Search
  • Follow NativePlanet
Share
» »ఈ చోటీ కాశీలో సర్పాలు ఇళ్లలోకి ప్రవేశించవు

ఈ చోటీ కాశీలో సర్పాలు ఇళ్లలోకి ప్రవేశించవు

లఖింపూర్ కేరి గురించిన కథనం.

By Kishore

లఖింపూర్ కేరి ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ లఖింపూర్ కేరి ఈ భూ మండలం పై ద్వాపర యుగం నుంచి మనుగడలో ఉందని చెబుతారు. ఇందుకు సంబంధించిన ఎన్నో వస్తువులు ఇక్కడ లభించాయి. అంటే ఇది పురాణ ప్రాధాన్యత కలిగిన నగరం. అటు పై గుప్తులు, మౌర్యులు, మొఘలు చక్రవర్తుల ఏలుబడిలో కూడా లఖింపూర్ కేరి ఉంది. అంటే చారిత్రాత్మకంగా ప్రామూఖ్యం చెందినదని స్పష్టమవుతోంది. మరోవైపు ఆధ్వాత్మికంగా ఈ లఖింపూర్ కేరి ఎంతో ప్రాధాన్యత చెందినది. దీనిని చోటీ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక తాంత్రిక పూజలు నిర్వహించే అఘోరాలు కూడా ఈ ప్రాంతానికి నిత్యం వస్తుంటారు. లఖింపూర్ కేరి పర్యాటక ప్రియులను కూడా ఆకర్షిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి రెండు అభయారణ్యాల్లో ఎన్నో జాతుల పక్షులు, జంతువులు సంరక్షించబడుతున్నాయి. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ప్రాంతం ఈ వేసవిలో సందర్శనకు అనుకూలంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రళయం కూడా ఏమీ చేయలేని మహాలక్ష్మీ అమ్మవారి నగరంప్రళయం కూడా ఏమీ చేయలేని మహాలక్ష్మీ అమ్మవారి నగరం

1. అందుకే ఆ పేరు

1. అందుకే ఆ పేరు

Image Source:

లఖింపూర్ కు పూర్వం లక్ష్మీపూర్ అని పిలిచేవారు. ఖేర్ అనే పట్టణం లఖింపూర్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో తుమ్మ చెట్లు (ఖయిర్) అధికంగా ఉండటం వల్ల దీనికి ఖేర్ అనే పేరువచ్చినట్లు చెబుతారు.

2. ద్వాపర యుగానికి సంబంధించినది

2. ద్వాపర యుగానికి సంబంధించినది

Image Source:

మహాభారత కాలం అంటే ద్వాపర యుగం నుంచి కూడా ఈ లఖింపూర్ ఖేర్ మనుగడలో ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహాభారత ప్రస్తావన కనిపిస్తుంది.

3. రాతి గుర్రం

3. రాతి గుర్రం

Image Source:

లఖింపూర్ ఖేర్ కు సమీపంలోని ఖైరాబాద్ సమీపంలో రాతి గుర్రం ఒకటి లభించింది. మగధరాజు సముద్రగుప్తుడు నిర్వహించిన అశ్వమేధ యాగం గుర్తుగా దీనిని పేర్కొంటారు. ఈ రాతి గుర్రం ప్రస్తుతం లక్నో మ్యూజియంలో ఉంది.

4. బ్రహ్మ కుమార్తే తపస్సు చేసిన ప్రాంతం

4. బ్రహ్మ కుమార్తే తపస్సు చేసిన ప్రాంతం

Image Source:

ఇక ఇక్కడ దేవకాళి శివాలయం ఉంది. బ్రహ్మదేవుడి కుమార్తె అయిన దేవకాళి శివుడి గురించి చాలా ఏళ్లపాటు ఇక్కడే తపస్సు చేయడం వల్ల దీనికి దేవకాళి శివాలయం అని పేరు వచ్చింది.

5. సర్పయాగం చేసిన ప్రదేశం కాబట్టే

5. సర్పయాగం చేసిన ప్రదేశం కాబట్టే

Image Source:

అంతే కాకుండా పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం ఇదేనని ఇప్పటికీ నమ్ముతారు. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో సర్పాలు ఇళ్లల్లోకి ప్రవేశించవని స్థానికుల విశ్వాసం.

6. అరుదైన కప్ప దేవాలయం

6. అరుదైన కప్ప దేవాలయం

Image Source:

ఈ పట్టణానికి సమీపంలో అత్యంత అరుదాగా కనిపించే కప్ప గుడి ఉంది. లఖింపూర్ కు 12 కిలోమీటర్ల దూరంలో లల్హింపూర్...సీతాపూర్ మార్గంలో ఈ దేవాలయం ఉంది.

7. ముండక్ ను ఆచరించే అఘోరాలు

7. ముండక్ ను ఆచరించే అఘోరాలు

Image Source:

తాంత్రిక విద్యలో ఒకటైన ముండక్ ను ఆచరించే అఘోరాలు ఈ దేవాలయానికి ఎక్కువగా వస్తుంటారు. ఈ ఆలయాన్ని ఒయోల్ రాజు 1860....70 మధ్యలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది.

9. చోటి కాశీ అంటారు

9. చోటి కాశీ అంటారు

Image Source:

శివుడి ఆత్మలింగం ఈ పట్టణం సమీపంలో ఉండటం వల్ల దీనిని చోటి కాశి అని అంటారు. ఆ శివలింగం ఉన్న దేవాలయాన్ని గోలా గోకర్నాథ్ శివాలయం అని పేర్కొంటారు. దీని వెనుక పురాణ కథనం ఉంది.

10. ఆత్మలింగాన్ని ఇస్తాడు

10. ఆత్మలింగాన్ని ఇస్తాడు

Image Source:

రావణుడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు రావణుడికి తన ఆత్మలింగాన్ని ఇస్తాడు. అయితే శ్రీలంకను చేరే వరకూ ఈ శివలింగం భూమిని తాకకూడదని చెబుతారు. ఇందుకు విరుద్ధంగా జరిగితే తాను తిరిగి కైలాసాన్ని చేరుకొంటానని షరత్తు విధిస్తాడు.

11. శ్రీలంకకు బయలు దేరుతాడు

11. శ్రీలంకకు బయలు దేరుతాడు

Image Source:

షరత్తుకు ఒప్పుకొన్న రావణుడు ఆత్మలింగాన్ని తీసుకొని శ్రీలంకాకు బయలుదేరుతాడు. ఈ నేపథ్యంలో రావణుడు గోలాగోకర్నాథ్ కు చేరుకోగానే సంధ్యావందనం చేయాల్సి వస్తుంది.

12. బంగారు నాణ్యాలు ఇస్తాడు

12. బంగారు నాణ్యాలు ఇస్తాడు

Image Source:

దీంతో అక్కడ తనకు కనిపించిన గొల్లవాడిని పిలిచి కొన్ని బంగారు నాణ్యాలు ఇస్తాడు. తాను సంధ్యావందనం ముగించుకొని వచ్చేవరకూ ఈ శివలింగాన్ని తల పై పెట్టుకోవల్సిందిగా కోరుతాడు.

13. అలా వెళ్లగానే

13. అలా వెళ్లగానే

Image Source:

ఇందుకు అంగీకరించిన గొల్లవాడి రూపంలో ఉన్న గణేషుడు రావణుడు అలా వెళ్లగానే ఆత్మలింగాన్ని భూమి పై పెడుతాడు. దీంతో ఆ ఆత్మలింగం శాశ్వతంగా అక్కడే నిలిచిపోతుంది.

14. వేలి ముద్రలు

14. వేలి ముద్రలు

Image Source:

తిరిగి వచ్చిన రావణుడు శివలింగాన్ని పెకిలించాలని సర్వవిధాల ప్రయత్నించి విఫలమవుతాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో శివలింగం మీద బొటనవేలుతో నొక్కుతాడు. ఇప్పటికీ ఆ శివలింగం పై రావణుడి వేలిముద్రను మనం చూడవచ్చు.

15. రెండు అభయారణ్యలు

15. రెండు అభయారణ్యలు

Image Source:

లఖింపూర్ కేరి జిల్లాలోని రెండు అభయారణ్యాలు ఉన్నాయి. అందులో ఒకటి దుధ్వాటైగర్ అభయారణ్యం కాగా, మరొకటి కిషన్ పూర్ వన్యప్రాణి అభయారణ్యం.

16. 400 జాతుల పక్షులు

16. 400 జాతుల పక్షులు

Image Source:

ఈ రెండింటిలో అంతరించిపోతున్న ఎన్నో జంతు జాతులను సంరక్షించబడుతున్నాయి. దాదాపు 400 జాతుల పక్షులు ఈ రెండు అభయారణ్యాలలో మనం చూడవచ్చు. ఉదయం, సాయంత్రం సమయంలో సఫారీ కూడా అందుబాటులో ఉంది.

17. నసీరుద్దీన్ మెమోరియల్ హాల్

17. నసీరుద్దీన్ మెమోరియల్ హాల్

Image Source:

భారతదేశంలో స్వతంత్ర్య పోరాటం జరిగే సమయంలో ఇక్కడ ఉండే నసీరుద్దీన్ షాహ్, రాజనారాయణ్ లు అప్పట్లో ఈ ప్రాంత డిప్యూటీ కమిషనర్ సర్ రాబర్ట్ విలియం, డౌగ్లాస్ ను కాల్చి చంపాడు.

18. కళ్లకు కట్టినట్టు

18. కళ్లకు కట్టినట్టు

Image Source:

ఆయన పేరు పై ఒక భవనం నిర్మించారు. దీనినే నసీరుద్దీన్ మోమోరియల్ హాల్ అని అంటారు. దీనిలో అప్పటి స్వాతంత్ర్య సంగ్రామన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఎన్నో వస్తువులు ఇక్కడ మనం చూడవచ్చు.

19. పర్షియన్ శైలి భవనాలు

19. పర్షియన్ శైలి భవనాలు

Image Source:

లఖింపూర్ ఖేరీలో పర్షియన్ శైలి భవనాలు ఎన్నో ఉన్నాయి. అందులో శిల్ప సంపద కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఈ శిల్ప సంపదను చూడటానికి పర్యాటకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.

20 ఎలా వెళ్లాలి

20 ఎలా వెళ్లాలి

Image Source:

లఖింపూర్ కేరి ఎయిర్ పోర్టు దుద్వా నేషనల్ పార్క్ సమీపంలో ఉంది. ట్యాక్సీల ద్వారా లఖింపూర్ కేరికి గంట ప్రయాణం ద్వారా చేరుకోవచ్చు. అదే విధంగా లఖింపూర్ కేరికి దేశంలోని వివిధ పట్టణాల నుంచి రైలు, బస్సు సౌకర్యం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X