• Follow NativePlanet
Share
» »చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఆదిలాబాద్ పట్టణం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఒక పురపాలక పట్టణం. ఆదిలాబాద్ లో జిల్లా ప్రధాన కార్యాలయము ఉంది. ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ లో దక్షిణ భారత రాష్ట్ర భాగం. స్థానికుల కధనం ప్రకారం పట్టణానికి బీజాపూర్ పాలకుడు అయిన మొహమ్మద్ ఆదిల్ షా నుంచి ఆ పేరు వచ్చింది. ఆదిలాబాద్ మొఘల్ పాలన సమయంలోనే అత్యధిక ప్రాముఖ్యతను పొందింది. దక్షిణ డౌన్ తన సామ్రాజ్యం కార్యకలాపాలను చూసుకోవడానికి, డెక్కన్ వైస్రాయ్ అని పిలిచే అతని పరిపాలన నుండి ఒక అధికారిగా నియమించబడ్డాడు. ఔరంగజేబ్ పరిపాలన కింద, ఈ ప్రాంతం ప్రధాన ఆర్థిక మరియు వ్యాపార కేంద్రంగా మారింది. పట్టణంలో పొరుగు పట్టణాలు మరియు నగరాలతో మరియు ఢిల్లీ వంటి ప్రాంతాలలో సుగంధ ద్రవ్యాలు, వస్త్రం మరియు ఇతర ఉత్పత్తులను దిగుమతి మరియు ఎగుమతి నిర్వహించేవారు. అతను ఈ క్రమంలో భారతదేశం యొక్క చక్రవర్తిగా గుర్తింపు పొందాడు. దక్షిణ భారతదేశం లోని ఆదిలాబాద్ ప్రాంతాన్ని అతని నియంత్రణలో ఉంచుకున్నాడు.

చప్పట్లు కొడితే చల్లని నీళ్ళు వచ్చే ప్రాంతం ఎక్కడ వుంది?దాని రహస్యం ఏంటి?అక్కడ చుట్టూ దట్టమైన అరణ్యం. ఆ అరణ్యంలో వెళుతుంటే ఎత్తైన గుట్టలు,ఇంతటి సుందరప్రదేశంలో చప్పట్లుకొడితే చాలు.చల్లనినీళ్ళువచ్చే మంచుకొండలు.మరిఇంతటి విశేషమున్న ఈ ప్రాంతంఎక్కడుంది? దీనివెనకున్న పురాణకధ ఏంటి?అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలోని దండేపల్లి మండలంలో,పెద్దయ్యదేవుని గుట్ట,లక్సిద్ధిపేటమండలంలో వున్న చెన్నయ్య గుట్టలు వున్నాయి.ఈ చెన్నయ్య,పెద్దయ్య గుట్టలు గిరిజనులకు ఆరాధ్యదైవాలుగా నిలుస్తున్నాయి.ఇక్కడి ప్రజలకు ఎంతోఆహ్లాదాన్ని పంచటంతోపాటు,ఆధ్యాత్మికంగా భక్తులకోర్కెలు తీరుస్తోంది.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

పెద్దయ్య దేవుని గుట్ట దండేపల్లి మండలకేంద్రం నుంచి దాదాపు 10కిమీల దూరంలో వున్న దట్టమైనఅడవిలో వుంటుంది. గుట్ట చూట్టానికి ఒక నిటారుస్థంభంలాగా వుంటుంది.
ఎత్తు సుమారు 1000అడుగులు.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

గుట్ట చుట్టూ అంతే ఎత్తైన కొండల వరసలు వలయాకారంగా వుండటంతో అవన్నీ దాటుకుని వెళ్ళేవరకూ పెద్దయ్యగుట్ట మనకు కనిపించదు.ఇక పురాణానికి వస్తే కుంతీదేవి సంతానంకోసం శంకరుడివద్ద మొరపెట్టుకుంది.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

తనకు సంతానం ప్రసాదించమని ఆయన్ను వేడుకోవటంతో ఆయన ఆమెను పరీక్షించాలనుకుని కప్పలు, చేపలు ముట్టని నీళ్ళు, కుమ్మరి చేయని కుండలో,విత్తనాలు అవే రాలి,అవే మొలిచే సువాసనఒడ్లతో నాకు నైవేద్యంపెట్టాలని కోరాడు.దీంతో కుంతీదేవి తన ఛాతిపై మట్టికుండలు చేసి చేపలు,కప్పలు ముట్టని నీళ్ళకోసం తిరిగి అవి ఎక్కడాకనపడక పోవటంతో అలసిపోయిసొమ్మసిల్లిపోయింది.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఆమె సత్యనిష్ఠకు మెచ్చిన శంకరుడు ఆ కొండలపైనుండి నీళ్ళను కురిపించాడు.అప్పుడు ఆ నీటితో కుమ్మరిచేయని కుండలతో నైవేద్యం వండి శంకరుడికి పెడుతుంది ఆ తల్లి. అప్పుడు శంకరుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని అనుగ్రహిస్తాడు.వారే పాండవులు.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

అందులో ధర్మరాజు పెద్దవాడు ధర్మయ్యగా, భీముడు చిన్నయ్యగా ఇక్కడ వెలిసారని స్థానికులు చెబుతుంటారు. ఆనాటి నుంచి చిన్నయ్యదేవుని సమీపంలోవున్న కొండలని మంచుకొండలని పిలుస్తున్నారు. చిన్నయ్యదేవుని దగ్గర నుంచి 2కిమీ ల దూరంలో మంచుకొండలు వుంటాయి.ఆ కొండలవద్దకు వెళ్ళిన భక్తులు చప్పట్లుకొడుతూ అలజడిచేస్తే పైనుంచి నీళ్ళు పడతాయి.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఇవి చల్లగా ఎంతో తియ్యగా వుంటాయి.ఎంత ఎక్కువమంది చప్పట్లుకొడితే అంత ఎక్కువధారతో నీళ్ళోస్తుంటాయి. ఈ నీటిని తీసికెళ్ళి అందులో పసుపు, కుంకుమ కలిపి చల్లితే పంటలకు చీడపీడలు వుండదని స్థానికులు విశ్వాసం.అదే విధంగా చిన్నయ్య గుహలకు అత్యంత సమీపంలో మండువేసవిలో కూడా నిరంతర సహజనీటి బుగ్గ వుబికివస్తూంటుంది.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

భయంకర కరువు కాలంలో సైతం ఈ నీటిబుగ్గ ఎండిపోలేదని స్థానికగిరిజనులు చెబుతుంటారు. ఈ దేవుడు దగ్గరుండే అల్లుబండ కూడా ఎంతో ప్రాశస్త్యముంది.మనస్సులో కోరికలు కోరి ఈ అల్లుబండను ఎత్తితే అది తేలికగా వస్తే అనుకున్నది కాదని,అది కదలకుండా అలాగే వుండిపోతే పనిసులువుగా అయిపోతుందనిచెబుతుంటారు.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఇక్కడ మొలిచే ఒక తీగజాతికిచెందిన మొక్కతోతీసే మందు ఎంతటి తలనొప్పినైనా తీవ్రమైన పార్శ్వనొప్పినైనా,నివారిస్తుంది. ఆ తీగను గుర్తించటం స్థానికగోండులు,నాయక్ పుడ్,తెగకు చెందిన వారికిమాత్రమే తెలుసు.పెద్దయ్యదేవుని దగ్గరుండే పూజారి స్థానికులకు ఏధాన్యం పండించాలో చెబుతాడు.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఆయన చెప్పిన పంటనే ఇక్కడ ప్రజలు వేసుకుంటారు. మొదట పూజారి పెద్దయ్యదేవుడికి దండంపెట్టుకుని పూనకంతో నిట్టనిలువుగా వున్న పెద్దయ్యగుట్టను అవలీలగా ఎత్తుతాడు.దాదాపు 1000అడుగులున్న ఈ గుట్టను కేవలం 10నిలో ఎక్కుతాడు. అది కూడా మనకు రెండుమూడు చోట్లమాత్రమే మనకు కనిపిస్తాడు.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఇతరులు ఎవరూఈ గుట్టను ఎక్కలేరు. ఈ గుట్టపైనుండి పూజారి పసుపుకుంకుమలు సీజన్లోపండే పంటగొలుకులను తీసుకువస్తాడు.గుట్టదిగి దేవునిగుడికొచ్చాక రైతులకు ఆ సీజన్లో ఏ పంటవేస్తే లాభసాటిగా వుంటుందో చెప్తాడు.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

వర్షాలస్థితిగతులు, ఏ పంటలకు ఏ వ్యాధులు ఎక్కువగా సోకుతుందోకూడా జ్యోస్యం చెప్పి పొలాలపై చల్లుకోమని వారికి పసుపు,కుంకుమలను పంచిపెడతాడు. ఇంత ప్రాశస్త్యం ఎన్నో ప్రకృతిరమణీయతలకు నెలవైన చిన్నయ్య,పెద్దయ్య దేవునిగుట్టలు చూట్టానికి ప్రజలు చాలాఆసక్తితో వస్తూంటారు.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఉత్తమ సీజన్ఆదిలాబాద్ సందర్శించడానికి అనువైన సమయం అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ నెలల్లో సందర్శన మరియు ప్రయాణం చేయటం కూడా సులభం. అయితే, ప్రయాణీకులకు సాయంత్రం మరియు రాత్రి వేళలో చలిగా ఉంటుంది .అందువల్ల పర్యాటకులు ఉన్ని దుస్తులు వెంట తెచ్చుకోవాలి.

pc:youtube

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

ఆదిలాబాద్ కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. హైదరాబాద్ నుండి వచ్చే బస్సులకు డీలక్స్ లేదా ఎయిర్ కండిషన్డ్ కూడా ఉంటుంది.

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

రైలు మార్గం

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కు నాందేడ్, నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్, పాట్నా, నాగ్పూర్ మరియు ముంబై సమీపంలోని పట్టణాలు నుండి రైళ్లు నేరుగా ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి బస్సు లేదా ఆటోలో వెళ్ళవచ్చు. రైలు ఛార్జీలు అందరికి అందుబాటు ధరలలో ఉంటాయి.

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

చప్పట్లు కొడితే నీరు వచ్చే వింత ప్రదేశం ఎక్కడవుందో తెలుసా?

విమాన మార్గం

ఆదిలాబాద్ కు విమానాశ్రయం లేదు, కానీ దగ్గరలో హైదరాబాద్ విమానాశ్రయం ఉంది. ఇది ఆదిలాబాద్ పట్టణం నకు 280 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి ఆదిలాబాద్ పట్టణంకు అద్దె కార్లు దొరుకుతాయి. వాటి అద్దె రూ.2000 నుంచి 4000 మద్య ఉంటాయి. ఆదిలాబాద్ ఎయిర్ కండిషన్డ్ బస్సులు సెంట్రల్ బస్ స్టేషన్ నుండి అందుబాటులో ఉన్నాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి