Search
  • Follow NativePlanet
Share
» »ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో వున్న అద్భుత వింతలు మీకు తెలుసా ?

ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో వున్న అద్భుత వింతలు మీకు తెలుసా ?

సుమారుగా కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు వారి మొబైల్ ఫోన్ నుంచి ఎస్ ఎమ్ ఎస్ ల ద్వారా , మరికొంత మంది ప్రజలు ఉత్తరాల ద్వారా వారి విలువైన సమాచారాన్ని చేరవేశారు.

By Venkatakarunasri

మనము ఇంతవరకు ప్రపంచంలో ఉన్న 7 వింతలు గురించి విన్నాం మరియు భారత దేశంలో ఉన్న 7 వింతలు గురించి కూడా కాస్త ఆటో ఇటో విన్నాం. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే వింతలు పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అనే మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవి. భారత దేశంలో ఉన్న స్వచ్చంద సంస్థలు ఈ అద్భుత వింతల మీద కొన్ని పోల్స్ కండక్ట్ చేసి ఎవరైతే ఎక్కువగా ఆ ప్రదేశాన్ని ఓట్ చేస్తారో లేదా లైక్ చేస్తారో వాటిని అద్భుత వింతలుగా పరిగణించింది.

మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పోల్స్ లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుమారుగా కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు వారి మొబైల్ ఫోన్ నుంచి ఎస్ ఎమ్ ఎస్ ల ద్వారా , మరికొంత మంది ప్రజలు ఉత్తరాల ద్వారా వారి విలువైన సమాచారాన్ని చేరవేశారు. ఇలా చేరవేసిన సమాచారాన్ని స్వచంద సంస్థలు పరిశీలించి ఈ క్రింద పేర్కొనబడిన ప్రదేశాలను వండర్స్ గా ప్రకటించారు.

టాప్ 5 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. ఎండల మల్లిఖార్జునస్వామి దేవాలయం

1. ఎండల మల్లిఖార్జునస్వామి దేవాలయం

కలియుగ కార్తీక కైలాసంగా పేరుగాంచిన ఈ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఇక్కడున్న శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగంగా గుర్తింపు పొందింది. ఏటా శివరాత్రితో పాటు కార్తీక మాసంలో పెద్దఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజున, కార్తీకమాసం సోమవారం పర్వదినాల్లో లక్షలాదిమంది భక్తులు సందర్శిస్తారు.

Photo Courtesy: kvs_vsp

2. బెలుం గుహలు

2. బెలుం గుహలు

వేల అడుగుల ఎత్తులో కొన్ని... వేల మీటర్ల పొడవుతో ఇంకొన్ని...భూ అంతర్భాగంలో కొన్ని...దేవుళ్ల పోలికలతో కొన్ని... దేవతలకు ఆవాసాలుగా కొన్ని... మనిషి కట్టని నిర్మాణాలతో ప్రకృతి చెక్కిన అద్భుతాలతో అబ్బురపరిచే గుహల సౌందర్యాన్ని కర్నూల్ జిల్లాలోని అవుకు మండలం లో చూడక మానదు. ఇక్కడ దొరికిన మట్టి పాత్రల ద్వారా ఈ గుహలు బొర్రా గుహల కంటే పురాతనమైనవిగా చెప్పబడుతున్నాయి. ఇది ఏకంగా భూ గర్భంలో 10 కి. మీ. వరకు విస్తరించి ఉన్నాయి. లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటుచేశారు. గుహల లోపల ఫౌంటెన్ , కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి.

Photo Courtesy:Lovell D'souza

3. రామప్ప ఆలయం

3. రామప్ప ఆలయం

ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయము హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో , వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా మూడు రోజుల పాటు జరుపుతారు.

Photo Courtesy: Vbshashank

4. లేపాక్షి ఆలయం

4. లేపాక్షి ఆలయం

వీరభద్ర టెంపుల్, అనంతపురం లో ఉన్న లేపాక్షి గ్రామంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. విజయనగర సామ్రాజ్యాధిపతుల చేత ఈ ఆలయం 16 వ శతాబ్దం లో, వారి నిర్మాణ శైలి లోనే నిర్మించబడినది. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యం తో అలరారుతూ ఉంటుంది. అతి పెద్ద రాతి నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ కొలువైన స్వామి వీరభద్రుడు.

Photo Courtesy:Navaneeth KN

5.హుస్సేన్ సాగర్

5.హుస్సేన్ సాగర్

హైదరాబాద్ యొక్క చరిత్రలో మరియు భౌగోళిక ప్రాంతంలో ఒక మైలురాయి వంటిది ఈ హుస్సేన్ సాగర్ చెరువు. ఈ మానవ నిర్మిత చెరువుని హజ్రత్ హుస్సేన్ షా వాలి 1562 లో నిర్మించారు. ఈ చెరువు చుట్టూ నిర్మితమైన నెక్లస్ రోడ్డు రాత్రి పూట లైట్లతో వజ్రాలు పొదగబడిన నెక్లస్ లాగా మెరుస్తూ ఉంటుంది.ఏక శిలా విగ్రహమైన బుద్ధుని విగ్రహం 1992 ఈ హుస్సేన్ సాగర్ చెరువు మధ్యలో ప్రతిష్టించారు. పడవ ద్వారా ఈవిగ్రహం ఉన్న ప్రదేశానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు తప్పని సరిగా సందర్శించడం మరవకండి.పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ కూడా కాస్త అలా ఏమనుకోకుండా చూడండే !

Photo Courtesy:Alosh Bennett

6. లెజిస్లేటివ్ ఆసెంబ్లీ

6. లెజిస్లేటివ్ ఆసెంబ్లీ

ఆసెంబ్లీ హైదరాబాద్ లోని నాంపల్లి ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ మన రాజకీయ నాయకులు ఉంటారండోయ్!. మనమైతే ఎప్పుడు ప్రతిరోజు స్కూల్ కో, లేకపోతే ఆఫీస్ కో వెళుతుంటాం మరి ఎం ఎల్ ఏ సార్లు వెళ్ళరా బడులకి అంటే ఇదే వారి బడి. ప్రతి 6 నెలలకి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ప్రెసెంట్ వేయించుకోవాల్సిందే. ఇక్కడే వారు చట్టాలను చేసి మనలను శాసిస్తారు. అంతటి పవర్ ఉన్న ఈ ఆసెంబ్లీని మనం ఆసెంబ్లీ సెలవుల రోజులలో (సమావేశాలు లేనప్పుడు) నామామాత్రపు ఛార్జీతో సందర్శించవచ్చు. ఇక్కడే పబ్లిక్ గార్డెన్ , ఆంధ్రప్రదేశ్ స్టేట్ మ్యూజియం వంటివి చూడవచ్చు.

Photo Courtesy:puihlein

7. వరంగల్ కోట

7. వరంగల్ కోట

వరంగల్ నగరంలో అందరినీ నిలువరించే ఆకర్షణలలో ఒకటి వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు ఉదాహరణ ఈ కోట. గణపతిదేవుడు 1199 ఏ.డి. లో కోట భవనం నిర్మాణం మొదలుపెడితే , 1261 ఏ.డి. లో అతని కుమార్తె రాణి రుద్రమ దేవి పూర్తి చేసింది. ఈ కోట రెండు గోడలతో ఉన్న నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలను సంచి శైలిలో కలిగిఉన్నది. ఎవరైతే నిర్మాణ ఆసక్తి కలిగి ఉన్నారో, చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నారో ఈ కోటను సందర్శించి ఆ విజ్ఞానాన్ని పొందుతారు.ఈ రోజు వరకు కూడా సింహాల వంటి జంతువులు మరియు స్వాన్స్ వంటి పక్షులు నిర్వచించేందుకు ఉపయోగింఛిన సున్నితమైన రాతి పని మరియు నమూనాలు స్పష్టంగా చూడవచ్చు.

Photo Courtesy: ShashiBellamkonda

8. నాగార్జున సాగర్

8. నాగార్జున సాగర్

నాగార్జునసాగర్, ప్రపంచంలో ఉన్న బౌద్ధులకు ముఖ్యమైన స్థలము. ఇది దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణ లో ఒక చిన్న పట్టణంగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ నుండి 150 కి.మీ దూరంలో ఉన్నది. పూర్వం ఇక్ష్వాకుల రాజధాని అయిన విజయపురి పట్టణంలో కలసి ఉండేది. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అతి విశాలమైన నాగార్జునసాగర్ డ్యాంను చూసి భావుకత్వంతో "ఆధునిక దేవాలయంగా" అభివర్ణించాడు. ఈ జలాశయం ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకొని పరవళ్ళు త్రొక్కుతూ ఉంది. వర్షాకాలంలో కృష్ణవేణమ్మ మరింతగా ఉప్పొంగి పొరలుతుంది.

Photo Courtesy: రహ్మానుద్దీన్

9. గోల్కొండ

9. గోల్కొండ

హైదరాబాద్ నగరానికి 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్కండ ఫోర్ట్ లేదా గొల్ల కొండ ఫోర్ట్, గొర్రెల కాపరుల పర్వతాన్ని తెలుపుతుంది. ఈ ఫోర్ట్ కున్న ముఖ్యమైన లక్షణం శబ్ద లక్షణ శాస్త్రం. ఈ ఫోర్ట్ వరండాలో నిలుచుని మీరు చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినబడుతుంది. ఇది హైదరాబాద్ లో పర్యటించే ప్రతి పర్యాటకుడు తప్పక చూడవలసిన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ జరిగే లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ షో లు పర్యాటకులను అబ్బురపరుస్తాయి.

Photo Courtesy: 10 Year Itch (Madhu Nair)

10. తిరుపతి

10. తిరుపతి

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది.ధర్మం, సంస్కృతి ప్రేమించే ప్రతి పర్యాటకుడు తప్పక చూసి తీరవలసిన ప్రాంతం తిరుపతి. చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు.

Photo Courtesy:daimalu

11. రామోజీ ఫిల్మ్ సిటీ

11. రామోజీ ఫిల్మ్ సిటీ

హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఈ రామోజీ సిటీ, సినిమా మరియు సీరియల్ షూటింగ్ లకే కాకుండా పిక్నిక్ లకి, థీమ్ బేస్డ్ పార్టీలకి, కార్పొరేట్ ఈవెంట్లకి, వైభవోపేతమైన పెళ్ళిళ్ళకి, సాహస కామ్పులకి, కాన్ఫరెన్స్ లకి అలాగే హనీ మూన్ జంటలకి అనువైన ప్రదేశం గా ప్రాచుర్యం పొందింది. రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా సర్టిఫై కాబడినది. జాయ్ రైడ్స్, ఫన్ ఈవెంట్, సంగీత సంబంధిత కార్యక్రమాలు, ఆటలు అలాగే నృత్యాలు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు సంపూర్ణ కుటుంబానికి వినోదం కలిగించేవి, మీకు కావలసినప్పుడు షాపింగ్ చేసుకునే సదుపాయం అలాగే వివిధ రకాల రుచులని అందించే భోజన సౌకర్యాలు కూడా ఇక్కడ కలవు.

Photo Courtesy: tushar gandhi

12. చార్మినార్

12. చార్మినార్

చార్మినార్ అనునది హైదరాబాద్ చిహ్నం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఒక భాగం. ఈ మినార్ హైదరాబాద్ లోని పాతబస్తి ప్రదేశంలో కలదు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కట్టడం కరెక్టుగా రోడ్డు మధ్యలో ఉన్నది. ఇంతకు పూర్వం ఈ మినార్ మధ్యలో నుంచి వాహనాలు వెళ్ళేవి కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఈ స్మారక చిహ్నం నగరం లో నుండి అంటు వ్యాధి అయిన ప్లేగు వ్యాధిని నిర్మూలించిన దైవ శక్తుల కి కృతజ్ఞతా భావం తో నిర్మింపబడినది. తన గాంభీర్యం తో వేల మంది పర్యాటకులని ఈ చార్మినార్ ఆకర్షిస్తోంది.

Photo Courtesy: Habeeb

13.బొర్రా గుహలు

13.బొర్రా గుహలు

బొర్రా గుహలు అరకు లోయ కు దగ్గరలో మరియు విశాఖపట్టణం ( వైజాగ్ ) నగరానికి కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్నాయి. ఒరియా భాషలో బొర్రా అంటే రంధ్రం అని అర్థం ఆట. ఒరియా ఎందుకులేండి మామూలుగా మన తెలుగు భాషలో కూడా బొర్రా అంటే అదే అర్థం వస్తుంది. ఈ గుహలు సుమారుగా 10 లక్షల ఏళ్ల క్రితమే సహజంగా ఏర్పడినవిగా శాస్త్రవేత్తల అంచనా. తూర్పు కనుమల్లో వెలసిన ఈ ప్రదేశం నిజంగా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం. ఇది ప్రకృతి ప్రసాదించిన వింతనే చెప్పాలి. ఈ గుహలలో ప్రయాణమే ఒక గొప్ప అనుభూతి. ఈ గుహలలోనే ఎన్నో తెలుగు సినిమా షూటింగ్‌లు జరిగినాయి. అందులో మచ్చుకి కొన్ని - మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు - అతిలోక సుందరి, అక్కినేని నాగార్జున నటించిన శివ, జంబలకిడి పంబ మొదలగునవి.

Photo Courtesy: Raj srikanth800

14. భొంగీర్ కోట

14. భొంగీర్ కోట

భొంగీర్ కోట ని పశ్చిమ చాళుక్య పాలకుడు అయిన త్రిభువనమల్ల 6 విక్రమాదిత్యుడు విడిగా ఒక ఏక శిలా కొండ మీద 10 వ శతాబ్ధం లో నిర్మించినాడు. అందువలన దీనిని అతని పేరు మీద త్రిభువనగిరి అని వచ్చేటట్లు పేరు పెట్టారు. సముద్ర మట్టానికి సుమారుగా 609.6 మీటర్ల ఎత్తులో భొంగీర్ పట్టణానికి సమీపంలో, పెద్ద రాళ్లు రక్షణలో రెండు ఎంట్రీ పాయింట్లతో ఒక ఏకైక గుడ్డు ఆకారంలో నిర్మాణం కలిగి ఉంది. ఈ కోటకి రాణి రుద్రమ దేవి మరియు ఆమె మనవడు రెండవ ప్రతాపరుద్రుడి పాలనతో సంబంధం ఉంది.

Photo Courtesy: Historical Places In India

15.మక్కా మసీద్

15.మక్కా మసీద్

ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక పురాతన మసీదు. అంతే కాక దేశంలోనే ఉన్న రెండవ అతి పెద్ద మసీదు గా (మొదటిది జమా మసీదు) ప్రాచుర్యం పొందింది. ఈ మసీదు లో ఉన్న ముఖ్య ఆకర్షణ ఇక్కడ వరండా. ప్రవక్త మొహమ్మద్ గారి తల నుండి వేరుపడిన వెంట్రుక ఇక్కడ భద్రపరచబడినదని నమ్మకం. మక్కా నుండి తీసుకువచ్చిన మట్టితో తయారుచేయబడిన ఇటుకలతో ఈ మసీదు నిర్మాణం జరిగింది. మధ్యలో ఉన్న కమానుని ఈ ఇటుకలతోనే నిర్మించారు. ఈ మసీదు మొఘలుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇక్కడికి కూత వేటు దూరంలోనే ప్రపంచ ప్రసిద్ధ కట్టడం లో ఒకటిగా చెప్పుకోబడే చార్మినార్ ఉన్నది. ఇక్కడ ప్రతి శుక్రవారం వేలాది మహమ్మదీయులు చాలా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుంటారు. ఇక రంజాన్ మరియు బక్రీద్ వంటి పండగలకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Photo Courtesy: Amit Rawat

తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!తిరుమల గురించి నమ్మశక్యంకాని కొన్ని నిజాలు !!

అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?అంతుచిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా ?

శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?శృంగార బావి యొక్క రహస్యం మీకు తెలుసా?

శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలుశ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వెనుక దాగి వున్న నిజాలు

నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?నీటిలో తేలియాడే 15 కిలోల బరువు వున్న మహిమ గల రాయి ఎక్కడుందో మీకు తెలుసా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X