Search
  • Follow NativePlanet
Share
» »లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది.

By Venkatakarunasri

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం 'తిరు' (పవిత్ర), 'మల' (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా 'పవిత్ర పర్వతం' అని అనువదించబడింది. ఎక్కడాకూడా కనిపించని లక్షకోట్లు అక్షరాలా లక్ష కోట్లు విలువచేసే శ్రీవారి వజ్రం వుందని తెలుసా? తెలీదు కదూ! ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

తిరుమల, తిరుపతి

తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని పిలువబడే ఏడూ శిఖరాలూ ఆదిశేషుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వేంకటాద్రి అని పిలువబడే ఏడవ శిఖరంపై ఉంది. తిరుమల అనే పదం ‘తిరు' (పవిత్ర), ‘మల' (రద్దీ లేదా పర్వతం) అనే రెండు పదాలను కలిగి ఉంటుంది. అందువల్ల తిరుమల పదం ద్రావిడ భాషలో అక్షరాలా ‘పవిత్ర పర్వతం' అని అనువదించబడింది.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

ఈ విగ్రహాన్ని ఆనంద నిలయ దివ్య విమానంగా పిలువబడే బంగారు తాపడపు శిఖరం కింద ఉంచుతారు, ఈ విగ్రహం కళ్ళు కర్పూర తిలకంతో నింపుతారు, ఈ విగ్రహాన్ని జాతి రాళ్ళతో అలంకరించారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శి౦చాక వెంకటేశ్వరస్వామి ని దర్శించాలి.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12కిలోల బరువుతో కూడుకుంది.దీనిని స్వామివారికి అలంకరించేందుకు 3 పండితులు అవసరమట. ఆలయంలోని నీలపువజ్రం ప్రపంచంలో ఎక్కడాలేదని పురోహితులు చెప్తున్నారు. దీని విలువ మాత్రం లక్షకోట్లు.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

రాజేంద్రచోళుడు,కృష్ణదేవరాయలు పలుఆభరణాలని స్వామివారికి కానుకగా సమర్పించారు.మరి ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా కలియుగప్రత్యక్షదైవంగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వుండే శీతాకాలంలో తిరుపతి సందర్శించడం మంచిది. ఇక్కడ వేసవి చాలా వేడిగా వుంది అసౌకర్యంగా వుంటుంది కనుక, ఆ సమయంలో ఇక్కడికి రాకుండా వుండడం మంచిది. వర్షాలు వేసవి నుంచి ఉపశమనం ఇస్తాయి, తేలిక పాటి వర్షాలు తిరుపతి అందాన్ని ఇనుమడింప చేస్తాయి.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

తిరుపతి ప్రధానంగా గుళ్ళు వుండే నగరం కనుక, చాలా పవిత్రంగా భావించబడుతుంది కనుక, యాత్రికులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సంప్రదాయ దుస్తులు ధరించండి, టోపీ, కేప్ లు పెట్టుకోకండి.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

ఇక్కడి పూలు దేవుడి కైకంకర్యానికే వాడాలి కనుక తలలో పెట్టుకోకండి. మాంసం మద్యం పూర్తీగా దొరకవు, వాడకం నిషేధం కూడా. ఫోన్ లు, కెమెరాలు లాంటి గాడ్జెట్ లు గుడిలోకి అనుమతించబడవు. ధర్మం, సంస్కృతి ప్రేమించే ప్రతి పర్యాటకుడు తప్పక చూసి తీరవలసిన ప్రాంతం తిరుపతి.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

చూడాల్సిన ఆకర్షణలు

తిరుపతి, వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లలాంటి ప్రసిద్ధ గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు. శిలాతోరణం అనబడే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా చూడవచ్చు.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

చక్కర పొంగలి, లడ్డూ రుచి చూడకపోతే తిరుపతి సందర్శన సంపూర్ణం కాదు. చెక్క బొమ్మలు, తెల్ల చెక్కతో చేసిన వస్తువులు, కలంకారీ చిత్రాలు, తంజావూర్ బంగారు ఆకుల చిత్రాలు, మరీ ముఖ్యంగా చందనపు బొమ్మలు లాంటి ఇక్కడి కళాకృతులు కూడా చూడాల్సిందే.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

గోవిందరాజ స్వామి గుడి, తిరుపతి

తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. 1235లో నిర్మించిన ఈ దేవాలయానికి వైష్ణవ గురువు శ్రీమద్రామానుజాచార్యులు శంఖుస్థాపన చేసారని చెప్తారు. ఈ గోపురం కాక మరో రెండు గుళ్ళ చుట్టూ బయటి ప్రాకారం వుంటుంది.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

దక్షిణం వైపు గుడిలో పార్ధసారధి స్వామి విగ్రహం వుండగా ఉత్తరం వైపు గోవింద రాజ స్వామి గుడి వుంది. అలాగే ఇక్కడ మనవాల మాముని, శ్రీ చక్రాతాళ్వార్, సలాయి నాచియార్ అమ్మవారి, శ్రీ మచురకవి ఆళ్వార్, శ్రీ వ్యాసరాజ ఆంజనేయ స్వామి, శ్రీ తిరుమంగాయి ఆళ్వార్, శ్రీ వేదాంత దేశికర్ ల చిన్న చిన్న ఆలయాలు కూడా వున్నాయి.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

పద్మావతీ దేవి గుడి, తిరుపతి

తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

ఈ ఆలయం పద్మావతీ దేవి జననం గురించి, పద్మావతీ వెంకటేశ్వరుల పరిణయం గురించిన గాథలను చెప్తు౦ద౦టారు. తోన్దమందలాన్ని పాలించే ఆకాశ రాజు ఒక యజ్ఞ౦ చేసినప్పుడు ఆయనకు ఒక తామరపువ్వు లో దొరికిన బిడ్డను పద్మావతీ దేవి పేరిట తన కూతురుగా పెంచుకున్నాడు.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

ఆవిడనే అలమేలు మంగ అని కూడా అంటారు - అంటే ప్రేమ, కరుణల నిరంతర, అక్షయ వనరు అని అర్ధం. ఆవిడ పెరిగి పెద్దదయ్యాక దైవ నిర్ణయంగా వెంకతెస్వ్హ్వార స్వామి ఆవిడను వివాహమాడారని చెప్తారు.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

కపిల తీర్ధం, తిరుపతి

తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

తీర్థం అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్ధం, వినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయం 13,16 శతాబ్దాలలో విజయనగర రాజుల ప్రోత్సాహంతో ప్రాచీన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంరక్షణలో పోషించబడుతుంది.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

ఇస్కాన్ కృష్ణుడి ఆలయం, తిరుపతి

తిరుపతిలోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగిఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన చేక్కుళ్ళు ఉన్నాయి. కిటికీలు కృష్ణుడి లీలల గాజు చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

పైకప్పులు తంజావూరు శైలి కళతో అలంకరించారు. ఆలయ స్తంభాలపై విష్ణుమూర్తి పది అవతారాలూ ఉంటాయి. గర్భగుడిలో చుట్టూ గోపికలతో కృష్ణుడు ఉంటాడు. ఆలయం లోపల అందమైన పూలు, కొలనులు, ఫౌ౦టైన్ లు, కృష్ణ లీల విగ్రహాల తో ఒక అందమైన పార్కు కూడా ఉంటుంది.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

శ్రీ వెంకటేశ్వరా జూలాజికల్ పార్క్, తిరుపతి

శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్1987 సెప్టెంబర్ 29న స్థాపించబడింది. 5,532 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ మగ కోడి, జింక, చిలక, చిరుత, అడవి ఏనుగులకి ఆవాసం. శాకాహార, మాంసాహార స్థలాలు, మగకోడి నివాస స్థలానికి పక్కన విస్తరి౦చీ ఉన్న పచ్చని మైదానాలు ఇక్కడ పెద్ద ఆకర్షణగా ఉన్నాయి.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

తిరుపతి ప్రయాణం చాలా తేలిక. తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం వుంది. డిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లనుంచి రేణిగు౦ట నేరుగా విమానాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడిన రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ వుంది.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

చెన్నై, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం నడుస్తుంటాయి. అద్దె కార్లు, బస్సులు అందుబాటులో వుండడం వల్ల నగరంలో తిరగడం కూడా తేలికే. నామమాత్రపు ధరల్లో రోజంతటికీ కార్లు అద్దెకు తీసుకోవచ్చు.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

రోడ్డు ద్వారా

తిరుపతి రాష్ట్రంలో అతిపెద్ద బస్సు టర్మినల్స్ కలిగి ఉంది. అన్ని ప్రధాన పట్టణాలూ, నగరాలూ లేదా దక్షిణ భారతదేశం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అలిపిరి బస్ స్టాప్ నుండి తిరుపతికి ప్రతి రెండు నిమిషాలకు బస్సులు నడుస్తాయి. ఈ నగరం అంతర్గతరవాణా వ్యవస్థ బాగా అభివృద్ది చెందడం వల్ల ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

రైలు మార్గం ద్వారా

దేశవ్యాప్తంగా నడుపుతున్న రైళ్లకు తిరుపతి ఒక ప్రధాన రైల్వే స్టేషన్. తిరుపతి నుండి రేణిగుంట జంక్షన్ కి ప్రయాణం 10 నిమిషాల దూరంలో ఉంది. తిరుపతి నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూర్ జంక్షన్ కూడా యాత్రీకుల అవసరాలు తీరుస్తుంది.

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం !

వాయు మార్గం ద్వారా

తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించబడింది, కానీ ఇప్పటికీ అంతర్జాతీయ విమానాలు నడవడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, వైజాగ్, కోయంబత్తూర్, కోలకతా, ముంబైకి విమానాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయం నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై దీనికి సమీప విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X