Search
  • Follow NativePlanet
Share
» »పహల్గాం..మన ఇండియాలోనే మినీ స్విట్జర్లాండ్ చుట్టొద్దామా!?

పహల్గాం..మన ఇండియాలోనే మినీ స్విట్జర్లాండ్ చుట్టొద్దామా!?

పహల్గాం ఒక పర్యాటక ప్రదేశం. పహల్గాం ప్రసిద్ది చెందిన టూరిస్ట్ డెస్టినేషన్ మరియు హిల్ స్టేషన్. పహల్గాం ప్రక్రుతి అందాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. అమర్‌నాథ్‌ యాత్ర మొదలయ్యేది ఇక్కడి నుండే.

ఎత్తైన పైన్‌ వృక్షాలు, ముట్టుకుంటే నరాలు జివ్వుమనే చన్నీటితో పరవళ్లు తొక్కుతున్న నదీ జలపాతాలు...ఆకుపచ్చని మైదానాలు...హిమాలయాల చెంతన కనిపించే ఈ సౌందర్య దృశ్యం ఇండియన్ స్టేట్ ఆఫ్ జమ్ము & కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా 'పహల్గాం'లో కనిపిస్తుంది. పహల్గాం ఒక పర్యాటక ప్రదేశం. పహల్గాం ప్రసిద్ది చెందిన టూరిస్ట్ డెస్టినేషన్ మరియు హిల్ స్టేషన్. పహల్గాం ప్రక్రుతి అందాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. అమర్‌నాథ్‌ యాత్ర మొదలయ్యేది ఇక్కడి నుండే. శివుడు తనను అడ్డుకున్న వినాయకుడి తలను ఖండించిన ప్రదేశం ఇదేనని ప్రతీతి.

ఇండియాలో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన ఈ పర్యాటక ప్రదేశం సంవత్సరంలో వేల సంఖ్య మందిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సంవత్సరంలో ఒకసారి ఇక్కడి నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. పహల్గాం నుండి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వారి నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది. పర్యాటకులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా పహల్గాం రాఫ్టింగ్‌, ట్రెక్కింగ్‌, ఫిషింగ్‌ తో సంతోషంగా ఉల్లాసంగా వెళ్ళి రావల్సిన ప్రదేశం. ఇక్కడి అందాలు చూడటానికి వారం రోజుల సమయం సరిపోదు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరున్న పహల్గాం చుట్టు చూడాల్సివనవి మరెన్నో చక్కని ప్రదేశాలు..పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలు చాలనే ఉన్నాయి. అవి...

బేతాబ్‌ వ్యాలీ:

బేతాబ్‌ వ్యాలీ:

బేతాబ్ వాలీ ఇక్కడ ఉండే సుందర దృశ్యాలకు పెట్టింది పేరు. పైన్‌ వృక్షాలు, మంచు పర్వతాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ అనేక హిందీ సినిమాల షూటింగ్ లు జరుగుతాయి. ఈ ప్రదేశం పహల్గాం నుండి 7కి.మీ దూరంలో ఉంటుంది. దీనినే శేశానాగ్ సరస్సు యొక్క నోటి భాగంగా పిలుస్తుంటారు. బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ మూవీ ‘బేతాబ్‌'ను ఇక్కడే చిత్రీకరించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి బేతాబ్‌ వ్యాలీ అని పేరు స్థిరపడింది. అంతకుముందు హగన్‌ వ్యాలీ పేరుతో పిలిచేవారు. పిర్‌ పంజల్‌, జన్‌స్కర్‌ అనే రెండు పర్వత శ్రేణుల మధ్య ఉండే బేతాబ్‌ వ్యాలీని ట్రెక్కింగ్‌కు బేస్‌గా భావిస్తుంటారు.

