Search
  • Follow NativePlanet
Share
» »తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

తిరుమల వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి.

By Venkatakarunasri

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని తూర్పు కనుమల కొండ దిగువ ప్రాంతంలో ఉన్న తిరుపతి భారతదేశంలోని సాంస్కృతికంగా అత్యంత వైభవంగా వుండే నగరాల్లో ఒకటి. సుప్రసిద్ధ తిరుపతి దేవాలయం సమీపంలో వుండడం వల్ల ఇది భక్తులకు, పర్యాటకులకు ఇష్టమైన నగరం అయింది. తిరుపతి అనే పదానికి మూలం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా 'తిరు', 'పతి' అనే రెండు పదాల కలయికతో ఈ పేరు ఏర్పడిందంటారు. తమిళంలో 'తిరు' అంటే గౌరవప్రదమైన అనీ, 'పతి' అంటే భర్త అనీ అర్ధం. కాబట్టి ఆ పదానికి అర్ధం 'గౌరవనీయుడైన పతి' అని అర్ధం. నగరానికి చాలా దగ్గరలో వున్న తిరుమల కొండలు ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రాచీనమైన కొండలని చెప్తారు.

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

తిరుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి బలమైన సాక్ష్యాలు లేనప్పటికీ క్రీ.శ. 4వ శతాబ్దం నుంచి వివిధ రాజవంశీకులు దీన్ని నిర్వహి౦చి, పునర్నిర్మించారు. 14, 15 శతాబ్దాలలో ఈ దేవాలయం ముస్లింల దండయాత్రను విజయవంతంగా ప్రతిఘటించింది. అలాగే బ్రిటిష్ దాడుల నుంచి కూడా తన్ను తాను కాపాడుకుని ఈ కట్టడం ప్రపంచంలోనే సంరక్షి౦చదగ్గ అతి ప్రాచీన కట్టడంగా నిలిచి వుంది.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

1933లో మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ఏర్పడి పరిపాలనా వ్యవహారాలూ చూసుకునేలా మద్రాస్ శాసనసభశాసనసభ ఒక చట్టం చేసింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలూ నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. ధార్మిక విషయాల్లో ధార్మిక సలహా మండలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాలు ఇచ్చేది.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

తిరుపతి నగరం ఇప్పటి కే టి రోడ్ లో కొత్తూరు లో వుండేది. తరువాత అది గోవిందరాజస్వామి దేవలాయం దగ్గరికి మారింది. ఇప్పుడు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించింది. తిరుమల వెంకన్న మూల విరాట్టును సాక్షాత్తూ విష్ణు మూర్తి ప్రతిరూపంగా కూడా భావిస్తుంటారు. స్వామి వారిపై వున్న తిరు నామం ఆయన కళ్ళను మూసివుంచుతుంది.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

శ్రీ వారిని దర్శించుకునే భక్తులు సగ భాగం మాత్రమే చూడగలుగుతారు. మిగిలిన సగ భాగం తిరునామం కింద వుంటుంది. స్వామివారి విగ్రహం పాదాల నుంచి పొంగి పొరలే జలప్రవాహాన్ని విరజా నదిగా పిలుస్తుంటారు.అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే,ఇది ఎక్కడ నుంచి ప్రవహిస్తుందనేది ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

అంతేకాదు అప్పుడప్పుడు స్వామివారి విగ్రహం వేడి పోగలను కక్కుతూ ప్రసరిస్తూ వుంటుంది.శ్రీవారి కళ్ళ నుంచి అత్యంత శక్తివంతమైన కిరణాలు వస్తున్నాయని భావించిన అర్చకులు ఎక్కువరోజులు కళ్ళను మూసివుంచేవిధంగా తిరునామాన్ని పెద్దదిగా పెడతారని చెబుతారు.వారంలో ఒక్క రోజు మాత్రమే అంటే గురువారం మాత్రమే స్వామివారి కళ్ళను పూర్తిగా దర్శించేవిధంగా తిరునామాన్ని చిన్నదిగా పెడతారు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

పండుగలు, ఉత్సవాల నగరం

తిరుపతి కేవలం ధార్మిక కేంద్రమే కాదు, గొప్ప సాంస్కృతిక కేంద్రం కూడా. ఇక్కడ జరిగే ఉత్సవాలు, పండుగలకు తిరుపతి ప్రసిద్ది. మే లో జరిగే గంగమ్మ జాతర బాగా ప్రసిద్ది చెందిన పండుగ. అసాధారణమైన వేడుకలకు ఈ పండుగ పెట్టింది పేరు. ఈ పండుగప్పుడు, భక్తులు మారువేషాల్లో గుడి వీధుల్లో తిరిగితే దుష్ట శక్తులనుంచి రక్షణ వుంతునదని నమ్ముతారు. ఇలా నడిచాక వాళ్ళు గంధం పూసుకుని, తలకు మల్లెల దండలు చుట్టుకుని గుళ్ళోకి వెళ్తారు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

దేవత మట్టి విగ్రహాన్ని పగులగోత్తడంతో జాతర ముగుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు దూరప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. చంద్రగిరి కోట లో నిర్వహించే విజయనగర ఉత్సవం, రాయలసీమ నృత్య, ఆహార పండుగలు ఇక్కడ జరిగే ఇతర ప్రధాన పండుగలు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

చూడాల్సిన ఆకర్షణలు

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు. చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

చెక్క బొమ్మలు, తెల్ల చెక్కతో చేసిన వస్తువులు, కలంకారీ చిత్రాలు, తంజావూర్ బంగారు ఆకుల చిత్రాలు, మరీ ముఖ్యంగా చందనపు బొమ్మలు లాంటి ఇక్కడి కళాకృతులు కూడా చూడాల్సిందే. తిరుపతి ప్రయాణం చాలా తేలిక. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది. డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది. చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అద్దె కార్లు, బస్సులు అందుబాటులో వుండడం వల్ల నగరంలో తిరగడం కూడా తేలికే. నామమాత్రపు ధరల్లో రోజంతటికీ కార్లు అద్దెకు తీసుకోవచ్చు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

గోవిందరాజ స్వామి గుడి

తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. 1235లో నిర్మించిన ఈ దేవాలయానికి వైష్ణవ గురువు శ్రీమద్రామానుజాచార్యులు శంఖుస్థాపన చేసారని చెప్తారు. ఈ గోపురం కాక మరో రెండు గుళ్ళ చుట్టూ బయటి ప్రాకారం వుంటుంది.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

దక్షిణం వైపు గుడిలో పార్ధసారధి స్వామి విగ్రహం వుండగా ఉత్తరం వైపు గోవింద రాజ స్వామి గుడి వుంది. అలాగే ఇక్కడ మనవాల మాముని, శ్రీ చక్రాతాళ్వార్, సలాయి నాచియార్ అమ్మవారి, శ్రీ మచురకవి ఆళ్వార్, శ్రీ వ్యాసరాజ ఆంజనేయ స్వామి, శ్రీ తిరుమంగాయి ఆళ్వార్, శ్రీ వేదాంత దేశికర్ ల చిన్న చిన్న ఆలయాలు కూడా వున్నాయి.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

అలమేలు మంగమ్మ ఆలయం

అలమేలు మంగమ్మ ఆలయం అలమేలుమంగాపురం లో ఉంది. దీనిని తిరుచానూరు అనికూడా పిలుస్తారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామీ భార్య అలమేలు మంగమ్మ లేదా శ్రీ పద్మావతి దేవి విగ్రహం ఉంది. పుష్కరిణి నదిలో ఈ దేవత పుట్టిందని నమ్మకం. ఈ ఆలయం రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉండి ఆధ్యాత్మిక సాధనలో వున్న పర్యాటకులకు అనువైన గుడి.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

పద్మావతీ దేవి గుడి

తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు. ఈ ఆలయం పద్మావతీ దేవి జననం గురించి, పద్మావతీ వెంకటేశ్వరుల పరిణయం గురించిన గాథలను చెప్తు౦ద౦టారు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

తోన్దమందలాన్ని పాలించే ఆకాశ రాజు ఒక యజ్ఞ౦ చేసినప్పుడు ఆయనకు ఒక తామరపువ్వు లో దొరికిన బిడ్డను పద్మావతీ దేవి పేరిట తన కూతురుగా పెంచుకున్నాడు. ఆవిడనే అలమేలు మంగ అని కూడా అంటారు - అంటే ప్రేమ, కరుణల నిరంతర, అక్షయ వనరు అని అర్ధం. ఆవిడ పెరిగి పెద్దదయ్యాక దైవ నిర్ణయంగా వెంకతెస్వ్హ్వార స్వామి ఆవిడను వివాహమాడారని చెప్తారు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

కపిల తీర్ధం

తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

తీర్థం అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్ధం, వినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

ఇస్కాన్ కృష్ణుడి ఆలయం

తిరుపతిలోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగిఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన చేక్కుళ్ళు ఉన్నాయి.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

కిటికీలు కృష్ణుడి లీలల గాజు చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. పైకప్పులు తంజావూరు శైలి కళతో అలంకరించారు. ఆలయ స్తంభాలపై విష్ణుమూర్తి పది అవతారాలూ ఉంటాయి. గర్భగుడిలో చుట్టూ గోపికలతో కృష్ణుడు ఉంటాడు. ఆలయం లోపల అందమైన పూలు, కొలనులు, ఫౌ౦టైన్ లు, కృష్ణ లీల విగ్రహాల తో ఒక అందమైన పార్కు కూడా ఉంటుంది.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వాతావరణం - రవాణా సౌకర్యాలు

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది. ఇక్కడ వేసవి చాలా వేడిగా వుంది అసౌకర్యంగా వుంటుంది కనుక, ఆ సమయంలో ఇక్కడికి రాకుండా వుండడం మంచిది. వర్షాలు వేసవి నుంచి ఉపశమనం ఇస్తాయి, తేలిక పాటి వర్షాలు తిరుపతి అందాన్ని ఇనుమడింప చేస్తాయి. తిరుపతి ప్రధానంగా గుళ్ళు వుండే నగరం కనుక, చాలా పవిత్రంగా భావించబడుతుంది కనుక, యాత్రికులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

సంప్రదాయ దుస్తులు ధరించండి, టోపీ, కేప్ లు పెట్టుకోకండి. ఇక్కడి పూలు దేవుడి కైకంకర్యానికే వాడాలి కనుక తలలో పెట్టుకోకండి. మాంసం మద్యం పూర్తీగా దొరకవు, వాడకం నిషేధం కూడా. ఫోన్ లు, కెమెరాలు లాంటి గాడ్జెట్ లు గుడిలోకి అనుమతించబడవు. ధర్మం, సంస్కృతి ప్రేమించే ప్రతి పర్యాటకుడు తప్పక చూసి తీరవలసిన ప్రాంతం తిరుపతి.

pc: youtube

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

ఎలా వెళ్ళాలి

రోడ్డు ద్వారా తిరుపతి

రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వెంకన్న కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

<strong>ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?</strong>ఈ లింగాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు సమస్త పీడలు నశిస్తాయి ! ఆదిశివలింగం ఎక్కడ ఉందో తెలుసా ?

<strong>వింతగా మారిన చంద్రగిరి కోట రహస్యం..రాణి మహల్ రహస్యం ? అక్కడ గుర్రాలకోసం !</strong>వింతగా మారిన చంద్రగిరి కోట రహస్యం..రాణి మహల్ రహస్యం ? అక్కడ గుర్రాలకోసం !

<strong>ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !</strong>ఆదోని కోట లో చక్రవ్యూహం..12 కోటల మధ్యలో ఉన్న రహస్యం మీకు తెలిస్తే షాక్ అవుతారు !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X