Search
  • Follow NativePlanet
Share
» »ఈ ఆలయంలో రెండు ప్రత్యేకతలు..ఒకటి ఆసియాలోనే పెద్ద రథం..రెండవది రెండు రహస్యగదుల్లో గుప్తనిధులు!

ఈ ఆలయంలో రెండు ప్రత్యేకతలు..ఒకటి ఆసియాలోనే పెద్ద రథం..రెండవది రెండు రహస్యగదుల్లో గుప్తనిధులు!

తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రముఖంగా త్యాగరాజేశ్వరుడు కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం ఈ ఆలయ విశిష్టతను ప్రస్తావించే సందర్భంలో ముఖ్యమైన దైవ స్వరూపాలుగా ఉన్న వాల్మీకేశ్వరుడు, సోమాస్కంద మూర్తి, కమలాంబికల గురించి కూడా విశేషంగా పేర్కొన్నాయి.

పురాణ గాథలు ప్రకారం

పురాణ గాథలు ప్రకారం

pc:Kasiarunachalam

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ‘షణ్ముఖ వైభవం’ ప్రవచనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించడం జరిగింది. పురాణ గాథాల ప్రకారం ఒక సారి రాక్షసులకు మరియు ఇంద్రునికి మధ్య యుద్దం సంభవించింది. ఆ సమయంలో ఇంద్రునికి ముచికుందుడు సహాయం చేశాడట. అందుకు ప్రతి ఫలంగా ముచికుందుడు ఇంద్రుడు పూజించే సోమాస్కంద మూర్తిని కావాలని కోరుతాడు.

సోమాస్కంద మూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి

సోమాస్కంద మూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి

PC: Nsmohan

సోమాస్కంద మూర్తిని మొదట విష్ణువు కొంతకాలం పూజించి తర్వాత దాన్ని ఇంద్రునికి ఇస్తాడు. అయితే ఆ విగ్రహాన్ని ముచికుందుడుకు ఇవ్వడానికి ఇష్టపడని ఇంద్రుడు రాత్రికి రాత్రి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి ఆ మూర్తిని అచ్చంగా పోలి ఉండే మరో ఆరు మూర్తులను తయారుచేయిస్తాడు. అయితే ముచికుంద శివుని అనుగ్రహంతో అసలు మూర్తిని గుర్తించడంతో ఇంద్రుడు ఆ సోమాస్కంద మూర్తిని ముచికుందకు ఇవ్వక తప్పలేదు. అలా పొంది పూజించిన సోమాస్కందమూర్తినే ముచికుందుడు తిరువారూర్ లో ప్రతిష్టించాడు. ఈ మూర్తినే వీధి విడంగర్ అని పిలుస్తుంటారు.

సప్తవిడంగ స్థలములుగా పిలిచే మిగిలిన ఆరు

సప్తవిడంగ స్థలములుగా పిలిచే మిగిలిన ఆరు

PC: Kasiarunachalam

సప్తవిడంగ స్థలములుగా పిలిచే మిగిలిన ఆరు తిరునల్లార్ లోని నాగర్ విడంగర్, నాగపట్టణంలో సుందర విడంగర్, తిరుకువలమైలో అవని విడంగర్, తిరువాయిమూర్ లో నీల విడంగర్, వేదారణ్యంలో భువని విడంగర్, తిరుకరవసల్ లో ఆది విడంగర్ పేరుతో త్యాగరాజ స్వామి ఈ ఏడు ప్రాంతాలలో పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం క్రీశ 7 వ శతాబ్ద౦లోని శైవ నాయన్మార్ల తేవర శ్లోకాల ద్వారా ప్రసిద్ధిచెందింది.

పంచభూతాలలో పృథ్వీ స్థానం పొందిన ఈ క్షేత్రంలో

పంచభూతాలలో పృథ్వీ స్థానం పొందిన ఈ క్షేత్రంలో

పంచభూతాలలో పృథ్వీ స్థానం పొందిన ఈ క్షేత్రంలో జన్మించిన వారికి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. శివ భూతగణాలే ఈ ప్రాంతంలో జన్మిస్తారని విశ్వసిస్తారు. సుందరార్ తన తేవారంలో ‘తిరువారూర్'లో జన్మించిన వారందరికీ నేను బానిసను అని ఈ స్థల ప్రాశస్త్యాన్ని తెలుపుతున్నది.

వాల్మికినాతార్ మందిరం త్యాగరాజస్వామి మందిరం కన్నా పెద్దది

వాల్మికినాతార్ మందిరం త్యాగరాజస్వామి మందిరం కన్నా పెద్దది

Ssriram mt

తిరువారూర్ లోని ఈ ఆలయ ప్రధాన దేవతను రెండుగా విభజించారు, ఒకటి వాల్మీకినాదార్ రూపంలో పూజించబడే శివుడు, మరొకటి త్యాగరాజ విగ్రహం. వాల్మికినాతార్ మందిరం త్యాగరాజస్వామి మందిరం కన్నా పెద్దదిగా ఉంటుంది. వల్మికినతార్ ఆలయంలో ఒక పుట్ట లేదా సాంప్రదాయ శివలింగం స్థానంలో ఒక "పుత్రు" ఉంది.

శ్రీ త్యాగరాజస్వామి ఆలయం తొమ్మిది రాజగోపురాలు

శ్రీ త్యాగరాజస్వామి ఆలయం తొమ్మిది రాజగోపురాలు

pc: Kasiarunachalam

శ్రీ త్యాగరాజస్వామి ఆలయం తొమ్మిది రాజగోపురాలు, ఎనభూ విమానములు, పదమూడు మంటపాలు, పదిహేను పవిత్ర బావులు, మూడు పూలతోటలు, మూడు పెద్ద ప్రాకారాలు, వెయ్యికి పైగా ఉపాలయాలతో ఆ ఆలయం ఎంతో విశాల ప్రాంగణంలో కొలువుదీరి ఉంది.

సాధారణంగా శివాలయాలలో ఉండే విధంగా

సాధారణంగా శివాలయాలలో ఉండే విధంగా

సాధారణంగా శివాలయాలలో ఉండే విధంగా చండికేశ్వరునితో పాటు యముడు తనకు ఇక్కడ ఏమీ పని లేదని చెప్పడంతో ఆయనను కూడా చండికేశ్వరుని స్థానంలో ఉండమనడంతో యమ చండికేశ్వరుడు అనే పేరుతో కొలువై ఉన్నారు.

ఈ ఆలయంలో అమ్మవారు కమలాంబికా అమ్మవారు

ఈ ఆలయంలో అమ్మవారు కమలాంబికా అమ్మవారు

ఈ ఆలయంలో అమ్మవారు కమలాంబికా అమ్మవారు కాలుపై కాలు వేసుకుని ఠీవిగా కూర్చొని ఉంటడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఇటువంటి భంగిమలో అమ్మవారు మనకి మరెక్కడా కనబడరు. ఈ స్థితిలో కూర్చుని అమ్మవారు శివుని ధ్యానిస్తూ ఉంటారని, కామంపై విజయం సాధించిన దానికి ఇది నిదర్శనం అని భక్తులు విశ్వసిస్తారు.

వాల్మీకనాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు

వాల్మీకనాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు

వాల్మీకనాథుడు అనే పేరుతో ఇక్కడ కొలువైన శివుడు ఒక పుట్టలో వెలసిన స్వామి అని దేవతల ప్రార్థననుసరించి ప్రత్యక్షమైన ఈ స్వామికి ఏ విధమైన అభిషేకాలు ఉండవు. అనంతీశ్వరుడు, నీలోత్పలాంబ, అసలేశ్వరుడు, అడగేశ్వరుడు, వరుణేశ్వరుడు, అన్నామలేశ్వరుడు మొదలైన ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు.

 నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటా

నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటా

ఇతర శివాలయాలలో మాదిరిగా కాకుండా ఇక్కడి నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటారు. ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది. ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది.

ఈ ఆలయంలో కనిపించే కొలనునే కమలాలయం అని పిలుస్తారు

ఈ ఆలయంలో కనిపించే కొలనునే కమలాలయం అని పిలుస్తారు

ఈ ఆలయంలో కనిపించే కొలనునే కమలాలయం అని పిలుస్తారు. ఇది అతి విశాలమైన సుందరమైనదిగా దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి విష్ణువును వివాహమాడాలని ఇక్కడి మూలస్థానేశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసింది. అందుకే ఇక్కడి కోనేరుకు కమలాలయం అని పేరు వచ్చింది. ఈ కోనేరు ఆలయమంత పెద్దది, ముప్పై మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ది చెందినది. కొలను మధ్యలో నాదువన నాథుని ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడి ప్రదోష అభిషేకం చాలా విశేషంగా ఉంటుంది.

మొత్తం ఇక్కడున్న అరవై నాలుగు తీర్థాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రశస్తిని

మొత్తం ఇక్కడున్న అరవై నాలుగు తీర్థాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రశస్తిని

మొత్తం ఇక్కడున్న అరవై నాలుగు తీర్థాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రశస్తిని కలిగి భక్తులను అనుగ్రహిస్తుంటాయి. పడమటి గోపురానికి ఎదురుగా ఉన్న దేవనీర్థ కట్టం అన్నింటిలోకి విశేషమైనదని ప్రశస్తి.

త్యాగరాజస్వామి ఆలయంలో రెండు రహస్యగదులలో

త్యాగరాజస్వామి ఆలయంలో రెండు రహస్యగదులలో

Ssriram mt

త్యాగరాజస్వామి ఆలయంలో రెండు రహస్యగదులలో గుప్తనిధులున్నట్లు శిలాఫలకాలు వెల్లడిస్తున్నాయి. చారిత్రాత్మిక త్యాగరాజస్వామి ఆలయంలో వున్న రథం ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ రథం. దీనిని రూ.2.17 కోట్ల వ్యయంతో రూపొందించించారు.

తిరువారూర్ ప్రాంతాన్ని అనునీతి చోళుడు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు

తిరువారూర్ ప్రాంతాన్ని అనునీతి చోళుడు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు

తిరువారూర్ ప్రాంతాన్ని అనునీతి చోళుడు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు. అనతి కుమారుడు రథంలో వస్తుండగా ఒక దూడ అతని రథానికి అడ్డు పడి మరణిస్తుంది. రాజు వద్దకు వెళ్ళి న్యాయం కోరిన ఆవుకు అభయం ఇచ్చిన రాజు దూడ ప్రాణాలు తీసిన పాపానికి ఆ రాజకుమారుని కూడా రథచక్రాల క్రింద చంపవలసిందిగా శిక్షను ఖరారు చేసి అమలు పరుస్తాడు. ఆ రాజు దర్శనిరతికి ప్రీతి నందిన యముడు తన స్వస్వరూపంతో ప్రత్యక్షమై రాజును అనుగ్రహిస్గాడు. దీనికి గుర్తుగా ఇప్పటికీ రాతి రథంపై ఈ గాథ అంతా కళ్ళకు కట్టినట్లు చెక్కి ఉండటం దర్శనమిస్తుంది.

ఈ ఆలయంలో ఉన్న రథం తమిళనాడులోనే ఎంతో ప్రఖ్యాతమైనది, అందమైనది.

ఈ ఆలయంలో సాయంత్రంలో జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది

ఈ ఆలయంలో సాయంత్రంలో జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది

ఈ ఆలయంలో సాయంత్రంలో జరిగే ప్రదోష పూజ చాలా విశేషమైనది. సాక్షాత్తుగా దేవేంద్రుడే ఆ సమయంలో ఇక్కడకు వచ్చి స్వామిని పూజిస్తాడని, మొత్తం దేవగణమంతా అందులో పాల్గొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more