Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణాలో అంతుచిక్కని 'బాహుబలి విగ్రహం' రహస్యం !

తెలంగాణాలో అంతుచిక్కని 'బాహుబలి విగ్రహం' రహస్యం !

అసలు బాహుబలి అంటే ఏమిటి ? ఆ పేరేలా వచ్చింది ?? అసలు ఇంతకీ ఇది కల్పిత కథా ? లేక నిజమైన కథా ??

By Venkatakarunasri

అసలు బాహుబలి అంటే ఏమిటి ? ఆ పేరేలా వచ్చింది ?? అసలు ఇంతకీ ఇది కల్పిత కథా ? లేక నిజమైన కథా ?? అసలు రాజ్యం ఉండేదా ఉంటే సినిమాలో చూపించిన క్యారెక్టర్లు నిజమేనా అనే విషయాల గురించి మీకు తెలుసుకోవాలని లేదా ?? అయితే కింద పేర్కొనబడిన బాహుబలి విశేషాలను చదివితే మీకే ఎన్నో రహస్యాలు, చరిత్ర తెలుస్తాయి.

బాహుబలి అన్న పేరు ప్రస్తుతం టాలీవూడ్ ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్. అందరూ బాహుబలి రెండవ భాగం కోసం వేచి ఉన్నారు. మొదటి భాగం తెలుగు సినిమా గతినే మార్చివేసింది మరి రెండవ భాగం ఎలా ఉంటుందో ... ఏ మేర ప్రేక్షక వర్గాన్ని ఆకర్షిస్తుందో చూడాలి మరి ..!

చరిత్ర విషయానికి వస్తే ..

చరిత్ర విషయానికి వస్తే ..

కొన్ని పురాణాల ప్రకారం, ఇక్ష్వాక వంశానికి చెందిన వృషభానాథుడు కి ఇద్దరు భార్యలు. ఒకరేమో యశస్వతీ దేవి (సుమంగళీ దేవి), మరొకరేమో సునందా దేవి. యశస్వతీ దేవి కి 99 మంది కొడుకులు, ఒక బిడ్డ (బ్రాహ్మీ లేదా బ్రహ్మీ) జన్మించారు. సునందా దేవి బాహుబలి అనే కుమారుడు మరియు సుందరి అనే కుమార్తె ను జన్మనిచ్చినది.

Photo Courtesy: Ankur P

చరిత్ర విషయానికి వస్తే ..

చరిత్ర విషయానికి వస్తే ..

99 కుమారుల్లో కెల్లా పెద్దవాడు భరతుడు. ఇతను గొప్ప వీరుడు, రాజనీతి కోవిదుడు. బ్రాహ్మీ సాహిత్యంలో మంచి నేర్పరి. బాహుబలి మంచి దేహధారుడ్యం మరియు భుజబలం గలవాడు. సుందరి గణితంలో దిట్ట.

చరిత్ర విషయానికి వస్తే ..

చరిత్ర విషయానికి వస్తే ..

వృషభనాథుడు తనకు కలిగిన జ్ఞానోదయం వల్ల నూరుగురు కుమారులకు రాజ్యాన్ని పంచిపెట్టి (అప్పట్లో వృషభనాథుడు అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు) పెద్ద కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేసి, బాహుబలి కి పొదనపురానికి(భోధన్) రాజుగా నియమించి అడవులకు వెళ్ళిపోతాడు.

Photo Courtesy: matthew logelin

చరిత్ర విషయానికి వస్తే ..

చరిత్ర విషయానికి వస్తే ..

తండ్రి అడవులకి వెళ్ళిన తరువాత భరతుడు తన రాజ్యాన్ని విస్తరించడం కోసం బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. సైన్యం కొత్తకొత్త ఆయుధాలను తయారు చేసే సమయంలో కనీవినీ ఎరుగని రీతిలో ఒక ఆయుధాన్ని తరుచేసింది. అదే చక్రరత్న ఆయుధం. ఇది అస్సలు గురి తప్పదు.

