Search
  • Follow NativePlanet
Share
» »శని వక్రదశలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళితే...

శని వక్రదశలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళితే...

తమిళనాడులోని వక్రకాళి దేవాలయం గురించి కథనం

By Kishore

హిందూపురాణాలను నమ్మేవారు దైవుడు, దెయ్యాన్ని ఎంత బలంగా నమ్ముతారో శనీశ్వరుడిని గురించి కూడా అంతే బలంగా నమ్ముతారు. ఆ శని చూపు తమ వైపు పడకుండా ఉండాలని కోరుకొంటుంటారు. ఒక వేళ శని ప్రభావానికి లోనయినా పరిహారం కోసం అనేక పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రమే తమిళనాడులోని ఒక చిన్న ఊరిలో ఉంది. ఒకే ఆలయంలో పరమశివుడి అత్యంత అరుదైన రూపంగ చెప్పుకొనే ముఖలింగం ఒకటి ఉంది. ఇక విష్ణువు కూడా ప్రయోగ చక్ర భంగిమలో ఉండటం ఇక్కడ గమనార్హం. ఇక్కడ ఉన్న కాళీమాతను తమిళనాట ఉన్న అనేక రాజకీయనాయకులు తమకు విజయాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుకొంటూ ఉంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ ఆలయానికి సంబంధించిన సమాచారం నేటివ్ ప్లానెట్ పాఠకులైన మీ కోసం

ఆ నిమ్మకాయను ఇంటిలో పెట్టుకొంటే ఒక్క నిమిషంలోఆ నిమ్మకాయను ఇంటిలో పెట్టుకొంటే ఒక్క నిమిషంలో

1. వక్రాసురుడు

1. వక్రాసురుడు

P.C: YouTube

పూర్వం ఈ ప్రాంతంలో వక్రాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఇతను గొప్ప శివ భక్తుడు. దాదాపు 500 ఏళ్లు తపస్సు చేసి శివుడి నుంచి అపార బలన్ని సంపాదిస్తాడు.

2. పరమశివుడిని వేడుకొంటారు

2. పరమశివుడిని వేడుకొంటారు

P.C: YouTube

వర గర్వంతో వక్రాసురుడు విర్రవీగుతూ ఉంటాడు. మునులను,సాధారణ ప్రజలను, మహిళలను, చిన్నపిల్లలను క్రూరంగా హింసించేవాడు. దీంతో ఇతని భారి నుంచి తమను కాపాడాల్సిందిగా మునులు కైలాసానికి వెళ్లి పరమశివుడిని వేడుకొంటారు.

4. ప్రయోగ చక్ర భంగిమలో

4. ప్రయోగ చక్ర భంగిమలో

P.C: YouTube

మునుల బాధలను విన్న ఆ విష్ణువు వెంటనే తన ఆయుధమైన సుదర్శనంతో వక్రాసురుడిని సంహరించడానికి వస్తాడు. అందువల్లే ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం ప్రయోగ చక్ర అనే భంగిమలో ఉంటుంది.

5. అతను చావడు

5. అతను చావడు

P.C: YouTube

అంటే ఆయుధమైన సుదర్శన చక్రాన్ని సంధిస్తున్న భంగిమలో విష్ణుమూర్తి ప్రతిమ ఉంటుంది. కాగా, విష్ణుమూర్తి ఎన్ని సార్లు తన సుదర్శన చక్రాన్ని వక్రాసురుడి పైకి వదిలినా అతను చావడు.

6. వేల మంది సైనికులను

6. వేల మంది సైనికులను

P.C: YouTube

సుదర్శన చక్రం తగిలిన వక్రాసురుడి ప్రతి అవయవం నుంచి వచ్చే రక్తపు బొట్టు మరో వక్రాసురుడితో పాటు వేల మంది రాక్షసులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దీంతో విష్ణువు ఆదిశక్తిని భక్తితో ప్రార్థన చేస్తాడు.

7. కాళీ రూపంలో

7. కాళీ రూపంలో

P.C: YouTube

దీంతో ఆ ఆదిపరాశక్తి కాళికా రూపంలో యుద్ధభూమిలో వెలుస్తుంది. వక్రాసురుడి రక్తం భూమి పై పడకుండా తన నాళికలను అడ్డు పెడుతుంది. దీంతో విష్ణవు వక్రాసురుడిని సంహరిస్తాడు.

8. అందుకే ఆ పేరు

8. అందుకే ఆ పేరు

P.C: YouTube

వక్రాసురుడిని సంహరించడానికి భూమి పై వెలిసిన కాళీమాత కాబట్టి ఈమెను వక్రకాళీ అని అంటారు. అమ్మవారు ఇక్కడ ఉగ్రస్వరూపంగా ఉంటుంది.

9. శ్రీ చక్రాన్ని

9. శ్రీ చక్రాన్ని

P.C: YouTube

ఈ విషయం తెలిసిన ఆదిశంకరాచార్యులు తిరువక్కరై చేరుకొని అమ్మవారిని తన ప్రార్థలతో శాంతపరిచారు. అటు పై అమ్మవారి కాలికింద శ్రీ చక్రాన్ని ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతుంది.

10. చంద్రమౌళీశ్వరుడు

10. చంద్రమౌళీశ్వరుడు

P.C: YouTube

ఇక ఈశ్వరుడిని ఇక్కడ చంద్రమౌళీశ్వరుడనే పేరుతో కొలుస్తాడు. లింగ రూపంలో వెలిసిన ఆ పరమశివుడు మూడు ముఖాలను కలిగి ఉంటారు. ఇలా లింగం మూడు రూపాలను కలిగి ఉండటం చాలా అరుదైన విషయం.

11. మూడు దిక్కులకు మూడు పేర్లు

11. మూడు దిక్కులకు మూడు పేర్లు

P.C: YouTube

త్రిమూర్తుల రూపంలో ఉన్న శివలింగంలో తూర్పు వైపున ఉన్న లింగాన్ని వామదేవ లింగమంటారు. దక్షిణం వెపున ఉన్న ముఖాన్ని అఘోర లింగమని, ఉత్తర వైపున ఉన్న లింగాన్ని వామదేవ లింగమని పిలుస్తారు.

12. అందువల్ల వేల మంది భక్తులు

12. అందువల్ల వేల మంది భక్తులు

P.C: YouTube

ఇలా అటు శివుడు, ఇటు విష్ణుమూర్తి తో పాటు ఆది పరాశక్తి కి ప్రతిరూపమైన కాళీమాత ఒకే చోట ఉండటం వల్లప్రతి ఏడాది ఈ చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి వేలమంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు.

13. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు

13. పర్వదినాల్లో ప్రత్యేక పూజలు

P.C: YouTube

ముఖ్యంగా శివరాత్రి, విజయదశమి, కార్తీక పౌర్ణమి, చైత్ర పౌర్ణమి పర్వదినాల్లో ఈ చిన్న గ్రామం కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రత్యేక పూజలు జరుగుతాయి.

14.శని వక్రదశలో ఉన్నప్పుడు

14.శని వక్రదశలో ఉన్నప్పుడు

P.C: YouTube

శని వక్రదశలో ఉన్నసమయంలో ఇక్కడ ఉన్న కాళీ అమ్మవారిని కొలిస్తే ఉపశమనం లభిస్తుందని స్థానికుల నమ్మకం. అందుకే శనిపరిహారం కోసం ఇక్కడకు వేలమంది ప్రజలు వస్తుంటారు.

15. ఎంతటి శత్రువునైనా

15. ఎంతటి శత్రువునైనా

P.C: YouTube

అంతే కాకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చనని తమిళనాటంతటా ప్రచారంలో ఉంది. ఎలాంటి ఆపదనైనా ఎదుర్కొనవచ్చునని చెబుతారు.

16. రాజకీయ నాయకులు

16. రాజకీయ నాయకులు

P.C: YouTube

ఇన్ని విశిష్టతలు ఉండటం వల్లే తమిళనాడు చాలా మందికి ఈ వక్రకాళీ అమ్మవారు పరమ ఆరాధ్య దేవతగా మారారు. ఎన్నికలకు ముందు, రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు తమిళ రాజకీయనాకులు ఇక్కడికి వస్తుంటారు.

17.అఘోరాలు కూడా

17.అఘోరాలు కూడా

P.C: YouTube

ఇక దక్షిణం వైపు ఉన్న అఘోర లింగాన్ని తాంత్రిక శక్తులను ఆరాధించే అఘోరాలు ఎక్కువగా పూజిస్తుంటారు. ఇక కాళీ అమ్మవారు ఉండటం కూడా ఈ దేవావాలయానికి ఎక్కవ మంది అఘోరాలు రావడానికి కారణం.

18. 9వ శతాబ్దంలో

18. 9వ శతాబ్దంలో

P.C: YouTube

ప్రస్తుత ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్యుడనే చోళ రాజు నిర్మించినట్లు స్థానికంగా దొరికిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఏడంతస్తుల రాజగోపురం కలిగి విశాలమైన ప్రాకారాలు ఉంటాయి.

19. 275 పుణ్యక్షేత్రాల్లో

19. 275 పుణ్యక్షేత్రాల్లో

P.C: YouTube

వైష్ణవులకు 108 విద్యక్షేత్రాలు ఎలాగో నయనార్లు అంటే శైవులకు 275 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని పాడల్ పెట్ర స్థలం (పాటలో పేర్కొన్న స్థలాలు) అంటారు. అందులో తరువక్కరై లో ఉన్న చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం ఒకటి.

20 ఎలా వెళ్లాలి..

20 ఎలా వెళ్లాలి..

P.C: YouTube

తమిళనాడులోని విల్లూపురం జిల్లా తిరువక్కారై అనే గ్రామంలో ఈ వక్రకాళి అమ్మవారి దేవాలయం ఉంది. చెన్నై నుంచి బస్సు, లేదా ప్రైవేటు వాహనాల ద్వారా ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. చెన్నై నుంచి ఈ దేవాలయానికి 155 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X