Search
  • Follow NativePlanet
Share
» »అందమైన పూల లోయ - నుబ్రావ్యాలీ

అందమైన పూల లోయ - నుబ్రావ్యాలీ

నుబ్రా వాలీ ఒక అందమైన పూల లోయ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున కలదు. దీనిని 'లడఖ్ తోట' అని కూడా పిలుస్తుంటారు అక్కడి స్థానికులు.

By Venkatakarunasri

నుబ్రా వాలీ ఒక అందమైన పూల లోయ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున కలదు. దీనిని 'లడఖ్ తోట' అని కూడా పిలుస్తుంటారు అక్కడి స్థానికులు. సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉండే నుబ్రా వాలీ ని వేసవిలో సందర్శించటానికి భారతీయులు, విదేశీయులు ఇష్టపడతారు.

నుబ్రా వాలీ ప్రాంతంలో ఎక్కువగా పసుపు, పింక్ వర్ణాలు కలిగిన పూలు పూస్తాయి అవే ఇక్కడ అధికంగా కనిపిస్తాయి కూడా. ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుమార్గం గుండా వాలీ చేరుకొనే ప్రయాణం ఊపిరి బిగబట్టే విధంగా ఉంటుంది. సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడే ఈ ప్రాంతంలో సందర్శన సాహసికులకు ఉత్తేజాన్ని ఇస్తుంది.

నుబ్రా వాలీ ప్రముఖ సందర్శనీయ స్థలాలు పనామిక్ గ్రామం, ఆరామాలు. ఈ ప్రాంతంలో ఇస్లాం మతం పుట్టక ముందు బౌద్ధ మతం వ్యాప్తి లో ఉండేదని అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఎన్నో యుద్ధాలను చవిచూసిన ఈ ప్రాంతం ఇప్పటికీ వన్నె తగ్గకుండా పర్యాటకులను ఆకర్షిస్తున్నది అంటే ... అక్కడి ప్రకృతి సౌందర్యాలు ఏ మాత్రం ఉన్నాయో తెలుసుకోవలసిందే !

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్

నుబ్రా వాలీ చేరుకోవాలంటే, ఖార్ దుంగ్ లా పాస్ ఒక్కటే మార్గం. ఇది రోడ్డు మార్గం. సముద్రమట్టానికి 18380 అడుగుల ఎత్తున ఉండే ఈ రోడ్డు మార్గం ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డు మార్గంగా ఖ్యాతి గడించింది.l

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్ రోడ్డు మార్గం సంవత్సరం పొడవునా 365 రోజులూ మంచుచే కప్పబడి ఉంటుంది. దీని నిర్వహణ అంత సులభం కాదు కనుకనే బార్డర్ రోడ్ సంస్థ నిర్వహిస్తున్నది.

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్ రోడ్డు మార్గం వేసవిలో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ పాస్ గుండా ప్రయాణించేటప్పుడు అందమైన కారాకోరం మరియు లడఖ్ పర్వత శ్రేణులను చూడవచ్చు.

పనామిక్ గ్రామం

పనామిక్ గ్రామం

పనామిక్ గ్రామం, లేహ్ పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో సుబ్రా వాలీ లోయలో కలదు. ఈ గ్రామం ఇండో - చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. గ్రామ పొలిమేర వరకు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది ప్రయాణీకులు. ఆది దాటితే చైనా దేశం వస్తుంది. ఇక్కడ ఒక వేడి నీటి బుగ్గ కూడా కలదు.

మైత్రేయ బుద్ధ

మైత్రేయ బుద్ధ

నుబ్రా వాలీ లో ఉన్న ప్రధాన ఆకర్షణల్లో మైత్రేయ బుద్ధ ఒకటి. దీనిని భవిష్యత్ బుద్ధ లేదా లాఫింగ్ బుద్ధ అని పిలుస్తారు. ఈ విగ్రహం అక్కడి కొండమీద గల ఓపెన్ ప్రదేశంలో 32 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది.

మైత్రేయ బుద్ధ

మైత్రేయ బుద్ధ

కొండ మీద ఉన్న మైత్రేయ బుద్ధ విగ్రహం చూడటానికి వింతగా ఉంటుంది. కొండ మీద ఉన్న విగ్రహం శ్యూక్ నది వైపుగా పాకిస్థాన్ వైపున తిరిగి ఉంటుంది. ఈ విగ్రహాన్ని శాంతికి చిహ్నంగా అక్కడి స్థానికులు భావిస్తారు.

ఇన్సా బౌద్ధ ఆరామం

ఇన్సా బౌద్ధ ఆరామం

ఇన్సా ఆరామాన్నే 'ఇన్సా గొంపా' అని కూడా పిలుస్తారు. ఇది పనామిక్ గ్రామానికి సమీపంలో ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్ళాలంటే సుమారు 6 గంటలు ట్రెక్కింగ్ చేయాలి. ఈ పురాతన బౌద్ధ ఆరామంలో బౌద్ధ మతానికి సంబంధించిన చిత్రాలు ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

డిస్ కిట్ బౌద్ధ ఆరామం

డిస్ కిట్ బౌద్ధ ఆరామం

డిస్ కిట్ బౌద్ధ ఆరామం సముద్ర మట్టానికి 10310 అడుగుల ఎత్తులో ఉన్న డిస్ కిట్ గ్రామంలో కలదు. ఇది నుబ్రా వాలీ లో ఉన్న అతిపెద్ద మరియు పురాతన ఆరామం. ఈ ఆరామంలో టిబెట్ సంస్కృతికి చెందిన అనేక శిల్పాలను, చిత్రాలను, పెయింటింగ్ లను చూడవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో స్కేప్ గోట్ ఫెస్టివల్ జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X