Search
  • Follow NativePlanet
Share
» »గుజరాత్ లోని శ్రీకృష్ణుని నగరమైన ద్వారకాదీష్ ఆలయాన్ని దర్శించండి

గుజరాత్ లోని శ్రీకృష్ణుని నగరమైన ద్వారకాదీష్ ఆలయాన్ని దర్శించండి

శ్రీకృష్ణుడు నడయాడిన నగరం ద్వారక. ఈ నగరం నుంచే యావత్ ద్వాపరయుగాన్ని తన కనుసన్నలతో కృష్ణుడు శాసించాడు.ఈ నగరం నుంచే బలరామ సమేత శ్రీకృష్ణుడు తన అఖండ సామ్రాజ్యాన్ని పాలించాడు.

By Venkatakarunasri

శ్రీకృష్ణుడు నడయాడిన నగరం ద్వారక. ఈ నగరం నుంచే యావత్ ద్వాపరయుగాన్ని తన కనుసన్నలతో కృష్ణుడు శాసించాడు.ఈ నగరం నుంచే బలరామ సమేత శ్రీకృష్ణుడు తన అఖండ సామ్రాజ్యాన్ని పాలించాడు.

విష్ణుపురాణాలలో చెప్పబడిన 7 పుణ్య నగరాలలో ఒకటి ఈ ద్వారక నగరం.అలాంటి మహా నగరాన్ని సముద్రం తన గర్భంలో కలిపేసుకొని ఒక జాతి అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేయగా ఇప్పటి మన
పురావస్తు శాఖ వారి కృషితో గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్రపు గర్భంలో ఆ మహానగర జాడలు కనుగొన్నారు.

మన చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ నగరం హటాత్తుగా ఎందుకు మాయమైంది ? అసలు ఆ నగరం ఎలా వున్నింది ? శ్రీకృష్ణుడు అంతటి మహానగరాన్ని సముద్రపు మధ్యలో కట్టడానికి గల కారణాలేవిటి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం

ద్వారక నగరం గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు

1. ద్వారక

1. ద్వారక

శ్రీమత్భాగవతం ప్రకారం కృష్ణుడు పాలించిన తొలి నగరం మధుర. దుష్టుడైన తన మేనమామ కంసుడ్ని చంపి బలరామసమేత శ్రీకృష్ణుడు మధురానగరాన్ని పాలించేవాడు. కృష్ణుడు చంపిన కంసుడుకి స్వయాన పిల్లనిచ్చిన మామ జరాసంధుడు.

PC: wikimedia.org

2. ద్వారక

2. ద్వారక

ఎంతో బలవంతుడైన తన అల్లుడు కృష్ణుడు వంటి పిల్లవాడి చేతిలో చనిపోవటం జీర్ణించుకోలేక శ్రీకృష్ణుడి పై తీవ్రమైన పగ పెంచుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11సార్లు మధురపై తన అఖండ సైన్యంతో దాడి చేసి ఓడిపోయాడు.ఇన్ని యుద్ధాలు చవి చూసిన మధురానగరం అక్కడి ప్రజలు ఆర్ధికంగా మానసికంగా చాలా పతనమయ్యారు.

PC: wikimedia.org

3. ద్వారక

3. ద్వారక

జరాసంధుడి బారి నుంచి ప్రజలను కాపాడి వారి జీవితాలలో మళ్ళీ వెలుగు నింపాలనే ఆలోచనతో ఒక కొత్త నగరాన్ని సముద్రం మధ్యలో నిర్మిస్తే జరాసందుడితో జరిగే యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బంది పడరనే ఉద్దేశంతో దేవశిల్పి విశ్వకర్మ పిలిచి శత్రుదుర్భేద్యమైన అతి సుందరమైన ఒక మహానగరాన్ని కట్టాలని ఆదేశించాడు.

PC: wikimedia.org

4. ద్వారక

4. ద్వారక

ఈ నగర నిర్మాణానికి భూమినివ్వమని శ్రీ కృష్ణుడు సముద్రుడ్ని ఆదేశించగా సముద్రుడు వెనక్కి జరిగి 12యోజనాల భూమినిచ్చాడు.ఆ ప్రదేశంలో విశ్వకర్మ నిర్మించిన మహానగరమే ద్వారక. ప్రపంచంలో ఈ ఒక్క నగరమే వజ్రవైడూర్యాలను కనక రత్నములను పొదిగి నిర్మించబడినది.

