Search
  • Follow NativePlanet
Share
» »ఉత్తమమైన తీరులో ఉడుపి పర్యటన !

ఉత్తమమైన తీరులో ఉడుపి పర్యటన !

ఒక వైపు పడమటి కనుమలు, మరో వైపు అరబియా మహా సముద్ర తీరంలతో ఉడుపి పట్టణం శోభిల్లుతూ అంతులేని ఆనందాన్ని పర్యాటకులకు అందిస్తుంది. ఈ సిటీ లో ప్రధాన ఆకర్షణ శ్రీ కృష్ణ టెంపుల్. అయినప్పటికీ ఎల్లపుడూ ఆకర్షణ కలిగి వుండే పర్వత శ్రేణులు, పొడవైన బీచ్ లూ కోడా అనేకం ఇక్కడ కలవు. అంతే కాదు, నోటి రుచులు ఊరే మంచి మంచి వంటకాలు కూడా ఉడిపి లో లభ్యంగా వుండి, తిండి ప్రియులకు ఒక స్వర్గంలా వుంటుంది. పర్యాటకులకు ఈ ప్రాంత సందర్శనకు వింటర్ అనుకూలమైనది. ఇంత గొప్పదైన ఈ ఉడుపి పట్టణంలో చూసేందుకు, ఆనందించేందుకు ఏమి ఉన్నా యనేది పరిశీలించండి.

ఉడుపి - చుట్టుపట్ల

ఉడుపి - చుట్టుపట్ల

ఉడుపి లో శ్రీకృష్ణ టెంపుల్ లోని కృష్ణుడి విగ్రహం శ్రీ మధ్వాచార్య ప్రతిష్టించినది. 12 వ శతాబ్దానికి చెందిన ఈ మహనీయుడు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు. ఈయన మరొక ఎనిమిది టెంపుల్స్ కూడా స్థాపించాడు. ప్రధాన పూజార్లు, వంతులవారీగా దేముడికి పూజలు చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే, తెప్పోత్సవం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.

 కాపు బీచ్

కాపు బీచ్

అరేబియా మహాసముద్రం ఎంతో విశాలం, అయినప్పటికీ ఇక్కడ మీకు అతి దగ్గరగా కనపడుతుంది. కాపు బీచ్ లేదా కౌప్ బీచ్ ప్రాంత అందాలు అనేక కవులను, వేదాంతులను ప్రభావించాయి. ఇక్కడ కల లైట్ హౌస్ ఒక ప్రధాన ఆకర్షణ.

 పాజక క్షేత్ర

పాజక క్షేత్ర

పాజక గ్రామం మధ్వాచార్యులవారి జన్మ స్థలం. వారి నివాసం వద్ద నేటికి వారి పాద ముద్రలు కనపడతాయి. సమీపంలో అనంతేస్వర టెంపుల్ ఒకటి వుంటుంది. ఈ స్థలం గురించిన వర్ణన అందరికి ఆసక్తికరంగా వుంటుంది.

ఉడుపి - చుట్టుపట్ల

ఉడుపి - చుట్టుపట్ల

ఇక్కడ త్వరలో ప్రతిష్టించాబడే మధ్వాచార్యుల వారి విగ్రహం అనేకమంది భక్తులను ఆకర్షించవచ్చు. ఇప్పటికే ఈ విగ్రహ నిర్మాణం పూర్తీ అయింది. పాలిమారు మతం లోని శ్రీ విద్యాదీశ తీర్థ స్వామిజి ఆదేశానుసారం ఈ విగ్రహాన్ని కున్జరుగిరి కొండలపై స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఉడుపి - చుట్టుపట్ల

ఉడుపి - చుట్టుపట్ల

అందాల మాల్పే బీచ్ ఉడుపి పట్టణానికి ఆరు కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ బీచ్ అతి విశాలంగా వుంది పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. మాల్పే ఒక సహజ ఓడ రేవు. మత్స్య వేటకు ప్రసిద్ధి. సూర్య రశ్మి, తీరం, ఇసుక వంటివి కాక మాల్పే లో ఆనందించ దాగిన అంశాలు ఎన్నో కలవు.

ఉడుపి - చుట్టుపట్ల

ఉడుపి - చుట్టుపట్ల

వేయి సంవత్సరాలకు పైగా చారిత్ర కల సాలిగ్రామ నరసింహ టెంపుల్ వేలాది భక్తులను ఆకర్షిస్తుంది. ప్రతి సంవత్సరం జరిగే రాదోత్సవానికి వేలాది ప్రజలు హాజరు అవుతారు. స్వామివారి ఆశీస్సులు పొందుతారు.

ఉడుపి - చుట్టుపట్ల

ఉడుపి - చుట్టుపట్ల

పడుబిద్రి లోని శ్రీ మహా గణపతి టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ ప్రదేశంలో తెగల ప్రజలు నివసిస్తారు వీరు పాములను పూజిస్తారు. వార్షిక రధోత్సవ వేడుకలలో పాల్గొనే సమయంలో ఈ గ్రామాన్ని సందర్శించి ప్రాంత అందాలు, ప్రజల సాంప్రదాయాలు చూడండి.

ఉడుపి - చుట్టుపట్ల

ఉడుపి - చుట్టుపట్ల

సెయింట్ మేరీస్ ద్వీపాలను కోకోనట్ ఐలాండ్స్ అని కూడా అంటారు. ఇవి ఒక నాలుగు దీవుల సముదాయం మాల్పే తీరంకుచివారి భాగాన వుంటుంది. పోర్చుగల్ నుండి వాస్కోడా గామ తన బోటు ప్రయాణాలలో ఈ దీవికి చేరాడని చరిత్ర చెపుతుంది. ఈ ద్వీపాలు చాలా అందంగా వుంది ఎన్నో సహజ దృశ్యాలు కలిగి వుంటాయి. నగరం లోని బిజి జీవన వాసులకు అంతులేని ప్రశాంతత చేకూరుస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X