Search
  • Follow NativePlanet
Share
» »శివుడిని పెళ్ళిచేసుకోవడానికి పరితపించి, చివరికి కన్యగా మిగిలిపోయి, కన్యాకుమారిగా మారింది

శివుడిని పెళ్ళిచేసుకోవడానికి పరితపించి, చివరికి కన్యగా మిగిలిపోయి, కన్యాకుమారిగా మారింది

శివుడిని పెళ్ళిచేసుకోవడానికి పరితపించి, చివరికి కన్యగా మిగిలిపోయి, కన్యాకుమారిగా మారింది

ఆధ్యాత్మికతకు, చారిత్రక కట్టడాలకు మన ఇండియా ప్రసిద్ది. ఉత్తర భారత దేవంలో హిమాలయాలు మంచుతో మంత్రముగ్ధుల్ని చేస్తే దక్షిణాన కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రసిద్ది చెందిన జిల్లా కన్యాకుమారి. ఇక్కడ ఎంతో పవిత్రమైన దేవాలయాలు, సముద్రతీరం, ప్రసిద్ది చెందిన కట్టడాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కన్యాకుమారి బీచ్ , మహాసముద్రం, పడమర అరేబియా సముద్రాలను హద్దులుగా కలిగి ఉంది.

బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం... ఈ మూడింటి సౌందర్యాలను ఒకే చోట చూడాలంటే కన్యాకుమారి వెళ్ళాలి! అక్కడ సాయంసంధ్యలో సముద్రపు అందాలు పర్యాటకులకు మధురానుభూతులను అందిస్తాయి. ఉదయం సూర్యుడు బంగాళకాతం నుండి ఉదయించడం, సాయంత్రం అరేబియా సముద్రంలో అస్తమించటం చూడటం ఒక అద్భుతమైన ఆనందం. మరో విశేషం కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. దక్షిణభారత దేశంలోని పవిత్రమైన ఆలయాలలో కన్యాకుమారి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించాడని అంటారు. అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది. మరి ఈ ఆలయ విశిష్టత గురించి మరికొంత తెలుసుకుందాం..

కన్యాకుమారిలో ఉన్న ప్రధాన ఆలయం ఇది.

కన్యాకుమారిలో ఉన్న ప్రధాన ఆలయం ఇది.

కన్యాకుమారిలో ఉన్న ప్రధాన ఆలయం ఇది. పట్టణం పేరును సార్థకం చేస్తున్న ఆలయం ఇది. కన్యకు అంకితం చేసిన ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా, అందంగా అలంకరిస్తారు. కుమారి అమ్మన్ టెంపుల్ లేదా కన్యాకుమారి టెంపుల్ సముద్రపు ఒడ్డున కలదు. సముద్రతీరం ప్రకృతి శోభతో వుండే కన్యాకుమారి సముద్ర తీరంలో ఇసుక థోరియం ధాతువుతో కూడి వుండటం పరమేశ్వరుడి అద్భుత శక్తికి నిదర్శనమని అంటారు. ఈ ఆలయంలో కుమారిని దేవతగా కొలుస్తారు. ఈ దేవత పార్వతి అవతారం.

దేవాలయానికి సమీపంలోనే కొబ్బరి చెట్లతో, పిచ్చుక గూళ్లతో ఉన్న బీబ్‌

దేవాలయానికి సమీపంలోనే కొబ్బరి చెట్లతో, పిచ్చుక గూళ్లతో ఉన్న బీబ్‌

మూడు సముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతుందని, కన్యాకుమారి పార్వతీ మాతకు నివాస స్థలమని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించాలంటే పంచె కట్టుతోనే లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ప్యాంటు, షర్టుతో లోనికి వెళ్లేందుకు అనుమతించరు. ఇది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. దేవాలయానికి సమీపంలోనే కొబ్బరి చెట్లతో, పిచ్చుక గూళ్లతో ఉన్న బీబ్‌ పర్యాటకుల్ని, చూపరుల్ని కట్టిపడేస్తుంది.

ఈ ఆలయం అతి పురాతనమైనది.

ఈ ఆలయం అతి పురాతనమైనది.

ఈ టెంపుల్ ను పాండ్య రాజులు ఎనిమిదవ శతాబ్దం లో నిర్మించారు. కన్యాకుమారి టెంపుల్ లో నేటికి 18 వ శతాబ్దం నాటి ఒక పవిత్ర ప్రదేశం దేవత యొక్క పాద ముద్రలు చూడవచ్చు. ఈఆలయంలో అమ్మవారిని బాలదేవి, కన్యాదేవి, దేవి కుమారి మొదలగు పేర్లతో పిలుస్తారు.

