• Follow NativePlanet
Share
» »బంగారు నంది దర్శిస్తే అంతులేని సంపద

బంగారు నంది దర్శిస్తే అంతులేని సంపద

Written By: Beldaru Sajjendrakishore

తిరువన్నామలై తమిళనాడులోని ఉత్తరదిక్కున గల ఒక జిల్లా. ఇక్కడ వెలసిన అన్నామలై ఆలయం ఎంతో మహిమ గల దేవస్థానం సంవత్సరం పొడవునా తిరువన్నామలైలో పండుగలు జరుగుతాయి. 4 లక్షల మంది పర్యాటకులు ఈ పండుగలలో పాల్గొంటారు. ఇక తిరువన్నామలైజిల్లాలోని ఒక ఆలయంలో నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం ఏడాది మొత్తం ముదురు గోదుమ రంగులో ఉండి ఏడాదిలో ఒక్కసారి మాత్రం బంగారు రంగులో మెరిసిపోతుంది. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియదు.

ఇక్కడకు వెళ్లి వచ్చారంటే మీకు గుండె ధైర్యం ఎక్కువనే అర్థం

ఆ సమయంలో ఆ నందిని దర్శిస్తే ఐశ్యర్యాభివృద్ధి జరిగి అంతులేని సంపద చేకూరుతుందని భక్తుల నమ్మకం. దీంతో ఆ రోజున ఆ నంది విగ్రహాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఆ నంది ఎక్కడ ఉంది అన్న విశేషాలతో పాటు సందర్భం వచ్చింది కాబట్టి తిరువన్నామలై విశిష్టతలతో పాటు సదరు ఆలయం చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల వివరాలను తెలుసుకుందాం.

1. ఎక్కడ వుంది?

1. ఎక్కడ వుంది?

1. ఎక్కడ వుంది?

Image Source:

ఈ మహిమకల దేవాలయం తిరువన్నమలై జిల్లాలోని చెంగమ్ అనే ఒక వూరిలో ఉంది. ఈ దేవాలయాన్ని వృషభేశ్వర్ ఆలయం అని పిలుస్తారు. ఈ శివాలయం 200 సంవత్సరాల పురాతనమైనది. అయినా ఇప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే వుంది. ఈ దేవాలయంలోని నంది చాలా ప్రత్యేకమైనది. పర్యాటకులు ఈ బంగారు నందిని సందర్శిచటానికి అధికసంఖ్యలో వస్తూవుంటారు.

2. మార్చి నెలలో

2. మార్చి నెలలో

2. మార్చి నెలలో

Image Source:

ఈ అద్భుతమైన సంఘటన ( తమిళంలో పెంగునీ నెల 3 వ రోజు అనగా ) మనకు మార్చి నెలలో అంటే బాగా వేసవి కాలమన్నమాట. ఈ నెలలో మూడవ రోజు ప్రతి సంవత్సరం మిరుమిట్లు గొలిపే బంగారుకాంతితో దర్శనమిస్తుంది. ఈ అద్భుతమైన సంఘటనను చూసేందుకు భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుండి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తూవుంటారు.

3. వేణుగోపాల పార్ధసారథి ఆలయం

3. వేణుగోపాల పార్ధసారథి ఆలయం

3. వేణుగోపాల పార్ధసారథి ఆలయం

Image Source:

ఇక్కడికి అతి దగ్గరలో చూడగల ఆలయం 700 సంవత్సరాల పురాతనమైన వేణుగోపాల పార్ధసారథి ఆలయం. ఈ పురావస్తు ప్రదేశాలంలో గల అనేక కళాఖండాలను అనేక మంది ప్రముఖులు వచ్చి సందర్శించారు. ఈ ఆలయ నిర్మాణం తిరువన్నామలై అన్నామలైయర్ ఆలయాన్ని పోలివుంటుంది. అంతే కాకుండా చెంగం అనేకమైన పర్యాటక ఆకర్షణలతో నిండి ఉంది. వాటిని కూడా పర్యాటకులు ఎంతో ఆసక్తితో సందర్శిస్తుంటారు.

4. సత్తనూర్ డ్యామ్

4. సత్తనూర్ డ్యామ్

4. సత్తనూర్ డ్యామ్

Image Source:

సత్తనూర్ డ్యామ్ ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువన్నామలై జిల్లాలోని చెన్నకేశవ పట్టణంలో నెలకొని వుంది ఈ డ్యామ్. ఇది తమిళనాడులోని అత్యంత ముఖ్యమైన ఆనకట్టలలో ఒకటి. ఆనకట్ట 1958 లో కామరాజ్ చేత నిర్మించబడింది. ఈ డ్యామ్ దగ్గరలోనే ఒక మొసళ్ళ పార్కు కూడా వుంది. ఈ అందమైన ఉద్యానవనం ఆసియాలో అతిపెద్ద మొసళ్ళ పార్కులలో ఒకటి. ఈ పార్క్ 7321 మిలియన్ క్యూబిక్ అడుగులు వుంది. దీని యొక్క పొడవు 119 అడుగుల పొడవు. ఈ డ్యామ్ తిరువన్నామలైతో సహా అనేక ప్రాంతాల్లో త్రాగునీరు మరియు నీటిపారుదల సౌకర్యాలను కలుగజేస్తుంది.

5. తీర్థమలై

5. తీర్థమలై

5. తీర్థమలై

Image Source:

తీర్థమలై ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తీర్థమలై జిల్లా ధర్మపురి జిల్లాలో ఉంది. ఈ ఆలయం త్రివేండ్రం కొండపైన వెలసియున్నది. ఇక ఇక్కడికి దగ్గర్లోని రామన్ పల్లిని కూడా చూసి తీరాల్సిందే. రాముడు రావణుని సంహరించి అయోధ్యకి తిరిగి వచ్చే సమయంలో ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నట్లు చెబుతారు. ఇక్కడికి దగ్గర్లోనే హనున్ తీర్థం ఉంది. ఈ తీర్థంలోని నీటిని సేవిస్తే అన్ని రకాల పాపాలు తొలిగిపోతాయని నమ్ముతారు. ఇది పాపాలు పోయే ప్రదేశం.

6. జింజీ ఫోర్ట్,

6. జింజీ ఫోర్ట్,

6. జింజీ ఫోర్ట్,

Image Source:

జింజీ ఫోర్ట్ ఇక్కడి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ కోట తమిళనాడులో మిగిలివున్న కొన్ని కోటలలో ఒకటి. మరాఠా పరిపాలకుడైన శివాజీ, "భారతదేశంలోని అంతర్గత కోటలలో ఇది ఉత్తమమైనది" అని చెప్పుకునే కోట. బ్రిటిష్ వారు దీనిని "ఈస్ట్ ట్రోయ్" అని పిలిచారు. ఈ కోట అప్పటి రాచరికపు గుర్తులను మన కంటి ముందుకు తీసుకువస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

7. ఈ కోట ఎక్కడ ఉంది

7. ఈ కోట ఎక్కడ ఉంది

7. ఈ కోట ఎక్కడ ఉంది

Image Source:

చెన్నై నుండి 160 కిలోమీటర్ల దూరంలో మరియు తిరువన్నమలై నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంది. తమిళనాడు లోని అనేక పట్టణాల నుండి తిరువన్నమలై నుండి పాండిచేరి వరకు బస్సు సర్వీసులు ఉన్నాయి. చెన్నై వెళ్ళే మార్గంలో దిందివానం నుండి ఈ కోటను సులభంగా చేరుకోవచ్చు.

8. తిరువన్నమలై గురించి

8. తిరువన్నమలై గురించి

8. తిరువన్నమలై గురించి

Image Source:

భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉన్న తిరువన్నమలై ఒక పుణ్య క్షేత్రము మరియు మునిసిపాలిటి. ఇది తిరువన్నమలై జిల్లా ప్రధాన కేంద్రం. అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువన్నమలై లోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రం. తిరువన్నమలైతో చాలా యోగులకి సిద్ధులకి సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు. అందుచేత, తిరువన్నమలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం.

9. పంచ భూత క్షేత్రాల్లో ఒకటి

9. పంచ భూత క్షేత్రాల్లో ఒకటి

9. పంచ భూత క్షేత్రాల్లో ఒకటి

Image Source:

తిరువన్నమలై పంచ భూత క్షేత్రాలలో ఒకటి. ఇది అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు చిదంబరం, శ్రీ కాళహస్తి, తిరువనైకోవిల్ మరియు కంచి వరుసగా ఆకాశము, గాలి, నీరు మరియు భూమిని సూచిస్తాయి. ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు.

10. విశ్వకర్మచేత

10. విశ్వకర్మచేత

10. విశ్వకర్మచేత

Image Source:

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.

11. కొండకు ఎక్కువ ప్రాధాన్యం

11. కొండకు ఎక్కువ ప్రాధాన్యం

11. కొండకు ఎక్కువ ప్రాధాన్యం

Image Source:

ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.

12. గిరి ప్రదక్షిణ

12. గిరి ప్రదక్షిణ

12. గిరి ప్రదక్షిణకు ప్రాధాన్యం

Image Source:

ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది భక్తులు గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.

13. ఔషద మొక్కల ప్రభావం

13. ఔషద మొక్కల ప్రభావం

13. ఔషద మొక్కల ప్రభావం

Image Source:

గిరిపైన గల ఔషద మొక్కల ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.

14. చోళ రాజులు

14. చోళ రాజులు

14. చోళ రాజులు

Image Source:


ఈ శివుని గుడి తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ రాజులచే 9వ మరియు 10వ శతాబ్దాల మధ్యలో నిర్మింపబడింది. ఈ క్షేత్రం చాలా పెద్ద గోపురాల వల్ల ప్రసిద్ధి చెందింది.[5] క్రి. శ. 9వ శతాబ్ద కాలంలో రాజ్యమేలిన చోళ రాజుల శిలాశాసనాల వల్ల ఈ విషయం తెలుస్తున్నది. 11 అంతస్తుల తూర్పు రాజ గోపురం 217 అడుగుల ఎత్తు ఉంది. కోట ప్రకారంలా ఉండే బలిష్టమైన గోడల నుండి చొచ్చుకు వచ్చే నాలుగు గోపురాలు, ఈ మందిర సముదాయానికి భీకర ఆకారాన్ని ఇస్తాయి.

15. శ్రీ కృష్ణ దేవరాయులు కూడా

15. శ్రీ కృష్ణ దేవరాయులు కూడా

15. శ్రీ కృష్ణ దేవరాయులు కూడా

Image Source:

పై గోపురము, తిరుమంజన గోపురము మరియు అన్ని అమ్మాళ్ గోపురము ఈ ప్రాకారానికి ఉన్న మిగిలిన గోపురాలు. విజయ నగరాన్ని పాలించిన శ్రీ కృష్ణ దేవరాయలు వేయి స్తంభాల శాలను, కోనేరును నిర్మించాడు. ప్రతి ప్రకారము ఒక పెద్ద నందిని, వల్లల మహారాజ గోపురము, కిల్లి గోపురము వంటి చాలా గోపురాలను కలిగి ఉంటుంది.

16. రమణాశ్రమం

16. రమణాశ్రమం

16. రమణాశ్రమం

Image Source:

రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మీల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ స్థానికులకంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చెసే ప్రార్థన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమం లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి .

17.ముందుగా బుక్ చేసుకోవాలి

17.ముందుగా బుక్ చేసుకోవాలి

17.ముందుగా బుక్ చేసుకోవాలి

Image Source:


నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూంటాయి. రమణాశ్రమంలో ఇంకా లక్ష్మి (ఆవు) సమాధి, కాకి సమాధి, శునకం యొక్క సమాధిని కూడా చూడవచ్చు . ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలాయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. మీరు ఆశ్రమంలో ఉండాలంటె మీరు ముందుగానే వసతి కోసం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

18. రోడ్డు మార్గంలో

18. రోడ్డు మార్గంలో

18. రోడ్డు మార్గంలో

Image Source:

రహదారులతో తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న పట్టణాలు, నగరాల నుండి తిరువన్నమలై చేరుకోవచ్చు. ఈ నగరం పుదుచేరి - బెంగళూరు జాతీయ రహదారి (NH 66) చిత్తూరు - కడలూరు రాజ్య రహదారుల కూడలిలో ఉంది. తమిళనాడులోని ఇతర నగరాలు చెన్నై, వేలూరు, సేలం, విల్లుపురం, తిరుచి, మదురై, కోయంబత్తూరు, ఈరొద్, తిరుప్పురు, ఇంకా కన్యాకుమారి, మరియు ఇతర ప్రాంతాలైన తిరుపతి, బెంగళూరు, పుదుచేరి వంటి నగరాలకి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ తిరువన్నమలై నుండి బస్సులను నడుపుతుంది.

19. రైలు

19. రైలు

19. రైలు

Image Source:

వెల్లూరు నుండి విల్లుపురం వెళ్ళే రైలు మార్గంలో తిరువన్నమలై ఉంది. ప్యాసింజరు రైలులో ప్రయాణికులు వెల్లూరు లేదా విల్లుపురం వెళ్ళవచ్చు. (గేజు మార్పిడి పనుల కోసం ఈ మార్గంలో రైలు రాక పోకలను ప్రస్తుతం నిలిపి వేసారు.) దగ్గరలో ఉన్న పెద్ద రైల్వేస్టేషన్ 60 కి.మీ. దూరంగా ఉన్న విల్లుపురంలో ఉంది. అక్కడి నుంచి ప్రైవేటు, ప్రభుత్వ బస్సులతో పాటు ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

 20. వాయు మార్గాల్లో

20. వాయు మార్గాల్లో

20. వాయు మార్గాల్లో

Image Source:

చెన్నై (170 కి.మీ.) మరియు బెంగళూరు (200 కి.మీ.) అంతర్జాతీయ విమానాశ్రయాలు తిరువన్నమలైకి దగ్గరగా ఉన్న విమానాశ్రయాలు

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి