Search
  • Follow NativePlanet
Share
» »విష్ణువు ఎంతమంది దేవేరిలతో కలిసి దర్శనమిస్తాడో తెలుసా?

విష్ణువు ఎంతమంది దేవేరిలతో కలిసి దర్శనమిస్తాడో తెలుసా?

తిరుచయార్‌లోని ఉదయార్ దేవాలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. ఈ దేవాలయం చరిత్రను తెలుసుకోండి.

హిందూ పురాణాలను అనుసరించి ఒక యుగం ముగిసిన తర్వాత మరో యుగం వస్తుంది. అయితే యుగాంతం సమయంలో మహాప్రళయం వచ్చి ఈ భూ మండలం పై ఉన్న అన్ని వస్తువులు నాశనం అవుతాయి. దీంతో బ్రహ్మకు ఒక సందేహం కలిగింది. యుగాంతం సమయంలో వేదాలతో పాటు సష్టిని నిర్మించడానికి అవసరమైన వస్తువులన్నీ నాశనం అయితే తదుపరి సష్టి ఎలా చేయాలని చింతిస్తూ ఉంటాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాల్సిందిగా ఆ బ్రహ్మ విష్ణువును వేడుకొంటాడు. ఆ విష్ణుభగవానుడు ఇచ్చిన సలహాతో తిరుచయార్ ఒక పుణ్యక్షేత్రంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ కోసం...

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

P.C: You Tube

పురాణ ప్రాధాన్యత కలిగిన ఉదయార్ దేవాలయం తిరుచెరాయ్ అనే పట్టణంలో ఉంది. ఇది తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుంభకోణంకు 15 కిలోమీటర్ల దూరంలో అదే విధంగా కొడవసాల్ అనే పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది.

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

P.C: You Tube

మూలవిరాట్టును సారనాథన్ అని పిలుస్తారు. అదే విధంగా అమ్మవారిని సారనాయకి పేరుతో పూజిస్తారు. హిందూ పురాణాలను అనుసరించి ఒక యుగం ముగిసిన తర్వాత మరో యుగం వస్తుంది. అయితే యుగాంతం సమయంలో మహాప్రళయం వచ్చి ఈ భూ మండలం పై ఉన్న అన్ని వస్తువులు నాశనం అవుతాయి.

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

P.C: You Tube

దీంతో బ్రహ్మకు ఒక సందేహం కలిగింది. యుగాంతం సమయంలో వేదాలతో పాటు స`ష్టిని నిర్మించడానికి అవసరమైన వస్తువులన్నీ నాశనం అయితే తదుపరి స`ష్టి ఎలా చేయాలని చింతిస్తూ ఉంటాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాల్సిందిగా ఆ బ్రహ్మ విష్ణువును వేడుకొంటాడు.

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

P.C: You Tube

విష్ణువు సూచనమేరకు ఈ భూ మండలం పై వివిధ ప్రాంతాలను మట్టి తెచ్చి కుండను తయారుచేసి అందులో వేదాలను, స`ష్టికార్యానికి అవసరమైన వస్తువులను ఉంచుతాడు. అయితే మిగిలిన అన్ని చోట్ల నుంచి తెచ్చిన మట్టితో తయారుచేయబడిన కుండలు పగలిపోగా కేవలం ఈ తిరుచెరాయ్ నుంచి తెచ్చిన మట్టితో తయారుచేసిన కుండ పగలిపోలేదు.

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

P.C: You Tube

అందుకే ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదని చెబుతారు. అదేవిధంగా తనకు సహాయం చేసిన విష్ణువును ఇక్కడ కొలువుండాల్సిందిగా బ్రహ్మ కోరుతాడు. దీంతో విష్ణువు ఇక్కడ ఐదు దేవేరిలతో కలిసి ఉండిపోతాడు.

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

P.C: You Tube

ఇలా ఐదు దేవేరిలతో కలిసి విష్ణువు కొలువై ఉన్న దేవాలయం ప్రపంచంలో ఇదొక్కటే అని చెబుతారు. ఇక్కడే కావేరి నది విష్ణువు గురించి తపస్సు చేసి గంగతో సమానంగా శక్తులు పొందిందని చెబుతారు. ఈ క్షేత్రంలో సారపరమేశ్వర పేరుతో శివుడిని కూడా అర్చిస్తారు.

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

ఉదయార్ దేవాలయం, తిరుచెరాయ్

P.C: You Tube

ఇక్కడి అమ్మవారిని జ్జానవల్లి అని పిలుస్తారు. ఇక్కడి శివలింగాన్ని మార్కెండేయుడు ప్రతిష్టించాడని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రం అటు వైష్ణవులతో పాటు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీంతో నిత్యం ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X