» »దక్షిణ మంత్రాలయంగా పిలవబడుతున్న పప్పారపట్టికి తీర్థయాత్ర

దక్షిణ మంత్రాలయంగా పిలవబడుతున్న పప్పారపట్టికి తీర్థయాత్ర

Posted By: Venkata Karunasri Nalluru

LATEST: ఈ గ్రామంలో ఒకే ప్రదేశంలో 54 దేవాలయాలా !

తమిళనాడు ధర్మపురి జిల్లాలోని ఒక చిన్న గ్రామం పప్పారపట్టి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయం "రాఘవేంద్ర స్వామి ఆలయం". దీనిని "దక్షిణ మంత్రాలయం" అని కూడా పిలుస్తారు.

చరిత్ర ప్రకారం 800 సంవత్సరాల క్రితం హొయసల రాజవంశంవారు పరిపాలించిన కాలంలో ఇది పాత మైసూర్ నగరంలో ఒక భాగంగా వుండేది. ఇది ధర్మపురి నుండి 10 కిలోమీటర్ల దూరంలో బెంగుళూర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తన భార్యలు శ్రీదేవి, భూదేవి సహితంగా వున్న వరదరాజ స్వామి ఆలయం హొయసల రాజవంశానికి చెందిన పాలకులలో ఒకరు నిర్మించారు.

A Pilgrimage To Papparapatti– Dakshina Mantralaya

పప్పారపట్టికి మా ప్రయాణం :

మేము హోసూర్ రోడ్ (ఎస్ హెచ్ 17) ద్వారా మా కారులో ఉదయం 6 గంటలకు బెంగుళూర్ నుండి మా ప్రయాణాన్ని ప్రారంభించాం.

మేము ఇంటి నుండి స్నాక్స్ మరియు దోసెలు ప్యాక్ చేసుకొని మా వెంట తీసుకువెళ్ళాం. కాబట్టి మేము బ్రేక్ ఫాస్ట్ కోసం ఏ ప్రదేశంలో ఆగలేదు.

మేము బ్రేక్ ఫాస్ట్ తీసుకోవటానికి ఒక చోట ఆగాం. అక్కడ చెట్ల కింద మా కారు పార్క్ చేయటానికి చూస్తుంటే అక్కడ నా చుట్టూ వున్న ఆ ప్రకృతి సౌందర్యం మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.

చల్లని గాలి మా ముఖాలను తాకుతోంది. అంతేకాకుండా పక్షుల కిలకిల రావాలు మాకు బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అనిపించింది. మేము ఇప్పుడు దేవాలయానికి కేవలం పది నిమిషాల దూరంలో ఉన్నాం. మేము చాలా సంతోషంతో వున్నాం.

ఇది కూడా చదవండి:

ధర్మపురిలో చూడవలసిన స్థలాలు

పప్పారపట్టికి వెళ్ళే రహదారులకు రెండు వైపులా మామిడి తోటలతో నిండి ఉన్నాయి. గ్రామం చాలా అందంగా వుంటుంది. మాకు పాత సినిమాలలో దృశ్యాలు గుర్తుకొచ్చాయి. కొన్ని సినిమాలు ఈ గ్రామంలో చిత్రీకరించారు. మేము పప్పారపట్టికి ఉదయం 8:30కు చేరుకున్నాం.

A Pilgrimage To Papparapatti– Dakshina Mantralaya

PC : Brunda Nagaraj

దేవాలయం గురించిన వివరాలు :

ఆలయ కాంప్లెక్స్ ఒక విశాల ప్రాంగణంలో విస్తరించింది. ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా వుంటుంది. ఇక్కడ హనుమాన్, లార్డ్ వేణు గోపాల స్వామి మరియు సెయింట్ మధ్వాచార్యుని విగ్రహాలు వున్నాయి. ఈ ఆలయంలో నీటి సౌకర్యం కోసం ఒక బావిని ఏర్పాటు చేశారు.

శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం 97 సంవత్సరాల క్రితం నాటిది అయితే వరదరాజ స్వామి ఆలయంనకు దీని కంటే వెయ్యి సంవత్సరాల కాలం నాటి చరిత్ర వుంది. ఇక్కడ బృందావనం ఉద్భవించిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక్కడ స్థానికుల సమాచారం ప్రకారం, పూర్వకాలంలో ఇక్కడ ఆలయ పూజారికి చాలా కాలం వరకు ఏ వారసుడు జన్మించలేదు. తర్వాత కొంతకాలానికి లేక లేక ఒక బిడ్డ జన్మించాడు. కానీ ఆ బిడ్డకి కాలేయ వ్యాధి వచ్చింది. తర్వాత ఆ కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం వెళ్లి రాఘవేంద్రస్వామిని దర్శించుకొని తమ బాధలు విన్నవించుకొనగానే ఆ బిడ్డకు వచ్చిన వ్యాధి పూర్తిగా నయం అయిపోయింది. ఇది జరిగిన తర్వాత ఒక రోజు పూజారికి నిద్రలో కల వచ్చింది. దాని ప్రకారం పప్పారపట్టిలో రాఘవేంద్రస్వామి ఆలయం నిర్మించారు.

ఇది కూడా చదవండి:

మంత్రాలయంలోని బృందావనం

A Pilgrimage To Papparapatti– Dakshina Mantralaya

ఈ కథ ప్రకారం ఆలయ పూజారి మంత్రాలయంలో ఒక బృందావనాన్ని నిర్మించారు. అయితే మాకు ఇంత గొప్ప బృందావనాన్ని తయారుచేసిన ఆ శిల్పిని చూడాలనుకున్నాం.

ఆ శిల్పి ఒక బృందావనాన్ని బెల్లారిలోని ఇంకొక మఠం కోసం సిద్ధం చేశాడు. అయితే అదే రోజు రాత్రి అతని కలలో ఒక ముసలివాడు అగుపించి అతని దగ్గర సిద్ధంగా వున్న బృందావనాన్ని ఎవరైతే బృందావనం నిర్మించాలని వెతుక్కుంటూ వచ్చిన ఆ పూజారికి అప్పచెప్పమని చెప్తాడు.

1996 సంవత్సరంలో నేను ఈ స్థలం దర్శించినప్పుడు సుష్మీంద్ర తీర్థ తన భక్తులకు మంత్రాలయం సరిగ్గా 40 సంవత్సరాల క్రితం పప్పారపట్టి వలే వుండేదని అందుకే ఈ ప్రదేశానికి "దక్షిణ మంత్రాలయం" అనే పేరు వాడుకలోకి వచ్చిందని చెప్తారు.

ఆలయ ప్రాంగణంలో భోజన వసతి లేదు. ఇది ఒక చిన్న గ్రామం కాబట్టి ఇక్కడ హోటల్స్ ఏవీ లేవు. మీరు మీ ఇంటి నుండి భోజనం తెచ్చుకోవచ్చును.

పప్పారపట్టి నుండి 38 కిమీ హోగెనక్కల్ ఫాల్స్ - అద్భుతమైన అట్రాక్షన్ :

A Pilgrimage To Papparapatti– Dakshina Mantralaya

PC : Sreejith.K

దేవుని సన్నిధిలో ఆలయం వద్ద ఒక రోజు ప్రశాంతంగా గడిపిన తరువాత ఆలయం నుండి 38 కిలోమీటర్ల దూరంలో హోగెనక్కల్ జలపాతాలు సందర్శకులని మంత్రముగ్ధులను చేస్తాయి.

తర్వాత మేము జలపాతం వద్ద సంభ్రమాన్ని కలిగించే కోరాకిల్ రైడ్ చేయాలని చాలా ఉత్సాహంగా వున్నాం.

జలపాతాల వద్ద ఈ అద్భుతమైన అనుభవం తర్వాత మేము సాయంకాలం స్పైసీ చర్మురి మరియు దోసకాయ ముక్కలను ఉత్సాహంగా ఆస్వాదించాం.

మేము పప్పారపట్టి నుండి సాయంత్రం 6 గం.లకు బయల్దేరి తిరిగి ఇంటికి చేరుకున్నాం. మాకు పప్పారపట్టి వంటి పవిత్ర స్థలాన్ని మళ్ళీ దర్శించుకోవాలని అనిపించింది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఈ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూసి రాఘవేంద్ర స్వామి దీవెనలు అందుకోవాలని కోరుకుంటున్నాం.

ఇది కూడా చదవండి :

దక్షిణ దిక్కున వున్న రాఘవేంద్ర స్వామి దేవాలయాలు