Search
  • Follow NativePlanet
Share

ఆలీఘర్ - విద్యా సంస్థల నిలయం !

22

ఆలీఘర్ పట్టణం ఉత్తర ప్రదేశ్ లోని ఆలీఘర్ జిల్లాలో అత్యధిక జనాభా కల ఒక పట్టణం. ఈపట్టణం ప్రధానంగా విద్యాభివృద్ధి సాధించి అనేక విద్యా సంస్థలు కలిగి వుంది. ప్రసిద్ధి చెందిన ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కూడా ఇక్కడ కలదు. అలీ ఘర్ చరిత్ర చాలా పెద్దది. ఇక్కడ బ్రిటిష్ వారికి , ఫ్రెంచ్ వారికి మధ్య అల్లి ఘుర్ యుద్ధం జరిగింది.

అలీ ఘర్ ను పూర్వం లో ఇక్కడి తెగల పేరుతో కోల్ అని పిలిచేవారు. అయితే, ఇంకా ఒక రుషి లేదా రాక్షసుడి పేరు వచ్చిందని కూడా కొన్ని కధనాలు కలవు. మొగలుల రాజు ఇబ్రహీం లోడి పాలనలో కోల్ గవర్నర్ ఉమర్ కుమారుడు మహమ్మద్ ఇక్కడ ఒక కోటను నిర్మించాడు. ఆ కోట నేటికి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఆ కోట ఆలీఘర్ కోటగా పిలువబడుతోంది. కాలానుగుణంగా ఈ ప్రాంతం అనేక మంది రాజుల పాలనలోకి వచ్చి, అనేక పేర్లతో పిలువబడి, చివరికి అలీ ఘర్ గా మారింది.

అలీ ఘర్ ప్రధానంగా ఒక విద్యా కేంద్రం అవటమే కాక ఉత్తర భారత దేశానికి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా కూడా వుంది. ఇది తాళాలు తయారు చేసే నగరంగా పేరు కెక్కింది. ఇత్తడి వస్తువులు కూడా ఇక్కడ బాగా తయారు చేస్తారు. ఈ వస్తువులను మీరు రైల్వే రోడ్ మార్కెట్ లేదా సెంటర్ పాయింట్ మార్కెట్ లలో కొనుగోలు చేయవచ్చు.

ఆలి ఘర్ చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు

అలీ ఘర్ కోట ప్రధాన ఆకర్షణ. అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీ దేశ వ్యాప్తంగా పేరు గాంచింది. ఈ నగరంలో ప్రసిద్ధి చెందిన సర్ సయ్యద్ అకాడమి మ్యూజియం, చాచా నెహ్రు జ్ఞాన్ పుష్ప్ మరియు హకీమ్ కరం హుస్సేన్ మ్యూజియం లు కూడా కలవు. జామా మసీద్ ఐలాండ్స్ , ఖేరేస్వర్ టెంపుల్ , జైనుల తీర్ధం మంగలయతాన్, వంటి ప్రార్ధన స్థలాలు కూడా కలవు. సూఫీ మత ప్రవక్తలు ఇక్కడ చివరగా నివసించారు. కనుక వారి ఆశ్రమాలు ఇక్కడ కలవు. వీటిని హిందువులు, ముస్లింలు కూడా గౌరవిస్తారు. భక్తుల కోరికలను బాబా బార్చి బహదూర్ దర్గా తీరుస్తుందని నమ్ముతూ అనేకులు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు. అలీ ఘర్ లో మౌలానా ఆజాద్ లైబ్రరీ కూడా కలదు. ఇది ఆసియా లోనే రెండవ పెద్ద లైబ్రరీ గా పేరు గాంచినది.

నగరానికి దూరంగా కల శేఖా సరస్సు స్థానికులకు ఒక పిక్ నిక్ స్పాట్ గా వుంటుంది. ఇక్కడ అనేక రకాల పక్షులు వస్తాయి. అలీ ఘర్ లోని సమీప నగ్లియా లో ఒక వన్య సంరక్షణాలయం కలదు. దీనిలో అనేక అరుదైన జంతువులు చూడవచ్చు. అలీ ఘర్ లో షాపింగ్ చేయటం ఒక విభిన్న అనుభూతి. తాళాల నుండి ఇత్తడి కళా వస్తువుల వరకూ కొనుగోలు చేయవచ్చు.

  

అలీఘర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అలీఘర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అలీఘర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అలీఘర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అలీ ఘర్ కు రాష్ట్ర, జాతీయ రహదారులు కలవు. జైపూర్, ఆగ్రా, మథుర, ఘజియాబాద్, న్యూ ఢిల్లీ, లక్నో , వారణాసి ల నుండి ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఆలీఘర్ ఢిల్లీ - కోల్కత్త మార్గం లో కలదు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రధాన ప్రాంతాలకు, ఇండియా లోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. అలీ ఘర్ రైల్వే జంక్షన్ లో న్యూ ఢిల్లీ, అగ్ర, కాన్పూర్, లుక్నో, బెనారస్, జైపూర్, కోల్కతా, ముంబై ల నుండి రైళ్ళు వచ్చి కలుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం అలీ ఘర్ కు న్యూ ఢిల్లీ విమానాశ్ర్యయం 147 కి. మీ.ల దూరంలో కలదు. ఇక్కడనుండి టాక్సీ లలో అలీ ఘర్ కు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jun,Tue
Check Out
10 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed