Search
  • Follow NativePlanet
Share
» »నాకు అది చేయాల్సిందేనని హఠం చేసిన ‘స్వామి’ ఏమి తింటున్నాడో తెలుసా

నాకు అది చేయాల్సిందేనని హఠం చేసిన ‘స్వామి’ ఏమి తింటున్నాడో తెలుసా

By Kishore

తమిళనాడులో అనేక దేవాలయాలు ఉండటం వల్ల ఆ రాష్ట్రాన్ని టెంపుల్ స్టేట్ అని అంటారు. అయితే అటు వంటి రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుంభకోణం చుట్టు పక్కల పురాణ ప్రాముఖ్యత కలిగిన అనేక దేవాలయాలు ఉన్నాయి.

అందులో ఒక దేవాలయంలో ఉప్పు లేని ఆహారాన్ని మూల విరాట్టుకు నైవేద్యంగా పెడుతారు. అదే నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా కూడా పంచుతారు. అసలు ఇక్కడి మూలవిరాట్టు తన కోరికను నెరవేర్చక పోతే ఆత్మహత్య చేసుకొంటానని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.

మరోవైపు హిందు ధర్మం ప్రకారం పుణ్యక్షేత్రాల్లో ఉన్న పుష్కరిణిల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మయం లోపు మాత్రమే స్నానం చేసి దైవ దర్శంన చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్షేత్రంలో ఉన్న పుష్కరిణిలో ఏ సమయంలోనైనా స్నానం చేసి పాపాలను పోగొట్టు కొవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆలయ విశేషాలు మీ కోసం

ధైర్యవంతులకు మాత్రమే ఇక్కడ దెయ్యాలు షేక్ హాండ్ ఇస్తాయి

ఇక్కడికి వెళితే మీ చేతితో పాటు దానికి పనిచెప్పకుండా ఉండలేరు

1. సాటిలేనివాడు

1. సాటిలేనివాడు

P.C: YouTube

ఉప్పిలియప్పన్ అంటే సాటిలేనివాడని అర్థం. అలాంటి సాటిలేని వాడు ఎవరై ఉంటారని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే కలియుగ దైవం శ్రీ మన్నారాయణుడు లేదా శ్రీ వేంకటేశ్వరుడు.

2. కొంత ఆశ్చర్యాన్ని

2. కొంత ఆశ్చర్యాన్ని

P.C: YouTube

అంతటి సాటిలేని వీరుడు ప్రస్తుతం ఉప్పులేని ఆహారాన్ని తింటున్నాడు. ఆ ఆహారమే తన భక్తులకు కూడా ప్రతి రోజూ ప్రసాదం రూపంలో ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన కథ కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా దీనిని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు.

3. సాగర మధనం సమయంలో

3. సాగర మధనం సమయంలో

P.C: YouTube

సాగర మధనం సమయంలో అమ`తానికి ముందు లక్ష్మీ, ఐరావతం, కల్పవ`క్షంతో పాటు తులసీ కూడా సముద్ర గర్భం నుంచి పైకి వచ్చింది. ఇందులో లక్ష్మీని శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడు.

4. తులసి బాధ పడుతుంది

4. తులసి బాధ పడుతుంది

P.C: YouTube

అంతేకాకుండా ఏకంగా తన వక్షస్థలం పైనే ఆ మహాలక్ష్మికి చోటు ఇస్తాడు. ఈ చర్యతో బాధపడిన తులసి స్వామితో తనను కూడా స్వీకరించాల్సిందిగా వేడుకొంటుంది.

5. నీవు కూడా తపస్సు చేయమని

5. నీవు కూడా తపస్సు చేయమని

P.C: YouTube

అయితే శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీ ఎంతో తపస్సు చేసి తన వక్షస్థలం పై చోటు సంపాదించిందని చెబుతాడు. నీవు కూడా తపస్సు చేస్తే తాను స్వీకరించడమే కాకుండా ఎల్లప్పుడూ నాతో పాటే ఉంటావని చెబుతారు. దీంతో తులసీ విష్ణువు సూచనమేరకు కావేరి నదికి దక్షిణం దిశగా కుంభకోణం పుణ్యక్షేత్రానికి దగ్గరగా ఉన్న తిరువిన్నగర్ వద్ద తులసి చెట్టు రూపంలో ఉంటూ తపస్సు చేస్తూ ఉంటుంది.

6. మార్కెండేయుడి కోరిక

6. మార్కెండేయుడి కోరిక

P.C: YouTube

ఇదిలా ఉండగా మార్కెండేయుడు సాక్షాత్తు మహాలక్ష్మిని కూతురుగా పొంది అటు పై శ్రీ మహావిష్ణువును అల్లుడిగా పొందాలని చాలా కాలంగా కోరికతో ఉంటాడు.

7. 1000 ఏళ్లు తపస్సు

7. 1000 ఏళ్లు తపస్సు

P.C: YouTube

ఈ నేపథ్యంలోనే తిరువిన్నగర్ వద్దకు చేరుకొని అక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్దుడై పోయి అక్కడ దాదాపు 1000 ఏళ్లు తపస్సు చేస్తాడు. దీంతో అక్కడి తులసి చెట్టు కింద ఒక చిన్నపాప కనిపిస్తుంది.

8. ఆకాశవాణి సూచనమేరకు

8. ఆకాశవాణి సూచనమేరకు

P.C: YouTube

అదే సమయంలో ఆకాశవాణి ఆ పాప శ్రీ మహాలక్ష్మి అని చెబుతుంది. అంతేకాకుండా ఆ పాపకు యుక్తవయస్సు వచ్చేసరికి శ్రీ మహావిష్ణువే స్వయంగా నీ వద్దకు వచ్చి కన్యాదానం చేయమని కోరుతాడని చెబుతుంది.

9. భూ దేవి అని పేరు

9. భూ దేవి అని పేరు

P.C: YouTube

దీంతో సంతోషించిన మార్కెండేయుడు ఆ పాప తులసి చెట్టు కింద, భూమి పై ఆ పాప కనిపించడం వల్ల భూదేవి అని పేరుపెడుతాడు. కాలు కింది పెడితే కందిపోతుందేమో అన్నట్లు అల్లారుముద్దుగా పెంచుతాడు.

10. ముసలి బ్రాహ్మణుడు

10. ముసలి బ్రాహ్మణుడు

P.C: YouTube

ఇక ఆ పాపకు యుక్తవయస్సు వస్తుంది. ఆ సమయంలో ఒక రోజు ఒక ముసలి బ్రాహ్మణుడు బిక్ష కోసం మార్కెండేయుడి ఇంటి వద్దకు వస్తాడు. ఆ రోజుల్లో అతిథిగా వచ్చినవాడిని పూర్తిగా సంత`ప్తి పరిచాల్సిన బాధ్యత ఆతిథ్యం ఇచ్చినవాడిదే.

11. ఆమె అందానికి

11. ఆమె అందానికి

P.C: YouTube

ఇదిలా ఉండగా భోజనానికి కుర్చొన్న అతిథికి భూదేవి వడ్డన చేస్తుంది. ఆమె అందానికి ముగ్దుడైన ముసలి బ్రాహ్మణుడు ఆమెను వివాహం చేసుకోవాలని భావిస్తాడు.

12. ఆమెను పెళ్లి చేసుకొంటానని

12. ఆమెను పెళ్లి చేసుకొంటానని

P.C: YouTube

ఈ క్రమంలో ఆ ముసలి బ్రహ్మణుడు తనకు వయస్సు మీద పడుతుందని అందువల్ల తనను ఈ సమయంలో చూసుకోవడానికి ఒక ఆడతోడు కావాలని మార్కెండేయుడికి చెబుతాడు. అందువల్ల నీ కుమార్తెను ఇచ్చి వివాహం చేయాల్సిందిగా కోరుతాడు.

13. మార్కెండేయుడి మనసు అంగీకరించదు

13. మార్కెండేయుడి మనసు అంగీకరించదు

P.C: YouTube

అంతటి ముసలివాడికి యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిని ఇవ్వడానికి మార్కెండేయుడికి మనస్సు అంగీకరించదు. దీంతో ఎన్నో విధాలుగా ఆ ముసలి బ్రాహ్మణుడికి తన బిడ్డను ఇవ్వలేనని నచ్చచెప్పాలని ప్రయత్నిస్తాడు.

14. వంటలో ఉప్పు ఎంత వేయాలో తెలియదు

14. వంటలో ఉప్పు ఎంత వేయాలో తెలియదు

P.C: YouTube

ఆ సమయంలో ‘తన కుమార్తె ఇంకా చిన్నపిల్ల. తనకు వంటలో ఉప్పు ఎంత వేయాలో కూడా తెలియదు. అందువల్ల ఆ పిల్లను వివాహం చేసుకొంటే మీరు ఇబ్బందులు పడుతారు.' అని పేర్కొంటాడు.

15.తాను ఉప్పులేని వంటలనే

15.తాను ఉప్పులేని వంటలనే

P.C: YouTube

దీంతో ముసలి బ్రహ్మణుడు కూడా తాను ఉప్పు లేని వంటలనే తింటానని అయితే అమ్మయిని ఇచ్చి పెళ్లి చేయాల్సిందేనని పట్టుపడుతాడు. లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకొంటానని హఠం చేస్తాడు.

16. ఈ గండం నుంచి రక్షించాల్సిందిగా

16. ఈ గండం నుంచి రక్షించాల్సిందిగా

P.C: YouTube

దీంతో మార్కెండేయుడు ఈ గండం నుంచి తనను రక్షించాల్సిందిగా మహావిష్ణువును వేడుకొంటాడు. అప్పుడు అక్కడ మహావిష్ణవు ప్రత్యక్షమయ్యి చిరునవ్వు చిందిస్తాడు. దీంతో ఇప్పటి వరకూ తనతో పరాచికాలు అడినది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని మార్కెండేయుడు మిక్కిలి సంతోషిస్తాడు.

17. తిరువన్నగర్ లోనే

17. తిరువన్నగర్ లోనే

P.C: YouTube

ఇక విష్ణువు భూదేవిని వివాహం చేసుకొని మార్కెండేయుడి కోరిక పై తిరువిన్నగర్ లోనే కొలువై ఉండిపోతాడు. అందువల్లే దీనిని భూ లోక వైకుంఠం అని కూడా అంటారు. అంతేకాకుండా ఇక పై తనకు జరిగే పూజలో తులసిని తప్పక ఉండాలని మహావిష్ణువు చెబుతాడు.

18. అందుకే ఆ ప్రసాదం

18. అందుకే ఆ ప్రసాదం

P.C: YouTube

మార్కెండేయ, ముసలివాడి రూపంలో ఉన్న విష్ణవు మధ్య జరిగిన సంభాషణలో వచ్చిన ‘ఉప్పులేని ఆహారం' ఇప్పటికీ ఇక్కడ నైవేద్యంగా స్వామివారికి ఇస్తున్నారు. అదే ఉప్పులేని ఆహారాన్ని భక్తులు కూడా ప్రసాదంగా తీసుకుంటున్నారు. ఇలా ఉప్పులేని ఆహారం ప్రసాదంగా ఇవ్వడం ప్రపంచంలో ఈ దేవాలయంలో తప్ప మరెక్కడా చూడలేము.

19. అందుకే తులసీ

19. అందుకే తులసీ

P.C: YouTube

అందుకే ఇప్పటికీ విష్ణు పూజ సమయంలో తులసి తప్పక ఉంటుంది. అలా తులసీ మహావిష్ణవుకు చేరువయ్యింది. ఇక ఇక్కడి దేవాలయంలోని స్వామి వారి విగ్రహం కూడా శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహాన్ని పోలిఉంటుంది.

20 కన్యాదానం చేస్తున్నట్లు

20 కన్యాదానం చేస్తున్నట్లు

P.C: YouTube

స్వామివారి నిలువెత్తు విగ్రహం కుడిచేతి వైపున భూదేవి విగ్రహం ఉంటుంది. మరోవైపున మార్కెండేయుడు కన్యాదానం చేస్తున్న విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. స్వామివారి ఆలయంలో రాజగోపురం ఐదు అంతస్తులు ఉంటాయి. చుట్టూ గ్రానైట్ రాళ్లతో ప్రహరీ గోడ కూడా ఉంటుంది. ఈ ఆలయ విమానాన్ని శుద్ధానంద విమానం అని అంటారు.

21. చోళ రాజులు

21. చోళ రాజులు

P.C: YouTube

ఇక ఆలయం లోపలి ప్రాకారాల్లో ఆళ్వారులు, సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుడు, మణియప్పన్, భూదేవి లభించిన ప్రాంతం తదితరాలన్నీ చూడవచ్చు. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించగా అటు పై తంజావూరు నాయకులు అభివ`ద్ధి చేశారు. రోజులో ఆరుసార్లు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇక చిత్తిరై (మార్చి..ఏప్రిల్) నెలలో వచ్చే రథోత్సవం చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

22. అహోరాత్రి పుష్కరిణి

22. అహోరాత్రి పుష్కరిణి

P.C: YouTube

సాధారణంగా ఏ దేవాలయంలోని తీర్థంలోనైనా ఉదయం నుంచి సాయంత్రం వరకూ మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి పుష్కరిణిలో ఏ సమయంలోనైనా అంటే రాత్రి పూట కూడా స్నానం చేయవచ్చు. అందుకే దీనిని అమోరాత్రి పుష్కరిణి అని పిలుస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X