» »టిప్పుసుల్తాన్ కుటుంబాన్ని బంధించిన కోట ఇది...

టిప్పుసుల్తాన్ కుటుంబాన్ని బంధించిన కోట ఇది...

వేలూరు కోట కూడా అత్యంత సుందరమైన కోటలలో ఒకటి. ఈ అద్భుతమైన కోట 16వ శతాబ్దంలో నిర్మించబడ్డ పురాతనమైన కోట.ఇది విజయనగర రాజులచే నిర్మించబడ్డ అద్భుతమైన కోట తమిళనాడు రాష్ట్రంలో వుంది. వేలూరు నగరంలో భాగంగా వున్న ఈ కోట విశాలమైన దిబ్బలు మరియు బలమైన రాళ్ళవల్ల ఎంతగానో ప్రసిద్ధిచెందినది.

ఈ కోటను విజయనగర రాజులు, బీజాపూరు సుల్తానులు, మరాఠాలు, కర్ణాటక నవాబులు మరియు చివరిగా బ్రిటీష్ వారు ఆధీనంలో వుంది. ఈ కోట యొక్క ఇతిహాసమేమంటే బ్రిటీష్ వారి పరిపాలనాకాలంలో టిప్పుసుల్తాన్ కుటుంబం మరియు శ్రీలంక చివరిరాజైన శ్రీ విక్రమరాజ సింహను ఈ కోటలోనే బంధించబడ్డారు.

ఇంత ఇతిహాసాన్ని కలిగివున్న ఈ కోట గురించిన విశేషాలు తెలుసుకునే తీరాలి కదా?

వేలూరు కోట

వేలూరు కోట

ఈ అద్భుతమైన కోట తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో కలదు. ఇక్కడ జలకంఠేశ్వర హిందూ దేవాలయం, సెంట్ జాన్స్ చర్చ్ మరియు ముస్లిం మసీదులు చూడవచ్చును.

ఇందులో జలకంఠేశ్వర దేవాలయం అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ది చెందింది.

Fahad Faisal

వేలూరు కోట

వేలూరు కోట

1806 లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా మొదటి తిరుగుబాటు ఈ కోటలో మొదలైంది. దీనికి విజయనగర శ్రీరంగ రాయలు సాక్షిగా వున్నారు.

A.D.G. Shelley

వేలూరు కోట

వేలూరు కోట

ఈ అద్భుతమైన కోట 1566 AD లో విజయనగర సామ్రాజ్యం యొక్క సదాశివరాయల ఆస్థానంలో ముఖ్యులైన చిన్న బొమ్మి నాయక్ మరియు తిమ్మారా రెడ్డి నాయక్ లు ఈ వేలూరు కోటను నిర్మించినారు.

Venkatesh Ragu

వేలూరు కోట

వేలూరు కోట

కోట ఆక్రమణ సమయంలో రక్షణా క్రమంలో 12 కిమీ ల దూరంలో వున్న విరింజి పురానికి దారి ద్వారా తప్పించుకొనటానికి సొరంగ మార్గం కూడా వుంది. శత్రువులు దాడి చేసే సమయంలో రాజులు ఈ సొరంగ మార్గం గుండా తప్పించుకునేవారు.

Samuelrajkumar

వేలూరు కోట

వేలూరు కోట

ముఖ్యంగా ఈ కోటను దక్షిణ భారత మిలిటరీ వాస్తుశిల్ప శైలిలోనే అత్యుత్తమమైనది అని గుర్తించబడినది. ప్రవేశ ద్వారం వద్ద నుండే శిల్పాలు వాస్తు శిల్పానికే మరింత మెరుగులుదిద్దిందని చెప్పవచ్చును. ఇక్కడ ఒక హిందూదేవాలయం వుంది, ప్రస్తుతం ఏవిధమైన దేవతామూర్తులు ఇక్కడ లేదు.అనేక సంవత్సరముల క్రిందట ఇక్కడ శివునివిగ్రహం వుండేదని చెప్పబడింది.

K S Sai Krishna

వేలూరు కోట

వేలూరు కోట

వేలూర్ కోట దాని ఇతిహాసాన్ని వెల్లడిస్తుంది. అందులోనూ మైసూర్ పులి టిప్పు సుల్తాన్ 1799లో శ్రీరంగ పట్టణపతనం అనంతరం టిప్పుసుల్తాన్ కుమారులు, అతని కుమార్తెలు, అతని భార్య మరియు అతని తల్లితో సహా ఈ కోటలోనే బంధించబడ్డారు.

Arullura

వేలూరు కోట

వేలూరు కోట

1806 నాటి సిపాయిల తిరుగుబాటు తరువాత బ్రిటిష్ వారు టిప్పుసుల్తాన్ యొక్క కుమారులను మరియు కుమార్తెలను కలకత్తాకు బదిలీ చేశారు. శ్రీలంకను పరిపాలించిన చివరి పాలకుడు శ్రీ విక్రమరాజసింహం యొక్క చివరి ప్రదేశం. రాజు మరియు అతని కుటుంబీకులు సుమారు 17సంల కాలం పాటు ఖైదుచేయబాడ్డారు.

Glsanthoshkumar

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఈ కోట తమిళనాడు రాష్ట్రంలో ఉన్నది మరియు పాత బస్ స్టాండ్ ఎదురుగా వేలూరు పట్టణంలో నెలకొనివుంది. వేలూర్ - చెన్నై - బెంగుళూరు రహదారి మీద వుంది. చెన్నై నుండి 120 కిలోమీటర్లు మరియు బెంగళూరు నుండి 210 కిలోమీటర్లు దూరంలో వుంది.

pc:google maps

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

రైల్వే స్టేషన్

సమీపంలోని రైల్వే స్టేషన్ ఏదంటే అది వేలూర్ - కాట్పాడి జంక్షన్. ఇక్కడ అన్నీ సూపర్ ఫాస్ట్ రైళ్ళు వున్నాయి.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

విమానాశ్రయం

సమీపంలోని విమానాశ్రయం ఏదంటే అది తిరుపతి విమానాశ్రయం, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం.