Search
  • Follow NativePlanet
Share
» »జామ్ నగర్ - 'సిటీ ఆఫ్ జామ్స్' !!

జామ్ నగర్ - 'సిటీ ఆఫ్ జామ్స్' !!

జామ్ నగర్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ పర్యాటకులు చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ఈ నగరాన్నీ 'సిటీ అఫ్ జామ్స్' గా అభివర్ణిస్తారు. 'జామ్' అంటే రాజు అని అర్థం

By Mohammad

పర్యాటక ప్రదేశం - జామ్ నగర్

రాష్ట్రం - గుజరాత్

ఆకర్షణీయ ప్రదేశాలు - బాల హనుమాన్ టెంపుల్, రాజభవనాలు, లఖోట సరస్సు, మెరైన్ పార్క్ మరియు మొదలగునవి.

క్రి.శ. 1540 లో జామ్ నగర్ ను జామ్ రావాల్ నావానగర్ కు రాజధానిగా కనుగొన్నారు. ఈ సిటీ ని రాన్మల్ సరస్సు ఒడ్డున మరియు రంగమతి మరియు నగ్మతి నదుల సంగమంలో స్థాపించారు. ఈ నగరాన్ని తర్వాతి కాలంలో మహారాజ కుమార్ శ్రీ రంజిత్ సిన్హాజి 1920 లలో మరోసారి పునరిద్ధరించారు. ఆ తర్వాతి కాలంలో దీనిని 'సిటీ అఫ్ జామ్స్' అనేవారు. 'జామ్' అంటే రాజు అని అర్ధం చెపుతారు.

ఇది కూడా చదవండి : దంతా - ఆశ్చర్యాల మిశ్రమం !!

మూల చరిత్ర

జామ్ రావాల్ తండ్రి అయిన జామ్ లకాజి కి బహదూర్ షా పన్నెండు గ్రామాలను బహుకరించాడు. తర్వాత, జామ్ రావాల్ కథియవార్ కు వెళ్లి అక్కడ నవానగర్ ను స్థాపించాడు. 1852 లో జామ్ విభాజి పాలనలో ఈ నగరంలో అనేక స్కూళ్ళు, ఆస్పత్రులు స్థాపించటం మరియు రైల్వే లైన్లు రాజ్ కోట్ కు వేయటంతోను నవ నగరం బాగా అభివృద్ధి చెందినది.

బాల హనుమాన్ టెంపుల్

బాల హనుమాన్ టెంపుల్

ఈ టెంపుల్ ఆకర్షణీయంగా ఉండటమే కాక ఎంతో ప్రసిద్ధిచెందిన క్షేత్రం గా వుంది. ఇది గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి దీర్ఘకాలంపాటు ‘శ్రీ రామ జయ రామ జయ జయ రామ ‘ అనే మంత్రాన్ని ఆగష్టు 1, 1964 నుండి అంటే సుమారు 48 సంవత్సరాలనుండి ప్రతి రోజూ ఇరవై నాల్గు గంటలూ జపించటం లో రికార్డు నెలకొల్పింది.

చిత్రకృప : Camaal Mustafa Sikan...

భుజియో కోతో

భుజియో కోతో

టూరిస్టుల పర్యటనకు ఇది ఒక ఆసక్తి కర ప్రదేశం. లఖోతా చెరువు ఒడ్డున ఇది ఒక అయిదు అంతస్తుల స్మారకం. మొదటి అంతస్తు మరియు గోడలు అనేక చోట్ల దెబ్బ తిన్నప్పటికీ పై భాగం లో నీటి నిలువకు ఒక ట్యాంక్ కలదు. ఖోతో శిఖరం ఒక దంచింగ్ నెమలిని చూపుతుంది. ఇది టూరిస్టులకు ఉదయం 10 గం. నుండి సా. 5 గం. వరకు తెరచి వుంటుంది.

చిత్రకృప : Rangilo Gujarati

దర్బార్ గఢ్

దర్బార్ గఢ్

ఈ భవనం రాజపుత్ర మరియు యురోపెయన్ ఆర్కిటెక్చర్ సమ్మేళనంగా వుంది పట్టనంలూకప్రాదాన చారిత్రక భావన సముదాయం గా పేరు పడింది. అనేక వాల్ పెయింటింగ్ లు, రాతి శిల్పాలు, అందమైన స్తంభాలు, అలంకరించిన అద్దాలు, ఇతర శిల్పాలతో కూడి వుంటుంది.

చిత్రకృప : Dheru2000

గాగా వైల్డ్ లైఫ్ సంక్చురి

గాగా వైల్డ్ లైఫ్ సంక్చురి

గాగా వైల్డ్ లైఫ్ సంక్చురి సుమారు 332 ఎకరాలలో వుంది. కచ్ గల్ఫ్ తీరంలో వున్నా గాగా సంక్చురి పచ్చటి ప్రదేశాలను వివిధ రకాల పక్షులను, అందమైన వలస పక్షులను ప్రత్యేకించి వింటర్ లో కలిగి వుంటుంది. ఇంతేకాక ఇక్కడ మీరు నక్కలు, తోడేళ్ళు, బ్లూ బుల్, జంగల్ కాట్ , బ్లూ బుల్, రంగు రంగుల సీతాకోక చిలుకలు, కందిరీగలు, సాలీళ్ళు, తేనెటీగలు, అన్నిగ్తిని ఈ సంక్చురి లో చూడవచ్చు.

చిత్రకృప : Rajendra jadeja

జైన టెంపుల్స్

జైన టెంపుల్స్

మూడింటి లోను, రైసి షా టెంపుల్ తీర్ధంకర శాంతినాత్ కు అన్కితమివ్వబడినది. దీని లోపలి మరియు వెలుపలి భాగాలు అనేక చెక్కడాలు కలిగి వుంటాయి. టెంపుల్ డోమ్ బంగారు పొదగబడి వుంటుంది. రెండవ టెంపుల్ వర్ధమాన్ షా టెంపుల్. ఇక మూడవ టెంపుల్ ఈ రెండిటి కంటే చిన్నది.

చిత్రకృప : Camaal Mustafa Sikan...

ఖిజాదియా సంక్చురి

ఖిజాదియా సంక్చురి

జామ్ నగర్ లో పక్షులకు అనేక ప్రదేశాలు కలవు. వాటిలో ఖిజాదియా సంక్చురి ఒకటి. ఇక్కడ అనేక స్థానిక, వలసపక్షులు వుంటాయి. పర్యావరణ విద్య, పరిశోధనలకు ఇది చక్కని ప్రదేశం. ఈప్రదేశానికి రిక్షాలు లేదా ప్రైవేటు వాహనాలలో వెళ్ళవచ్చు.

చిత్రకృప : Rangilo Gujarati

లఖోట సరస్సు

లఖోట సరస్సు

ఈ పాలస్ లఖోట సరస్సు మధ్య భాగంలో కలదు. ఈ భవనాన్ని లఖోట టవర్ అంటారు. ఇది ఇపుడు అరుదైన వస్తువుల సేకరణతో ఒక మ్యూజియంగా నిర్వహించబడుతోంది.ఈ మ్యూజియం పర్యాటకులకు ఉదయం 10.30 గం నుండి సా. 5.30 గం. వరకు తెరచి వుంటుంది.

చిత్రకృప : Arunnimbel

రతన్ బాయి మసీద్

రతన్ బాయి మసీద్

పురాతన జామ్ నగర్ లో మధ్య భాగం లో కల అందమైన పొడవైన భవనం రతన్ బాయి మసీద్. దీని తలుపులు గంధపు చెక్క మరియు ముత్యాలు కలిగి వుంటాయి. ఈ నిర్మాణం రెండు పొడవైన టవర్లు కలిగి వుంటుంది.

చిత్రకృప : Camaal Mustafa Sikan...

మెరైన్ నేషనల్ పార్క్

మెరైన్ నేషనల్ పార్క్

మెరైన్ నేషనల్ పార్క్ ఇండియా లోనే ఒక ప్రత్యేకత కలిగి చూడదగిన ప్రదేశం. ఇది ఇండియాలో మొదటి మెరైన్ సంక్చురి. దీనిలో 42 ద్వీపాలు కలవు. ఇవి చాలా అందమైనవి. ఈ నీటి దీవులు అరుదైన, రంగు రంగుల ప్రాణులతో వుండి నీటిలో అందంగా కనపడతాయి.

చిత్రకృప : Rangilo Gujarati

మానెక్ బాయీ ముక్తిధం

మానెక్ బాయీ ముక్తిధం

మానెక్ బాయీ ముక్తి ధం ఒక సమాదుల పార్క్ . చాలా ప్రశాంతం గా వుంటుంది. అందమైన ఈ ముక్తి ధాం లో పచ్చటి గార్డెన్, విగ్రహాలు, రామాయణ గాధల కుడ్య చిత్రాలు ,ఒక లైబ్రరీ వుంటాయి. ఈ పార్క్ సిటీ మధ్య భాగం నుండి పది నిమిషాలలో చేరవచ్చు.

చిత్రకృప : Emmanuel DYAN

లఖోట తలావ్

లఖోట తలావ్

లఖోట తలావ్ ప్రాంతంలో ఎల్లపుడూ పక్షుల కిల కిలలు వినపడుతూ వుంటాయి. ప్రతి సంవత్సరం సుమారు 75 రకాల జాతుల పక్షుల రాకతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూంటారు. ప్రత్యేకించి వారాంతపు సెలవులు, సాయంత్రాలు జనం అధికంగా వుంటారు.

చిత్రకృప : Pruthviraj PSJ

జామ్ నగర్ ఎలా చేరుకోవాలి ?

జామ్ నగర్ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : జామ్ నగర్ లో విమానాశ్రయం కలదు. ఇక్కడకు ముంబై నుండి ఫ్లైట్స్ నడుస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ లేదా ఆటో రిక్షాల్లో ఊరిలోకి ప్రవేశించవచ్చు.

రైలు మార్గం : జామ్ నగర్ లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడకు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాలలోని ముఖ్య పట్టణాల నుండి రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి.

బస్సు / రోడ్డు మార్గం : రాజ్ కోట్, ద్వారకా, ముంబై, గాంధీనగర్, అహ్మదాబాద్, భుజ్, సూరత్ తదితర ప్రాంతాల నుంచి జామ్ నగర్ కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్రకృప : Camaal Mustafa Sikan...

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X