Search
  • Follow NativePlanet
Share
» »తుంగభధ్ర డ్యాం నాలుగేళ్లకు నయనానందకరం

తుంగభధ్ర డ్యాం నాలుగేళ్లకు నయనానందకరం

తుంగభద్ర డ్యాం గురించి కథనం

తుంగభద్ర డ్యాం ను కష్ణానది ఉపనది తుంగభద్ర నది పై నిర్మించారు. ఈ ఆనకట్ట కర్నాటకలోని హోస్పేట్ పట్టణానికి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కర్నాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగునీటిని అందిస్తోంది. దీని ప్రధాన ఆర్కిటెక్షర్ తిరుమలై అయ్యంగార్. ఇక దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ తుంగభద్ర డ్యాం పూర్తిగా నీటితో నిండి కనులకు విందు చేస్తోంది. దీంతో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో దీనిని సందర్శిస్తున్నారు. ఈ డ్యాం నుంచి గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నప్పుడు ఆ దష్యాన్ని చూడాల్సిందే. ఈ డ్యాం దగ్గర చిన్న జింకలపార్కు, గులాబి తోట మ్యూజికల్ ఫౌంటైన్ వంటివి ఉండటం వల్ల పిల్లలు బాగా అడుకుంటారు. అన్నట్టు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రం హంపికి ఈ తుంగభద్ర డ్యాం కు 26 కిలోమీటర్ల దూరం మాత్రమే. మరెందుకు ఆలస్యం ఈ పంద్రాగస్టుకు ఈ జలశయ అందాలను తిలకించండి

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

పంద్రాగస్టుకు తుంగభద్ర జలాశయం ముస్తాబయ్యింది. 2014 తర్వాత మళ్లీ ఈ ఏడాది మాత్రమే తుంగభడ్ర జలాశయం నిండు కుండలా తొనికిసలాడుతోంది. దీంతో ఈ జలశయం నూతన అందాలతో పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తోంది.

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

అగస్టు 15 సెలవు రోజు కావడంతో ఆ రోజున ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ముఖ్యంగా పిల్లలతో కూడి తల్లిదండ్రులు ఇక్కడికి వస్తారని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. దీంతో పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

ఈ ఏడాది జులై లోనే దాదాపు జలాశయం పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆ నెలలోనే గేట్లు ఎత్తివేసి నీటిని నదికి వదిలేశారు. అప్పటి నుంచే తుంగభద్ర జలాశయం చూడటానికి పర్యాటకులు ఎక్కవ సంఖ్యలో వస్తున్నారు.

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

సాధారణ రోజుల్లో 10వేల మంది పర్యాటకులు ఈ జలాశయాన్ని సందర్శిస్తే వారాంతాల్లో ఈ సంఖ్య లక్షకు పైగా ఉంటుందని చెబుతారు. ఇదిలా ఉండగా నాలుగేళ్ల తర్వాత ఈ జలాశయం భర్తీ కావడంతో ఈ సారి సంఖ్య రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు.

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

దీంతో ఈ జలాశయం వద్ద ఉన్న పర్యాటక కేంద్రాలను ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉద్యానవనాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. జలాశయం సందర్శనకు ఎటువంటి రుసుము వసూలు చేయరు.

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

అయితే ఉద్యానవనం చూడాలంటే మాత్రం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉద్యానవనంలోని గులాబి తోట, జింకలు, వర్ణరంజితమైన ఫౌంటైన్, అక్వేరియం చూడటానికి ఎంతో బాగుంటుంది. ఇక మ్యూజికల్ ఫౌంటైన్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. 8.15 వరకూ ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

కుటుంబ సభ్యులతో వస్తే ఉదయం నుంచి రాత్రి వరకూ ఇక్కడే గడపడానికి అన్ని వసతులు ఉన్నాయి. తాగునీరు, శౌచాలయల ఏర్పాటు కూడా ఉంది. ఇక్కడికి ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు.

తుంగభద్ర డ్యాం

తుంగభద్ర డ్యాం

P.C: You Tube

ఇక్కడికి దగ్గరగా అంటే 14 కిలోమీటర్ల దూరంలో హొసపేట ఉంది. ఇక్కడి నుంచి ప్రత్యేక సిటీ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. వారాంతాలు, పంద్రాగస్టున ఎక్కువ సంఖ్యలో బస్సులు నడుపుతారు. బెంగళూరు నుంచి హొసపేటకు రైలు, బస్సు సర్వీసులు నిత్యం అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X