Photo Courtesy: Nandanupadhyay

 ఆరు వ్యాలీ

ఆరు వ్యాలీ

ఆరు వ్యాలీ పెహల్గాంకు సుమారు 11కి.మీల దూరంలో సముద్ర మట్టానికి 2408మీ.ల ఎత్తున ఉంది. ప్రకృతి ప్రేమికులు బాగా ఇష్టపడే ప్రదేశం ఇది. ఇక్కడి సుందరదృశ్యాలు మొత్తం కశ్మీర్‌కే ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. పొగమంచు ముద్డాడుతున్న పర్వతాలు, అతి పొడవైన పైన్‌ వృక్షాలతో వ్యాలీ ముగ్ద మనోహరంగా ఉంటుంది. కొల్హాయి గ్లేసియర్‌కు ఇది బేస్‌ క్యాంప్ గా ఉంటుంది. ఎక్కువ మంది పర్యాటకులు రాత్రుల్లో ఇక్కడ బస చేయడానికి ఇష్టపడతారు.హార్స్‌రైడింగ్‌, ట్రెక్కింగ్‌ ఎంజాయ్‌ చేయవచ్చు. సోనామార్గ్ కు మూడు రోజుల ట్రెక్కింగ్ లో చేరవచ్చు.

Photo Courtesy: Irfanaru

బైసరన్‌:

బైసరన్‌:

బైసరన్ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 2500మీ.ల ఎత్తున ఉంది. ఇది పహల్గాంకు 5కి.మీ ల దూరంలో ఉంది. ఇక్కడ అద్భుతమైన దృశ్యాలు, దట్టమైన వృక్షాలు, పచ్చని మైదానా ప్రాంతాలు ఎక్కువగా ఆకర్షించడం వల్ల ఈ ప్రాంతానికి మినీ స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా అని పేరు. బాలీవుడ్ డైరెక్టర్ యశ్‌చోప్రా సినిమాల్లో ఈ వ్యాలీ తప్పక ఉంటుంది. పహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వ్యాలీని తప్పక సందర్శించాలి. కొండలపై నుండి లిద్దర్ రివర్ వాలీ మరియు పహల్గాం వాలీలు చూడవచ్చు. టులియన్‌ లేక్‌ను సందర్శించాలనుకునే ట్రెక్కర్స్‌కి ఈ ప్రదేశం బేస్‌గా ఉపయోగపడుతుంది. ఫొటోగ్రఫీని ఇష్టపడేవారు తమ కెమెరాలకు ఇక్కడ పనిచెప్పొచ్చు. ఇక్కడ దొరికే టీ రుచిని రుచి చూడాల్సిందే.

Photo Courtesy : commons.wikimedia.org

చందన్‌వారి:

చందన్‌వారి:

చందన్ వారి ప్రదేశం పహల్గాంకు సుమారు 16కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కప్పబడిని శిఖరాలు, సుందర దృశ్యాలు పర్యాటకులకు విస్మయం కలిగిస్తాయి. హిందువుల యాత్ర స్థలం అమర్‌నాథ్‌యాత్రకు బయల్దేరే భక్తులు ఇక్కడి నుంచే తమ ప్రయాణం ప్రారంభిస్తారు. ఇది పిక్నిక్‌ స్పాట్‌గానూ పేరుపొందినది. అడ్వెంచర్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్‌ స్పాట్‌. మంచుతో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. స్థానికంగా ఉండే స్టాల్స్‌లో గమ్‌ బూట్స్‌ అద్దెకు దొరుకుతాయి. స్థానికులు స్లెడ్డింగ్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తుంటారు. రోడ్డు మార్గం నుంచి ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు.

Photo Courtesy: Dr. Partha S. Sahana

మామ్లేశ్వర్‌ టెంపుల్‌:

మామ్లేశ్వర్‌ టెంపుల్‌:

మమలేశ్వర్ టెంపుల్ వినాశనానికి హిందువుల దేవుడు, శివ, పవిత్రమైన స్థలాలలో ఇది ఒకటి. ఇది 12వ శతాబ్దం, జయసింహ రాజుల కాలంలోని కట్టడం. ఈ గుడి లిడ్దర్ నది ఒడ్డున, పహల్గాం నుండి 1 కి.మీ. దూరంలో ఉంది.ఇది పూర్తిగా రాతి కట్టడం. ఈ గుడిలో ఒక పీఠంతో పాటుగా శివ లింగం ఒక నీటి నీటి బుగ్గలో కవర్ చేయబడి ఉంటుంది. ఈ ఆలయం వెనుక పౌరాణిక గాథ ఒకటి ఉంది. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ వినాయకుణ్ణి ద్వారం దగ్గర కాపలా ఉంచుతుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుడిని లోపలకు వెళ్లకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. అప్పుడే శివుడు... వినాయకుడి తలను ఖండిస్తాడు. ఈ కథ తెలిసిందే కదా. ఆ సంఘటన జరిగింది ఇక్కడేనని చెబుతారు.

Photo Courtesy : commons.wikimedia.org

శేషనాగ్‌ లేక్ :

శేషనాగ్‌ లేక్ :

శేషనాగ లేక్ పహల్గాంకు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3658 అడుగుల ఎత్తున ఉంది. ఈ ప్రదేశం ఏడు శిఖరాలచే చుట్టు ముట్టు ఉంటుంది. కశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశం ఇది. కిలోమీటరు పొడవు, ఏడు వందల మీటర్ల వెడల్పుతో ఉండే ఈ లేక్‌లోని స్వచ్ఛమైన నీటిలో చుట్టుపక్కల ప్రదేశం ప్రతిబింబిస్తుంది. ఈ దృశ్యం అత్యంత మనోహరంగా ఉంటుంది. చలికాలంలో ఈ ప్రదేశం మొత్తం మంచుతో గడ్డకట్టుకుపోతుంది. హిందూ పురాణాలలో ఏడు తలల పాము పేరుపై దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ సరస్సును దేవుడే నిర్మించాడని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు.

Photo Courtesy: Akhilesh Dasgupta

కొల్హాయి గ్లేసియర్‌:

కొల్హాయి గ్లేసియర్‌:

కొల్హాయి గ్లేసియర్ ను హ్యాంగింగ్ గ్లేసియర్ అని కూడా పిలుస్తారు. ఇది లిద్దేర్ వ్యాలీలో ఉంది. కశ్మీర్‌లో చూడాల్సిన మరో అందమైన ప్రదేశం ఇది. అరు వ్యాలీ నుంచి ప్రారంభించి, లిడ్డర్‌ వ్యాలీని ట్రెక్కింగ్‌ చూస్తూ కొల్హాయి గ్లేసియర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. 4700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గ్లేసియర్ ను పర్యాటకులు కుడివైపు నుండి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈవైపున మంచు గడ్డలు విరిగిపడటం తక్కువ ఉంటుంది. లిడ్డర్‌ రివర్‌ దగ్గర బేస్‌క్యాంప్‌ ఉంటుంది. రాత్రి అక్కడ బస చేసి ఉదయాన్నే కొల్హాయి గ్లేసియర్‌ ను ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ట్రెక్కింగ్ అనుభవం లేని వారు ఈ ప్రదేశానికి వెళ్ళకపోవడమే మంచిది.

Photo Courtesy : Irfanaru

తులియన్ లేక్:

తులియన్ లేక్:

పర్వతాలలో పులకరింపు మరియు త్రిల్లింగ్ అడ్వెంచర్స్ కోరుకునే వారికి పహల్గాంకు సమీపంలో చూడాల్సిన ప్రదేశాలలో ఇది ఒకటి.ఇది సముద్ర మట్టానికి 12000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ హిమాలయ సరస్సు చేరుకోవాలంటే మొదట పోనీ రైడ్ తీసుకుని తర్వాత కొన్ని గంటలు పాటు అతి కష్టం మీద ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. పైన్ అడువులతో గడ్డిమైదానాలు, ఆకర్షణీయమైన ఆల్పైన్ సరస్సు మూడు వైపులా గంభీరమైన పిర్ పంజాల్ మరియు జాంస్కర్ పర్వత శ్రేణుల మధ్య అద్భుతమైన ద్రుశ్యం అమరి ఉంది. ఈ సరస్సు సంవత్సరం పొడవునా ఘనీభవించి ఉండటం ఒక విశేషం.

PC:wikimedia.org

అవంతిపుర్ టెంపుల్:

అవంతిపుర్ టెంపుల్:

శ్రీనగర్ -పహల్గాం రహదారిపై (పహల్గాంకు సుమారు 57కిలోమీటర్ల ముందు)ఉంది, ఇది అతి పురాతన శిధిలాలు కలిగిన ఆలయం, చారిత్రాత్మక మరియు నిర్మాణాత్మకపరంగా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. 855-883AD మధ్య కాలంలో అవన్తివార్మాన్ నిర్మించిన ఈ మనోహరమైన ఆలయంలో ఇప్పటికి మత భక్తులు మరియు చరిత్రకారులు యొక్క ఆనవాల్లో ఇప్పుటికీ అలాగే ఉన్నాయి. ఆలయ నిర్మాణం శిల్పకళకు అద్దం పట్టేలా స్వర్ణ స్థంబాలపై దేవతల ప్రతిమలు , శిల్పకళ మంత్రముగ్దులు అవ్వాల్సిందే. ఈ అవంతీశ్వర ఆలయంను శివుడు మరియు విష్ణువుకు అంకితం చేయబడినది. ఫోటోగ్రఫీకీ ఇది పర్ఫెక్ట్ స్పాట్.

Photo Courtesy : Priyank jain

లిడెర్ అమ్యూజ్మెంట్ పార్క్:

లిడెర్ అమ్యూజ్మెంట్ పార్క్:

పహల్గాంలో పిల్లలతో పాటు తప్పనిసరిగా ప్రధానంగా సందర్శించవల్సిన ప్రదేశం లిడెర్ అమ్యూజ్మెంట్ పార్క్. ఇక్కడ తెడ్డు పడవలు, ఇక చిన్న రైల్వే, బుట్టింగ్ కార్లు మరియు ఇతర ఆహ్లాదకరమైన రైట్స్ మరియు స్వింగ్లు మంచు శిఖరాలు మరియు చల్లని లోయ, పిల్లగాలి దృశ్యాలతో పిల్లలకు ఒక స్వర్గందామం, పిల్లలే కాదు, పెద్దలు, కుటుంబం మొత్తం కూడా విరామ సమయంలో ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.

పహల్గాం సందర్శనకు మార్చి నుంచి నవంబర్‌ మధ్య కాలం అనుకూలం.

PC:www.jandknow.com

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం : శ్రీనగర్‌, జమ్ము నుంచి బస్సు సర్వీసులుంటాయి. అనంతనాగ్‌ నుంచి రెగ్యులర్‌ బస్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు బస్సులు కూడా నడుస్తుంటాయి.

రైలు మార్గం : పహల్గాంకు సమీపంలో రైల్వేస్టేషన్‌ లేదు. 157 కి.మీ దూరంలో జమ్ముతావీ రైల్వేస్టేషన్‌ ఉంది. ఇక్కడికి ప్రధాన నగరాల నుంచి రైలు సదుపాయం ఉంది. రైలులో ఇక్కడికి చేరుకుంటే ప్రైవేటు వాహనంలో శ్రీనగర్‌ మీదుగా పహల్గాం చేరుకోవచ్చు.

విమాన మార్గం : పహల్గాంకు 95 కి.మీ దూరంలో శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు ఉంటుంది. ఇక్కడికి న్యూఢిల్లీ, జమ్ము, లెహ్‌, ముంబై, చండీఘర్‌ నుంచి విమాన సర్వీసులున్నాయి. విమానంలో శ్రీనగర్‌ చేరుకుంటే పహల్గాం వెళ్లడానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X