Search
  • Follow NativePlanet
Share
» » తెలుగు రాష్ట్రాల్లోని ఈ జలపాతాల్లో జలకాలాడారా?

తెలుగు రాష్ట్రాల్లోని ఈ జలపాతాల్లో జలకాలాడారా?

తెలుగు రాష్ట్రాల్లోని జలపాతాల గురించిన కథనం.

దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడే వర్షాలు మొదలయ్యాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇప్పటి వరకూ జలసవ్వడులు కరువైన జలపాతాలకు నూతన జవసత్వాలు వస్తున్నాయి. ఈ నెలాఖరు లేదా జులై లోపు ఆయా జలపాతాలు మనకు నయనానందకరంగా కనిపించడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని జలపాతాలు, అక్కడికి దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించిన సమాచారం మీకందిస్తున్నాం. జలపాతాల సమాచారంలో భాగంగా మీకు ఎత్తిపోతల, మల్లెల తీర్థం, పోచర్చ, కుంతల, తలకోన జలపాతాల సమాచారం మొదటగా ఇస్తున్నాం. రెందుకు ఆలస్యం వాటిని చదివి రానున్న రోజుల్లో వీకెండ్ కు సరదాగా ఒక ట్రిప్ వేసేయండి.

ఎత్తి పోతల జలపాతం

ఎత్తి పోతల జలపాతం

P.C: You Tube

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మనోహరమైన జలపాతాల్లో ఎత్తిపోతల జలపాతం ముందువరుసలో ఉంటుంది. చంద్రవంక నదీ ఎత్తైన కొండల ప్రాంతం నుంచి పడటం వల్ల ఈ జలపాతం ఏర్పడుతుంది. ఈ జలపాతం చుట్టు పక్కల పచ్చదనం మనలను కనువిందు చేస్తుంది. నాగార్జున సాగర్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి 176 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ జలపాతం దగ్గర్లో నాగార్జున సాగర్ తో పాటు మెసళ్ల పెంపక కేంద్రం, రంగనాథ దేవాలయం, దత్తాత్రేయ దేవాలయం చూడదగినవి.

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

P.C: You Tube

మల్లెత తీర్థం జలపాతం మనకు నల్లమల అడవుల్లో క`ష్ణా నది వల్ల ఏర్పడుతుంది. శ్రీశైలానికి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి 58 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మల్లెల తీర్థం దగ్గర మల్లికార్జున దేవాలయం, సాక్షి గణపతి దేవాలయాన్ని చూడదగిన ప్రాంతాలు.

పోచర్ల పాల్స్

పోచర్ల పాల్స్

P.C: You Tube

హైదరాబాద్ కు 257 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచర్ల పాల్స్ వీకెండ్ కు మంచి టూరిస్ట్ స్పాట్. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి సుడులు తిరుగుతూ వచ్చే నీటి ప్రవాహం చూడటానికి చాలా మనోహరంగా ఉంటుంది. ఈ జలపాతానికి దగ్గర్లోనే బాసర సరస్వతీ దేవి దేవాలం, నిర్మల్, కావల్ అభయారణ్యం, ప్రాణహిత అభయారణ్యం, సువర్ణపురి వంటి పర్యాటక స్థలాలు ఉన్నాయి.

కుంతల పాల్స్

కుంతల పాల్స్

P.C: You Tube

తెలంగాణలో అతి ఎతైన జలపాతాల్లో కుంతలది అగ్రస్థానం. ఆదిలాబాద్ జిల్లాలోని సహ్యద్రి పర్వత పంక్తుల్లో కడెం నది పై కుంటాల గ్రామానికి సమీపంలో ఈ జలపాతం ఉంటుంది. దుష్యంతుడి భార్య శకుంతల పేరు పై ఈ జలపాతానికి కుంతల జలపాతం అని పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ జలపాతం వద్ద ఉన్న గుహల్లో సహజ సిద్ధంగా శివలింగాలు ఏర్పడ్డాయి. అందువల్ల శివరాత్రికి ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంటుంది.

తలకోన

తలకోన

P.C: You Tube

శేషాచల కొండల వరుసలో తల భాగంలో ఉన్నందు వల్ల ఈ జలపాతానికి తలకోన అని పేరు వచ్చింది. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తు నుంచి ఇక్కడ నీరు కిందికి పడుతుంది. ఈ నీటిలో వివిధ రకాల వ్యాధులను నయం చేసే గుణముందని నమ్ముతారు. ఈ తలకోన వద్దే సిద్ధేశ్వర దేవాలయం కూడా చూడవచ్చు. తిరుపతి నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఈ తల కోన జలపాతం ఉంటుంది. ఈ జలపాతం నుంచి తిరుమలతో పాటు కాళహస్తి పుణ్యక్షేత్రాలు చాలా దగ్గరగా ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X