» »బంగారు పద్మంలో అవతరించిన శ్రీపద్మావతి దేవి మరియు లక్ష్మీ దేవి ఒక్కరేనా !

బంగారు పద్మంలో అవతరించిన శ్రీపద్మావతి దేవి మరియు లక్ష్మీ దేవి ఒక్కరేనా !

Posted By: Venkata Karunasri Nalluru

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుజిల్లాలోని అలిమేలు మంగాపురం తిరుపతి దగ్గరలో గల పుణ్యక్షేత్రం. దీనినే తిరుచానూరు అని కూడా అంటారు. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించాలనుకుని విష్ణుమూర్తి వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. విష్ణుమూర్తి వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై వుంది. వెంటనే లక్ష్మీదేవి అలిగి కొల్హాపురంకు వెళ్ళిపోతుంది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమలలో 12 సం.లు తపస్సు చేశాడు. కార్తీక శుక్ల పంచమినాడు శుక్రవారం బంగారుపద్మంలో ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మించింది. బంగారు పద్మంలో అవతరించినది కాబట్టి పద్మావతి అంటారు. శ్రీనివాసుడు లక్ష్మీదేవి అనుమతితో పద్మావతిని పెండ్లాడాడు.

తిరుచానూరు (అలిమేలుమంగాపురం)

అమ్మవారి సన్నిధి

అమ్మవారి సన్నిధి

ఈ దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజాలు కలిగివుంటుంది. రెండు చేతులతో పద్మాలు ధరించి వుంటుంది. ఇక్కడ దర్శించగల ఇతర దేవుళ్ళు శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సత్యనారాయణ స్వామి.
PC: Malyadri

తిరువెంగడ కూటం

తిరువెంగడ కూటం

పూర్వకాలంలో ఇక్కడ వెంకటేశ్వరస్వామి గుడి ఒకటుండేది. ఇక్కడ చారిత్రక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇక్కడ దేవుని విగ్రహాలు వుండేవి. తరువాత కాలంలో ఈ విగ్రహాలను వేరే చోటికి తరలించారు.
PC: wikimedia.org

తిరుచానూరు అమ్మవారి మహత్యం

తిరుచానూరు అమ్మవారి మహత్యం

తిరుచానూరులో 50 కి పైగా కళ్యాణమండపాలు వున్నాయి. ప్రతి సంవత్సరం అనేక వివాహాలు ఇక్కడ జరుగుతాయి. మొదట కొండ మీద శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత తప్పకుండా కొండ దిగువున కొలువై వున్న పద్మావతీదేవి అమ్మవారిని దర్శించుకోవాలి.
PC: wikimedia.org

ఇక్కడ జరిగే సేవలు

ఇక్కడ జరిగే సేవలు

సుప్రభాత సేవ, సహస్రనామార్చన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వుంటాయి. ఏకాంతసేవ అనంతరం ఆలయం మూస్తారు.
PC: wikimedia.org

అష్టదళ పద్మారాధన

అష్టదళ పద్మారాధన

ప్రతి సోమవారం అమ్మవారికి అష్టదళ పద్మారాధన జరుగుతుంది. శుక్రవారం అభిషేకం చేస్తారు. గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది.
pc : Bhaskaranaidu

లక్ష్మీ పూజ

లక్ష్మీ పూజ

తిరుచానూరులో లక్ష్మీ పూజ శ్రావణమాసంలో చేస్తారు. ఈ పూజలో పసుపు, కుంకుమలను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
pc : Malyadri

ఇక్కడ జరిగే ఉత్సవాలు

ఇక్కడ జరిగే ఉత్సవాలు

ఇక్కడ అమ్మవారు ధరించిన మంగళసూత్రాలు ఆనాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి సమర్పించినదని చెప్తారు. రధసప్తమి, వసంతోత్సవం ఇక్కడ జరిపే ముఖ్య ఉత్సవాలు.
pc : Malyadri

ఆలయకోనేరు

ఆలయకోనేరు

ఈ ఆలయం వెనక కోనేరు, పద్మావతీదేవి గార్డెన్స్, శ్రీరామఆలయం, రామకృష్ణ తీర్థం, గోవిందరాజులస్వామి ఆలయం మరియు ఆంజనేయస్వామి ఆలయం మొదలైనవి చూడవచ్చును.
pc :Malyadri

అలమేలు మంగాపురం - వాహనసౌకర్యాలు

అలమేలు మంగాపురం - వాహనసౌకర్యాలు

1. తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరుకు ఏపియస్ ఆర్ టి సి బస్సులు, ప్రవేట్ బస్సులు, జీపులు ప్రయాణీకులకు సౌకర్యంగా వున్నాయి.

2. అంతేకాకుండా షేర్ ఆటోలలో కూడా ఆలయాన్ని చేరుకోవచ్చును.

3. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి క్యాబ్ లేదా టాక్సీ మాట్లాడుకుని అలమేలు మంగాపురం చేరుకోవచ్చును.
pc :Bhaskaranaidu

Latest: కలియుగాంతం రంకె వేసే నంది యాగంటి రహస్యం !