Search
  • Follow NativePlanet
Share
» »గుహలో దాగి వున్న కైలాసం - శివుని మహాద్బుతలింగం

గుహలో దాగి వున్న కైలాసం - శివుని మహాద్బుతలింగం

యానాలోని అసాధారణ కొండ ప్రాంతాలు యాత్రికులను, ప్రకృతి ప్రియులను, ట్రెక్కర్లను విశేషంగా ఆకర్షిస్తాయి.

By Venkatakarunasri

యానాలోని అసాధారణ కొండ ప్రాంతాలు యాత్రికులను, ప్రకృతి ప్రియులను, ట్రెక్కర్లను విశేషంగా ఆకర్షిస్తాయి. పడమటి కనుమలలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలోని ఈ ఈ చిన్న గ్రామంలో కల ఈ రాతి నిర్మాణాలు యానా కు ప్రధాన ఆకర్షణ. ఈ గ్రామం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. దగ్గరి పట్టణాలైన కుంటా 29 కి.మీ.ల దూరంగాను, సిర్శి 55 కిలో మీటర్ల దూరంలోను కలవు.

కర్ణాటక రాష్ట్రంలో వున్న ఒక అందమైన ప్రదేశం యానా కేవ్స్ గా పిలవబడే పర్వతాలు. ఈ పర్వతాలు వుండే ప్రాంతం మంచి టూరిస్ట్ స్పాట్ అని చాలా మందికి తెలుసుగానీ ఆ పర్వతాల వెనుక శివుని మహా అద్భుతం వుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. యానాలో 2 ఎత్తైన శిఖరాలు ప్రసిద్ధిచెందాయి.

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

భైరవేశ్వర శిఖరం మరొకటి మోహినీశిఖరం

భైరవేశ్వర శిఖరం

భైరవేశ్వర శిఖరం 400అడుగులఎత్తు వుంటుంది.ఈ కొండలోని గుహలో మహాశివుడు స్వయంభూలింగమై వెలిసాడని ప్రసిద్ధి.చుట్టూ దట్టమైన అడవిలో చిమ్మచీకటిలో ఈ గుహవున్నా, గుహలోని శివ లింగంపై మాత్రం ఎప్పుడూ వెలుగు ప్రసరిస్తూవుంటుంది. అది ఆకాశం నుండి శివుడు వచ్చిన మార్గమని చెప్తారు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

ఇక రెండవది మోహినీశిఖరం

2. మహాశివుడ్ని భస్మాసురుడి బారి నుండి రక్షించటానికి శ్రీ మహా విష్ణువు మోహినీ వేషంలో వచ్చి భస్మాసురుడ్ని అంతం చేసాడని పురాణాలు చెప్తున్నాయి.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

యానా గుహలనుండి ప్రవహించే చండీ నది మహాశివుడి ఝటాఝూటంనుండి ఉద్భవించిందని భక్తులు నమ్ముతారు.యానా కి సుమారు 25కి మీ ల దూరంలోనే సైంటిస్ట్ లు మరో అద్భుతాన్ని కనుగొన్నారు. అదే షల్మలా జీవనదిలోని సహస్రలింగాలు అంటే వెయ్యిలింగాలు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

ఇక్కడ ప్రతీ శివలింగం ఎదుట నందీశ్వరుని ప్రతిష్టించటం విశేషం.ఎప్పుడైతే నదీప్రవాహం తగ్గుతుందో అప్పుడు ఆ శివ లింగాలు అద్భుతంగా దర్శనమిస్తాయి. ప్రతి మహాశివరాత్రికి భక్తులు వేల సంఖ్యలో అక్కడికి వెళ్లి పూజలు చేస్తారు. చరిత్ర ప్రకారం 1670లో ఆనాడు ఉత్తరకన్నడను పాలించిన రాజు ప్రజల సుఖ సంతోషాల దృష్ట్యా సహస్రాలింగాలను ప్రతిష్టించాడని చెప్తూ వుంటారు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

ప్రదేశ ఇతిహాస చరిత్ర

పౌరాణిక ఇతిహాసాల మేరకు యానా ప్రనదేశానికి ప్రత్యేక గుర్తింపు కలదు. ఇక్కడి రాతి నిర్మాణాలకు సంబంధించి అనేక గాధలున్నాయి. వాటిలో ఒకటి శివుడు భస్మాసురుడనే ఒక రాక్షసరాజు తనను తరుమూతూ ఉంటే ఈ రాతి నిర్మాణాలలో ఒకటైన భైరవేశ్వర శిఖరంపై తలదాచుకున్నాడని చెపుతారు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

