Search
  • Follow NativePlanet
Share
» »కర్జాత్ ... ఒక పచ్చటి ప్రకృతి నిలయం !!

కర్జాత్ ... ఒక పచ్చటి ప్రకృతి నిలయం !!

జలపాతాల నుంచి నీటి ధారాలు దూకుతున్నాయి . పర్యాటకులు తాళ్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు... మెల్లగా ఒకరి తర్వాత ఒకరు ఆ నీటి ప్రవాహంలో నానుతూ కిందకు దిగుతున్నారు ... అహా !! మీకూ ఈ సాహసం చేయాలని ఉందా?? అయితే ప్రయాణానికి సిద్ధం కండి !!

మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో కర్జాత్ ఒక పట్టణం మరియు ఉప జిల్లా పర్వత ప్రాంతంగా ఉంటుంది. ఇది ఉల్లాస్ నదీ తీరంలో కొంకణ్ ప్రాంతంలో కలదు. కర్జాత్ లో పూర్తిగా పచ్చటి ప్రాంతాలు కనపడతాయి. అదే సమయంలో రాతి ప్రదేశంగా ఉండి వర్షాకాలంలో ఆకర్షణీయ అందాలతో ఎన్నో జలపాతాలు కూడా ఇక్కడ మీకు దర్శనమిస్తాయి.

సాహస పర్యటనకు ఒక కేంద్రం కర్జాత్ పట్టణం. నగర జీవితంతో విసుగెత్తిన వారికి, సాహస క్రీడలు ఆచరించాలనుకునేవారికి ఈ ప్రదేశం ఎంతో బాగా నచ్చుతుంది. కర్జాత్ ట్రెక్కింగ్ కు అనుకూల ప్రదేశం. సవాలుతో కూడిన ఎన్నో ట్రెక్కింగ్ ప్రదేశాలు కలవు. ట్రెక్కింగ్ ప్రియులకే కాదు ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో ఇష్టపడే ఈ ప్రదేశం గురించి కొన్ని మాటల్లో ...

ఫ్రీ కూపన్లు : ఇప్పుడు అన్ని గోఐబిబో కూపన్లను ఉచితంగా సాధించండి

కొండనా జలపాతం

కొండనా జలపాతం

వర్షా కాలంలో జలపాతాలు మహ జొరుమీదుంటాయి. ఆ అందాలనూ కళ్ళతో చూడటానికి అందరు వెళుతుంటారు. ఆ కోవలోకి వచ్చినదే ఈ " కొండనా జలపాతం" . ఇక్కడికి మాత్రం జలపాతం చూడటానికి రారు. సాహసం చేయడానికి వస్తారు. ఎంటా సాహసం అంటే ?? ఆ జలపాతం నుంచి కిందికి దూకుతున్న నీటి ధారాల నుంచి త్రాడు సహాయంతో కిందకు దిగడం. ఇది చెబుతుంటే ఒళ్ళు ఝల్లుమంటుంది కదు ! ఎం చేద్దాం ఈసారికి ఇట్లా కానిద్దాం!! ఈ జలపాతం సుమారుగా 110 అడుగుల ఎత్తు మీద నుండి కిందకు దుముకుతుంది. ఈ సాహస క్రీడను రాపెల్లింగ్ అంటారు. మనతో రాపెల్లింగ్ చేయించడానికి ఇక్కడ ప్రత్యేక నిపుణులు ఉంటారు. ముందుగా వారికి ధృఢమైన త్రాళ్లు బిగిస్తారు. కూర్చోవటానికి ఒక సీట్ కూడా ఉంటుంది. చేతులకి గ్లౌసులు తొడుక్కొని , జలపాతం ధారల్లో మెల్లగా తడుస్తూ మెల్లగా క్రిందకు జారిపోవాలి. ఇలా జారుకుంట చివరిదాకా వెళ్ళాలి. త్రాడు జారిపోకుండా ఇక్కడ కట్టు దిట్టమైన జాగ్రత్తలతో మీతో ఈ సాహసం చేపిస్తారు. దీంతో మీకు భయం పోతుందట. అక్కడికి వచ్చిన వారందరికీ ఇట్లానే పోయిందట. ఈ సాహసం కేవలం 12 సంవత్సరాల వయస్సు పై బడిన వారే చేయాలి అనే నిభందన ఉంది. ఇక్కడున్న ప్రకృతి అందాలనూ, అడవులను చూడటానికి, సాహసాలు చేయటానికి విదేశీయులు క్రమం తప్పకుండా వస్తుంటారు.

