» »రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు !

రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు !

Written By:

రాయల వైభవానికి ప్రతీక ఈ హంపి ఉత్సవాలు అని చెప్పవచ్చు. సుమారు 500 ఏళ్ల క్రితం ఇంచుమించు దక్షిణ భారతదేశం అంతా వ్యాపించిన విజయనగర సామ్రాజ్యం గురించి భారత దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనూ కీర్తించారు. ఈ సామ్రాజ్యానికి విదేశీ రాయబారులు, యాత్రికులు స్వయంగా వచ్చి ఇక్కడి విశేషాలను చూసి వాటిని గ్రంధంలో వ్రాశారు.

రాయల వంశాన్ని స్థాపించింది హరిహర రాయలు, బుక్కరాయలు అయినప్పటికీ విజయనగర సామ్రాజ్యం అంటే అందరికీ గుర్తొచ్చేది మాత్రం శ్రీకృష్ణదేవరాయలు. ఈయన రాయల వంశంలో అగ్రగణ్యుడు మరియు ఇతని పరిపాలన కాలాన్ని గొప్ప స్వర్ణ యుగం గా పేర్కొన్నారు. స్వర్ణ యుగం అని చెప్పడానికి కారణం రాయల కాలంలో వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారట.

ఇది కూడా చదవండి : హంపి - హోస్పేట్ మధ్య గల పర్యాటక ప్రదేశాలు !

ఇంతటి ఘనకీర్తి సంపాదించిన విజయనగర సామ్రాజ్యం గురించి, దాని గత చరిత్ర, వైభవాల గురించి చాటిచెప్పే ఉత్సవాలే హంపి ఉత్సవాలు. రాయల వారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే హంపి ఉత్సవాలు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటిని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఉత్సవాలను తిలకించేందుకు దేశవిదేశాల నుండి యాత్రికులు తరలివస్తుంటారు. ప్రస్తుతం జనవరి 9 నుండి 11 వరకు హంపి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వీటిని ఎక్కడ జరుపుతారు ? ఎలా జరుగుతుంది అనే విశేషాలకి వస్తే ...

హంపి ఉత్సవాలను ఎక్కడ నిర్వహిస్తారు ?

హంపి ఉత్సవాలను ఎక్కడ నిర్వహిస్తారు ?

ఆంధ్ర ప్రదేశ్ కు సరిహద్దు జిల్లాగా ఉన్న బళ్ళారిలోని హంపిలో హంపి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఒకప్పుడు హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా భాసిల్లింది. ఇక్కడున్న ఎన్నో చారిత్రక కట్టడాలు, అంతులేని సంపద ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. హంపి ఉత్సవాల సమయంలో జరిగే మహోన్నత ఘట్టం రాయలవారి పట్టాభిషేక మహోత్సవం.

చిత్ర కృప : vinay's

విజయ ఉత్సవ్

విజయ ఉత్సవ్

"దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న కృష్ణదేవరాయలు అంటే తెలుగు ప్రజలకు వళ్లమాలిన అభిమానం. మన సంస్కృతిని, ప్రాచీన కళలను మరిచిపోకుండా ... శ్రీకృష్ణ దేవరాయల గత వైభవాన్ని చిరకాలం గుర్తుకుతెచ్చేలా ... మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాలే హంపి ఉత్సవాలు. ఈ ఉత్సవాలకు గల మరోపేరు హంపి పండగ లేదా విజయ ఉత్సవ్.

చిత్ర కృప : Gennaro Serra

ఏమి చేస్తారు ?

ఏమి చేస్తారు ?

హంపిలోని పురాతన కట్టడాలకు, నిర్మాణాలకు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో ఒక కొత్త శోభను తీసుకువస్తారు.

చిత్ర కృప : Ranjan Sakalley

ఏమి చేస్తారు ?

ఏమి చేస్తారు ?

హంపి ఉత్సవాల కొరకు వేదికలను ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం 5 వేదికలను సిద్ధం చేశారు. వాటికి గల పేర్లు శ్రీకృష్ణదేవరాయ వేదిక, ఎంపీ ప్రకాష్ వేదిక, ధరోజీ ఈరమ్మ వేదిక, హక్క, బుక్క వేదికలు, విద్యారణ్య వేదిక.