ప్రదేశ ఇతిహాస చరిత్ర

మరో రాతి నిర్మాణం అంటే జగన్మోహినిగా చెప్పబడేది శివుడిని రక్షించేందుకు మోహిని అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు అని భావిస్తారు. ఈ పురాణ గాధలే కాక, ఈ ప్రదేశంలో అంటే యానాలో మహా శివరాత్రి పండుగను అత్యంత వైభవంగాజరుపుతారు. పదిరోజులపాటు చేసే ఈ వేడుకలలో సాంప్రదాయ నృత్యాలు, సంగీత కచేరీలు, యక్షగానాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఒక గుహ దేవాలయం మరియు ఒక జలపాతం కూడా ఉన్నాయి.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

యానా గుహలు

యానా గ్రామంలో యానా గుహలు మరో ఆకర్షణ. ఈ 3 మీటర్ల లోతున్న గుహలు దట్టమైన సహ్యాద్రి పర్వ శ్రేణులలో ఉన్నాయి. పర్యాటకులు ఈ కొండలు ఎక్కి ఆనందించవచ్చు. యానా గుహలు నల్లని సున్నపు రాతితో ఏర్పడ్డాయి. ఈ గుహలలో గంగోద్భవ అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇది ప్రవేశం లోనే ఉంటుంది.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

యానా గుహలు

పురాతన దేవాలయం, రాతి నిర్మాణాలు, పర్వత శ్రేణులు, జలపాతాలతో ఈ ప్రదేశం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. మాత దుర్గాదేవి అవతారమైన చంద్రిక కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ పర్యాటకులు చూడవచ్చు. ఈ రాళ్ళగుండా ప్రవహించే నీరు చండిహోల్ అనే చిన్న నదిగా ఏర్పడి అది అఘనాశిని నదిలో ఉప్పినపట్టణం వద్ద కలుస్తుంది. ఇక్కడ బస చేయాలనుకునే వారికి అవసరమైన వస్తువులు సమకూరుస్తారు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

విభూతి జలపాతాలు

ఉత్తర కన్నడ జిల్లాలోని యానా గ్రామంలో విభూతి జలపాతాలు ప్రసిద్ధి గాంచినవి. ఈ ప్రాంత పర్యటనకు వచ్చినవారు వీటిని తప్పక చూస్తారు. ఈ జలపాతం 30 అడుగుల ఎత్తునుండి పారుతూ దట్టమైన అడవులు, వెదురు తొటలలో పారుతుంది. చుట్టూ అనేక రకాల పూవులు కూడా అందంగా కనపడతాయి. అక్కడకు సమీపంలో ఉన్న సున్నపురాయి కారణంగా దీనికి విభూతి జలపాతాలని పేరు వచ్చిందని స్ధానికులు చెపుతారు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

విభూతి జలపాతాలు

సున్నపు రాయి ప్రదేశం కాక, ఇక్కడే మరో రెండు అతి పెద్ద రాతి ప్రదేశాలు కూడా ఉన్నాయి. దీనికి చేరాలంటే కాలినడకన మాత్రమే వెళ్లాలి. ప్రధాన జలపాతం నుండి ఇది రెండు కి.మీ.ల దూరం ఉంటుంది. అయితే, పర్యాటకులు తరచుగా నడిచే అడవి బాట ఉంటుంది. అది ఒకవైపు వ్యవసాయ భూములు మరోవైపు అడవులు కలిగి ఉంటుంది.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

భైరవ క్షేత్ర

ఇక్కడగల భైరవేశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి. దీనినే గుహ దేవాలయం అని కూడా అంటారు. భైరవేశ్వరుడు అంటే శివభగవానుడి అవతారంగా చెపుతారు. ఇది భైరవేశ్వర శిఖరం క్రింద ఉంటుంది. ఇక్కడ స్వయంభూ లింగం మరియు ఒక కాంస్య చంద్రిక అంటే మాత దుర్గా దేవి అవతారం, విగ్రహం ఉంటాయి. ఇక్కడ ఉండే లింగాన్ని ‘గంగోద్భవం' అంటే గంగ నుండి పుట్టినది అని అంటారు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

