Search
  • Follow NativePlanet
Share
» » డిసెంబర్ లో ఈ ప్రకృతి సౌందర్య ప్రదేశాలు చూడటం మీ అదృష్టమమే..

డిసెంబర్ లో ఈ ప్రకృతి సౌందర్య ప్రదేశాలు చూడటం మీ అదృష్టమమే..

ప్రస్తుతం వింటర్ సీజన్ . వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు క్రిస్మస్, న్యూ ఇయర్ హడావిడి మొదలవుతుంది. ఈ సీజన్ లో సెలవులు కూడా ఎక్కువే. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా డిసెంబర్ నెలలో దాదాపు 15 రోజుల నుండి నెలరోజుల పాటు సెలవులు ఉంటాయి. ఈ సెలవుల్లో చాలా మంది సొంత ఊర్లకు ప్రయాణాలు చేసి, బందువులు, స్నేహితులతో పండగలు సెలబ్రేట్ చేసుకుంటారు. వింటర్లో వీచే చల్లని వాతావరణం, పచ్చని పొలాలుపై మంచుపరదాలు, సంక్రాంతి ముగ్గులు, ఇవే అందరికీ గుర్తుకొస్తాచి మంచుపొరలను దాటుకుంటూ, పచ్చని చెట్ల మద్య భూమిపై పడే సూర్యకిరణాలు చూస్తేంటే ఆ అందానికి హద్దేముంటుంది.

ముఖ్యంగా గజగజ వణికిపోయేంత చలిలో మంచు పొరలతో కప్పేసిన ప్రక్రుతి వర్షంలా కురుస్తున్నమంచు, కాశ్మీర్ అందాలను తలదన్నే విధంగా ప్రకృతి అందాలను ఆరబోసే బోలెడన్ని ప్రాంతాలు మన ఆంధ్రరాష్టంలో కూడా ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్స్ మద్య టీవిగా నిల్చున్న పర్వతాల నడుమ మెలికలు తిరిగే రహదారులు, సెలయేళ్ళు, చేతికందే అంత దూరంలో నీలి మేఘాలు, సాగర తీరాలు, వెరసి ప్రకృతి ఒడిలో కనువిందు చేసే ప్రదేశాలు మన ఇండియాలో కూడా ఉన్నాయి.

ఈ ప్రదేశాలు చుట్టడానికి చాలా ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటాయి. హాలిడే డెస్టినేషన్ కు ఈ ప్రదేశాలలోని వాతావరణం డిసెంబర్ కు ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎలాంటి వర్రీస్ లేకుండా చాలా రిలాక్స్డ్ గా ట్రావెల్ చేయడానికి అద్భుతమైన వాతావరణం కలిగిన ఆ ప్రదేశాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. మురుడేశ్వర:

1. మురుడేశ్వర:

హిందుదేవుల్లో ముఖ్యులు పరమశివుడి విగ్రహం ఉన్న మురుడేశ్వర బ్యాక్ డ్రాప్ లో అరేబియన్ సముద్రం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ శివుని విగ్రహం కందుక గిర్ (చిన్న కొందడ మీద నిర్మితమైనది. ఈ శివుడి యొక్క విగ్రం ప్రపంచంలోనే 2వ అతి పెద్ద విగ్రహంగా వెలసినది. డిసెంబర్ లో ఈ ప్రదేశం సందర్శించడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Photo Courtesy: Lucky vivs

2.అథిరపల్లి ఫాల్స్:

2.అథిరపల్లి ఫాల్స్:

ఈ మద్య కాలంలో అథిరపల్లీ ఫ్యాల్ సినిమా షూటింగ్ లొకేషన్స్ కు బాగా ప్రసిద్ది చెందిన ప్రదేశం కేరళ. ఈఅథిరపల్లీ ఫాల్స్ యొక్క అందాలను చాలా సినిమాల్లో చూపించడం జరిగింది. దీన్నే నయాగరా ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. డిసెంబర్లో సందర్శించవల్సిన ప్రదేశాల్లో తప్పనిసరిగా అథిరపల్లీ ఫాల్స్ ను ఒకటి.

Photo Courtesy: PP Yoonus

3.యానం:

3.యానం:

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి మరియు యానం జిల్లాలోని పాండిచర్రీ బార్డర్ లో ఉంది. ఒక వైపున తీరప్రాంతం మరియు ఇంకక వైపున కొరింగ రివర్ డెల్టా ఉంది. యానంలో మీరు చూడగలిగినన్నీ ఆకర్షణీయ ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో ఈ ప్రదేశం సందర్శించడం చాలా ఆహ్లాదంగా, పీస్ గా ఉంటుంది.

Photo Courtesy: Eldrichr

4.లక్షద్వీప్:

4.లక్షద్వీప్:

భారతదేశంలో తప్పక సందర్శించవల్సిన ప్రదేశాలలో ఒక కేంద్రపాళిత ప్రాంతం. ఈ లక్షద్వీప్ చుట్టూ పగడపు దిబ్బలు, ద్వీప సమూహం ప్రత్యేక ఆకర్షణలు. స్కూబా డైవింగ్ కు అనుకూలమైన ప్రదేశం. ఈ ద్వీపం ఎకో సిస్టమ్, కోస్టల్ విలేజ్ ను అందంగా ఉంటాయి. ఈ ప్రదేశం సందర్శించడానికి డిసెంబర్ అనుకూలమైన సమయం.

Photo Courtesy: Manvendra Bhangui

5.ఊటీ:

5.ఊటీ:

పర్యాటకులచే ఎల్లప్పుడు కిటకిటలాడుతుండే పర్యాటక ప్రదేశం ఊటి. తమిళనాడులో ఉన్న ఈ ప్రదేశంను సంవత్సరం పొడవునా పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ హిల్ స్టేషన్ పై అద్భుతమైన ప్రకృతి అందాలు పర్యాటకులకు ఆకర్షణియంగా ఉంటుంది. చలికాలంలో ఈ ప్రదేశం పచ్చదనం, మంచుపొరల మద్య ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్థులను చేస్తుంది.

Photo Courtesy: Gpitta

6. వయనాడ్:

6. వయనాడ్:

వయనాడ్ అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి వయనాడు. చూపరుల అమాంతం ఆకర్షించే అందాలు వయనాడ్ సొంతం. వయనాడ్ అందాలను తిలకించడానికి సంవత్సరం పొడవును పర్యాటకులు సందర్శిస్తుంటారు.

Photo Courtesy: Vinayaraj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X