Photo Courtesy: Sean Ellis

చరిత్ర విషయానికి వస్తే ..

చరిత్ర విషయానికి వస్తే ..

భరతుని వద్ద ఉన్న ఆయుధాలు ప్రపంచంలో మరెవరి దగ్గర లేవు కనుకనే తన చుట్టుప్రక్కల రాజ్యాలైన 98 మంది సోదరుల రాజ్యాలను సైతం త రాజ్య విస్తరణలో భాగంగా ఆక్రమించాడు. ఇతని జైత్ర యాత్రని అడ్డుకున్నది మాత్రం బాహుబలి.

Photo Courtesy: Mahendra Patnaik

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

బాహుబలి, భరతుడు ఇద్దరూ కూడా బాగా బలం కలిగిన వారే. ఇద్దరి వద్ద ఉన్న సైన్యం సైతం బలమైనవే కాబట్టి ఎటువంటి ప్రాణనష్టం కలగకూడదని మంత్రుల అభిప్రాయం. యుద్ద స్థలానికి చేరుకోగానే మంత్రులు తమ అభిప్రాయాలను ఇరువురి రాజులకు ఈవిధంగా చెప్పారు - " రాజా ..! మీరిరువురి సైన్యం బలంగా ఉన్నది. ఒకవేళ యుద్ధ రంగంలో సైన్యం దిగితే అపార ప్రాణనష్టం కలుగుతుంది కాబట్టి సైన్యాన్ని రంగంలో దించకుండా మీరిద్దరే తలపడండి. యుద్ధంలో ఎవ్వరైతే ఓడిపోతారో వారు తమ రాజ్యాన్ని గెలిచిన వారికి ఇవ్వండి " అని సారాంశం. ఇరువురూ దీనికి సమ్మతించి సమర శంఖారావాన్ని పూరిస్తారు.

Photo Courtesy: Kunal Dikshit

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

ఈ యుద్ధం ఎటువంటి ఆయుధం లేకుండా మూడు రకాలుగా జరుగుతుంది. అవి దృష్టి యుద్ధం, జల యుద్ధం మరియు మల్ల యుద్ధం. దృష్టి యుద్ధం అంటే కన్నార్పకుండా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోవడం. బాహుబలి తన అన్న కళ్ళలో తీక్షణంగా చూస్తూ - చిన్నప్పటి నుంచి చూస్తున్న అన్న మీద ఎలా నేను కోపాన్ని విరజిమ్మడం అంటూ అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోతాడు. అన్న భరతుడు కూడా అలాగే తమ్ముని ముఖంలో కనిపిస్తున్న ప్రేమానురాగాలకు కోపాన్ని మరిచి కళ్ళు మూసుకుంటాడు. ఇందులో అన్న భరతుడు ఓడిపోతాడు.

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

రెండవది జలయుద్ధం. నదిలో దిగి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత. ఇందులో అన్న భరతుడు అలసిపోతాడు. తమ్ముడు బాహుబలి విజయం సాధిస్తాడు.

Photo Courtesy: Sean Ellis

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

ఇక చివరిది, మూడవది మల్ల యుద్ధం. రెండు యుద్దాలలో ఓడిపొయిన భరతుడు ఎలాగైనా గెలవాలని తమ్ముడిని పిడిగుద్దులు కొడతాడు. రెండవ దెబ్బకే బాహుబలి కిందపడిపోతాడు. అయ్యో ..! తమ్ముడు కిందపడిపోయాడే, చనిపోతాడేమో అని కంగారు పడతాడు భరతుడు. వెంటనే తేరుకొని కిందపడ్డ బాహుబలి తేరుకుంటాడు. ఇప్పుడు బాహుబలిది గుద్దె వంతు. అన్నని రెండు చేతులతో పైకి లేపి గిరగిరా తిప్పి మెల్లగా కిందకు దించుతాడు. తరువాత అన్నని పిడిగుద్దులు గుద్దటానికి చేయి పైకి ఎత్తుతాడు. ఎక్కడ భరతుడు చనిపోతాడని పక్కనున్న సైన్యం, మంత్రులు లబోదిబోమని హాహాకారాలు చేస్తారు. ఒక పక్క భరతుడు సైతం భయపడతాడు.

Photo Courtesy: Desmond Lobo

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

బాహుబలి - భరతుని మధ్య యుద్ధం

ఎలాగైనా గెలావాలనే ఆకాంక్షతో ఆయుధాన్ని వాడకూడదనే నియామాన్ని పక్కన బెట్టి భరతుడు తన చక్రరత్న ఆయుధాన్ని బాహుబలి పై ఉపయోగిస్తాడు. కానీ ఆది పనిచెయ్యదు. అన్న నియామాన్ని మరిచి తనపై ఆయుధాన్ని ఎక్కుపెట్టటం చూసి కోపొద్రిక్తుడైన బాహుబలి అన్నను గుద్దటానికి చెయ్యి పైకెత్తి నిశ్చలంగా ఉండిపోయి మనసులో ఇలా అనుకుంటాడు "ఎంటిది, నేనేం చేస్తున్నాను, నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా నేను నా అన్న ను చంపుతున్నది ... తుచ్చమైన ఈ రాజ భోగభాగ్యాలు అనుభవించటానికేనా నేనున్నది .. నేను నా తండ్రి లాగా, సోదరుల వలె అడవిలోకి వెళ్ళి విశ్వప్రేమను పోందుతాను ... " అని ఆలోచించసాగాడు. వెంటనే తన అన్న కాళ్ళ మీద పడి క్షమించమని కోరాతాడు. తన రాజ్యాన్ని కూడా అన్నకే ఇస్తున్నట్లు ప్రకటించి ఆభరణాలను, ఆయుధాలను, బట్టలను తొలగించి వెంట్రకలను చేత్తో పీక్కొని తన అన్న వద్దని వారిస్తున్న సన్యాసంలో వెళ్ళిపోతాడు.

తెలంగాణ లో బాహుబలి

తెలంగాణ లో బాహుబలి

బాహుబలి రాజ్యం చేసింది ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలోనే. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణాన్ని బాహుబలి రాజధానిగా చేసుకొని పరిపాలించాడని, బౌద్ధ, జైన, వైదిక మతాలు సమానంగా విరజిల్లాయని జైన గ్రంథాలు, విష్ణు పురాణాలు చెబుతున్నాయి. బోధన్ లో లభ్యమైన జైన విగ్రహాలు, ఆలయాల ద్వారా బాహుబలి ఖచ్చితంగా బోధన్ పట్టనాన్నే రాజధానిగా చేసుకొని పరిపాలనగావించాడని చరిత్రకారుల నమ్మకం.

Photo Courtesy: Anant A

తెలంగాణ లో బాహుబలి

తెలంగాణ లో బాహుబలి

కర్నాటకలోని శ్రావణ బెళగోళలో విగ్రహానికి స్ఫూర్తినిచ్చిన విగ్రహం బోధన్ లో ఉండేది. బోధన్‌ లో ఉన్న విగ్రహం బాహుబలునిది. కర్నాటక ప్రాంతాన్ని ఏలుతున్న పశ్చిమగాంగ రాజు రాచమల్లుని మంత్రి చాముండరాయడు తమ ఆస్థానాన్ని సందర్శించిన ఓ కవి ద్వారా బాహుబలి విగ్రహం గురించి, మనుషులు చేరడానికి వీలు లేని కీకారణ్యంలో ఉందనీ తెలుసుకుంటాడు.

Photo Courtesy: matthew logelin

తెలంగాణ లో బాహుబలి

తెలంగాణ లో బాహుబలి

దీంతో చాముండరాయడు బోధన్‌ వెళ్ళి బాహుబలుని అద్భుతమైన విగ్రహాన్ని దర్శించుకుంటాడు. దాదాపు విగ్రహం అడవుల్లో అదృశ్యమయ్యే స్థితిలో ఉండటంతో ఇదే పరిమాణం, రూపం ఉన్న బాహుబలుని విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ఉన్న వింధ్యగిరిపై చెక్కించి ప్రతిష్టించాడు.

Photo Courtesy: matthew logelin

తెలంగాణ లో బాహుబలి

తెలంగాణ లో బాహుబలి

శ్రావణ బెళగోలలో వేయించిన శాసనం బోధన్‌ బాహుబలి విగ్రహం చుట్టూ భయంకరమైన కుక్కుట సర్పాలు తిరుగాడుతున్నాయని, అక్కడికి వెళ్ళడం కష్టంగా మారిందని, అందువల్ల చాముండరాయడు బోధన్‌లో ఉన్న విగ్రహానికి సమానమైన మరో విగ్రహాన్ని ఇంద్రగిరి కొండపై ప్రతిష్టించడానికి ప్రయత్నించాడని కానీ అంత ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించలేకపోయాడని చెబుతోంది. దీన్ని బట్టి బోధన్‌లో ఉన్న విగ్రహం ఎంతపెద్దదో అర్థంచేసుకోవచ్చు.

Photo Courtesy: matthew logelin

ప్రపంచంలోని ఎత్తయిన విగ్రహం

ప్రపంచంలోని ఎత్తయిన విగ్రహం

జైన గ్రంథాలు, శ్రావణ బెళగోళలో ఉన్న శాసనం బట్టి మన బోధన్‌లో ప్రపంచంలోని ఎత్తయిన బ్రహ్మాండమైన విగ్రహం ఒకటి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ విగ్రహం ఏమైపోయినట్లు? శాసనంలో పేర్కొన్నట్లు బాహుబలుని విగ్రహం అప్పట్లోనే అడవుల్లో కలిసిపోయిందా? కాల క్రమంలో విగ్రహం నేలపై ఒరిగి భూమిలో పూడుకుపోయి ఉండవచ్చా ??. మొత్తం దేశంలోనే భారీ విగ్రహాల ప్రతిష్టకు మూలం బోధన్‌ బాహుబలి విగ్రహం. అటువంటి విగ్రహం ఒకటుందనే విషయం చాలామందికి తెలియదు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి బాహుబలి తెచ్చిన పేరు సామాన్యమైనది కాదు.

Photo Courtesy: matthew logelin

శ్రావణ బెళగోళ

శ్రావణ బెళగోళ

58 అడుగుల ఎత్తు ఉంటే గోమఠేశ్వరుని విగ్రహం శ్రావణ బెళగోళ లో ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని చాముండరాయ నిర్మించినారు. ఈ ప్రదేశంలో తమిళ, కన్నడ భాషలలో ప్రచురితమైన శాశనాలను చూడవచ్చు. అంతే కాదు వేల మంది భక్తులు ప్రతి సంవత్సరం జరిగే మహా ముస్తభిషేకం ఉత్సవానికి పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. విగ్రహాన్నంతటిని అభిషేకించే కార్యాక్రమం 12 సంవత్సరాల కొకసారి మాత్రమే జరుగుతుంది. అప్పుడు పూలు, పెరుగు, బంగారు నాణేలు, నెయ్యి, పాలు వంటి వస్తువులతో అభిషేకం చేస్తారు.

Photo Courtesy: Amar Raavi

కర్కల

కర్కల

కర్కల ఉడిపి జిల్లాలో ఉన్న పట్టణం. ఇక్కడ బాహుబలి ఏకశిలా విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 42 అడుగుల ఎత్తైన ఈ బహుబలి విగ్రహం కర్నాటక రాష్ట్రంలో ఉన్న శ్రావణ బెళగోళ లోని గోమఠేశ్వరుని విగ్రహం కంటే చిన్నది మరియు రెండవది. ఈ శిలాఖండాన్ని పాండ్య రాజైన వీరపాండే భైరవ నిర్మించినారు. ఇక్కడ కూడా 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహామస్తకాభిషేకం రోజున బాహుబలి ఏకశిలా విగ్రహానికి నీటితో, కుంకుమపువ్వు పేస్టు తో, పాలతో అభిషేకం జరుగుతుంది.

Photo Courtesy: Suresh B

ధర్మస్ధల

ధర్మస్ధల

ధర్మస్ధల లో బాహుబలి విగ్రహం తప్పక చూడవలసిన ఆకర్షణలలో ఒకటి. ఇది రత్నగిరి కొండపై ఉంది. ఈ విగ్రహం సుమారు 39 అడుగుల పొడవు ఉంది. నిస్వార్ధానికి, త్యాగానికి ప్రతీకగా జైనులు ఈ విగ్రహాన్ని కొలుస్తారు. ఈ ప్రదేశం చేరటానికి పర్యాటకులు రత్నగిరి కొండలు షుమారు 20 నిమిషాలపాటు మెట్లు ఎక్కాలి. కనుక పర్యాటకులు ఉదయం వేళ మాత్రమే ఈ ప్రదేశాన్ని చేరి ఆనందించాలని చెపుతారు. ఈ ప్రదేశం సందర్శించేవారు ఉదయం 8 గంటలనుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటలకు మాత్రమే అక్కడి విగ్రహ దర్శనం పొందగలరు.

వేణూర్

వేణూర్

వేణూర్ సందర్శనలో పర్యాటకులు ఫల్గుణి నది ఒడ్డున ఉన్న గోమఠేశ్వరుని విగ్రహాన్ని తప్పక చూడాలి. దీనిని తిమ్మన్న అజిల 1604 లో నిర్మించాడు. ఒకే రాతితో చేసిన విగ్రహం ఇది. దీనిని అమరశిల్పి జక్కన్న చెక్కాడు. కర్నాటకలోని నాలుగు బాహుబలి విగ్రహాలలోను ఇది చిన్నది. ఇది 35 అడుగుల ఎత్తు ఉంది. దీనికి ప్రత్యేకత అంటే, ఏ రకమైన ఆధారం లేకుండా విగ్రహం ఎత్తైన ప్లాట్ ఫారంపై నిర్మించారు.

Photo Courtesy: Anoop Rao

గొమ్మతాగ్రి

గొమ్మతాగ్రి

గొమ్మతాగ్రి అనే ప్రదేశం జైన మతానికి సంబంధించిన ప్రదేశం. ఇది మైసూరు పట్టణానికి 20 కి. మీ. దూరంలో ఉన్న కొండపై 20 అడుగుల ఎత్తున్న గోమఠేశ్వరుని విగ్రహం ఉంది. దీనిని శ్రావణ బెళగోళలో ఉన్న విగ్రహాన్ని స్పూర్తిగా తీసుకొని నిర్మించినారు.

Photo Courtesy: Rajan Thambehalli

<strong>మన తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడవుందో తెలిస్తే షాక్ అవుతారు !</strong>మన తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడవుందో తెలిస్తే షాక్ అవుతారు !

<strong>మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...</strong>మీరు అక్కడికి వెళ్తే... మీ తల రాత మారిపోతుంది...

<strong>రావణుడు జటాయువు రెక్కలు నరికినపుడు ఆ పక్షి పడ్డ స్థలం ఇప్పుడెలా ఉందో తెలుసా !</strong>రావణుడు జటాయువు రెక్కలు నరికినపుడు ఆ పక్షి పడ్డ స్థలం ఇప్పుడెలా ఉందో తెలుసా !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X