Search
  • Follow NativePlanet
Share
» »ఈ రహస్యాలను ఆ ‘చిదంబరుడు’ కూడా ఛేదించలేడేమో

ఈ రహస్యాలను ఆ ‘చిదంబరుడు’ కూడా ఛేదించలేడేమో

భారత దేశంలోని శివాలయాల్లో అత్యంత రహస్య విషయాలకు సంబంధిచిన కథనం.

నిఘూడమైన విషయాలను, ఆ విషయాల వెనుక ఉన్న కారణాలను చెప్పలేకపోయినప్పుడు చిదంబర రహస్యం అన్న పదాన్ని ఎక్కువగా వాడుతుంటాం. ఈశ్వరుడికి మరోపేరే చిదంబరుడు. చిదంబరంలో ఆయన దేవాలయంలో జరిగే చమత్కారం వెనుక ఉన్న కారణాలు సాంకేతికత ఇంతగా అభివద్ధి చెందినా కనుగొనలేకపోతున్నారు.

అందువల్లే ఆ చిదంబర రహస్యం అన్న పదం వాడుకలోకి వచ్చి ప్రాచూర్యం పొందింది. ఈశ్వరుడు కొలువై ఉన్న ఆ చిదంబరంలోనే కాకుండా దేశంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్న అనేక దేవాలయాల్లో కూడా కొన్ని విషయాలు రహస్యంగానే ఉండిపోయాయి. ఈ రహస్యాలను బహుషా ఆ పరమేశ్వరుడు కూడా ఛేదించలేడేమోనని భక్తులు చర్చించుకొంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆ రహస్యాల వెనుక ఉన్న కారణాలను కనుగొంటారేమో ప్రయత్నించండి

 అమర్నాథ్

అమర్నాథ్

P.C: You Tube

హిందువులు జరిపే తీర్థయాత్రల్లో అమర్నాథ్ యాత్ర అత్యంత ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతి ఏడాది నిర్థిష్ట సమయంలో దాదాపు 70 అడుగుల పొడవున్న గొహలో ఒకే దగ్గర మంచు శివలింగం రూపాన్ని సంతరించుకొంటుంది. అది ఎందుకన్న విషయం నిఘూడ రహస్యం.

పావురాళ్లు

పావురాళ్లు

P.C: You Tube

అదే విధంగా ఇక్కడ పార్వతీ దేవికి పరమేశ్వరుడు అమరత్వానికి సంబంధించిన రహస్యాలను బోధించాడని చెబుతారు. ఆ సమయంలో అక్కడ ఉన్న రెండు పావురాళ్లు ఆ మాటలను విని అమరత్వం పొందయని చెబుతారు. ఆ పావురాళ్లను ఇప్పటికీ మనం చూడవచ్చు. అంత గడ్డకట్టే చలిలో ఆ రెండు పావురాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయం నిఘూడ రహస్యం.

 గవిపురం

గవిపురం

P.C: You Tube

బెంగళూరులోని గవిపురం లో ఉన్న శివాలయం రహస్యం తరతరాలుగా అలాగే ఉండిపోయింది. శివుడు ఉన్నాడన్న దానికి ప్రతిరూపంగా ఆ రహస్యాన్ని పేర్కొంటారు. ఏడాదిలో ఒకే ఒక రోజు ఈ రహస్యం అవిష్కారమవుతుంది. దీనిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు.

గుహాలయం

గుహాలయం

P.C: You Tube

గవిపుంరలోని శివాలంయ ఒక గుహాలయం. ఇక్కడి శివలింగం ఎదురుగా ఉన్న నంది కొమ్ముల మధ్యనుంచి ప్రతి ఏడాది సంక్రాంతి రోజు సాయంత్రం సూర్యకిరణాలు ప్రసురించి శివలింగాన్ని తాకుతాయి. ఆ సమయంలో గర్భాలయం మొత్తం దేదీప్యమానంగా వెలుగొంతుంది.

మల్లేశ్వరం

మల్లేశ్వరం

P.C: You Tube

1997లో మల్లేశ్వరంలోని కాడు మల్లేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న వీధిని వెడల్పు చేసే సమయంలో ఓ నంది విగ్రహం బయట పడింది. ఈ విషయం తెలుసుకొన్న పురావస్తుశాఖ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా తవ్వకాలు జరిపిన తర్వాత ఓ దేవాలయమే బయటపడింది.

 దక్షిణ ముఖ నంది తీర్థం

దక్షిణ ముఖ నంది తీర్థం

P.C: You Tube

అదే దక్షిణ ముఖ నంది తీర్థ. ఈ దేవాలయంలోని నంది నోటి నుంచి ఎల్లప్పుడూ నీరు బయటికి వచ్చి శివలింగం పై పడుతుంది. అటు పై శివలింగం కింద ఉన్న కళ్యాణి లో ఆ నీరు చేరుతుంది. అయితే ఆ నంది నోటి నుంచి వచ్చే నీరు ఎక్కడ నుంచి వస్తుందన్న విషయం ఇప్పటికీ నిఘూడ రహస్యం

లేపాక్షి

లేపాక్షి

P.C: You Tube

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే లేపాక్షి పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ ప్రధాన దైవం వీరభద్రుడు. అంతేకాకుండా ఇక్కడ శివలింగం, పెద్ద నందిని కూడా చూడవచ్చు. ఇక్కడి శిల్ప సంపద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

వేలాడే స్తంభం

వేలాడే స్తంభం

P.C: You Tube

ఈ శివాలయంలో అత్యంత ఆకర్షణీయ, ఆశ్చర్యం కలిగించే విషయం వేలాడే స్తంభం. ఏ ఆధారంల లేకుండా ఈ వేలాడే స్తంభం గాలిలో తేలుతూ ఉంటుంది. గాలిలో తేలే ఈ స్తంభం పైన ఆ దేవాలయం పై కప్పు ఆధారపడి ఉంటుంది. బలవంతంగా ఈ స్తంభాన్ని నేలకు దింపాలని చూస్తే పై కప్పు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు గల కారణాలు మాత్రం జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి

దారాసురం

దారాసురం

P.C: You Tube

చోళులు నిర్మించిన దేవాలయాల్లో ఇప్పటికీ నిత్యం దూప, ధీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో దారాసురంలోని ఐరావతేశ్వరాలయం కూడా ఒకటి. ఇది పురాణ ప్రాధాన్యత కలిగిన కుంభకోణం పట్టణం నుంచి కూత వేటు దూరంలోనే ఉంది.

సంగీతపు మెట్లు

సంగీతపు మెట్లు

P.C: You Tube

ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపజేసే రాతి మెట్లు ఉన్నాయి. ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిఘూడ రహస్యం. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఉన్న సరస్సులో స్నానం చేస్తే చర్మరోగాలన్నీ సమిసిపోతాయని కూడా చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X