భైరవ క్షేత్ర

రధోత్సవం మరియు మహా శివరాత్రి సందర్భాలలో దేశ వ్యాప్తంగా భక్తులు ఇక్కడకు వస్తారు. మహా శివరాత్రి 10 దినాలు జరుగుతుంది. షుమారు పది వేల మంది యాత్రికులు దర్శిస్తారు. వీరంతా పవిత్రమైన ఈ ప్రదేశాన్ని చెప్పులు లేకుండా కాలినడకన భైరవేశ్వర శిఖరాన్ని చేరుతారు. దేవాలయం బయటకు రాగానే వీరికి మోహిని శిఖరం చేరేటందుకు మెట్లు కనపడతాయి.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

యానా వాతావరణం

వర్షాకాలంలోనే కాక, సంవత్సరం పొడవునా ఈ ప్రాంతం సందర్శించవచ్చు. అయితే, జనవరి, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలలో ఈ ప్రాంత అందాలు వికసిస్తాయి కనుక, ఈ సమయంలో పర్యాటకులు బాగా ఆనందించవచ్చు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

వేసవి

వేసవి (ఫిబ్రవరి, ఏప్రిల్ మరియు నవంబర్) - వేసవి కాలంలో, యానా ఉష్ణోగ్రతలు 18 నుండి 32 డిగ్రీలుగా మారుతూంటాయి. ఫిబ్రవరి, ఏప్రిల్ మరియు నవంబర్ నెలలు అధిక వేడి కనుక పర్యాటకులు సందర్శనకు రారు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

వర్షాకాలం

వర్షాకాలం (సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి) - వర్షాకాలంలో వర్షపాతం అధికంగా ఉంటుంది. ట్రెక్కింగ్ వంటివి సాధ్యం కావు. కనుక ఈ ప్రదేశాలు సందర్శించటం సరి కాదు.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

చలికాలం

శీతాకాలం (అక్టోబర్) - సంవత్సరంలో ఈ నెల ఎంతో చల్లగా ఉంటుంది. యానాలో ఉష్ణోగ్రతలు 15 నుండి 26 డిగ్రీల మధ్య ఉండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయం యానా సందర్శనకు అనుకూలమైనది.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

సమీప ప్రదేశాలు యానా

సాహస క్రీడలు, నీటి క్రీడలు బాగా ఇష్టపడేవారికి హొన్నెమర్దు ప్రదేశం ఎంతో బాగుంటుంది. హొన్నె మర్దు గ్రామం ఎంతో చిన్నది. ఇది హొన్నెమర్దు రిజర్వాయర్ సమీపంలో ఏటవాలు కొండలపైగల ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం షిమోగా జిల్లాలో ఉంది. బెంగుళూరుకు షుమారుగా 379 కి.మీ.ల దూరం ఉంటుంది. ప్రదేశాన్ని గురించిన కొన్ని వాస్తవాలు హొన్నెమర్దు అనే పేరు హొన్నె చెట్టు నుండి వచ్చింది. అయితే, కాని దీనికి ప్రాంతాన్నిబట్టి ఖచ్చితమైన అర్ధం చెప్పాలంటే బంగారు సరస్సు అని చెప్పాలి. వాస్తవానికి ఈ ప్రదేశం షరావతి నది బ్యాక్ వాటర్స్ లేదా వెనుక నీటివైపుగా ఉంది. హొన్నెమర్దులో పెద్ద ఆకర్షణ అంటే ఈ ఊరు ఒక ద్వీపంవలే రిజర్వాయర్ మధ్యలో ఉంది. రాత్రి బసకు సౌకర్యాలు ఉంటాయి.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

సమీప ప్రదేశాలు యానా

తాజానీరు, స్విమ్మింగ్ పూల్ మరియు పెద్ద అటవీ ప్రదేశం అన్నీ ఇక్కడకు వచ్చే పర్యాటకులను ర్యాఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు ఆచరించేలా చేస్తాయి. అడవీ భాగాలలో కాలినడక ఎన్నో రకాల పక్షులను చూపుతుంది. జోగ్ ఫాల్స్ లేదా జోగ్ జలపాతాలు చూడకుండా హొన్నెమర్దు పర్యటన అసంపూర్తే. 829 అడుగుల ఈ జలపాతం షరావతి నదినుండి పడుతుంది. జోగ్ ఫాల్స్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబ్బే ఫాల్స్ కూడా తప్పక చూడదగినవి. హొన్నెమర్దు ప్రదేశానికి షిమోగా రైలు స్టేషన్ సమీపంగా ఉంటుంది. బెంగుళూరు నుండి కూడా చేరుకోవచ్చు. స్ధానిక రవాణా సదుపాయాలు అంటే, చిన్న నావలు, బస్సులు ఉంటాయి.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