Photo Courtesy: karjat

కొండన గుహలు

కొండన గుహలు

కర్జాత్ లోని కొండన గుహలు చూడదగినవి. బౌద్ధమత జీవిత అవలంబనా విధానాలను అవి ప్రదర్శిస్తాయి. పురాతన ఈ కొండ గుహలు అనేక శిల్పాలను, స్తూపాలను, విహారాలను, చైత్యాలను కలిగి ఉంటాయి. ఈ గుహలు సుమారుగా 2వ శతాబ్దం నాటివిగా చెపుతారు. ఇక్కడి శిల్పాలు, స్తూపాలు బౌద్ధుల కాలంలో అవలంబించిన విధానాలను ప్రతిబింబిస్తాయి. కొండ గుహలలోని చెక్కడాలు స్త్రీ పురుషుల అనేక నాట్య భంగిమలను ప్రదర్శిస్తాయి. ఈ ప్రాంతంలోకి వచ్చే భక్తులకు ఆల్కహాలు సేవనం, పొగాకు సేవనం వంటివి పూర్తిగా నిషేధించబడ్డాయి.

Photo Courtesy: Rudolphfurtado

కొండేశ్వర్ దేవాలయం

కొండేశ్వర్ దేవాలయం

కొండేశ్వర్ దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం ఉంటుంది. ఈ దేవాలయ ప్రాంగణంలోనే మరి కొన్ని చిన్న దేవాలయాలు కూడా కలవు. ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచిన హేమందపతి శిల్ప శైలి లో నిర్మించారు. ఈ దేవాలయం చాలామంది భక్తులను, పర్యాటకులను ప్రత్యేకించి మహా శివరాత్రి వంటి సందర్భాలలో అధికంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రదేశం రాతి మయం కావటం చేత, కాలు జారే ప్రమాదాల కారణంగా వర్షాకాలంలో పర్యటనకు సూచించదగినది కాదు.

Photo Courtesy: karjat

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

కర్జాత్ ప్రాంతం అనేక ట్రెక్కింగ్ అవకాశాలతో ప్రసిద్ధి చెందింది. తేలికగా లేదా అధిక రిస్కుతో కూడా ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఎన్నో ప్రదేశాలు కలవు. కొండలపైకి ఎక్కుతున్న కొలది మనోహర దృశ్యాలు అనేకం కనపడుతూంటాయి. అన్ని మార్గాల ట్రెక్కింగ్ కంటే కూడా పేధ్, చందేరి ఫోర్ట్, మాధేరన్ లకు కర్జాత్ నుండి వెళ్ళే మార్గాలు ఆకర్షణీయంగా ఉంటాయి.

Photo Courtesy: patiljayesh1

పేధ్ కోట

పేధ్ కోట

పేధ్ కోటను కోట్లిగడ్ అని కూడా పిలుస్తారు. పేధ్ గ్రామం కర్జాత్ కు సమీపంలో ఉండి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. పేధ్ కొండలు వెనుక భాగంలో మాధేరన్ ప్రదేశ అందాలతో మరింత మనోహరంగా చూడబడతాయి. ఇక్కడనుండి కొంకణ్ గ్రామీణ ప్రాంత అందాలు చూడబడతాయి. కోటకు సమీపంలోనే పవిత్ర లార్డ్ భైరోబా విగ్రహం ఉంది. ఇక్కడి స్నానపు తొట్టెలు, గదులు అన్ని ఆకర్షణీయంగా కనపడతాయి.

Photo Courtesy: karjat

కర్జత్ ఎలా చేరుకోవాలి??

కర్జత్ ఎలా చేరుకోవాలి??

కర్జాత్ మహారాష్ట్రలో సందర్శించదగిన పర్యాటక ప్రదేశం. ఇక్కడి నుంచి విమానాలు రెగ్యులర్ గా నడవకపోయిన, దీనికి దగ్గరలో ఉన్న ఛత్రపతి శివాజీ విమానాశ్రయం నుంచి ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. కర్జాత్ కు దేశంలోని అన్ని నగరాల నుంచి రైళ్లు రాకపోకలు కొనసాగుతున్నాయి. అంతే కాకుండా ఖండాలా నుంచి రెగ్యులర్ గా బస్సులు నడుస్తాయి.

విమానా మార్గం

కర్జాత్ నుండి రెగ్యులర్ ఫ్లైట్స్ ఉండవు. కనుక దీనికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం ఛత్రపతి శివాజీ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం. కనుక ఇక్కడికి దేశీయ, అంతర్జాతీయ విమానాలు రెగ్యులర్ గా నడుస్తాయి. కర్జాత్ ఛత్రపతి శివాజీ ఏర్‌పోర్ట్ నుండి 47 కి. మీ. దూరంలో, పూణే లోని లొహెగన్ ఏర్‌పోర్ట్ నుంచి 71 కి. మీ. దూరంలో ఉంది

రైలు మార్గం

కర్జాత్ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసందానించబడినది. ఈ రైల్వే స్టేషన్ ఒక జంక్షన్ గా ఉండటం వల్ల రెగ్యులర్ రైళ్లతో ఎప్పుడు బిజీగా ఉంటుంది.

రోడ్డు మార్గం

కర్జాత్ కంటే కూడా మీకు ఖండాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక్కడి నుంచి కర్జాత్ 18 కి. మీ. దూరంలో, లోనవాలా 20 కి. మీ. దూరలో ఉంటుంది.

Photo Courtesy: India Property

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X