Search
  • Follow NativePlanet
Share
» »మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

By Venkatakarunasri

మేడారం, వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన గ్రామము. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ గ్రామం జిల్లా కేంద్రమైన వరంగల్లునుండి 120 కి.మీ. దూరంలో ఉంది. ఆసియాఖండంలోనే అతి పెద్ద జాతరగా పేరొందిన మేడారం మహాజాతరకు తేదీలు ఖరారయ్యాయి.జయశంకర భూపాలపల్లి జిల్లా, తాడ్వాయి మండలం, మేడారంలో నిర్వహించే జాతర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందింది. కోట్లాదిమంది భక్తి భావంతో సమ్మక్కసారలమ్మ తల్లులను కొలుస్తారు. వారి దీవెనలకోసం ఈ జాతరకు తరలివస్తారు. 2సంలకు ఒకసారి జరిగే జాతర సమయంలో మేడారం అడవులన్నీ జనసంద్రంగా మారతాయి.కాగా సమ్మక్కసారలమ్మ జాతర తేదీలను మేడారంలోని ఆలయప్రాంగణంలో పూజారులు మహాజాతర తేదీలను ప్రకటించారు.

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

ఈ జాతర భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర . 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా.ఇది విగ్రహాలు లేని జాతర.సమ్మక-సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జనవరి 27 నుంచి 30 తేదీ వరకు నిర్వహిస్తారు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

హన్మకొండ బస్టాండ్‌ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.45 లు బస్ చార్జి ఉంటుంది.కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీర వని తలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తుంది.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలాది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.కోయ గిరిజనుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ. శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు తెలుపుతున్నాయి.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించే వారు. ఇతను కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీంనగ రాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పడిగిద్ద రా జు సతీమణి సమ్మక్క . ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం జరిపించారు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతానం. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలిం చేవారు. ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సై న్యం వంటి వరంగల్లు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పా టు చేసుకొని యుద్ధం ప్రకటించారు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

పగిడిద్దరాజు అతని కుమార్తెలు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది.ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది.తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతా పరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు ప ది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతపూ జారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకల గుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసు కువస్తారు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తా రు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు. వచ్చే ఏడాది జనవరి 31 తొలిరోజున కన్నెపల్లెలో వున్న సారలమ్మ ఆలయంలో ఆదివాసీ సంప్రదాయాలప్రకారం పూజాదికార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం వేళ కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం గద్దెలవద్దకు తీసుకువస్తారు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

ఫిబ్రవరి 1, రెండవరోజు సమ్మక్కదేవతను చిలుకలగుట్ట నుంచి గద్దెలపైకి తీసుకువస్తారు. ఫిబ్రవరి 2 భక్తులు మ్రొక్కులు సమర్పించుకుంటారు. 3న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయటం జరుగుతుందని పూజారులు వివరించారు.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభంరోజున అంటే జనవరి 31న గద్దెలపైకి సారలమ్మ చేరుకునే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహణం వీడిన తర్వాత సారలమ్మను గద్దెలపైకి తీసుకురానున్నారు.ఈ మేరకు సమ్మక్కసారలమ్మ పూజారుల సంఘం నిర్ణయించింది.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

31వ తేది సాయంత్రం 6గంల 4ని ల నుండి రాత్రి 8:40నిల వరకు చంద్రగ్రహం ఏర్పడుతుంది.దీంతో గ్రహణసమయంలో ఏం చేయాలి అనే అంశంపై సందిగ్దత ఏర్పడటంతో గ్రహణంవీడిన తర్వాత రాత్రి 9గం ల సమయంలో సారలమ్మను మేడారం గద్దెలపైకి తీసుకురావాలని పూజారులసంఘం నిర్ణయించింది.

pc:youtube

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

మేడారం సమ్మక్కసారక్క జాతర జరిగే తేదీలు ఇవే !

భక్తుల మనోభావాలను దృష్టిలో వుంచుకుని గ్రహణం విడిచిన తర్వాత సారలమ్మను కన్నెపల్లినుంచి మేడారం గద్దెలపైకి తీసుకువస్తామన్నారు.

pc:youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more