• Follow NativePlanet
Share
» »ఇండియాలో స్వాతంత్ర పోరాటం జరిగిన ప్రదేశాలు !

ఇండియాలో స్వాతంత్ర పోరాటం జరిగిన ప్రదేశాలు !

ఇండియా కు గల చరిత్ర పరిశీలిస్తే, అనేక యుద్ధాలు, ఆక్రమణలు, పోరాటాలు చారిత్రకంగా, సంస్కృతి పరంగా చూస్తాము. విదేశీయులు మన దేశం మీదకు ఇన్ని దండయాత్రలు చేస్తున్నారంటే, అది మన భూమి గొప్పతనం. అంటే మన దేశ ప్రజలు విదేశీయులకు దోచుకునేందుకు అనుమతిని ఇచ్చారని భావించ రాదు. దురాక్రమనలతో దండెత్తి వచ్చిన పాలకులకు మన దేశ ప్రజలు అనేక మార్లు బుద్ధి చెప్పారు. వాటిలో బ్రిటిష్ పాలకులతో మనకు గల పోరాటం ఒకటి. బ్రిటిష్ వారిని మన భూమి నుండి తరిమి వేయటానికి ఇండియా కు అనేక సంవత్సరాలు పట్టింది. ఎన్నో బాధలు, అత్యాచారాలు బ్రిటిష్ పాలకుల చేతిలో భారతీయులు అనుభవించారు. కొన్ని ప్రదేశాల ప్రజలు బ్రిటిష్ పాలకులను తీవ్రంగా ప్రతిఘటించారు, వారితో పోరాడారు. మరి ఈ విధంగా భారత స్వాతంత్ర పోరాటాలు జరిగిన ప్రాంతాలు ఏవి అనేది చూడండి.

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

రెడ్ ఫోర్ట్

ఇండియా లో బ్రిటిష్ వారితో మొట్ట మొదటి పోరాటం 1857 సంవత్సరంలో సిపాయ్ ల తిరుగుబాటు తో మొదలైంది. ఈ తిరుగుబాటు ఢిల్లీ లోని ఎర్రకోట లేదా రెడ్ ఫోర్ట్ లో జరిగింది. ఇండియా కు ఈ రెడ్ ఫోర్ట్ గుండె కాయ వలే పని చేస్తోంది. నేటికీ ప్రతి స్వాతంత్ర లేదా రిపబ్లిక్ దినోత్సవానికి మన దేశపు ప్రధాన మంత్రి ఇక్కడ పతాకోత్సవం జరిపి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Photo Courtesy: michael clarke stuff

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

తిరునల్వేలి

తిరునల్వేలి వీరన్ ఆలాగు ముతూ వద్ద ఒక స్వాతంత్ర పోరాటం 1739 సంవత్సరంలో అంటే సిపాయిల తిరుగుబాటుకు ముందే జరిగింది. ముతూ కొనే అనే స్వాతంత్ర పోరాట యోధుడు తన కు గల మరొక ఏడు మంది యోధులతో కలసి బ్రిటిష్ సైన్యాలతో పోరాడి మరణించారు. ఈ సంఘటన తరువాత సుమారు వంద సంవత్సరాలకు సిపాయీ ల తిరుగుబాటు జరిగింది.

Photo Courtesy: Prakash

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

అమ్రిత్ సర్ , జిల్లియన్ వాలా బాగ్

1919 సంవత్సరంలో సరిగా వైశాఖి రోజున ఘోర మారణకాండ ఇక్కడ జరిగింది. బ్రిటిష్ పాలకులతో మన దేశ ప్రజల పోరాటంలో ఇక్కడ సుమారు 1,650 రౌండ్లు తుపాకులు పేల్చారని ఆ కాల్పులలో సుమారు 1000 మంది మరణించగా, 1,500 మంది గాయ పడ్డారని ఆనాటి బ్రిటిష్ ప్రధాని సర్ విన్ స్టన్ చర్చిల్ వెల్లడించారు. జిలియన్ వాలా బాగ్ లో జరిగిన హత్యా కాండ బ్రిటిష్ వారి ఆకృత్యాలను ప్రపంచానికి చాటింది.

Photo Courtesy: Sean Ellis

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

పోర్ట్ బ్లేర్

పోర్ట్ బ్లేర్ లోని సెల్యూలర్ జైలు లో భారతీయులపై జరిగిన హింసాత్మక సంఘటనలు ఎంతో బాధాకరమైనవి. స్వాతంత్రం పొందేందుకు ఈ జైలు లో పెట్టబడిన భారతీయులు బ్రిటిష్ వారితో ఎలా పోరాడారు అనేది ఒక్కసారి ఈ జైలు చూస్తె మీకు అర్ధం అయిపోతుంది.

