Search
  • Follow NativePlanet
Share
» »బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

By Venkatakarunasri

శబరిమలై అయ్యప్పస్వామి దేవాలయం అత్యంత పవిత్రమైనది.ఇది దక్షిణభారతదేశంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ పుణ్యక్షేత్రానికి దేశం మూలమూలలనుండే కాకుండా విదేశాలనుంచి కూడా అనేకమంది భక్తులు తరలివస్తారు. ఈ క్షేత్రం కేరళ రాష్ట్రంలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. ఈ దేవాలయం కూడా అపార భక్తులను కలిగివున్న శ్రీమంతదేవాలయాలలో ఒకటి.ఇక్కడ ప్రతివర్షం సుమారు 45నుంచి 50మిలియన్ భక్తులు వస్తుంటారని ఒక అందాజుగా చెప్పవచ్చును.

ఈ దేవాలయంలో జరిగే విస్మయం జరిగేది సామాన్యంగా మనకంతా తెలియని సంగతిగా వుంది.అదేమంటే "మకర జ్యోతి". ఈ విస్మయాన్ని చూచుటకు దేశవిదేశాల నుంచి అనేకమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని పునీతులౌతుంటారు. ఈ మకరజ్యోతి గురించి విభిన్నమైన అభిప్రాయాలున్నాయి.ఒకరు ఇది విస్మయం అంటారు మరికొందరు ఇదంతా మోసం అని వాదిస్తున్నారు. దీనికి సమాధానంగా దేవాలయం కమిటీవారు ఇచ్చిన ఆ సమాధానం ఏమిటి అనే దానిని వ్యాసం మూలంగా తెలుసుకుందాం.

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

అయ్యప్పదేవాలయం ఒక తీర్థయాత్ర.స్వామి అయ్యప్పను 18కొండల మధ్యలో వెలసియున్నాడు. ఈ సుందరమైన దేవాలయం అందమైన కొండలు మరియు దట్టమైన అరణ్యాలతో కప్పబడివుంది. ఈ దేవాలయం చుట్టుపక్కల అద్భుతమైన ప్రాకృతిక సౌందర్యాన్ని కలిగివుంది.

PC: Saisumanth532

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

శబరిమలై దేవాలయం అత్యంత పురాతనమైన దేవాలయం, 12 శతాబ్దం పంఢలం అనే రాజవంశం యొక్క రాజకుమారుడైన మణికంఠుడిదేవాలయం.దీనిని సస్త మరియు ధర్మసస్త అని పిలుస్తారు. శబరిమలై గురించి అనేక విషయాలు మీకు తెలిసేవుంటాయి.

PC: ragesh ev

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

మహిషి అనే రాక్షసి తన సోదరుడైన మహిషాసురుడి చావుకు దేవతలే కారణమనుకుని అనుకొని, దేవతల మీద ద్వేషాన్ని పెంచుకుని ఘోరమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి ఫలితంగా బ్రహ్మదేవుడు అనేక వరాలు ప్రసాదిస్తాడు. తనకి మరణం అనేదే లేకుండా వరాన్ని పొందుతాడు.ఆ వరాన్ని పొందిన అనంతరం అహంకారం చేత దేవతలకు, ఋషిమునులను హింసిస్తుంటాడు. ఇందువలన భయపడిన దేవతలు హరిహరులను ప్రార్థిస్తారు.

PC: Ranjithsiji

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

ఇందుకు హరిహరులు సంగమించి ఒక బిడ్డకు జన్మనిస్తారు.ఆ బిడ్డను అడవిలో చూసిన ఒక రాజు తన స్వంతకొడుకు లాగా సాకి పెంచి పెద్దచేస్తాడు. తదనంతరం అతను పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో నెలకొంటాడు.

PC: Sailesh

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

1991లో కేరళ హైకోర్టు 10సంల కన్నా ఎక్కువ మరియు 50 సంల వయసు కన్నా తక్కువ వుండే మహిళలకు ప్రవేశాన్ని నిర్భంధించింది. భారతదేశం యొక్క సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పును పరిశీలనచేసి ఇప్పుడు మహిళలకు కూడా ప్రవేశాన్ని కల్పించాలని చర్యలు చేపట్టినది.

PC: Sailesh

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

ఈ దేవాలయపు మండలపూజ(నవంబర్ 15నుంచి 26డిసెంబర్)మకర సంక్రాంతి (14జనవరి)మరియు మహా విష్వాసంక్రాంతి (14ఏప్రెల్)లో తెరుస్తారు. అదే విధంగా మళయాళంనెలప్రారంభమైన మొదటి 5రోజులు పూజలకు తెరుస్తారు. మకరసంక్రాంతి ని కేరళలో మకర విలక్కు అని కూడా పిలుస్తారు.

PC: Abhilash Pattathil

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

దక్షిణభారతదేశంలో అనేక శాతాభ్దాల కాలంనాటి దేవాలయం ఇది.ఈ దేవాలయం ఇతిహాసం ప్రకారం శబరిమలైలో వున్న శాతాభ్దాల దేవాలయం, పరశురాముని చేత స్థాపించబడిన 5 వ శతాబ్దం నాటి దేవాలయాలలో ఒకటిగా చెప్పబడినది. ఇక్కడ అయ్యప్పస్వామి బాలకుని విషంలో దర్శనం ఇస్తాడు.

PC: Saisumanth532

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

శబరిమలై అనే పేరు విన్న తక్షణమే సాధారణంగా మనకు గుర్తుకువచ్చేది "మకర జ్యోతి". మకరసంక్రాంతి రోజున అయ్యప్పజ్యోతిని చూచుటకు లక్షలాదిభక్తులు వస్తారు.ఆ మకర జ్యోతిని అయ్యప్పస్వారూపం అని భక్తులు నమ్ముతారు.

PC: Sailesh

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

అయితే కొందరు మాత్రం మకరజ్యోతి మూఢనమ్మకం అని, భక్తులను మోసం చేయుటకు కొందరు చేస్తున్నారని చెప్పుకునే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అనే దానికి జవాబు ఇక్కడ వుంది.

PC: Challiyan

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

స్వామి నెలకొన్న మకర సంక్రాంతిరోజున అయ్యప్పస్వామి జ్యోతి రూపమున దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు. 1999లో మరియు 2010లో జరిగిన త్రొక్కిసలాటలో అనేక మంది మరణించటం మరియు గాయపడటం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత కొందరు మాత్రం తమ స్వార్థపూరిత దృష్టివల్ల సృష్టించిన మూఢనమ్మకం అని ద్రుఢంగా వాదిస్తున్నారు.

PC: Aruna

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

అందువలన కేరళ హైకోర్టు ఈ వివాదానికి సంబంధించిన దేవాలయం కమిటీకి విన్నవించుకున్నారు. కొన్ని వార్తాపత్రికలు టెంపుల్ కమిటీ ఇచ్చిన వివరణలు తీసుకున్నాయి. అదేమంటే దేవాలయం పూర్వదిక్కునవున్న ఒక కొండమీద గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు.

PC: Tonynirappathu

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

అయ్యప్పస్వామి మహిషిని చంపి, ఆ గిరిజనులను కాపాడినకారణంగా ఆ కొండమీద పెద్దదైన ఒక జ్యోతిని రాత్రి యందు వెలిగిస్తారు. ఆ జ్యోతిని చూసినవెంటనే పండలరాజవంశస్తులు అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలను ఇస్తారని చెప్తారు.

PC: Chitra sivakumar

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

ఇది అనేక వందలసంవత్సరాల నుండి వస్తున్నఆచారం అని చెప్తారు. ఈ విధంగా ఆ కార్యాన్ని దేవాలయకమిటీ మరియు ధర్మాధికారులు ఆ ఆచారాన్ని ఆచరిస్తూవస్తున్నారని దేవాలయంయొక్క ప్రధానమైన పూజారి చెప్పెను.

PC: Chitra sivakumar

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

దీనినే "అయ్యప్పస్వామి జ్యోతి" లేదా "మకర జ్యోతి" అని చెప్తారు.దీనిని ట్రావెన్కోడ్దేవాలయంవారు మరియు పంఢల రాజవంశస్తులు కూడా అంగీకారం తెలిపారు. ఆ విషయం పెడితే మకరజ్యోతి అనేది భక్తి-భావములతో కూడిన ఒక సంప్రదాయం.అటువంటి సంప్రదాయానికి ఏవిధంగా కూడా అడ్డు-ఆటంకాలు కలగకూడని రీతిలో కొనసాగించాలని ఆశిద్దాం.

PC: YOUTUBE

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

రైలుమార్గం

శబరిమల రైల్వే లైన్ చెంగన్నూర్ నుండి 82 కిలోమీటర్లు, కయాముకుళం జంక్షన్ నుండి 102 కిలోమీటర్లు, సస్తంకోట్టా నుండి 120 కిలోమీటర్లు మరియు కొల్లం జంక్షన్ నుండి 129 కిలోమీటర్లు రైల్వే మార్గం వుంది.

PC: Arian Zwegers

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

బట్టబయలైన శబరిమలై మకర జ్యోతి రహస్యం..

విమాన మార్గం

ఈ పుణ్యక్షేత్రానికి చేరుటకు సమీప విమానాశ్రయం తిరువనంతపురం అంతరాష్ట్రీయ విమానాశ్రయం. ఇక్కడినుండి 170కి.మీ దూరం వుంది.కొచ్చిన్ అంతర్రాష్ట్రీయ విమానాశ్రయం నుండి 160కిమీ దూరం వుంది.ఇక్కడి నుండి సులభంగా దేవాలయానికి వెళ్ళవచ్చును.

PC: AnjanaMenon

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X