బైందూర్ - వెచ్చని సూర్య రశ్మి, ఇసుక తిన్నెలు, సముద్రం

బైందూర్ పేరు చెపితే అన్నీ బీచ్ లు మరియు అందమైన సూర్యాస్తమయాలు అంటారు. ఈ విహార ప్రదేశం కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపురలో ఉంది. ఈ కుగ్రామం శ్రీ సోమేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి. ఈ దేవాలయం శివభగవానుడిది. సరిగ్గా సముద్రపు ఒడ్డున ఉంది. అద్భుతమైన శిల్పాలు, గుడిలో లింగం చూడదగిన అంశాలు. బైందూర్ లో చూసేవి ....చేసేవి ఏమిటి? అందమైన బీచ్ కల బైందూర్ గ్రామం అనేక ఇతిహాసాలతో సంబంధం కలిగి ఉంది. ఈ ప్రదేశానికి, ఈ గ్రామంలోని ఒట్టినెనె కొండ వద్ద ఘోర తపస్సు చేసిన రుషి బిందు పేరుతో బైందూర్ గా ఏర్పడింది.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

బైందూర్ - వెచ్చని సూర్య రశ్మి, ఇసుక తిన్నెలు, సముద్రం

ఒట్టినెనె కొండ ఎక్కి సముద్రం, బీచ్ మరియు సూర్యాస్తమయం వంటివి చూసి ఆనందించవచ్చు. బైందూర్ వద్ద మరో ప్రసిద్ధి గాంచిన యాత్రా స్ధలం కొల్లూరు శ్రీ మూకాంబిక దేవాలయం. మరావంతే మరియు మురుడేశ్వర పుణ్యక్షేత్రాలు కూడా సమీపంలో ఉంటాయి. మరావంతేలో ఒక బీచ్, మురుడేశ్వర దేవాలయానికి మూడువైపుల సముద్రం ఉంటాయి. బైందూర్ వాతావరణం, సాధారణంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. ఆగస్ట్ నుండి మార్చి వరకు పర్యటనకు అనుకూలం. బైందూర్ కు రైలు సౌకర్యం కలదు. బెంగుళూరు నుండి 480 కిలో మీటర్ల దూరం ఉంటుంది. బెంగుళూరు, మంగుళూరుల నుండి ఈ గ్రామానికి ప్రయివేటు బస్సులు కూడా నడుస్తాయి.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

మరావంతే - ఆహ్లాదకరమైన బీచ్!

మరావంతే ఒక చిన్న పట్టణం. దీనిలో ప్రధాన ఆకర్షణ దానికిగల అందమైన బీచ్. ఈ పట్టణం దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. పట్టణానికి కుడిభాగంలో అరేబియా సముద్రం ఎడమ భాగంలో సౌపర్ణిక నది ఉంటాయి. కుందాపుర వద్దనున్న ఈ బీచ్ ఉడుపి పట్టణానికి సుమారు 50 కి.మీ. దూరంలోను మరియు బెంగుళూరు నగరానికి 450 కి. మీ. దూరంలోను ఉంటుంది. ప్రశాంత జీవనం కోరేవారి స్వర్గంఈ బీచ్ ను తరచుగా వర్జిన్ బీచ్ లేదా కన్యత్వ బీచ్ అంటారు. దానికి కారణంఈ బీచ్ మైళ్ళ పొడవున ఏ మాత్రం పాడవకుండా తెల్లటి ఇసుకతో పరచబడి ఉంటుంది. పర్యాటకులు ఎంతో ఇష్టపడే ఈ బీచ్ కొల్లూరు మరియు కొడచాద్రి కొండలకు సమీపంలో ఉంది. ఇక్కడినుండి జాతీయ రహదారి షుమారు 100 మీటర్ల దూరం మాత్రమే.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

మరావంతే - ఆహ్లాదకరమైన బీచ్!

కనుక మీరు బీచ్ సందర్శించటం ఎంతో తేలిక. బీచ్ లో కల అంతు లేని ఇసుక ప్రదేశం, చల్లటి గాలినిచ్చే సముద్రం, తాటి చెట్లు వంటివి ఈ ప్రాంతంలో మీకు ఎంతో ప్రశాంతతనిచ్చి జీవితంలో మరువలేని మధుర అనుభూతులు పంచుతాయి. ఈ బీచ్ కు దక్షిణ భాగంలో ట్రాసి అనే ప్రదేశం మరోవైపునున్న సౌపర్ణిక నదికి ఆనుకుని పడుకొనే గ్రామం ఉంటుంది. మరావంతే పట్టణంలో కోస్తాతీర వాతావరణం ఉంటుంది. కొద్దిపాటి వేడి కొన్ని కాలాలలోను మరి కొన్ని కాలాలలో ఎంతో వేడిగాను ఉంటుంది. వేసవిలో చెమటలు అధికం.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

మరావంతే - ఆహ్లాదకరమైన బీచ్!

అయితే శీతాకాలం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే సెప్టెంబర్ నుండి మార్చి వరకు అనుకూలం. సముద్రంలో స్విమ్మింగ్ చేసి ఆనందించవచ్చు. ఈ ప్రాంతంలో తుళు మరియు కన్నడం భాషలు మాట్లాడతారు. ఈ పట్టణానికి విమాన, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలున్నాయి. సమీప విమానాశ్రయం మంగుళూరు మరియు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు. మంగుళూరు విమానాశ్రయం నుండి బస్సులలో లేదా టాక్సీలలో బీచ్ చేరవచ్చు. సమీప రైలు జంక్షన్ మంగుళూరు. ఈ బీచ్ కర్నాటకలోని ఇతర ప్రాంతాలతో బాగా కలుపబడింది. బస్సులు, ప్రయివేటు వాహనాలు తేలికగా లభ్యం అవుతాయి.

pc: youtube

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

యానా ఎలా చేరాలి?

బస్ ప్రయాణం

కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ అనేక బస్సులను సిర్సి, కుంటా పట్టణాలనుండి నడుపుతుంది. ప్రయివేటు వాహనాలు కూడా దొరుకుతాయి. ఇక్కడి నుండి పర్యాటకులు జీపులు, బస్సులు, ప్రయివేటు వాహనాలలో కూడా యానా చేరవచ్చు. బెంగుళూరు దీనికి 400 కి.మీ.ల దూరంలో ఉండి తరచుగా బస్ సౌకర్యం కలిగి ఉంది. ప్రయివేటు వాహనాలు కూడా తరచుగా లభ్యం అవుతాయి.

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

రైలు ప్రయాణం

యానాకు రైలు స్టేషన్ లేదు. కుంటా రైలు స్టేషన్ దీనికి దగ్గర. దీని దూరం 32 కి.మీ.లు ఉంటుంది. ఈ రైలు స్టేషన్ చుట్టుపట్ల సమీప ప్రాంతాలకు కలుపబడింది.

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

గుహ లో దాగిన కైలాసం - శివుని మహాద్బుతం

విమాన ప్రయాణం

యానాకు హుబ్లీ విమానాశ్రయం స్ధానిక విమానాశ్రయం. ఇది. 102 కి.మీ. ల దూరంలో కలదు. అయితే, 181 కి.మీ.ల దూరంలోగల గోవాలోని డబోలిం విమానాశ్రయంనుండి విదేశీయులు ఈ ప్రదేశానికి చేరవచ్చు. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడనుండి ఛార్టర్ విమానాలు లభ్యంగా ఉంటాయి.

దీనికి గోవా సమీప విమానాశ్రయం. ఇది సుమారుగా 181 కి.మీ.ల దూరంలో ఉంది. యానా కు హుబ్లీ రైలు స్టేషన్ సమీపం. కుంటా మరియు సిర్సిలనుండి రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు నడుస్తాయి.

<strong>చరిత్రలో ఊహించని సంఘటనలు : కౌరవుల పక్షాన యుద్ధం చేసిన పురాతన ఆంధ్ర ప్రజలు !</strong>చరిత్రలో ఊహించని సంఘటనలు : కౌరవుల పక్షాన యుద్ధం చేసిన పురాతన ఆంధ్ర ప్రజలు !

<strong>భీమ్ కుండ్ మిస్టరీ !</strong>భీమ్ కుండ్ మిస్టరీ !

<strong>మీరు పుట్టకముందు హైదరాబాద్ ఎలా ఉండేదో చూడండి !!</strong>మీరు పుట్టకముందు హైదరాబాద్ ఎలా ఉండేదో చూడండి !!

<strong>ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?</strong>ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు నిజాం నవాబ్ దాచిన నిధి హైదరాబాద్ లో ఎక్కడుంది ?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X