Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు చుట్టూ అత్యంత ఆకర్షణీయంగా ఉన్న టూరిస్ట్ ప్లేసులు ఇవే...

బెంగళూరు చుట్టూ అత్యంత ఆకర్షణీయంగా ఉన్న టూరిస్ట్ ప్లేసులు ఇవే...

కర్ణాటక రాష్ట్ర రాజధాని, ఐటి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలవబడుతున్న బెంగళూరు, ఇండియాలోనే అత్యంత వేగవంతంగా అభివ్రుద్ది చెందుతున్న అతి పెద్ద నగరాల్లో రెండవదిగా ప్రసిద్ది చెందినది. గ్రీన్ సిటిగా పేరు పొందిన బెంగళూరులో ఐటి కంపెనీలు ఎక్కువగా ఉండటం వల్ల వారం మొత్తం 9 నుండి 6 వరకూ 5రోజుల పాటు పనిచేసే ఉద్యోగులు వారాంతంలో కాస్తంత విశ్రాంతి పొందడానికి బ్రేక్ కోరుకుంటారు.

వారాంతపు సెలవులైన శని, ఆది వారాల్లో సిటి ట్రాఫిక్ నుండి కాస్త భయటపడి విశ్రాంతి పొందాలనుకునే వారు చాలా మందే ఉంటారు. మరి అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే మీ స్నేహితులతో లేదా మీ ఫ్యామిలితో కలిసి బెంగళూరు చుట్టు ప్రక్కల ఉన్న ఈ క్రింది లిస్ట్ లో ఉన్న మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని చుట్టేసే ఎంజాయ్ చేసి రండి.

అంతరగంగే:

అంతరగంగే:

వారాంతంలో రాత్రి ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ మరియు కావింగ్ కోసం బెంగుళూరు సమీపంలో ఉన్న అంతరగంగే బెస్ట్ ప్లేస్. ఈ కొండ ప్రాంతం కోలార్ జిల్లాలో ఉంది, చుట్టూ బండరాళ్లు మరియు ట్రెక్కింగ్ కు సౌకర్యవంతంగా ఉండే చిన్న చిన్న గుట్టలపై నైట్ ట్రెక్కింగ్ అత్యంత ఉత్తేజాన్ని కలిగిస్తుంది.

సావన్ దుర్గ కొండలు:

సావన్ దుర్గ కొండలు:

భారత దేశంలో ఉన్న అతి పెద్ద మనోహరమైన కొండలలో సావన్ దుర్గ కొండలు ఒకటి, ఇది బెంగళూరుకు సుమారు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సావన్ దుర్గ కొండపై లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ది. సావన్ దుర్గ ప్రాంతంలో కల ఎత్తైన కొండలు, దేవాలయాలు మరియు ప్రకృతి దృశ్యాలు, ఈ ప్రదేశాన్ని తప్పక చూడదగిన ప్రదేశంగా చెబుతారు పర్యాటకులు మరియు సాహస యాత్రికులు. ఈ ప్రదేశంలో వైల్డ్ లైఫ్ అనిమల్స్ , పసుపు బుల్ బుల్, రాబందులు, సీతాకోక చిలుకలు వంటి వన్యప్రాణిలకు ప్రసిద్ది.

Savandurga Forest around the hill Photo Courtesy: L. Shyamal

ఆవల బెట్ట -హిల్ టాప్ ట్రెక్కింగ్

ఆవల బెట్ట -హిల్ టాప్ ట్రెక్కింగ్

బెంగళూరు చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలలో ఆవల బెట్టి బెస్ట్ డెస్టినేషన్ . ఇక్కడ హ్యాంగింగ్ రాక్ బెంగళూరు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

Photo Courtesy: Akshatha Vinayak

Most Read: హైదరాబాద్ లో ఉండి ఈ ఫేమస్ టెంపుల్ చూడకపోతే ఎలా..?

నంది హిల్స్ :

నంది హిల్స్ :

చిక్క మంగళూరు జిల్లో ఉన్న నంది హిల్స్ నగరానికి సుమారు 60కిలో మీటర్ల దూరంలో ఉంది. వేసవి విడుదులకు ఫేమస్ టూరిస్ట్ స్పాట్ గా ప్రసిద్ది చెందినది. అలాగే నందిహిల్స్ కు దగ్గరలో భోగ నందీశ్వర ఆలయం ఉన్నది. నందిహిల్స్ చూటానికి వెళ్ళే వారు భోగ నందీశ్వర ఆలయంను కూడా సందర్శించవచ్చు.

Photo Courtesy: Shyamal

శివగంగే -పర్వత శిఖరం:

శివగంగే -పర్వత శిఖరం:

బెంగళూరు సిటికి సుమారు 54కిలోమీటర్ల దూరంలో శివగంగే ఉంది ,బెంగళూరు వాసులకు వారాంతపు సెలవుకు ఇక్కడి రాక్ క్లైంబింగ్ ప్రసిద్ది చెందిన ప్రదేశం. ఈ ప్రదేశంలో కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి.

Photo Courtesy: Brunda Nagaraj

హెబ్బాల్ లేక్- అతి పెద్ద లేక్

హెబ్బాల్ లేక్- అతి పెద్ద లేక్

బెంగళూరు సిటికి ఉత్తర దిక్కులో ఉన్న హెబ్బాల్ లేక్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నది. బెంగళూరులో అత్యంత ప్రసిద్ది చెందిన సరస్సు. బెంగళూరు సిటిలో ఉన్న అతి పెద్ద సరస్సులలో ఒకటి ఇది. ఈ సరస్సు పక్షులకు ప్రసిద్ది చెందినది.

PC- Rishabh Mathur

Most Read: సంక్రాంతి సంబరాలు చూసొద్దాం పదండి..పదండి..

స్కందగిరి-కలవర దుర్గ

స్కందగిరి-కలవర దుర్గ

బెంగళూరు నుండి పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్ స్కందగిరి లేదా కలవర దుర్గ,

Photo Courtesy: kalyan kanuri

తలకాడు-డిజర్ట్ టౌన్

తలకాడు-డిజర్ట్ టౌన్

తలకాడు బెంగళూరు సిటికి సుమారు 133 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందువులకు ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఇక్కడ ఇసుకతో కట్టిన ఆలయాలు ప్రత్యేక ఆకర్షణలు. ఉద్యానవం మరియు వైన తయారీకి ప్రసిద్ది చెందిన ఈ ప్రదేశంక పర్యాటకానికి అనుకూలమైన ప్రదేశం

Photo Courtesy: Dineshkannambadi

మా కాళీ దుర్గు హిల్ ఫోర్ట్ :

మా కాళీ దుర్గు హిల్ ఫోర్ట్ :

పర్ఫెక్ట్ వీకెండ్ అడ్వెంచర్ డెస్టినేషన్ మాకాళీ దుర్గా ఆలయం. బెంగళూరు సిటికి దగ్గరలో ఉన్న గ్రానైట్ కొండ. ఈ మాకాళీ దుర్గ కొండ రాక్ ట్రెక్కింగ్ పర్యాటకులకు ఒక చక్కటి ప్రదేశం.

Photo Courtesy: Sakeeb Sabakka

Most Read: హనీమూన్ కు సరసమైన ప్రదేశం-ప్రకృతి సౌందర్యానికి సొంతం కేరళ

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్

ఇండియాలో ట్రోపికల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ కు అతి పెద్ద బొటానికల్ గ్లాస్ హౌస్ గార్డెన్ చాలా ఫేమస్. బెంగళూరు సిటి సెంటర్లో ఉన్న లాల్ బాగ్ గార్డెన్ ప్రధాన పర్యాటక ప్రదేశంగా ఆకర్షణీయంగా ఉంది.

బిగ్ బ్యానీయన్ ట్రీ

బిగ్ బ్యానీయన్ ట్రీ

కేతేహల్లి గ్రామంలో అతి పెద్ద మర్రిచెట్టు ప్రధాన చారిత్రక అట్రాక్షన్ గా ఉంది, పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్ బెంగళూరు నగరానికి 28కిలోమీటర్ల దూరంలో ఉంది.

Photo Courtesy: BostonMA

సమ్మర్ ప్యాలెస్- టిప్పు సుల్తాన్

సమ్మర్ ప్యాలెస్- టిప్పు సుల్తాన్

బెంగళూరు లో ఉన్న మేజర్ హిస్టారికల్ అట్రాక్షన్స్ లో టిప్పు సుల్తాన్ కోట మరియు ప్యాలెస్ ఒకటి. ఇది ఆల్బర్ట్ విక్టర్ రోడ్ లో ఉంది. ఈ సమ్మర్ ప్యాలెస్ ఇస్లామిక్ వాస్తుశిల్ప కళకు సరైన ఉదాహరణ. టేకుతో నిర్మింపబడిని పిల్లర్స్, ఆర్చ్ లు మరియు బాల్కనీలు ఈ సమ్మర్ ప్యాలెస్ కు ప్రధాణ ఆకర్షణ.

PC: Akshatha Vinayak

రామనగర- రామదేవర బెట్ట

రామనగర- రామదేవర బెట్ట

రామనగరను ఇప్పుడు రామదేవర బెట్టగా పిలవబడుతున్నది. బెంగళూరుకు నైరుతి దిశలో సుమారు 50కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశంలోనే అతిపురాతనమైన గ్రానైట్ కు మరియు మైసూర్ సిల్క్ కు ప్రసిద్ది. రామదేవర బెట్టకు దగ్గరలో సావర్ దుర్గా మరియు అరకేశ్వర ఆలయం సందర్శించవలసిన ప్రదేశాలు.

Photo Courtesy: L. Shyamal

Most Read: ఈ వింటర్ సీజన్లో బెంగళూరు సమీపంలో చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు

తొట్టికల్లు జలపాతం- అద్భుతమైన ఆకర్షణ

తొట్టికల్లు జలపాతం- అద్భుతమైన ఆకర్షణ

తొట్టికల్లు ఫాల్స్ ను టికె ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ట్రెక్కింగ్ మరియు పర్వతారోహణకు పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ది చెందినది

బన్నేరుగట్ట నేషనల్ పార్క్ -బయోలాజికల పార్క్

బన్నేరుగట్ట నేషనల్ పార్క్ -బయోలాజికల పార్క్

బన్నేరుగట్ట నేషనల్ పార్క్ ప్రసిద్ది చెందిన టూరిస్ట్ ప్రదేశం. ట్రెక్కింగ్ మరియు హైకింగ్ తో పాటు వన్యప్రాణి ఫోటోగ్రఫీకి ఉత్తమ ప్రదేశం. ఈ బయోలాజికల్ పార్క్ లో అక్వేరియం, సీతాకోక చిలుకల ఉద్యానవనం మరియు స్నేక్ హౌస్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X