 గర్భగుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కుపుడక దేదీప్యమానంగా

గర్భగుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కుపుడక దేదీప్యమానంగా

గర్భగుడిలోని అమ్మవారి వజ్రపు ముక్కుపుడక దేదీప్యమానంగా వెలుగుతుంది. ప్రతి రోజూ తెల్లవారి 5గంటల నుండి ఆలయ దర్శనం కలుగుతుంది. వైశాఖ మాసంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది పర్యాటకులు రోజూ వందల మంది సందర్శించడానికి కారణం ఈ ఆలయంలో నుండి సముద్రపు అలల ఘోష వినిపించడమే.

బాణాసురుడిని మహాశివుడు వదించే సమయంలో

బాణాసురుడిని మహాశివుడు వదించే సమయంలో

పురాణగాథ ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంను పరవార్ రాజులు పరిపాలించే వారు. బాణాసురుడిని మహాశివుడు వదించే సమయంలో ఒక కన్య శివుడిపై మనస్సు పడుతుంది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఆ కోరికను శివుడికి తెలిపగా, అందుకు శివుడు ఆ కన్యను వివాహమాడుటకు ఇష్టపడుతాడు. బాణుడు కన్య వలననే మరణిస్తాడని తెలుసుకున్న నారద మహర్షి, వారిద్దరి పెళ్ళికి అడ్డుపడ్డాడు. కానీ వివాహ ముహోర్తం కూడా నిర్ణయమై పోయింది. బ్రహ్మీ ముహూర్తంలో వివాహ లగ్నంను నిర్ణయిస్తారు.

వుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశ చెందింది. అన్నపానీయాలు వదిలేసింది.

వుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశ చెందింది. అన్నపానీయాలు వదిలేసింది.

కానీ ఈ వివాహన్ని ఎలాగైనా ఆపాలని నారదుడు నిర్ణయించి నారద మహర్షి కోడిపుంచు గొంతుతో ముందే కూస్తాడు. ముహూర్తం మించిపోయిందని భావించిన శివుడు పెళ్లికి చేసుకోవడానికి వెళ్ళకుండా ఆగిపోతాడు. శివుడు రాకపోవడంతో ఆ కన్య నిరాశ చెందింది. అన్నపానీయాలు వదిలేసింది. చేతికి వేసుకున్న పెళ్లి నాటి గాజులు పగలకొట్టుకున్నది. ఆ నాటి నుండి సన్యాసిగా, కన్యగా లాగే మిగిలిపోయింది. దాంతో ఈ ప్రదేశం కన్యాకుమారిగా ప్రసిద్ది చెందిందనీ ప్రతీతి.

ర్శించుకున్న తర్వాత పర్యాటకులు తప్పకుండా సమీపంలోని బీచ్ సందర్శించాలి

ర్శించుకున్న తర్వాత పర్యాటకులు తప్పకుండా సమీపంలోని బీచ్ సందర్శించాలి

బీచ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పర్యాటకులు తప్పకుండా సమీపంలోని బీచ్ సందర్శించాలి. దీన్ని సన్ రైజ్ పాయింట్ గా పిలుస్తారు. సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు కనులారా చూడటానికి ఇక్కడి బీచ్ లన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇండియాలో ఆకర్షనీయమైనవి సూర్యోదయ, సూర్యాస్తమ ప్రదేశాలు. కన్యాకుమారి అమ్మన్ ఆలయానికి పశ్చిమ వైపున గాంధీ మెమోరియల్ ఉంది. ఇక్కడ నుండి సూర్యాస్తమయం చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ప్రదేశంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం దర్శించుట కన్యాకుమారి స్థల విశేషం.

కన్యాకుమారికి ఎలా వెళ్లాలి

కన్యాకుమారికి ఎలా వెళ్లాలి

కన్యాకుమారి కి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

కన్యాకుమారి లో ఎటువంటి విమానాశ్రయం లేదు కానీ 93 కిలోమీటర్ల దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ వంటి ప్రవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని కన్యాకుమారి చేరుకోవచ్చు. రైలు మార్గం కన్యాకుమారి లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం చెన్నై, తిరువనంతపురం, మధురై, చెన్నై వంటి ప్రాంతాల నుండి కన్యాకుమారి కి చక్కటి రోడ్డు మార్గం కలదు. ఈ ప్రాంతాల నుండి నిత్యం ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు కన్యాకుమారి కి తిరుగుతుంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X