• Follow NativePlanet
Share
» »మేధావులను సైతం షాక్ గురి చేసే టెక్నాలజీ ఈ ఆలయంలో వుంది !

మేధావులను సైతం షాక్ గురి చేసే టెక్నాలజీ ఈ ఆలయంలో వుంది !

Written By: Venkatakarunasri

ఈ వ్యాసంలో మనం ప్రస్తుతటెక్నాలజీకి కూడా అందని ఎన్నో వైజ్ఞానికపరమైన రహస్యాలను తమలో దాచుకున్న ఆనాటి శిల్పకళావైభవానికి తార్కాణంగా నిలుస్తున్న అత్యద్భుతమైన ఆలయం యొక్క రహస్యాలను, విషయాలను, వివరాలను ఈ వ్యాసంలో మనం తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ?

విరూపాక్ష ఆలయం

విరూపాక్ష ఆలయం

ఇది హంపీలో వుంది. బెంగుళూరుకి 350కిమీ ల దూరంలో వుంటుంది. ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ లలో చేర్చారు. ఈ ఆలయాన్ని లక్కన్న, దండేష అనే విజయనగరసామ్రాజ్యంలో పని చేసే కోశాధికారులు దీనిని నిర్మించారట.

PC: youtube

విజయనగర సామ్రాజ్యం

విజయనగర సామ్రాజ్యం

హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది. ఈ పట్టణం తుంగబధ్ర నది ఒడ్డున వుంటుంది. అయితే తుంగభద్రానదిని పూర్వం పంపానది అని పిలిచేవారు. కన్నడభాషలో హంపి అంటే పంప అని అర్ధమట. ఇక ఈ పట్టణంలో విజయనగర రాజులు వారికి కుల దైవమైన విరూపాక్షస్వామి ఆలయాన్ని నిర్మించారు.

PC: youtube

స్థలపురాణం

స్థలపురాణం

అయితే స్థలపురాణం ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోటానికి పంపా నది తీర్థంలో శివుడి కోసం తపస్సు చేసిందని మరి పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన పరమ శివుడు పార్వతీదేవిని ఈ ప్రాంతంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు.

PC: youtube

ప్రత్యేకత

ప్రత్యేకత

ఈ ఆలయంలోని అత్యంత ప్రత్యేకత ఏమిటంటే మరి ఈ అద్భుతాన్ని చూడటానికి అనేకమంది భక్తులు, విదేశీయులు కూడా ఈ ఆలయానికి రావటంఅనేది జరుగుతుంది.

PC: youtube

అద్భుతం

అద్భుతం

మరి ఆ అద్భుతం ఏంటంటే విరూపాక్ష స్వామి వెనుకవున్న స్వామి మండపం గోడపైన రాజగోపురం యొక్క నీడ అనేది తలక్రిందులుగా పడుతుంది. మరి రాజగోపురం నుండి 300 ల అడుగుల దూరంలో వున్న మండపం గోడపైన ఈ నీడఅనేది తల క్రిందులుగా పడటం అనేది ఒక అద్భుతం.

PC: youtube

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం

ప్రధాన ఆలయం లోపల గోడపైన 6అంగుల అంచులతో ఒక సన్నని చీలిక వుంటుంది. మరి ఈ చీలిక ద్వారా సూర్యకిరణాలు అనేవి ఆలయం లోపలి గోడ మీద పశ్చిమగోడ మీద పడి తూర్పుఅభిముఖంగా వున్న రాజగోపురం యొక్క నీడఅనేది పాలి మండపంమీద పడటం అనేది జరుగుతుంది.

PC: youtube

హేతువాదులు

హేతువాదులు

మరి ఈ నీడను అందరూ చూడవచ్చును. ఈ విధంగా నీడ పడటం అనేది ఆ శివుడు మహిమగా భావిస్తారు భక్తులు. కానీ హేతువాదులు మాత్రం ఆనాటి భారతీయ వాస్తు,శిల్పకళా నైపుణ్యానికి, విజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తుందని అంటారు.

PC: youtube

అద్భుతదృశ్యం

అద్భుతదృశ్యం

ఏది ఏమైనా ఇది మాత్రం ఒక అద్భుతదృశ్యం అని అందరూ అంగీకరించవలసిందే. ఇక మరొక విశేషం ఏమిటంటే ఉగాది నాడు వచ్చే సూర్య కిరణాలు అనేవి గర్భ గుడిలోని శివలింగంపైన ప్రసరిస్తాయి.అయితే ఈ మధ్యకాలంలో మరొక అద్భుతాన్ని కూడా కనుగొనటంజరిగింది.

PC: youtube

సాలె మంటపం

సాలె మంటపం

అదేంటంటే గర్భగుడిలోని నీడ యొక్క సాలె మంటపంలో ఒక చోట తల క్రిందులుగా కనిపిస్తుంది. ఇక ఈ నీడ అనేది గర్భగుడిలో వున్న ఒక చిన్న రంధ్రం ద్వారా ప్రసరించి సాలెమంటపంలో ఒక చోట పడుతుంది. ఉదయం 9గంలలోపు మరి సాయంత్రంపూట కూడా కొన్ని సార్లు ఈ నీడఅనేది భక్తులకు కను విందుచేస్తుంది.

PC: youtube

పాతాళేశ్వరస్వామి ఆలయం

పాతాళేశ్వరస్వామి ఆలయం

మరి ఈ ఆలయంలో అనేక చిన్న శివఆలయాలు వున్నాయి. మరి ఇక్కడవున్న రెండు ఉపఆలయాలు అనేవి అతిప్రాచీన కాలం నుండి వున్నట్టుగా భావిస్తారు. ఇక ప్రధాన ఆలయానికి తూర్పుదిశలో వున్న పాతాళేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయంలోకి వెళ్ళటానికి మెట్లు వుంటాయి.మరి ఈ ఆలయం 7వ శతాబ్దంముందు నుండే పూజలు అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

PC: youtube

విఠలస్వామి ఆలయం

విఠలస్వామి ఆలయం

ఇక ఈ ఆలయంగురించి మాటలలో వర్ణించలేం. ఈ ఆలయంలో ప్రతిఒకటీ అత్యద్భుతమైన శిల్పకళకి తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో ప్రధానమైన దైవం శ్రీ మహావిష్ణువు. దీనిని 15వ శతాబ్దంలో నిర్మించారు.

PC: youtube

ప్రధాన ఆకర్షణ

ప్రధాన ఆకర్షణ

ఇక ఇక్కడ ప్రధాన ఆకర్షణ రాతితో నిర్మించిన రథం. ఇక ఆలయంయొక్క గోపురం నమూనా గరుడ పక్షి ఆకారంలో వుంటుంది. ఇక రథంముందు వుండే ఏనుగులు నిజంగా ప్రాణంతో వుండి ఆ రథాన్ని లాగుతున్నాయా?అనిపిస్తాయి.

PC: youtube

ఆలయంలో వున్న స్థంభాలు

ఆలయంలో వున్న స్థంభాలు

వీటిగురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిచెందినవి. వీటినే మ్యూజికల్ పిల్లర్స్ అనిఅంటారు. ఈ ఆలయాన్ని 1422నుండి 1444మధ్యలో నిర్మించారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు తన పరిపాలనాకాలంలో మరింతగా వెలుగులోనికి తీసుకు రావటం అనేది జరిగిందంట.

PC: youtube

మ్యూజికల్ పిల్లర్స్ రహస్యం

మ్యూజికల్ పిల్లర్స్ రహస్యం

మరి ఈ ఆలయంలోని అత్యద్భుతమైన మ్యూజికల్ పిల్లర్స్ రహస్యం ఏమిటో తెలుసుకోవటానికి బ్రిటీష్ వారు 2 పిల్లర్స్ ని ఈ ఆలయంనుండి కట్ చేసి వారి దేశానికి వెళ్ళటంజరిగిందంట. వారు అక్కడ ఆ పిల్లర్స్ ని కట్ చేసి పరీక్షించటం జరిగిందంట.

PC: youtube

అద్భుతం

అద్భుతం

ఎందుకంటే ఆ పిల్లర్స్ లోపల ఏదైనా రహస్యం దాగి వుందేమో అందుకని ఆ స్థంభాలనుండి సప్త స్వరాలు వినిపిస్తున్నాయని పరీక్షించటం జరిగింది.కాని ఆ స్థంభాలలోపల ఏమీ లేకపోవటం చూసి వారు విస్తుపోయారు. ఇక ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఈ అద్భుతాన్ని చూడాలంటే హోస్పేటకు వెళితే అక్కడినుండి 10కిమీ ల దూరంలో ఈ ఆలయంఅనేది వుంటుంది

PC: youtube

ప్రసిద్ధిచెందిన ఆలయాలు

ప్రసిద్ధిచెందిన ఆలయాలు

మరిప్పుడు మనం గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్ గా ప్రసిద్ధిచెందిన ఆలయాలలో బృహదీశ్వరాలయం, ఐరావతేశ్వరాలయం, గంగైకొండ చోళాపురంఆలయం. మరి ఈ ఆలయాలు అద్భుతమైన శిల్ప కళకు, నేటి విజ్ఞానానికికూడా అంతుపట్టని వైజ్ఞానికపరమైన కట్టడాలకు ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయాయి. మరి అందులో బృహదీశ్వరాలయం గురించి చాలామందికి తెలిసిందే.

PC: youtube

ఐరావతేశ్వరాలయం

ఐరావతేశ్వరాలయం

కానీ ఐరావతేశ్వరాలయం గురించి చాలామందికి తెలీదు. ఈ వ్యాసంలో మనం ఐరావతేశ్వరాలయం గురించి, గొప్పతనం గురించి తెలుసుకుందాం.ఈ ఆలయంలో ప్రతిశిల్పం అనేది మనకు ఏదోరకంగా సంకేతాన్ని తెలియచేస్తుంది.

PC: youtube

ఐరావతేశ్వరాలయం

ఐరావతేశ్వరాలయం

ముందుగా ఒకే తలతో 2జంతువులలాగా కనిపించే చెక్కిన శిల్పనైపుణ్యం అనేది మనంమాటలలో వర్ణించలేం. ఒక వైపు నుండి చూస్తే బసవయ్య, మరో వైపు నుండి చూస్తే ఏనుగు మరి అంత ఖచ్చితంగా ఆ శిల్పాన్ని మలచినవిధానం మాత్రం అద్భుతం.

PC: youtube

ఐరావతేశ్వరాలయం

ఐరావతేశ్వరాలయం

ఇక ఆలయంలోని గోడలపై-ప్రాకారాలపై సహజంగా అనేకశిల్పాలు వుంటాయి. మనం వాటి గురించి అంత పెద్దగా పట్టించుకోం. కాని ఈ ఆలయంలోని సూర్యుడు యొక్క విగ్రహమూర్తిని మనం పరీక్షిస్తే ఉదయం పూట అంటే తూర్పుదిక్కునవున్న విగ్రహం చేతిలో తామరపూవులు అనేవి అప్పుడే వికసిస్తున్నట్టుగా వుంటాయి. మరి పడమటి వైపు వున్న సూర్యుని యొక్క చేతిలో వుండే పుష్పాలు అనేవి ముడుచుకుని వుంటాయి.

PC: youtube

ఆలయంలో గుర్రాలు

ఆలయంలో గుర్రాలు

మరిఅంతేకాకుండా ఆలయంలోని గుర్రాలు ఆలయాన్ని లాగుతున్నట్టుగా వుంటాయి. మరి ఆ చక్రాలు కూడా సన్ డయల్స్ గా వున్నాయట. మనం సాధారణంగా వాటిని రథంయొక్క చక్రాలుగా భావించటం జరుగుతుంది.

PC: youtube

ఆలయంలో గుర్రాలు

ఆలయంలో గుర్రాలు

మరి అంతేనా ఆ రథంపై వున్న స్వారీ చేస్తూవున్నట్టుగా వుండే శిల్పాలుకూడా ఉదయంపూట తూర్పు వైపున సూర్యకిరణాలు ఎక్కడ ప్రసరిస్తాయో,ఆ వైపున ఆ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా వున్నట్టు, అదే పడమట దిక్కున వున్న రథచక్రం పైన వున్న వ్యక్తి అలసిపోయినట్టుగా ఆ శిల్పంలో కనిపించటం అనేది అద్భుతం.

PC: youtube

ఈ ఆలయంలోని మ్యూజికల్ స్టెప్స్

ఈ ఆలయంలోని మ్యూజికల్ స్టెప్స్

మరి ఈ ఆలయంలోని మ్యూజికల్ స్టెప్స్ ఎంతో ప్రసిద్ధి చెందినవి.మరి వీటిని రక్షించటంకోసం ఆర్కియాలజికల్ వారు వాటికి ప్రొటెక్షన్ సెల్ అనేది ఏర్పాటుచేయటం జరిగింది. మరి దీన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ లలో చేర్చటం జరిగింది. మరి ఇప్పటికీ ఎప్పటికి కొనసాగుతూవుండే విషయం ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు అందుకు సంబంధించిన శిల్పాలను కూడా మనం అక్కడ చూడవచ్చును.

PC: youtube

ఐరావతేశ్వర్ టెంపుల్

ఐరావతేశ్వర్ టెంపుల్

తమిళనాడులోని కుంభకోణం వద్ద దరాసురం అనే పట్టణంలో వుంటుంది. ఈ ఆలయంలో ప్రధానదైవం శివుడు.మరి ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలోని శివుడ్ని ఇంద్రుడి వాహనమైన తెల్లటిఏనుగు పూజించిందని అందుకే ఆ ఐరావతం పేరుమీదుగానే ఐరావతేశ్వర్ టెంపుల్ అనే పేరురావటం జరిగింది.

PC: youtube

ఐరావతేశ్వర్ టెంపుల్

ఐరావతేశ్వర్ టెంపుల్

పూర్వం దుర్వాస మహర్షి ఐరావతానికి తన రంగును కోల్పోవాలని శాపాన్ని ఇస్తాడు.అప్పుడు ఐరావతం తిరిగి తన రంగును పొందటానికి ఈ ఆలయంవద్ద తీర్థంలో స్నానాన్ని చేసి శివుడిని అభిషేకించిందని తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందిందనిమరి అంతే కాకుండా కింగ్ ఆఫ్ డెత్ గా అభివర్ణించే యమధర్మరాజు కూడా ఇక్కడ శివుడిని ప్రార్థించాడనితనకు శాపవిముక్తిని కలగటానికి ఈ తీర్థంలో స్నానాన్ని ఆచరించి యముడు శివుణ్ణిప్రార్ధించాడని అందుకే దీనిని యమతీర్థం అంటారు.

PC: youtube

3వ కుళోత్తుంగచోళ

3వ కుళోత్తుంగచోళ

ఈ ఆలయాన్ని 2వ రాజరాజచోళ 12 వ శతాబ్దంలో నిర్మించాడు. మరి ఈ ఆలయాన్ని 3వ కుళోత్తుంగచోళ పునరుద్దరించటం జరిగింది.

PC: youtube

హంపి పట్టణాన్ని చేరటం ఎలా?

హంపి పట్టణాన్ని చేరటం ఎలా?

రోడ్డు ప్రయాణం

హంపి పట్టణం రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు ద్వారా అనుసంధానించబడి ఉంది. ప్రభుత్వ బస్సులు మరియు ప్రయివేటు వాహనాలు విరివిగా దొరుకుతాయి.

రైలు ప్రయాణం

రైలు ప్రయాణం

హంపికి రైలు స్టేషన్ లేదు. హోస్పేట్ రైలు స్టేషన్ సుమారు 13 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడినుండి బెంగుళూరు, హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాలకు వెళ్ళవచ్చు. ఈ స్టేషన్ నుండి టాక్సీలు, క్యాబ్ లలో హంపి చేరవచ్చు.

విమాన ప్రయాణం

విమాన ప్రయాణం

హంపికి దగ్గరి విమానాశ్రయం బెళ్ళారి విమానాశ్రయం. సుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. హంపి నుండి 350 కి.మీ. దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది దేశీయంగాను అంతర్జాతీయంగాను అనేక విమానాలు నడుపుతోంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి