Search
  • Follow NativePlanet
Share
» »ఇవి సముద్ర పార్కులు

ఇవి సముద్ర పార్కులు

మెరైన్ పార్కులకు సంబంధించిన కథనం

By Gayatri Devupalli

సముద్ర ఉద్యానవనం అనగా రక్షిత సముద్ర ప్రాంతం లేదా ఒక సరస్సు ప్రాంతం. ఇది అనేక సముద్ర జీవజాతులను కలిగి ఉంటుంది. ఇటువంటి సముద్ర ఉద్యానవనాలు, సాధారణంగా తీరప్రాంతాలలో కనిపిస్తాయి. భారతదేశంలో ఆరు జాతీయ సముద్ర పార్కులు స్థాపించబడ్డాయి. ఈ ప్రదేశాలలో, సముద్ర జీవాల రక్షణ మరియు పెంపకం చేపడతారు. ఇందుకు సంబంధించిన కథనం మీ కోసం ఒడిషాలోని గహీర్మత సముద్రతీరం దగ్గర ఆలివ్ రిడ్లే రకం సముద్ర తాబేళ్ళ పెంపకం ప్రధానంగా చేపడుతున్నారు. గుజరాత్ లోని గల్ఫ్ ఆఫ్ కచ్ లో, ఉన్న పగడపు దిబ్బలు రక్షించాల్సిన అవసరం ఉంది. అందువల్ల, భారతదేశంలోని ఇటువంటి సున్నితమైన పర్యావరణ మండలాలను సముద్రపు ఉద్యానవనాలుగా గుర్తించారు. వీటిలోని కొన్ని ప్రదేశాలలో, గాజు పడవ సవారీలు, స్కూబా డైవింగ్ మరియు స్నార్కెలింగ్ కూడా అనుమతించబడతాయి.

 గల్ఫ్ ఆఫ్ కచ్ జాతీయ సముద్ర ఉద్యానవనం:

గల్ఫ్ ఆఫ్ కచ్ జాతీయ సముద్ర ఉద్యానవనం:

P.C: You Tube

జాంనగర్ సముద్ర తీరాన 42 ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ సముద్ర వన్యప్రాణులలో గొప్ప వైవిధ్యం కనిపిస్తుంది. 1980 లో ఈ ప్రాంతాన్ని, సముద్ర అభయారణ్యంగా ప్రకటించబడింది. బాటిల్ నోస్ డాల్ఫిన్లు, ఆకుపచ్చ సముద్రపు తాబేళ్లు, పెద్ద పగడపు దిబ్బలు మొదలైనవి.

మొదటిది

మొదటిది

P.C: You Tube

దీనిని భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ సముద్ర ఉద్యానవనంగా ప్రకటించారు. భారతదేశంలోని ప్రధాన జాతీయ సముద్ర ఉద్యానవనాలలో, గుజరాత్ లోని గల్ఫ్ ఆఫ్ కచ్ ఒకటి. ఇక్కడి వివిధ ద్వీపాలలో, పిరోటాన్ ద్వీపం అత్యంత ప్రసిద్ధమైనది.

గహిర్మతా సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం:

గహిర్మతా సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం:

P.C: You Tube

గహిర్మత సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం ఒడిషాలో ఉంది. ఐదు భారతదేశంలోని ఆలివ్ రిడ్లే సముద్ర తాబేళ్ల ప్రధాన స్థావరం. సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం మరియు భీతర్కనికా మడ అడవుల మధ్య, గహిర్మత సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరం, అభయారణ్యంలో ప్రధాన భాగంగా మరియు ఆలివ్ రిడ్లే తాబేళ్ళ ప్రధాన ప్రత్యుత్పత్తి స్థలంగా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మహాత్మా గాంధీ సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం

మహాత్మా గాంధీ సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం

P.C: You Tube
మహాత్మా గాంధీ సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం, అండమాన్ దీవులలోని, వందూర్ లో ఉంది. 15 ద్వీపాలతో కూదుకుని ఉన్న ఈ సముద్రపు ఉద్యానవనం, పర్యావరణ పర్యాటక రంగం కోసం కూడా తెరవబడింది.స్కూబా డైవింగ్ కు అనుకూలం

పగడపు దిబ్బలు

పగడపు దిబ్బలు


P.C: You Tube
ఇక్కడ సముద్ర జాతులు మరియు పగడపు దిబ్బలు పెద్ద రకాలు ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని సీజన్లలో, పర్యాటకులు స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ మరియు బోటింగ్ కూడా ఆనందించవచ్చు.వివిధ రకాల సముద్ర జాతులు మరియు పగడపు దిబ్బలు ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని సీజన్లలో పర్యాటకులు, స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ మరియు బోటింగ్ ను కూడా ఇక్కడ ఆనందించవచ్చు.

మన్నార్ గల్ఫ్ సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం

మన్నార్ గల్ఫ్ సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం

P.C: You Tube

తమిళనాడులోని తూర్పున ఉన్న 21 ద్వీపాల సమూహం, భారతదేశంలోని సముద్ర వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటి. వైవిధ్యానికి పెట్టింది పేరైన ఈ పర్యావరణ వ్యవస్థ,మన్నార్ గల్ఫ్ లో ఉంది.మన్నార్ గల్ఫ్ పెద్ద పగడపు దిబ్బలకు మరియు వైవిధ్యభరిత సముద్ర జంతుజాలానికి నెలవు. ఇది తూత్తుకుడి మరియు ధనుష్కోడి తీరం మధ్య ఉంది.

రాణి ఝాన్సీ సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం:

రాణి ఝాన్సీ సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం:

P.C: You Tube

అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలలో రిట్చీ ద్వీపసమూహంలో, ఈ సముద్ర వన్యప్రాణుల అభయారణ్యం ఉంది.1996 లో స్థాపించబడిన ఈ అభయారణ్యంకు, ఝాన్సీ రాణి పేరు పెట్టబడింది. పోర్ట్ బ్లెయిర్ నుండి పడవలు ద్వారా ఈ సముద్ర అభయారణ్యంకు చేరుకోవచ్చు.

మాల్వాన్ మెరైన్ వన్యప్రాణుల అభయారణ్యం:

మాల్వాన్ మెరైన్ వన్యప్రాణుల అభయారణ్యం:

P.C: You Tube

మాల్వాన్, మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో ఉన్న ఒక తీర పట్టణం. మాల్వాన్ సముద్ర అభయారణ్యంలో, వివిధ రకాల సముద్ర వృక్షజాతులు మరియు జంతుజాతులు ఉంటాయి. ఇక్కడ ముత్యాల క్లామ్ లు, మొలస్క్ లు మరియు పగడాలు చూడవచ్చు. లేడి, అడవి పంది మొదలైన కొన్ని క్షీరదాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X