Search
  • Follow NativePlanet
Share
» »ఒక వైపు రాచరికపు ఆనవాళ్లు...మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాల కోసం చలో...

ఒక వైపు రాచరికపు ఆనవాళ్లు...మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాల కోసం చలో...

పూనేకు దగ్గరగా ఉన్న పర్యాటక కేంద్రాలకు సంబంధించిన కథనం

మహారాష్ట్ర రాష్ట్రంలోనే కాక భారత దేశ చరిత్రలోనే పూనే ప్రత్యేకత సంతరించుకొన్న నగరం. మరాఠాల థీరత్వానికి ప్రతీక. ముఖ్యంగా శివాజీ పాలనలో ఈ పూనే సర్వతోముఖంగా అభివద్ధి చెందింది. అనేక కోటలు, ఉధ్యానవనాలు నిర్మించబడ్డాయి. అంతకు ముందు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కూడా పూనేలో అనేక దేవాలయాలను నిర్మించారు.

ఇక స్వాతంత్ర సంగ్రామంలో ఈ పూనే లో కొంత కాలం మహాత్మాగాంధీతో పాటు అనేక మంది నాయకులను బంధించారు. ఇలా చారిత్రాత్మకంగానే కాకుండా ధార్మిక కేంద్రంగా కూడా పూనే ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో పూనే లో చూడదగిన ఐదు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

ఆగాఘాన్ ప్యాలెస్

ఆగాఘాన్ ప్యాలెస్

P.C: You Tube

పూనేలోని ఆగాఘాన్ ప్యాలెస్ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే కేంద్రాల్లో ఒకటి. అలనాటి మహారాష్ట్ర వాస్తు శైలిని ఈ భవనం కళ్లకు కడుతుంది. ఈ భవనాన్ని క్రీస్తుశకం 1892లో నిర్మించారు. స్వతంత్ర సంగ్రామ సమయంలో మహాత్మాగాంధీతో పాటు ఎంతో మందిని ఈ భవనంలో ఖైదు చేసినట్లు చెబుతారు. ఈ నిర్మాణంలో మనకు కొంతవరకూ ఇటాలియన్ వాస్తు శైలి మనకు కనిపిస్తుంది. ఈ భవనంలో మనకు గాంధీతో పాటు కొంతమది స్వతంత్ర సమరయోథులకు సంబంధించిన కొన్ని వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ ఖాదీ దుస్తులు బాగుంటాయి.

శనివార్ వాడా

శనివార్ వాడా

P.C: You Tube

మరాఠా సామ్రాజ్య వైభవానికి ఈ శనివార్ వాడ ఒక మచ్చుతునక. మూడవ ఆంగ్లో మరాఠా యుద్దంలో విజయం సాధించిన తర్వాత బాజీరావ్ పేష్వా ఈ కోటను నిర్మించినట్లు చెబుతారు. అయితే క్రీస్తు శకం 1823లో జరిగిన ఒక భారీ అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట ధ్వంసమయ్యింది. అప్పటి నుంచి ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ఈ కోట ముందరి భాగంలోని ఉద్యానవనం, భారీ ఫౌంటైన్లు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి.

సింహఘడ్ కోట

సింహఘడ్ కోట

P.C: You Tube

పూనే నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సినాఘడ్ కోట ప్రముఖ ట్రెక్కింగ్ ప్రదేశం కూడా. సహ్యాద్రి పర్వత శ్రేణిలోని భూలేశ్వర్ లో ఉన్న ఈ కోట అప్పట్లో శత్రుదుర్భేద్యంగా ఉండేది. సింహఘడ్ కోట మరాఠా సామ్రాజ్యపు యుద్ధనీతిని తెలియజేస్తుంది. పూనే నుంచి వీకెండ్ సమయంలో ఎక్కువ మంది ఈ సింహఘడ్ కోట పై భాగానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకొంటారు.

చతుశ్రింగి దేవాలయం

చతుశ్రింగి దేవాలయం

P.C: You Tube

చతుశ్రింగి దేవాలయం పర్వత శిఖరం పై ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ దేవాలయం పూనేకు దగ్గరగా ఉంటుంది. ఈ దేవాలయం 125 అడుగుల వెడల్పు, 90 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి 100 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న పరిమాణంలో ఉన్న 8 అష్ట వినాయక విగ్రహాలతో పాటు దుర్గాదేవి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ దేవతను సందర్శించడం వల్ల మనుకొన్న పనిలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని పూనే వాసులు నమ్ముతారు.

పాతాళేశ్వర్

పాతాళేశ్వర్

P.C: You Tube

పాతాళేశ్వర్ ఒక గుహాలయం. ఇది ప్రముఖ శివాలయం కూడా. ప్రస్తుతం పురావస్తు శాఖ ఆదీనంలో ఉంది. రాష్ట్రకూటల కాలంలో కొండను తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ దేవాలయంలోని శివలింగానికి పూజలు జరుగుతున్నాయి. శివలింగం ముందు ఉన్న మంటపంలో ఉన్న నంది విగ్రహం విలక్షణంగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X