PC: dwarkadhish.org

5. ద్వారక

5. ద్వారక

భాగవతం ప్రకారం నారదముని ద్వారకనగరానికి విచ్చేసినప్పుడు ఆ మహానగర నిర్మాణాన్ని ఈ విధంగా వర్ణించాడు. విశ్వకర్మ ఈ నగరానికి కవచంలా చుట్టూ ఒక గోడను నిర్మించి దానికి నాలుగు ద్వారాలను ఏర్పాటుచేసాడని ఈ నగరంలోనే భవననిర్మాణాన్ని ఒక ఖచ్చిత పద్ధతిలో కట్టి ప్రాంతాల వారీగా విభజించాడట.

pc:Saawariyasairam

6. ద్వారక

6. ద్వారక

ఆ నగరంలోకి అడుగుపెట్టగా పక్షుల కిలకిలా రావాలతో, పచ్చటి వుద్యానవనాలతో, అందమైన సరస్సులతో దర్శనమిస్తుందని ఈ నగరంలో సామాన్యజనాలు వుండటానికి,అందమైన నివాసాలతో పాటు 9లక్షల రాజప్రాసాదాలను,వజ్రవైడూర్యలతో నిర్మించి వాటి స్థంభాలపై బంగారుపూత పూసి ఎంతో విలువైన మణిమాణిక్యాలను పొదిగారట.

pc:Saawariyasairam

7. ద్వారక

7. ద్వారక

ఆ కోటలలోని ప్రతివస్తువూ బంగారంతో తయారుచేసి వివిధరకాలైన ఆభరణాలతో అలంకరించారట.వాటిలో కొన్ని భవంతులు ఆకాశంలో మబ్బులను తాకే ఎత్తుకు కట్టారట. ఆ ఆకాశ హరణ్యాల పై నుంచి చూస్తే ద్వారకనగరం చుట్టు పక్కల ప్రాంతాలన్నీ స్పష్టంగా కనపడేవట.

pc:Krishna Vir Singh

8. ద్వారక

8. ద్వారక

కృష్ణుడి తన పరివారానికి 16,000ల మంది గోపికలకు ఎంతో అందమైన 16,000 ల భవంతులు కట్టించాడట.నారదుడు వాటిలోని ఒక భవంతిలోనికి ప్రవేశించినప్పుడు అక్కడి దృశ్యాన్ని చూసి అబ్బురపడినట్లు భాగవతంలో వుంది.

pc:Saawariyasairam

9. ద్వారక

9. ద్వారక

ఆ భవంతులలోని స్థంభాలకు వైడూర్యాలను బహు చక్కగా పొదిగి అక్కడి గోడలపై ఆ నీలలోహితుడి లీలలను శిల్పరూపంలో ఆవిష్కరించారట. అక్కడి నేల బంగారు వర్ణంతో ధగధగలాడేదట. ఆ భావంతిలోని పందిళ్ళకు ముత్యాల హారాన్ని తోరణాలుగా అలంకరించారట. అక్కడి బల్లలు, మంచాలు, కుర్చీలు తెల్లటి ఏనుగు కొమ్ములతో చేసి వాటికి వెలకట్టలేని అందమైన ఆభరణాలను అలంకరించారు.

pc:Ramkumar TD

10. ద్వారక

10. ద్వారక

అక్కడి పని వాళ్ళు చక్కటి వస్త్రాలంకరణతో మెడలో ఒక రకమైన ముద్రకలిగిన ఆభరణాలను కలిగివున్నారు. ఆ ఆభరణాలకు రక్షణ కాచే భటులు కంచుకవచాలు ధరించి తలకు తలపాగాలు పెట్టుకుని
ఆ రాజ్యపు ప్రత్యేక వస్త్రాలను ధరించి చెవులకు బంగారు ఆభరణాలు పెట్టుకొని వున్నారట.

pc:Amogh123000

11. ద్వారక

11. ద్వారక

ఆ భవంతిలోని చీకటిని పారద్రోలే దీపాలకు వజ్రాలను పొదిగి వాటిలో సువాసనలను వెదజల్లే నూనెను పోసి వెలిగించగా ఆ నూనెలోని సువాసనవంతంతో ఆ ప్రాంతమంతా పరిమళవంతంగా అయ్యిందట.ఆ భవనంలోంచి బయటకు వచ్చిన నారదుడు ఆ భవనం మొత్తం తిరగ సాగగా అక్కడి రోడ్లన్నీ చక్కటి నిర్మాణశైలితో,ఎక్కడా వాహనాలకు ఆటంకం కలగకుండా వుండేవిధంగా కూడళ్ళను నిర్మించారట.

pc:Rohit Gupta

12. ద్వారక

12. ద్వారక

ఆ నగరం మొత్తం వివిధ భాగాలుగా విభజించి ఒక భాగంలో రాజప్రాసాదాలు, మరో భాగంలో ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు, వేరొకభాగంలో నగరవాసులు నివసించటానికి భవంతులు, మరొక భాగంలో పాఠశాలలు, ఇంకొక భాగంలో వ్యాపారసముదాయాలు, యాత్రికులకు బసఏర్పాట్లు, మరో భాగంలో ఆలయాలు ఇలా పక్కాప్రణాళికతో కట్టారట.

pc:MADHURANTHAKAN JAGADEESAN

13. ద్వారక

13. ద్వారక

ద్వారకా భారతదేశంలో ఉన్న ప్రాచీన 7 నగరాల్లో ఒకటి. ఇది అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది. ఈ నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు. ఆయన హయాంలో ఈ రాజ్యం సిరిసంపదలతో, అష్టైశ్వర్యాలతో తలతూగింది.

14. ద్వారక

14. ద్వారక

శ్రీకృష్ణుని మరణానంతరం తరువాత ఒక పెద్ద వరద ముంచెత్తడంతో ఈ రాజ్యం పూర్తిగా తుడుచి పెట్టుకపోయింది. అయినా అరేబియా సముద్రంలో అడుగు భాగంలో అలనాటి రాజ్య కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయని భక్తుల నమ్మకం.

15. ద్వారక

15. ద్వారక

ద్వారకా లో చూడదగ్గవి

బెయ్ట్ ద్వారకా, ద్వారకాదీష్ ఆలయం, ఘుమ్లి, గోపి తలవ్, హనుమాన్ ఆలయం, గోమతి ఘాట్ ఆలయాలు, రుక్మిణీదేవి ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం, శ్రీకృష్ణ ఆలయం, భలక తీర్థ మరియు దేహోత్సార్గ్ మరియు గొప్నాథ్ మహదేవ్ ఆలయాలు మొదలగునవి.

ద్వారకా ఎలా చేరుకోవాలి ?

ద్వారకా ఎలా చేరుకోవాలి ?

ద్వారకా చేరుకోవటానికి రోడ్డు, రైలు మరియు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

17. వాయు మార్గం

17. వాయు మార్గం

ద్వారకాకి 127 కి. మీ. దూరంలో ఉన్న జామ్నగర్ దేశీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. అక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లలో ప్రయాణించి ద్వారకా కి చేరుకోవచ్చు.

18. రైలు మార్గం

18. రైలు మార్గం

ద్వారకా లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది అహ్మదాబాద్ - ఓఖా రైలు మార్గం లో కలదు. ఈ రైల్వే స్టేషన్ నుండి ముంబై, గాంధీనగర్, పూణే, నాగ్‌పూర్ వంటి నగరాలకు, దేశంలోని ఇతర ముఖ్య పట్టణాలకు ప్రయాణించవచ్చు.

19. రోడ్డు మార్గం

19. రోడ్డు మార్గం

ద్వారకా పట్టణానికి బస్సుల ద్వారా జామ్నగర్ మరియు అహ్మదాబాద్ నుండి సులభంగా హైవే రోడ్డు గుండా చేరుకోవచ్చు. గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సుల ద్వారా ఈ పవిత్ర నగరానికి రాష్ట్రం నలుమూలల నుండి చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X