• Follow NativePlanet
Share
» »తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

ప్రపంచవ్యాప్తంగా తిరుమలతిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక గుర్తింపు వుంది. ఏడుకొండలలో వెలసిన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోటానికి ప్రపంచనలుమూలల నుండి భక్తులు తరలివస్తూంటారు. అయితే ఇది ఇక్కడవున్న స్వామివారి మూల విరాట్టు స్వామివారిది కాదు.అమ్మవారిది అని కొందరి వాదన.మరి వారు అలా అనటానికి కారణాలేంటి?అక్కడ వెలసింది శివుడా?లేక విష్ణువా?అనేది మనం ఈ వ్యాసంలో తెలుసుకుందాం. తిరుమల అంటే అదో విశేష ఖజానా.అదో అంతుచిక్కని రహస్యాలనిధి. ఏడేడు 14లోకాలలోని అపురూపసమాచారమంతా ఆ ఏడుకొండల్లో నిక్షిప్తమై వుంటుందంటే ఎలాంటి అనుమానంలేదు. ఈ పుణ్యస్థలం కవులకు కవనవనమని, కార్మికులకు కార్య క్షేత్రమని,భక్తులకు వైకుంటం అని, శరణార్థులకు అభయమిచ్చే ప్రాంగణంఅని, అలాగే తిరుమల శైవులకు క్షేత్రమని, సాత్వీయుల శక్తిపీటమని కూడా అంటారు.

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

బాలాజీ అని పిలవటంలో ఆ మూలవిరాట్టు బాలత్రిపురసుందరి కావటమే కారణమని చెప్తారు. నిజానిజాలెంత అనే విషయానికొస్తే అన్నమాచార్యకీర్తనల్లోకూడా బాలాజీలోని బాల శబ్దానికి అర్ధమిదే అని చెప్పిన దాఖలాలు వున్నాయి.అన్నమయ్య వివిధ కీర్తనలతో కీర్తిస్తాడు.ఇదే కీర్తనలతో వేంకటేశ్వరున్ని వైష్ణవులు, శైవులు శివుడిగా,కాపాలకులు ఆదిభైరవుడిగా కొలుస్తారని పేర్కొంటారు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

ఇదే ఇక్కడ పరిశీలనాంశమైంది.తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడు అసలు విష్ణురూపంకాదన్నది ఒక వాదన. మూలవిరాట్టు వెనకభాగంలో జడ వుంటుందట.అంటే దీనర్ధం ఏమిటి?అమ్మవారనేగా అంటారు కొందరు సాత్వీయులు.దీనికి తోడు వేంకటేశ్వరున్ని బాలాజీ అని వుత్తరాదిప్రజలు పిలుస్తూంటారు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

దీనికి కారణం ఈ మూర్తి బాలాత్రిపురసుందరి రూపం అన్నది మరో వాదన.అసలు స్వామివారికి జరిగే పూజలు సాత్వీయులు అమ్మవారికి మాత్రమే చేస్తారు. అవి విష్ణుసాంప్రదాయానికి చెందినవి కాకున్నా,ఆచారంలో వున్నాయని అంటారు.దీన్ని బట్టి మూలవిరాట్టు బాలాత్రిపురసుందరీఅమ్మవారు అంటారు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

ఆది శంకరుడు ఈ స్థలం సందర్శించినప్పుడు, మూలవిరాట్టు పాదం క్రింద శ్రీచక్రం ప్రతిష్టించారు.విష్ణుపాదాలకు,శ్రీచక్రానికి సంబంధం ఏమిటిఇదంతా అలా వుంచితే శిల్పశాస్త్రజ్ఞులప్రకారం మూల విరాట్టు విగ్రహం స్త్రీమూర్తికొలతలకు సరిపోతాయట.అందుకే వక్షస్థలం మూసివేస్తూ శ్రీదేవిని, భూదేవిని వుంచారనేది వీరి వాదన.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

విగ్రహం వెనక అమ్మవారి రూపం వుంది.అందుకే ఆ విగ్రహం అయ్యవారిది కాదు.శక్తిస్వరూపిణి అంటూ పేర్కొంటారు. అసలు శరన్నవరాత్రులప్పుడు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని అందుకే శక్తి స్వరూపిణి అని అంటారు.మూల విరాట్టు శక్తికి చెందినది గనుకే ఇలా చేస్తున్నారని వాదనలున్నాయి.దానికి తోడు అన్నమయ్య అన్నట్టు శైవులు శ్రీవేంకటేశ్వరున్నిశివరూపంగా భావిస్తూంటారు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

గుడిపైన శిల్పాలలో నందివుండటం ఇప్పటికీ గమనించవచ్చును. వైష్ణవాలయంలో నందిపేరు వూహించలేనిదని అంటారు.దాంతో పాటు స్వామివారి పేరులో ఈశ్వరశబ్దం వుండటం కూడా గమనార్హమే కావాలంటే పరిశీలించమంటారు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

వేం అంటే పాపములు కట అంటే తొలగించు ఈశ్వరుడు కలిపితే వేంకటేశ్వరుడు అవుతుంది.అంతేకాదు శివుని మూడో రూపం కప్పివుంచటానికే పెద్దనామం పెట్టారన్నదే వీరి భాష్యం.ఈ వివాదాలన్నిటికీ తెరవేస్తూ శ్రీరామానుజులవారికి శంఖుచక్రాలను అమర్చి ఈ క్షేత్రాన్ని వైష్ణవక్షేత్రంగా ప్రకటించారట.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

ఇంతకి శ్రీవారు శివుడా?లేక విష్ణువా?లేక శక్తా అన్నది ఇప్పటికీ తేలని విషయమే.దాన్ని బలపరుస్తూ అన్నమయ్యకూడా కీర్తనలు రాయటం.ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతున్నట్లుగాను కనిపిస్తుంది.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

చూడాల్సిన ఆకర్షణలు

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు. చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

చెక్క బొమ్మలు, తెల్ల చెక్కతో చేసిన వస్తువులు, కలంకారీ చిత్రాలు, తంజావూర్ బంగారు ఆకుల చిత్రాలు, మరీ ముఖ్యంగా చందనపు బొమ్మలు లాంటి ఇక్కడి కళాకృతులు కూడా చూడాల్సిందే. తిరుపతి ప్రయాణం చాలా తేలిక. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది. డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది. చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అద్దె కార్లు, బస్సులు అందుబాటులో వుండడం వల్ల నగరంలో తిరగడం కూడా తేలికే. నామమాత్రపు ధరల్లో రోజంతటికీ కార్లు అద్దెకు తీసుకోవచ్చు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

సరైన సమయం

సంవత్సరంలో వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో తిరుపతిని సందర్శించడం ఉత్తమం. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు తిరుపతి సందర్శనకు అనువైన పరిస్థితులను అందిస్తాయి. అయితే, జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో జరిగే ప్రధాన పండుగ బ్రహ్మోత్సవ సమయంలో యాత్రికులు తిరుపతిని సందర్శించడం ఉత్తమం.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

గోవిందరాజ స్వామి గుడి, తిరుపతి

తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. 1235లో నిర్మించిన ఈ దేవాలయానికి వైష్ణవ గురువు శ్రీమద్రామానుజాచార్యులు శంఖుస్థాపన చేసారని చెప్తారు. ఈ గోపురం కాక మరో రెండు గుళ్ళ చుట్టూ బయటి ప్రాకారం వుంటుంది.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

అలమేలు మంగమ్మ ఆలయం, తిరుపతి

అలమేలు మంగమ్మ ఆలయం అలమేలుమంగాపురం లో ఉంది. దీనిని తిరుచానూరు అనికూడా పిలుస్తారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామీ భార్య అలమేలు మంగమ్మ లేదా శ్రీ పద్మావతి దేవి విగ్రహం ఉంది. పుష్కరిణి నదిలో ఈ దేవత పుట్టిందని నమ్మకం. ఈ ఆలయం రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉండి ఆధ్యాత్మిక సాధనలో వున్న పర్యాటకులకు అనువైన గుడి.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

అవనాక్షమ్మ ఆలయం, తిరుపతి

అవనాక్షమ్మ ఆలయం తిరుపతి నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో ఎంతో ఉత్సాహంతో, వైభవంతో జరిగే బ్రహ్మోత్సవం, నవరాత్రి ఉత్సవాలకి వందలమంది భక్తులు వస్తారు. కళ్యాణ వెంకటేశ్వరస్వామి కి సంబంధించిన దగ్గరలోని ఐదు ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, శ్రీ పరాసరేశ్వర స్వామి ఆలయం, శ్రీ అగస్తేశ్వర స్వామీ ఆలయం, శ్రీ శక్తి వినాయక స్వామి ఆలయాలు ఇతర దేవాలయాలు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతి

అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమలలో తన నౌకాయన సమయంలో వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఇక్కడ శ్రీ సిద్దేశ్వర, ఇతర ఋషులను ఆశీర్వదించాడు.

PC: youtube

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

తిరుమలలో గర్భ గుడిలో వెలసిన విగ్రహం వెంకన్నది కాదా?

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి