Search
  • Follow NativePlanet
Share
» »మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

By Venkatakarunasri

చరిత్ర మేరకు ఈ ప్రదేశం మహా జనపద లేదా పురాత రాజ్యానికి రాజధానిగా ఉండేది. 5వ శతాబ్దంలో ఛేది రాజులు దీనిని పాలించారు. తర్వాతి కాలంలో అది మౌర్య రాజ్యంలో ఒక భాగమైంది. ఇక్కడ పర్యాటకులు అశోకుడి శిలా లేఖనాలు చూస్తారు. మౌర్య రాజు ఇక్కడ తన రాజ్య పాలనకు సంబంధించిన చట్టాలు, ప్రకటనలు వంటివి శిలా శాసనాలుగా చెక్కించాడు. ఇక్కడ చూడవల్సిన ప్రదేశాలను ఒక్కొక్కటిగా తెలియజేస్తూ ...

విరాట్ నగర్ ప్రదేశం రాజస్ధాన్ లోని పింక్ సిటీ జైపూర్ నుండి 53 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పట్టణం ఇపుడిపుడే పర్యాటకులకు ఒక ఆకర్షణీయ ప్రదేశంగా మారుతోంది. ఈ ప్రదేశాన్ని చాలామంది బైరాత్ అని పిలుస్తారు. దీని సమీపంలో సరిస్కా, శిలిసేర్, అజబ్ ఘర్ - భంగ్రా మరియు ఆల్వార్ లవంటి ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు కలవు. విరాట్ నగర్ పేరు మన గొప్ప ఇతిహాసమైన మహాభారత లో కూడా చెప్పబడింది. పురాణేతిహాసాల మేరకు ఈ ప్రదేశాన్ని రాజు విరాటుడు కనుగొన్నాడు. ఆక్కడ రాజ్యాన్ని ఏర్పరచాడు. పాండవులు తమ అరణ్య వాస సమయంలో ఇతని రాజ్యంలో కొంతకాలం తలదాచుకున్నారు.

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

అశోకా శిలాలేఖ్

అశోకా శిలాలేఖలను మౌర్య చక్రవర్తి అశోకుడు రాయించాడు. ఇవి మెయిన్ రోడ్ నుండి 100 మీ.ల దూరంలో ఉంటాయి. దీని చుట్టు పట్ల అనేక సుందర దృశ్యాలను కూడా చూసి ఆనందించవచ్చు. అశోకుడు భారత దేశాన్ని క్రీ. పూ. 269 నుండి క్రీ. పూ. 232 వరకు పాలించాడు. ఇండియాలోని వివిధ ప్రాంతాలలో తన పాలనకు సంబంధించిన చట్టాలను శిలా శాసనాలుగా లిఖించాడు.

Photo Courtesy: Giridharmamidi

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

జైన దేవాలయం

జైన దేవాలయం ప్రసిద్ధి చెందిన పర్యాటక ఆకర్షణ. ఈ దేవాలయంలో ఒక బయలు ప్రాంగణం ఉంటుంది. చుట్టూ గోడ నిర్మితమై కలదు. దేవాలయ ప్రవేశంలో స్తంభాల పోర్టికో చక్కని చెక్కడాలతో కనపడుతుంది.. అక్కడి దేవాలయ రాతి ఫలకాలపై కొన్ని మతపర శాసనాలు లిఖించబడ్డాయి. ఈ దేవాలయంలో జైన తీర్ధంకరుల చిత్రాలు కలవు. పార్శ్వ నాధ, చంద్ర ప్రభ మూర్తులు కరూడా కలవు. జైన మతంలోని 24 తీర్ధంకరులలో మొదటి వాడైన రిషభ దేవ చిత్రం కూడా చూడవచ్చు.

Photo Courtesy: India Journeys

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

భీమ్ కి దుంగారి

భీమ్ కి దుంగారి ఒక పెద్ద గుహ. ఇది వారాట్ నగర్ లో కలదు. కౌరవులకు అంతా వదిలేసిన పాండవులు 12 సంవత్సరాలపాటు అరణ్య వాసం చేసి ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేస్తూ ఇక్కడ గడిపారని, 13వ సంవత్సరంలో విరాటుడి కొలువులో చేరారు. పాండవులలో బలవంతుడైన భీముడు తన నివాసంగా ఈ భీమ్ కి దుంగారి అనే గుహను ఎంపిక చేసుకున్నాడని ఆ సమయంలో అక్కడ ఉన్నాడని పురాణాలు చెపుతాయి. భీముడు విరాటుడి కొలువులో వంటలవాడుగా చేరి తన అజ్ఞాత వాసం గడిపాడు.

Photo Courtesy: indian citizen

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

గణేశ్ గిరి దేవాలయం మరియు మ్యూజియం

గణేశ్ గిరి దేవాలయాన్ని సంవత్సరం పొడవునా భక్తులు అధిక సంఖ్యలో దర్శిస్తారు. ఇక్కడే ఒక చిన్న మ్యూజియం కూడా కలదు ఈ మ్యూజియం సుమారు 170 శిల్ప శైలి కధలను వివరిస్తుంది.

Photo Courtesy: indian museum

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

బీజక్ కి పహారి

బీజక్ కి పహారి ప్రదేశంలో రెండు బౌధ్ధ ఆరామాలు చరిత్రలోని సువర్ణయుగం రాటివి యేడవయంయె, ఈ రకమైన బౌద్ధ ఆరామాలు సుమారు 8 వరకు ఉండేవని చెపుతారు. క్రీ. శ. 634 లో హ్యూయన్ సాంగ్ విరాట్ నగర్ ను సందర్శించాడు. ఇతని సందర్శన అశోక చక్రవర్తి పాలన తర్వాత 900 సంవత్సరాలకు మొదటి సారి జరిగింది. ఈ బౌద్ధ ఆరామాలు గుండ్రంగా ఉండి అతి పురాతనమైనవిగా చెప్పబడతాయి. దేవాలయ బయటి గోడలపై బౌద్ధుల శిలా శాసనాలు అశోకుడి కాలంనాటి బ్రాహ్మీ లిపి లో లిఖించబడ్డాయి.

Photo Courtesy: Giridharmamidi

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

జైన్ నాసియా

జైన్ నాసియా విరాట్ నగర్ లోని ముఘల్ గేటు ఎదురుగా ఉంది. పర్యాటకులు ఇక్కడ ఆ నాటి సాగునీరు, నీటి పారుదల విధానాలను మరియు చిన్న తోటను చూడవచ్చు. ఇక్కడే ఒక పిల్లల ఆట స్ధలం కూడా కలదు.

Photo Courtesy: viratnagar.co.in

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

మహాభారతంలో కనుగొన్న ప్రదేశం !

విరాట్ నగర్ చేరుకోవడం ఎలా?

విమాన ప్రయాణం

జైపూర్ లోని సంగనేర్ విమానాశ్రయం విరాట్ నగర్ కు సమీపం. సంగనేర్ నుండి ముంబై, ఢిల్లీ, ఔరంగాబాద్, ఉదయపూర్ మరియు జోధ్ పూర్ లకు నేరు విమాన ప్రయాణం చేయవచ్చు. అంతర్జాతీయ పర్యాటకులు న్యూఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సంగనేర్ చేరుకోవచ్చు. సంగనేర్ ఎయిర్ పోర్ట్ నుండి విరాట్ నగర్ కు క్యాబ్ లు దొరుకుతాయి.

రైలు ప్రయాణం

విరాట్ నగర్ కు జైపూర్ రైలు స్టేషన్ సమీపం. ఈ ప్రదేశానికి సాధారణ రైళ్ళు మాత్రమే కాక, ప్యాలెస్ ఆన్ వీల్స్ వంటి లగ్జరీ రైళ్ళు కూడా కలవు. ఢిల్లీనుండి ఈ రైలు పై జైపూర్, ఆల్వార్, ఉదయపూర్ పట్టణాలు చేరుకొని అక్కడినుండి విరాట్ నగర్ క్యాబ్ లలో చేరవచ్చు.

రోడ్డు ప్రయాణం

జైపూర్ కు దేశంలోని వివిధ పట్టణాలనుండి బస్ సర్వీసులు కలవు. న్యూఢిల్లీ, ఆగ్రాలనుండి నేరు బస్సులు జైపూర్ కు కలవు. జైపూర్ నుండి విరాట్ నగర్ కు క్యాబ్ లలో చేరవచ్చు.ఆర్ టి సి బస్సు సర్వీసులు కూడా జైపూర్ నుంచి విరాట్ నగర్ కు రెగ్యులర్ గా నడుపుతున్నారు.

Photo Courtesy: Rakesh Gupta 1

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X