Search
  • Follow NativePlanet
Share
» »కార్కల జైన బసదిలు చూసొద్దామా !!

కార్కల జైన బసదిలు చూసొద్దామా !!

పెద్ద బాహుబలి విగ్రహ౦తో పాటు మరికొన్ని ప్రసిద్ధ నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పట్టణంలోని రాతి కొండలలో అమర్చబడిన 42 అడుగుల ఎత్తైన విగ్రహం కర్నాటకలోని రెండవ ఎత్తైన నిర్మాణం.

By Mohammad

ఎక్కడ ఉంది - కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి దగ్గరలో.

ఆకర్షణలు : బాహుబలి ఏకశిలా విగ్రహం, చతుర్ముఖ బసది ముఖ్యమైనవి. ఇవేకాక ఇతర జైన దేవాలయాలు మరియు హిందూ దేవాలయాలు కూడా చూడదగ్గవి.

కర్ణాటక లో ఉడిపి జిల్లాలోని కర్కల అనే చిన్న పట్టణం చారిత్రిక, ధార్మిక ప్రాముఖ్య౦ వున్న ప్రదేశం. ఇది చూసి తీరవలసిన సాంస్కృతిక వైభవం గల ప్రదేశం.

కార్కల జైన రాజులు పరిపాలించిన 10 వ శతాబ్దపు చారిత్రిక మూలాలు కలిగిన ప్రదేశంగా గుర్తించబడింది. ఆ సమయంలో ఉన్న పాలకులు అనేక జైన బసదిలు, దేవాలయాలను నిర్మించారు. ఈ నిర్మాణాలు ఈరోజు పాత చరిత్ర తెలుసుకోవాలని వచ్చే యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. నిజానికి, ఈ జైన విగ్రహాలు నిర్మాణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వీటిని UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా గుర్తించింది.

ఇది కూడా చదవండి : ఒకేకొండపై వెయ్యికి మించిన దేవాలయాలు !!

పెద్ద బాహుబలి విగ్రహ౦తో పాటు మరికొన్ని ప్రసిద్ధ నిర్మాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పట్టణంలోని రాతి కొండలలో అమర్చబడిన 42 అడుగుల ఎత్తైన విగ్రహం కర్నాటకలోని రెండవ ఎత్తైన నిర్మాణం. ఈ విగ్రహం ముందు ఉన్న బ్రహ్మదేవ స్థంభం కూడా అసాధారణమైనది. కర్కల లో చరిత్ర ఆనవాళ్ళున్న 18 జైన్ బసదిలు వున్నాయి. అంతేకాక, అనంతశయన, ఆదిశక్తి ఆలయాలతో సహా పలు పురాతన ఆలయాలు ఉన్నాయి. కర్కల బెంగళూర్ నించి 380 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బాహుబలి ఏకశిలాఖండం

బాహుబలి ఏకశిలాఖండం

1432 AD లో నిర్మించారని భావించే బాహుబలి ఏకశిలా విగ్రహం కార్కల పట్టణం ప్రధాన ఆకర్షణగా పరిగణించబడుతోంది. 42 అడుగుల ఎత్తుగల ఈ బాహుబలి ఏకశిలా విగ్రహం కర్నాటకలోని రెండవ పెద్ద విగ్రహం (మొదటిది శ్రావనబెలగోల లోని 55.77 అడుగుల గోమతేశ్వర విగ్రహం).

చిత్రకృప : Dr Murali Mohan Gurram

బాహుబలి విగ్రహం

బాహుబలి విగ్రహం

బాహుబలి, గోమటేశ్వర ఏకశిలా ఖండ విగ్రహాన్ని యువరాజు బాహుబలి జ్ఞాపకార్ధం పాండ్య రాజైన వీరపాండ్య భైరవ నిర్మించారని స్థానికుల నమ్మకం. దేశం మొత్తం మీద 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహామస్తకాభిషేకం రోజున బాహుబలి ఏకశిలా ఖండం ప్రత్యేకంగా జైన్ భక్తులతో క్రిక్కిరిసి ఉంటుంది.

చిత్రకృప : Subhashish Panigrahi

చతుర్ముఖ బసది

చతుర్ముఖ బసది

కార్కల లో ప్రయాణించే ప్రయాణీకులు, కర్ణాటకలో అత్యంత ఆకర్షణీయమైన జైన్ స్మారకాలలో ఒకటిగా భావించే చతుర్ముఖ బసది ని తప్పక సందర్సించాలి. ఈ నిర్మాణం ఒక రాతి కొండపై ఉంది. 1432 లో వీర పాండ్య దేవుడు రాతి కొండపైన నిర్మించిన 108 స్తంభాలు కలిగిన ఈ ప్రదేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

చిత్రకృప : Ashay vb

గర్భగృహం

గర్భగృహం

గర్భాలయంలోకి ప్రవేశించిన తరువాత, సందర్శకులు సూర్యత, మల్లి, ఆరా ల విగ్రహాలను చూడవచ్చు. నిలబడిఉన్న విగ్రహాలే కాకుండా, ఇక్కడ గర్భగృహంలో యక్షి పద్మావతి, 24 తీర్ధంకరుల చిత్రాలను కూడా చూడవచ్చు. ధ్యానం చేయాలనుకునే వారికి ఈ చతుర్ముఖ బసది అనువైన ప్రదేశం.

చిత్రకృప : Subhashish Panigrahi

మూడబిద్రి

మూడబిద్రి

కార్కల సందర్శించేటప్పుడు ప్రయాణీకులు అత్యంత ప్రసిద్ది పొందిన జైన దేవాలయాలు ఉన్న మూడబిద్రిని కూడా దర్శించవచ్చు. గట్టి గ్రానైట్ రాతిని ఉపయోగించి నిర్మించిన 1000 స్తంభాలు కలిగిన చంద్రనాథ ఆలయం మూడబిద్రి లోని ప్రధాన ఆకర్షణ.

చిత్రకృప : Shivanayak

హిందూ యాత్రాస్థలాలు

హిందూ యాత్రాస్థలాలు

జైన కాశి గా పిలువబడే మూడబిద్రి లో10 వ శతాబ్దపు జైన ఆలయం ఉంది, ఇక్కడ గౌరీ ఆలయం (9 వ శతాబ్దం), కాంతవర ఆలయం (7 వ శతాబ్దం) లాంటి కొన్ని హిందూ యాత్రాస్థలాలు కూడా ఉన్నాయి.

చిత్రకృప : Dvellakat

హిరియంగడి

హిరియంగడి

హిరియంగడి, కార్కల సమీపంలో ఉన్న మరొక ప్రఖ్యాత ఆకర్షణ. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య వున్న నేమినాథ్ బసది వల్ల ఈ ప్రదేశం ప్రసిద్ధికి ఎక్కింది. హిరియంగడి సందర్శించే ప్రయాణీకులు అక్కడ ఉన్న జైన పూజారుల సమాధులు, శిల్పాల నిర్మాణాలను చూడవచ్చు.

చిత్రకృప : Srashmi01

ఇక్కడ ప్రసిద్ధి చెందినవి

ఇక్కడ ప్రసిద్ధి చెందినవి

నేమినాథ్ బసది సందర్శించిన తరువాత, పర్యాటకులు చంద్రనాధ్ స్వామి విగ్రహం, భుజబలి బ్రహ్మచర్య ఆశ్రమం, అనంతనాద్ విగ్రహం, పద్మావతి బసదిలు, మహావీర్ దేవుని విగ్రహం, ఆదినాధ్ స్వామి విగ్రహన్ని చూడగలరు. అంతేకాక, 60 అడుగుల ఎత్తు కలిగిన మనస్తంభం కూడా ఇక్కడ ప్రసిద్ది చెందింది.

చిత్రకృప : Dvellakat

అత్తూర్

అత్తూర్

సమయం ఉన్నట్లయితే, పర్యాటకులు కర్కల పొలిమేరలలో ఉన్న అత్తూర్ గ్రామాన్ని దర్శించవచ్చు. 1759 AD లో స్థాపించబడ్డ సెయింట్ లారెన్స్ చర్చి వల్ల ఈ గ్రామం అత్యంత ప్రసిద్ది పొందింది. చర్చితో పాటు, సందర్శకులు ఈ ధార్మిక క్షేత్రం చుట్టు ఉన్న అందాన్ని చూసి ఎంతో ఆనందిస్తారు.

చిత్రకృప : Noeljoe85

కార్కల ఎలా చేరుకోవాలి ?

కార్కల ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ద్వారా: రోడ్డు మార్గం ద్వారా కార్కల అనేక ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. కార్కల చేరుకోవడానికి బెంగళూర్, హైదరాబాద్, చెన్నై నుండి ఎన్నో విలాసవంతమైన, ప్రైవేట్ బస్సులు తరచుగా అందుబాటులో ఉన్నాయి.

రైలు ద్వారా: కార్కల కు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ అనేక ప్రధాన భారత నగరాలకు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది.

వాయు మార్గం: కార్కల నించి ప్రధాన భారత నగరాలకు వెళ్ళడానికి మంగలూర్ విమానాశ్రయం దగ్గరి విమానాశ్రయం. ఇది కర్కల పట్టణం నించి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చిత్రకృప : RajuBabannavar

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X