చిత్ర కృప : Ramkumar S

ఏమి చేస్తారు ?

ఏమి చేస్తారు ?

ఇంతకు ముందు పేర్కొన్న 5 వేదికల వద్ద మూడు రోజుల పాటు వివిధ సాంస్కృతిక, జానపద, సినీ, నృత్య, హాస్య ఇలా చెప్పుకుంటూ పోతే మన సంస్కృతి వారసత్వాలకు అద్దం పట్టేలా శ్రీకృష్ణదేవరాయల పాలన గత వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

చిత్ర కృప : Photography club

క్రీడలు

క్రీడలు

హంపి ఉత్సవాల్లో క్రీడలకు పెద్దపీట వేస్తారు. ఈ ఉత్సవాల్లో గ్రామీణ క్రీడలు, సాహస క్రీడలు, కుస్తీ పోటీలు, కబడ్డీ ఇంకా ఇతర క్రీడలు ఎంతో ఆకట్టుకుంటాయి.

చిత్ర కృప : Amit Rai Chowdhury

గాలిపటాలు

గాలిపటాలు

హంపి ఉత్సవాల సమయంలో ప్రత్యేకంగా ఆకట్టుకొనే ఉత్సవం గాలిపటాల ఉత్సవం. ఈ ఉత్సవంలో పాల్గొనటానికి పెద్దలు, పిల్లలు ముఖ్యంగా యువత అమితమైన ఆసక్తిని కనబరుస్తారు.

చిత్ర కృప : Arun Keerthi K. Barboza

ఇంకా ..

ఇంకా ..

విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్ళకు కట్టే విధంగా లైట్ అండ్ సౌండ్ సిస్టం, లేజర్ షో లను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటుగా కర్నాటక రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే ప్రఖ్యాత కళాకారులు పలురకాల నృత్య ప్రదర్శనలు చేస్తారు.

చిత్ర కృప : Karnataka Tourism

వసతులు

వసతులు

ప్రతి ఏటా నిర్వహించే హంపి ఉత్సవాలను తిలకించేందుకు దేశవిదేశాల నుండి యాత్రికులు వస్తుంటారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను సిద్ధం చేస్తారు. కాటీజీలు, భోజన వసతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు.

చిత్ర కృప : Dahlia

హంపి ఎలా చేరుకోవాలి ??

హంపి ఎలా చేరుకోవాలి ??

హంపి వెళితే రాయల కాలానికి వెళ్లినట్టే అని చాలా మంది భావిస్తుంటారు. మరి అంతటి భాగ్యం మనకు లేదా అంటే ... !

వాయు మార్గం

హంపి లో విమానాశ్రయం లేదు కానీ 60 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి వద్ద దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం బెంగళూరు, ముంబై, నాగ్‌పూర్, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాలకు అనుసంధానించబడి ఉంది. ఈ విమానాశ్రయంలో దిగి క్యాబ్ లేదా ఇతర రవాణా సాధనాలను ఉపయోగించి హంపి చేరుకోవచ్చు.

రైలు మార్గం

హంపి లో రైల్వే స్టేషన్ లేదు. దీనికి సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ హోస్పేట్ రైల్వే స్టేషన్. ఇది హంపి నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బెంగళూరు, హుబ్లీ, పూణే, సొలాపూర్, చెన్నై, ముంబై, బెల్గాం, పనాజీ, హైదరాబాద్ వంటి నగరాల నుండి నిత్యం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. హోస్పేట్ రైల్వే స్టేషన్ లో దిగి బస్సు లేదా క్యాబ్ వంటి వాహనాల్లో హంపి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

చారిత్రక పట్టణమైన హంపి కి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. చక్కటి రోడ్డు వ్యవస్థ కలిగిన హంపి కి బళ్ళారి, బెంగళూరు వంటి ప్రదేశాల నుండి ప్రభుత్వ బస్సులు, ప్రవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

చిత్ర కృప : Pablo Pecora

Please Wait while comments are loading...