Courtesy: Jomesh

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

సబర్మతి ఆశ్రం

మన దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ పాత్ర మరువలేనిది. ఆయన బ్రిటిష్ వారిని ఇండియా వదలి వెళ్ళే లాగునే కాక, భారతీయ సంస్కృతి తో ఎంత మందినో మార్పు చేసారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం నేటికి చరిత్ర లోని బ్రిటిష్ వారితో గల మన పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం గా నిలిచి వుంది.

Photo Courtesy: anurag agnihotri

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

మైసూరు

కర్నాటక రాష్ట్రంలోకి స్వాతంత్ర పోరాటం ఆలస్యంగా వచ్చింది. 1920 సంవత్సరం లో తగదూర్ రామచంద్ర రావు, రామస్వామి అయ్యంగార్ వంటివారు తమ మహారాజు బ్రిటిష్ వారికి ఒక బానిస అని వారికి తాము బానిసలుగా ఉన్నామని చెప్పేవారు. స్వాతంత్ర పోరాటంలో ప్రజా అవిధేయ ఉద్యమం, సైమన్ కమిషన్ కు వ్యతిరేక పిలుపుల వంటివి కర్నాటక రాష్ట్ర మైసూరు ప్రత్యేకతలు. కర్ణాటకలో ఇంకనూ చరిత్ర పుస్తకాలలోకి ఎక్కని వారు అనేక మంది యోధులు కలరు.

Photo Courtesy: Riju K

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

చౌరీ చౌరా

గాంధిజీ పిలుపు ఇచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో కొంత మంది యువకులు చౌరీ చౌరా ప్రదేశంలో కల ఒక పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు. ఈ సంఘటనకు గాంధిజీ వెంటనే స్పందించి తన ఉద్యమం అహింసా ధోరణి లో కొనసాగాలని తెలిపారు.

Photo Courtesy: Nagarjun Kandukuru

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

చంపారణ్

ప్రసిద్ధ ఇండిగో విప్లవం చంపారణ్ లో జరిగింది. సరిగ్గా ఈ సంఘటనలోని ఇండియా లోని గొప్ప నేత మహాత్మా గాంధి ఉద్యమ ప్రవేశం చేసాడు. అయితే, ఈ సంఘటన 1918 లో ఇండియాకు అనేకూలంగా చేయబడిన చంపారణ్ అగ్రరియా లా తో ముగిసింది.

Photo Courtesy: Rory MacLeod

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

దండి

ప్రసిద్ధి చెందిన ప్రజా నిరాకరణ ఉద్యమం 24 రోజుల తరవాత దండి లో 1930 ఏప్రిల్ 6 వ తేదీన ముగిసింది. ఈ సంఘటన భారతీయ చరిత్రనే మార్చి వేసింది. భారతీయులు దిగుమతి చేసుకునే వస్తువులను నిరాకరించారు. తమ స్వంత ఉప్పు ను తామే చేసికొనటం మొదలు పెట్టారు. ఈ సంఘటన గాంధిజీ ని ఒక అంతర్జాతీయ స్థాయి కి తీసుకు వచ్చింది.

Photo Courtesy: Sandip Bhattacharya

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వేదారణ్యం

సివిల్ డిశ్ ఒబీడియన్స్ ఉద్యమంలో భాగంగా సి. రాజగోపాలా చారి 1930 ఏప్రిల్, 28 తేదీ నాడు ఒక వంద మంది కాంగ్రెస్ నాయకులతో దండి ఉద్యమం వలెనె ఒక ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు.

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

బొంబాయి ఆగష్టు క్రాంతి మైదాన్

సుమారు 60,000 మంది భారతీయులను జైలు కు పంపిన ప్రసిద్ధ 'క్విట్ ఇండియా' ప్రకటన ముంబై లో కల ఆగష్టు క్రాంతి మైదాన్ లో జరిగింది.

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వందేమాతరం వినిపించిన ప్రదేశాలు !

వైకోమ్

హిందువులకు వ్యతిరేకంగా, అస్పృశ్యత కు వ్యతిరేక నిరసనగా జరిగిన ఈ ఉద్యమం కూడా ఇండియా స్వాతంత్ర పోరాటంలో ఒక భాగమే. ఈ వైకోమ్ సత్యాగ్రహ ను 1924 లో టి కే. మాధవన్ నిర్వహించారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి