• Follow NativePlanet
Share
» »భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయ శిఖరాలు ఏవో మీకు తెలుసా ?

భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆలయ శిఖరాలు ఏవో మీకు తెలుసా ?

Written By: Venkatakarunasri

దేవాలయాలు అనగానే గుర్తుకొచ్చేది గోపురం లేదా విమానం. వీటిని దేవుని పాదాలుగా అభివర్ణిస్తాము. దూరంగా ఉండి వీటిని నమస్కరించినా ... స్వామి పాదాలను నమస్కరించినట్లే అవుతుంది. కాబట్టే అందరికి కనబడేటట్లు ఆలయ గోపురాలను ఎత్తుగా నిర్మిస్తారు. కొత్తగా వచ్చిన వారికి గుడి ఎక్కడుందో సులభంగా తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. దేవాలయ గోపురమే కాదు ... దేవాలయం కూడా ఎత్తుగా ఉండటం హితదాయకం.

అందుకనే ఎత్తు చూసి మరీ కొండల్లో గుళ్ళను నిర్మిస్తుంటారు. మానవుడు ఎప్పటికైనా ప్రకృతి ప్రళయతాండవానికి గురికాకతప్పదు. అటువంటప్పుడు ఈ దేవాలయాలే ఆశ్రయాన్ని ఇస్తాయి. మొన్నీమధ్య చెన్నై లో వరదలు వచ్చినప్పుడు చుట్టుపక్కల కొండ లపై నిర్మించిన దేవాలయాలలో ప్రజలకు ఆశ్రయం పొందారు. ఇది కూడా చదవండి : నవగ్రహ ఆలయాలు ఏవి ? ఎక్కడెక్కడ ఉన్నాయి ? భగవంతుడు సర్వోన్నతుడు. ఆయనకు లింగ, జాతి, కులం అంటూ బేధం ఉండదు. ఎవ్వరైనా అయన దృష్టిలో సమానమే! ఈ సర్వోన్నతభావం మనిషికి అర్థమవ్వాలనే దేవాలయాన్ని, దేవాలయ గోపురాన్ని ఎంత వీలైతే అంత ఎత్తుగా నిర్మిస్తారు.

దేవాలయ గోపురం మీద రకరకాల శిల్పాలు, దేవతామూర్తులు చెక్కబడి ఉంటాయి. విమానాలు, గోపురాలు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు చాలా మంది తికమకపడుతుంటారు. గోపురం అన్నది ఆలయ ప్రవేశం వద్ద నిర్మించిన ఎత్తైన భాగం కాగా విమానం గర్భగుడి పై నిర్మించిన ఎత్తైన భాగం. ప్రస్తుతం మనము ఇక్కడ చెప్పుకోబోతున్నది భారతదేశంలోని ఎత్తైన దేవాలయాల గోపురాలు/ విమానాల గురించి. వీటి ఎత్తు, అవెక్కడ ఉన్నాయి ?? వాటిలో ప్రధాన దైవం ఎవరు ? ఎప్పుడు స్థాపించారు వంటివి ఇప్పుడు తెలుసుకుందాం !!

శ్రీకంఠేశ్వర ఆలయం ఎక్కడ ఉంది ?

శ్రీకంఠేశ్వర ఆలయం ఎక్కడ ఉంది ?

కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న నంజన్ గుడ్ లో ఈ దేవాలయం కలదు. గోపురం ఎత్తు - 120 అడుగులు ప్రధాన దైవం - శ్రీకంఠేశ్వర స్వామి (శివుడు) నంజన్ గుడ్ లో ఉన్న శ్రీకంఠేశ్వర గుడిని సందర్శిస్తే చూపు లేనివారికి చూపు వస్తుందని భక్తుల నమ్మకం. టిప్పు సుల్తాన్ తన పట్టపుటేనుగు చూపు కోల్పోతే, ఈ స్వామిని ప్రార్ధించాడని దాంతో ఏనుగుకు చూపు వచ్చిందని స్థానిక కధనం.

చిత్రకృప : Dineshkannambadi

శంకరనాయినర్ కోయిల్ ఎక్కడ ఉంది ?

శంకరనాయినర్ కోయిల్ ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా శంకరన్ కోవిల్ పట్టణంలో ఈ గుడి కలదు. గోపురం ఎత్తు - 127 అడుగులు ప్రధాన దైవం - శివుడు, విష్ణువు ఉక్కిర పాండియర్ తేవర్ క్రీ.శ. 900 వ శతాబ్దంలో ఈ దేవాలయంను నిర్మించారు. ఇందులో ప్రధాన దైవం శంకర నారాయణన్ (సగం - శివుడు, సగం - విష్ణువు).

చిత్రకృప : Vasanth2499

శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం ఎక్కడ ఉంది ?

శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం ఎక్కడ ఉంది ?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ దేవాలయం కలదు. గోపురం ఎత్తు - 153 అడుగులు ప్రధాన దైవం - శ్రీలక్ష్మి నరసింహ స్వామి (విష్ణుమూర్తి అవతారం) మంగళగిరి లో దేవాలయం రెండు భాగాలుగా ఉంటుంది. కింద ఉన్న భాగం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గా, పైన కొండ మీద ఉన్న భాగం పానకాల స్వామి గా భక్తులు భావిస్తారు. ప్రత్యేకత ఏమిటంటే, పానకాల స్వామి కి, పానకం అభిషేకం చేస్తే అందులో స్వామి సగం తాగి, మిగిన సగాన్ని మనకు ఇస్తాడట. ఏపీ లో అంతుపట్టని ఆలయ రహస్యం !!

చిత్రకృప : Bhaskaranaidu

మీనాక్షి దేవాలయం ఎక్కడ ఉంది ?

మీనాక్షి దేవాలయం ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని మదురైలో గోపురం ఎత్తు - 170 అడుగులు ప్రధాన దైవం - మీనాక్షి అమ్మవారు (పార్వతి) దేవాలయం 45 ఎకరాలలో విస్తరించింది. ఆలయ సముదాయంలో ముఖ్య దేవతలకు రెండు బంగారు గోపురాలు మరియు 14 అద్భుతమైన గోపురాలు ఉన్నాయి. మదురై - మాత మీనాక్షి కొలువు !

చిత్రకృప : Kumar Appaiah

సారంగపాణి ఆలయం ఎక్కడ ఉంది ?

సారంగపాణి ఆలయం ఎక్కడ ఉంది ?

తంజావూర్ జిల్లా కుంభకోణం లో ఈ దేవాలయం కలదు. గోపురం ఎత్తు : 164 అడుగులు ప్రధాన దైవం : సారంగపాణి (విష్ణువు) పంచరంగ క్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయం ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. ఇక్కడి స్వామివారిని 'సారంగపాణి' గా, అమ్మవారిని 'కోమలవల్లి తాయార్' గా పూజిస్తారు. సందర్శించు సమయం 5:30 am - 9 pm వరకు.

చిత్రకృప : Ilya Mauter

రాజగోపాలస్వామి ఆలయం ఎక్కడ ఉంది ?

రాజగోపాలస్వామి ఆలయం ఎక్కడ ఉంది ?

తమిళనాడు - తిరువరూర్ జిల్లా - మన్నార్ గుడి టౌన్ లో కలదు. గోపురం ఎత్తు : 154 అడుగులు ప్రధాన దైవం : విష్ణు గుడి 23 ఎకరాలలో విస్తరించింది. దీనిని దక్షిణ ద్వారకా అని (గురువాయూర్ తో కలిపి) పిలుస్తారు. శ్రీకృష్ణ అవతారమైన రాజగోపాలస్వామి ని భక్తులు పూజిస్తారు.

చిత్రకృప : Supraja kannan

అళగర్ కోయిల్ ఎక్కడ ఉంది ?

అళగర్ కోయిల్ ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని మదురై జిల్లా అళగర్ కోయిల్ గ్రామంలో ఈ దేవాలయం కలదు. గోపురం ఎత్తు : 187 అడుగులు ప్రధాన దైవం - విష్ణువు గుడి క్రీ.శ 6 - 7 శతాబ్దాల మధ్య నిర్మించారు. గుడిలో విష్ణుమూర్తిని 'కల్లాజ్హాగర్' గా, లక్ష్మిదేవిని తిరుమామగాళ్ గా పూజిస్తారు. దేవాలయం 2 ఎకరాల్లో మరియు గోపురం 5 అంచెలుగా నిర్మించబడి ఉన్నది.

చిత్రకృప : G41rn8

ఏకాంబరేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది ?

ఏకాంబరేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని కాంచీపురం గోపురం ఎత్తు - 190 అడుగులు ప్రధాన దైవం : ఏకాంబరనాథర్ (శివుడు) దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి ఈ ఏకాంబరేశ్వర దేవాలయం గోపురం. ఇది కూడా పంచభూత క్షేత్రాలలో ఒకటి. గుడిని 6 am - 12:30 pm మరియు 4 pm - 8 : 30 pm వరకు సందర్శించవచ్చు.

చిత్రకృప : Ssriram mt

పెరుమాళ్ దేవాలయం ఎక్కడ ఉంది ?

పెరుమాళ్ దేవాలయం ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిరుక్కోళూర్ లో ఉలగలంత పెరుమాళ్ దేవాలయం కలదు. గోపుర మెట్టు : 192 అడుగులు ప్రధాన దైవం : వైత్తమానిది పెరుమాళ్ (నిక్షిప్తవిత్తన్) ప్రధాన దేవత : కోళూర్ వల్లి తాయారు శ్రీమహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఇక్కడ విష్ణువును 'ఉలగలంత పెరుమాళ్' గా, లక్ష్మి దేవిని 'పూంగుతై' గా కొలుస్తున్నారు.

చిత్రకృప : Ssriram mt

ఆండాళ్ ఆలయం ఎక్కడ ఉంది ?

ఆండాళ్ ఆలయం ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ లో ఆండాళ్ దేవాలయం కలదు. గోపురం ఎత్తు - 193 .5 అడుగులు ప్రధాన దైవం - పెరియాళ్వార్ ఆండాళ్ (వైష్ణవ క్షేత్రం) ఇది పెరియాళ్వార్ ఆండాళ్ జన్మించిన దివ్యక్షేత్రం. ఇచట పెరియాళ్వార్లు పెంచిన నందవనం, కన్నాడి కినర్ ( ఆండాళ్ ముఖం చూసుకున్న బావి), ఆండాళ్ జన్మించిన స్థలం చూడదగ్గవి. దీని గోపురం తమిళనాడు రాజచిహ్నం.

చిత్రకృప : Gauthaman

అన్నామలైయార్ ఆలయం ఎక్కడ ఉంది ?

అన్నామలైయార్ ఆలయం ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా, అరుణాచలం లో కలదు. గోపురం ఎత్తు - 216. 5 అడుగులు ప్రధాన దైవం : మహాశివుడు అరుణాచలం లేదా అన్నామలై పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. ఈ అరుణాచలం పవిత్ర జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు మహాశివుని చుట్టూ ప్రదక్షిణ చేయటంతో సమానంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ 14 కి. మీ ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకోరాదు.

చిత్రకృప : Adam Jones Adam63

శ్రీ రంగనాథస్వామి ఆలయం ఎక్కడ ఉంది ?

శ్రీ రంగనాథస్వామి ఆలయం ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని శ్రీరంగంలో రంగనాథస్వామి గుడి కలదు. గోపురం ఎత్తు - 239.5 అడుగులు ప్రధాన దైవం : రంగనాథస్వామి (విష్ణుమూర్తి) ఆసియా ఖండంలోనే అతిపెద్ద దేవాలయం మరియు గోపురం కలిగి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం తమిళనాడులోని ట్రిచి కి సమీపాన 8 కి.మీ ల దూరంలో ఉన్న శ్రీరంగంలో కలదు. ఈ దేవాలయం 156 ఎకరాలలో విస్తరించబడి ఉన్నది. అంకార్ వాట్ దేవాలయం కాదట ... ఇదే అతిపెద్ద దేవాలయమట !

చిత్రకృప : BOMBMAN

మురుడేశ్వర ఆలయం ఎక్కడ ఉంది

మురుడేశ్వర ఆలయం ఎక్కడ ఉంది

కర్ణాటకలోని మురుడేశ్వరం లో మురుడేశ్వర దేవాలయం కలదు. గోపురం ఎత్తు - 249 అడుగులు ప్రధాన దైవం : మహాశివుడు మురుడేశ్వరంలో ప్రపంచంలోనే అతి పొడవైన మహాశివుని విగ్రహం కలదు. బీచ్, టిప్పుసుల్తాన్ కోట సమీపంలో సందర్శించదగినవి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : Vinodtiwari2608

సూర్యదేవాలయం ఎక్కడ ఉంది ?

సూర్యదేవాలయం ఎక్కడ ఉంది ?

ఒడిశాలోని కోణార్క్ లో ఈ దేవాలయం కలదు విమానం ఎత్తు : 130 అడుగులు (శిథిలం కానప్పుడు దీని ఎత్తు 230 అడుగులు) ప్రధాన దైవం : సూర్యభగవానుడు ఒడిశా సూర్యదేవాలయం క్రీ.శ. 13 వ శతాబ్దానికి చెందినది. దీనిని ఎర్ర ఇసుక రాయితో నిర్మించారు. దీనిని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపద గా పేర్కొన్నారు.

చిత్రకృప : Bikashrd

బృహదీశ్వర ఆలయం ఎక్కడ ఉంది ?

బృహదీశ్వర ఆలయం ఎక్కడ ఉంది ?

తంజావూర్ లోని గంగైకొండ చోళపురం లో ఈ దేవాలయం కలదు. విమానం ఎత్తు - 182 అడుగులు ప్రధాన దైవం - శివుని రూపం రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వర దేవాలయం ను నిర్మించాడు. ఇతను తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆలయ శిఖరాన్ని తగ్గించి నిర్మించాడు అయితే, తంజావూర్ లోని బృహదీశ్వర దేవాలయం కంటే అతి పెద్ద ప్రాంగణం కలిగి ఉంటింది ఈ దేవాలయం.

చిత్రకృప : Thamizhpparithi Maari

లింగరాజ ఆలయం ఎక్కడ ఉంది ?

లింగరాజ ఆలయం ఎక్కడ ఉంది ?

ఒడిశా లోని భువనేశ్వర్ లో విమాన ఎత్తు : 183. 7 అడుగులు ప్రధాన దైవం : శివుని రూపం ఏడాది పొడవునా సందర్శించే లింగరాజు ఆలయం భువనేశ్వర్ నగరంలో ఉన్నది. దేవాలయంలో శివుని రూపం ఉంటుంది. దీనిని క్రీ.శ 10 - 11 మధ్య నిర్మించినట్లు చెబుతారు. ఆలయ నిర్మాణం ఒక కళాఖండంలా ఉంటుంది.

చిత్రకృప : Nitun007

జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది ?

జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది ?

ఒడిశా లోని పురీలో జగన్నాథ ఆలయం ఉన్నది. విమాన ఎత్తు : 216 మీటర్లు ప్రధాన దైవం : జగన్నాథుడు (శ్రీకృష్ణుడు) పురీ లోని శ్రీ జగన్నాథ దేవాలయం ను క్రీ.శ. 1174 లో నిర్మించారు. దేవాలయంలో శ్రీకృషుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. ప్రతి హిందువు జీవితంలో తప్పనిసరిగా దర్శించవల్సిన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి.

చిత్రకృప : Amartyabag

బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంది ?

బృహదీశ్వరాలయం ఎక్కడ ఉంది ?

తమిళనాడులోని తంజావూర్ లో ఈ దేవాలయం కలదు. విమాన ఎత్తు : 216 మీటర్లు ప్రధాన దైవం : శివుడు బృహదీశ్వరాలయం ను చోళరాజులలో ఒకరైనా రాజరాజ చోళుడు క్రీ.శ. 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయం మరియు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో చేత గుర్తించబడింది.

చిత్రకృప : Nara J

విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉంది ?

విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉంది ?

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో నూతనంగా నిర్మించిన విశ్వనాథ దేవాలయం ఉన్నది. విమాన ఎత్తు : 250 అడుగులు ప్రధాన దైవం - శివ భగవానుడు వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ కి 1. 7 కిలోమీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్ కు 9 కిలోమీటర్ల దూరంలో నూతనంగా నిర్మించిన విశ్వనాథ దేవాలయం కలదు. బిర్లా ఫౌండేషన్ వారు దేవాలయం పనులు 1931 లో పనులు మొదలుపెట్టి, 1966 లో పూర్తిచేశారు (చాలా సార్లు ఒరిజినల్ విశ్వనాథ ఆలయం దుండగుల చేతిలో నాశనమైంది కనుక).

చిత్రకృప : Kuber Patel, Rosehub

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి