Search
  • Follow NativePlanet
Share
» »మేథావులకూ షాక్ ఇస్తున్న ఆ టెక్నాలజీ ఉన్న దేవాలయాలు

మేథావులకూ షాక్ ఇస్తున్న ఆ టెక్నాలజీ ఉన్న దేవాలయాలు

హంపి విరూపాక్ష దేవాలయానికి సంబంధించిన కథనం.

ధార్మిక దేశమైన భారత దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటి మర్మాలు ఇప్పటికీ అంతుబట్టడం లేదు. శాస్త్ర, సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఆ రస్యాల ఛేదన కొనసాగుతూనే ఉంది కాని ఒక కొలిక్కిరావడం లేదు. అటు వంటి దేవాలయాలు మన దక్షిణ భారత దేశంలో కూడా ఉన్నాయి. అందులోనూ తమిళనాడు తర్వాత కర్నాటకలోనే ఇటువంటి దేవాలయాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని చెబుతారు. అందులో ఒక దేవాలయంలో ఒకటి కాదు, రెండు కాదు అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అటువంటి దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube

కర్నాటకలోనే కాకుండా ప్రపంచ పర్యాటక చిత్రపటంలో తనదైన ముద్రవేసిన హంపిలో అటువంటి దేవాలయం ఉంది. దాని పేరే విరూపాక్ష దేవాలయం.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
బెంగళూరు నుంచి హంపి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యునెస్కో చేత సంరక్షించబడే కట్టడాల జాబితాలో కూడా ఈ దేవాలయానికి స్థానం దక్కింది.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
విజయ నగరానికి చెందిన లక్కన్న, దండేష్ అనే ఇద్దరు కోశాధికారులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఈ పట్టణం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. తుంగభద్ర నదిని పంపా నది అని కూడా పిలుస్తారు. కన్నడలో హంపి అంటే పంప అనే అర్థం కూడా ఉంది.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఇక ఇక్కడ కొలువై ఉన్న విరూపాక్ష స్వామి విజయనగర రాజుల కులదైవం. పురాణాల ప్రకారం ఈ పంపా నదీ తీరంలోనే పార్వతీ దేవి పరమేశ్వరుడి గురించి తపస్సుచేసిందని చెబుతారు.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
పార్వతి దేవి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను వివాహం చేసుకొన్నట్లు చెబుతారు. ఈ దేవాలయం అనేక రహస్యాలను తనలో దాచుకుంది.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఆ రహస్యాలను చూడటానికి దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
విరూపాక్షస్వామి ముందున్న మంటపం గోడ మీద రాజగోపురం నీడ ఎప్పుడూ తలకిందులుగా పడుతూ ఉంటుంది. ఇందుకు గల కారణాలను మాత్రం ఇప్పటివరకూ ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేకపోయారు.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఇక్కడ మరో అద్భుతం సూర్యకిరణాలు విగ్రహాన్ని తాకడం. ప్రధాన దేవాలయం లోపల 6 అడుగుల ఎత్తులో చిన్న రంధ్రం ఉంది. ఆ రంద్రం గుండా ఎల్లప్పుడూ దేవాలయ గోడ మీద పడుతూ ఉంటాయి.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
అవి వివిధ రంగుల్లో ఉండటం గమనార్హం. ఆ నీడకు అడ్డంగా మన చేతి వేళ్లను పెట్టినా ఆ నీరు కనబడకపోవడం గమనార్హం. ఇటువంటి నిర్మాణం ఆ నాటి శిల్ప, వాస్తు శైలికి నిదర్శనమని చెబుతారు.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఇప్పటి తరం శాస్త్రవేత్తలు ఎంతగా ప్రయత్నించినా కనుక్కోలేకపోతున్నారు. అదే విధంగా ఉగాది రోజున ఇక్కడ సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగం మీద పడటం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
అదేవిధంగా గర్భగుడిలో పడే సూర్యకిరణాలు సాలె మంటం వద్ద తిరిగి తల కిందులుగా కనిపిస్తాయి. గర్భగుడిలోని ఒక చిన్న రంద్రం ద్వారా ఈ సూర్యకిరణాలు సాలె మంటపంలో పడుతాయి.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఉదయం 9 గంటల సమయం, సాయంత్రం పూట మాత్రమే ఈ సూర్యకిరణాలు మనకు కనిపిస్తాయి. ఈ దేవాలయం లోపల అనేక చిన్న శివాలయాలు ఉన్నాయి.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
అందులో రెండు ఉపాలయాలు అత్యంత ప్రాచీనమైనవని చెబుతారు. అదులో ఒకటి పాతాళేశ్వర స్వామి దేవాలయం. ప్రధాన దేవాలయానికి తూర్పు వైపున ఉన్న ఈ దేవాలయం ఏడో శతాబ్దం ముందు నుంచి కూడా ఉన్నట్లు ఇక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
హంపిలో ఉన్న మరో దేవాలయం విఠలాలయం. అద్భుత శిల్పకళా సంపదకు ఈ దేవాలయం నిలయం. ఈ దేవాలయంలో ప్రధాన దైవం శ్రీమహావిష్ణువు. ఈ దేవాలయాన్ని 15వ శతాబ్దంలో నిర్మించారని చెబుతారు.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఇక్కడ ప్రధాన ఆకర్షణ రాతితో మలిచిన రథం. ఈ దేవాలయం గోపురం గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది. విష్ణవు వాహనం గరుడపక్షి రూపంలో ఉండటం గమనార్హం.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 1422 నుంచి 1444 మధ్య నిర్మించారు. ఇక ముఖ్యంగా ఈ విఠలాలయంలో ఉన్న ప్రధాన ఆకర్షణ ఇక్కడ సంగీతాన్ని వినిపించే స్తంభాలు. వీటినే మ్యూజికల్ పిల్లర్స్ అని అంటారు.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
ఈ స్తంభాలను మీటితే సప్తస్వరాలు వినిపించేవి. ఈ విషయం పై బ్రిటీష్ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. ముఖ్యంగా ఈ రాతి స్తంభాల లోపాల ఏవైనా సంగీత పరికరాలు ఉన్నాఏమోనని వారు అనుమానించారు.

హంపి, విరూపాక్ష దేవాలయం

హంపి, విరూపాక్ష దేవాలయం

P.C: You Tube
దీంతో ఈ మ్యూజికల్ పిల్లర్స్ లో రెండింటిని తమ దేశానికి తీసుకువెళ్లి వాటిని పరిశోధించారు. అయితే ఆ స్తంభాల లోపల ఎటువంటి సంగీత వాయిద్య పరికరాలు లేకపోవడం గమనార్హం.

<strong></strong>చనిపోయినవారిని బతికించే దేవాలయం నమ్మక పోతే వదిలేయండిచనిపోయినవారిని బతికించే దేవాలయం నమ్మక పోతే వదిలేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X