసులను వధిస్తాడు. ఆ మార్తాండ భైరవ అవతారాన్నే ఖండోబాగా పిలుస్తారు. ఇక మణి చనిపోయేసమయంలో పశ్చాత్తాపంతో తన తెల్లని గుర్రాన్ని ఖండాబాకు ఇస్తాడు.

ఆ తల ఆలయం మెట్ల పై

ఆ తల ఆలయం మెట్ల పై

P.C: You Tube

అంతేకాకుండా తాను నిత్యం ఖండాబాకు ఎదురుగా ఉండేలా వరాన్ని పొందుతాడు. అయితే మల్ల కూడా చనపోతూ తనకు ప్రపంచాన్ని నాశనం చేసేలా శక్తి ఇవ్వాల్సిందిగా శివుడిని కోరుతాడు. దీంతో శివుడు కోపంతో మల్ల శిరస్సును ఖండించడమే కాకుండా ఆ తల తన ఆలయం ఎదురు మెట్ల పై ఉంటుందని చెబుతాడు.

 పిశాచాల భయం

పిశాచాల భయం

P.C: You Tube

తన దర్శనం అయిన తర్వాత ఆ తలను చూసినవారికి భూత, ప్రేత, పిశాచాల భయం ఉండదని కూడా చెబుతారు. అందువల్లే ఖండోబా ఆలయానికి వెళ్లిన వారు స్వామి దర్శనంతో పాటు ఈ రాక్షసుడి దర్శనాన్ని కూడా చేసుకొంటారు. దీని వల్ల భూత, ప్రేత, పిశాచాల భయం ఉండదని భక్తుల నమ్మకం.

ఐదుగురు భార్యలు

ఐదుగురు భార్యలు

P.C: You Tube

ఖండోబాకు ఐదుగురు భార్యలని ఈయన గురించి వివరించే జానపద కథలు చెబుతాయి. వారంతా వివిధ మతాలు, తెగలకు చెందినవారు. అందులో ఒక ముస్లీం వర్గానికి చెందిన ఆమె కూడా ఉంది. అయితే ఆయనతో పాటు గుడిలో పూజలు అందుకునేవారుమాత్రం మాల్సా, బనాయి. వీరిద్దరినీ పార్వతీదేవి, గంగమ్మ తల్లికి ప్రతిరూపాలుగా భావిస్తారు.

 జానపద కథలను అనుసరించి

జానపద కథలను అనుసరించి

P.C: You Tube

జానపద కథల్లో మాత్రం ఇద్దరు భార్యలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారని చెబుతాయి. అందువల్లే ఖండోబ ప్రధాన దేవాలయం అయిన జెరూరి వద్ద ఉన్న కొండలో పై భాగంలో మల్సాతో కూడిన కండోబ ఉంటాడు. అదే విధంగా కింది భాగంలో బనాయితో కూడిన ఖండోబా ఉంటారు. అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఖండోబా ఈ ఇద్దరితో కలిసి ఉంటారు.

దక్కన్ పీఠభూమి ప్రాంతంలో

దక్కన్ పీఠభూమి ప్రాంతంలో

P.C: You Tube

దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఖండోబాకు దాదాపు 600 దేవాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో జెజురిలో ఉన్న ఆలయం ప్రధానమైనది. ఇక్కడ ఖండాబాను ఆరాధించేవారు తప్పక 11 నియమాలను పాటిస్తూ ఉంటారు. వీటిని జాగ్రుత్ అని పిలుస్తారు. తెలంగాణలోని కొమురవెళ్లిలో కూడా ఈ ఖండోబా ఆలయం ఉంది. అదే విధంగా కర్నాటకలో పలుచోట్ల ఖండోబాను మైలర లింగేశ్వర పేరుతో కొలుస్తూ ఉంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X