Search
  • Follow NativePlanet
Share
» »యోగాభ్యసన చేయడానికి ఇండియాలోని టాప్ 10 ప్రదేశాలు

యోగాభ్యసన చేయడానికి ఇండియాలోని టాప్ 10 ప్రదేశాలు

పండంటి ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని జనరల్ అసెంబ్లీ తీర్మానంలో పేర్కొంది. రోజూ యోగాసనాలు వేయడం ద్వారా రోగాలు దరిచేరవని, ఎలాంటి మానసిక రుగ్మతలైనా పారిపోతాయని, మానవ జీవితాల్లో సామరస్యం ఇనుమడిస్తుంది

యోగా ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక రూపం. వ్యాయామ సాధనల సమాహారం. హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక సాధనలకు యోగానే పునాది. మునుల నుంచి సామాన్యుల దాకా అందరికీ యోగా అవసరమే. యోగాసనాలు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతాయి. శారీరకంగానూ ప్రయోజనాలు అనేకం. బౌద్ధ, జైన, సిక్కు వంటి ధార్మిక మతాలతోపాటు ఇతర ఆధ్యాత్మిక సాధనల్లోనూ యోగా ప్రాధాన్యత కనిపిస్తుంది.

యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. ఉపనిషత్తులు, భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనల్లో తేలింది. ఇండియాలో పురుడు పోసుకున్న యోగా.. ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. జూన్ 21 నాడు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం.

2014 సెప్టెంబర్ 27. యోగా దినోత్సవానికి బీజం పడిన రోజు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 69వ సదస్సు ఒక గాఢమైన ముద్రలోకి వెళ్లింది. ప్రతీ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐరాస వేదికగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 11న మోడీ ప్రతిపాదనకు ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ 193 సభ్య దేశాలకు 177 దేశాలు ఏకగ్రీవంగా ఓటేశాయి.

పండంటి ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని జనరల్ అసెంబ్లీ తీర్మానంలో పేర్కొంది. రోజూ యోగాసనాలు వేయడం ద్వారా రోగాలు దరిచేరవని, ఎలాంటి మానసిక రుగ్మతలైనా పారిపోతాయని, మానవ జీవితాల్లో సామరస్యం ఇనుమడిస్తుందని అందులో వివరించింది. 2015 జూన్ 21న ఢిల్లీ రాజ్ పథ్‌ లో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. దాని తర్వాత ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరపుకుంటున్నాము. తద్వార ప్రజల్లో యోగ మీద ఆసక్తి పెరుగుతుంది. భారత దేశంలో యోగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించే ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కేరళ

కేరళ

కేరళలో యోగ డే ను ఘనంగా నిర్వహించే ప్రదేశం మరియు సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం తిరువనంతపురం. ఇక్కడ, శివానంద యోగా వేదాంత ధన్వంతరి ఆశ్రమాన్ని సందర్శించండి మరియు వివిధ యోగ అభ్యాసాలలో పూర్తిగా మునిగిపోతారు. ఈ యోగ కేంద్రం ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుంది. ఈ కేంద్రం మద్యం లేని శాఖాహారంను అదిస్తుంది, మరియు కర్మ యోగ, నిశ్శబ్ద ధ్యానం, అంతర్గత శాంతి మరియు ఆధ్యాత్మికతను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది.

ఉత్తరాఖండ్:

ఉత్తరాఖండ్:

యోగ దినోత్సవంన ఈ ప్రదేశంను సందర్శించడం చాలా ఉత్తమం. ఉత్తరాఖండ్ అద్భుతమైన టూరిస్ట్ ప్రదేశం మాత్రమే కాదు, ఆధ్యాత్మికం ప్రదేశం కూడా. యోగకు రాజధానిగా పిలువబడే రిషికేష్ ను సందర్శించడం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వారం లేదా రెండు వారాలు గడపడానికి ఉత్తమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న ఆనంద ప్రకాష్ ఆశ్రంలో అఖండ యోగను నేర్పడం జరుగుతుంది. అందుకు మీరు బస చేయడానికి ఉత్తమమైన గదులను సౌకర్యాలను అందిస్తారు. ఇక్కడ ఇంకా ఓషా గంగ దామ్ ఆశ్రమ, హిమాలయ యోగా ఆశ్రమ వంటి ఉత్తమ యోగా కేంద్రాలున్నాయి, ఇక్కడ అన్ని ఉచితం.

పాండిచ్చేరి:

పాండిచ్చేరి:

పాండిచ్చఏరి యూనియన్ టెరిటరీ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలిచే పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీయల్ ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది. బ్రైట్ కలర్ బిల్డింగులు, సహజసిద్దంగా ఏర్పడ్డ బీచ్ లు అందమైన వృక్షజాలం సందర్శకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. హాలిడేస్ కు ఈ ప్రదేశం అద్భుంగా ఉన్నా యోగాతో మరింత ఉల్లాసంగా గడపడానికి అనుకూలమైన ప్రదేశం. ప్రపంచంలో ప్రసిద్ది చెందిన యోగా సెంటర్ ర్యూ డి లా మెరైన్ వద్ద ఉన్న శ్రీ అరబిందో ఆశ్రమంలోని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యోగా కేంద్రానికి వెళ్లి ఆధ్యాత్మిక బోధనలు మరియు యోగా అభ్యాసాల గురించి తెలుసుకోవచ్చు. వాస్తవానికి, ఈ ఆశ్రమం ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు ప్రధాన గమ్యాన్ని కోరుకునే పర్యాటకులకు మార్గదర్శకత్వం.

 హిమాచల్ ప్రదేశ్:

హిమాచల్ ప్రదేశ్:

ఇది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ గంభీరమైన మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు మనోహరమైన పట్టణాలచే రూపొందించబడినది. పర్యాటకులకు ఇది అద్భుతమైన ప్రదేశం. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, కసోల్, సిమ్లా వంటి టూరిస్ట్ ప్రదేశాలు ప్రసిద్ది. అయితే వీటితో పాటు యోగకు ప్రసిద్ది చెందిన దర్శశాలను మరిచిపోకూడదు. ఇక్కడ యోగ నేర్పడం జరుగుతుంది. దర్శశాల వద్ద మక్లీడ్ గంజ్ వద్ద శివ యోగా ప్రదేశాన్ని సందర్శించండి. యోగ గురువుగా ఎలా ఉండాలి, యోగ శక్తి ఏంటో హాటా యోగా, కుండలిని యోగా, క్రియ యోగా మరియు మరిన్ని యోగ పద్దతులను గురించి నేర్చుకోవడానికి ఇది ఒక చక్కటి ప్రదేశం.

మహరాష్ట్ర:

మహరాష్ట్ర:

మహారాష్ట్ర అత్యంత ప్రసిద్ది చెందిన టవర్ సిటీస్ ఉన్న రాష్ట్రం. ముఖ్యంగా బీచ్ లతో అలరిస్తోన్న రాష్ట్రం. వీటితో పాటు యోగ కేంద్రాలతో హాలిడే ఉల్లాసంగా గడపడానికి ఉత్తమమైన ప్రదేశం. యోగకు ప్రసిద్ది చెందిన ప్రదేశాల్లో లోనవాన నుండి కైవల్యదామ ఆశ్రమం. ఈ ఆశ్రమం అనేక ప్రోగ్రామ్‌లను అందిస్తుంది, వీటిని మీరు వరుస కోర్సుల ప్రకారం ఎంచుకోవచ్చు; అలాగే వారు యోగా కాకుండా వైద్యం కార్యక్రమాలు మరియు ఆయుర్వేదం, ప్రకృతివైద్య కార్యక్రమాలను అందిస్తారు. కైవల్యాధమ ఆశ్రమం యోగా ఉపాధ్యాయులకు డిప్లొమా కోర్సులతో శిక్షణ ఇస్తుంది.

 కర్ణాటక:

కర్ణాటక:

యోగాకు ఉత్తమ ప్రదేశం .కర్ణాటక రాష్ట్రంలో యోగాకు ఉత్తమైన ప్రదేశం మైసూర్ . మైసూర్ లోని యోగ కేంద్రం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడినది. ప్రశాంతమైన వాతారణంలో ఇక్కడ జరిగే యోగా కార్యక్రమాల్లో ఉత్తమ సూత్రాలను ప్రాణాయామం వివిధ రకాల యోగాసనాలను నేర్చుకోవచ్చు. కేఫ్ తో పాటు శాఖాహారాన్ని అందించే ఈ కేంద్రం ప్రతి ఆధ్యాత్మిక సందర్శికుడుని అద్భుతంగా ఆకర్షిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X