Search
  • Follow NativePlanet
Share
» »అరణ్యాలలో సాహస పర్యటన యాత్ర !

అరణ్యాలలో సాహస పర్యటన యాత్ర !

బండిపూర్ అడవుల గుండా ఎపుడైనా జంగల్ సఫారి చేసారా ? లేక మన కళ్ళ ముందే వన్య జీవులు సమీపంనుండి సంచరించాలని కోరుతున్నారా ? అలాగైతే, బెంగుళూరు నుండి మాసినగుడికి ఒక ట్రిప్ వేయాలి. మార్గంలో బండి పూర్ మరియు ముదు మలై అడవులలో కల వన్య జీవులను, అనేక రకాల పక్షులను చూసి ఆనందిస్తూ సాగిపోవచ్చు.

అరణ్యాలలో సాహస పర్యటన !
అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

ఈ ట్రిప్ ను ఒక లాంగ్ వీక్ ఎండ్ లో ప్లాన్ చేయాలి. ఎందుకంటే, దూరం అధికం. బెంగుళూరు నుండి ఉదయం 7 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసి బయలుదేరితే చాలు. బెంగుళూరు, కళా సిపలయం లోని కామత్ హోటల్ బ్రేక్ ఫాస్ట్ మీకు సమయం కూడా ఆదా చేస్తుంది.

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

మీకు ఈ మార్గంలో తగిలే గోపాలస్వామి హిల్స్ చూడటం మరువకండి. ఈ ప్రదేశం బండి పూర్ కు కొద్ది కిలో మీటర్లు ముందుగానే తగులుతుంది. ఈ కొండలు మీకు అద్భుత ప్రకృతి దృశ్యాలను అందిస్తాయి. వీటి పని వేళలు ఉదయం 8.30 గం నుండి సా. 4 గం. వరకు.

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

రోడ్డు మార్గంలో బండి పూర్ ను మీరు మధ్యాహ్నం 12 గం. కల్లా చేరవచ్చు. అడవికి సమీపంగా వుండి ఆనందిన్చాలనుకుంటే, అడవికి ఒక్క కి. మీ. దూరంలో కల ఫారెస్ట్ సరిహద్దులోని బండి పూర్ సఫారి లాజ్ లో దిగండి. ఇక్కడి అడవిలో మీరు, అడవి కుక్కలు, చిరుతలు, ఎలుగులు, చీతల్ , గౌర్ వంటి జంతువులు చూడవచ్చు.

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

ఫారెస్ట్ లో మీరు ఉదయం వేళ ప్రకృతి నడక సాగించేందుకు సౌకర్యాలు కలవు. కనుక అక్కడి లాజ్ లలో రాత్రి బస తీసుకొని ఈ ఆనందాలు అందుకోవటం మీకు జీవిత కాల అనుభవం కాగలదు. సఫారినే కాక, ఈ రిసార్ట్ మీకు క్యాంపు ఫైర్, విభిన్న రుచుల ఆహారాల రెస్టారెంట్ కూడా అందిస్తుంది.

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

బండి పూర్ సఫారి వేళలు ఉ. 6 .౩౦ గం. నుండి సా 4 .30 గం. వరకు వుంటాయి. కనుక మీరు సాయంత్రం మరియు, ఉదయం బయలు దేరే ముందు కూడా వీటిని ఆనందించవచ్చు. ఈ సఫారి లో మీరు అరుదైన పక్షులు గ్రీ జంగల్ ఫౌల్, ద్రోన్గోస్ వంటివి చూడవచ్చు.

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

ఇక మన తర్వాతి సందర్శన ముడుమలై నేషనల్ పార్క్. అంటే ఇది బందిపూర్ నుండి సుమారు 20 కి. మీ. ల దూరం. ప్రయాణం అర్ధ గంట కంటే తక్కువే. ఇక్కడి సఫారి ఉ. 9 గం. కు మూస్తారు. జంగల్ లో ఒక 30 నిమిషాల సఫారి తీసుకోండి. ఇక్కడ మీరు బెంగాల్ టైగర్ , గౌర్ , ఇండియన్ చిరుత వంటి జంతువులు చూడవచ్చు.

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

ముడుమలై జంగల్ సఫారి తర్వాత మాసిన గుడి కి బయలుదేరండి. ఇపుడు మీరు కోయంబత్తూర్ - ఊటీ - గుండ్లుపేట్ హై వే లేదా బాగా ప్రసిద్ధి అయిన 36 హెయిర్ పిన్ బెండ్లు రోడ్ పై డ్రైవ్ చేయాలి. ఈ రోడ్డుపై చాక చక్యంగా ఎంతో మెలకువతో 36 వ రోడ్డు బెండ్ వరకూ డ్రైవ్ చేయాలి. మార్గంలో మీరు చూసే ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా వుంటాయి. వాటిని చూస్తూ డ్రైవ్ చేస్తే, రియల్ అడ్వెంచర్ అనిపిస్తుంది. ముడుమలై నుండి మాసిన గుడి 75 కి. మీ. ల దూరం అంటే మీరు సరిగా మిట్ట మధ్యాహ్నానికి చేరతారు.

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

ముడుమలై వైల్డ్ లైఫ్ సంక్చురి లో ఒక భాగం అయిన మాసినగుడి లో మీకు అనేక రకాల జాతుల పక్షులు దర్శనమిస్తాయి. పక్షి ప్రియులు, వైల్డ్ లైఫ్ అంటే ఇష్టపడేవారు ఈ ప్రదేశం తప్పక చూసి ఆనందించాలి. వీటిని మీరు చూడటమే కాదు, ఇక్కడ కల ట్రెక్కింగ్, కామ్పింగ్ వంటి అనేక క్రీడలు కూడా ఆచరించవచ్చు.

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

మాసినగుడిలో మీరు వసతి తీసుకోవాలంటే, బ్లూ వాలీ జంగల్ రిసార్ట్, ది మోనార్క్ సఫారీ పార్క్, క్లబ్ మహీంద్రా, జంగల్ రిట్రీట్ అనుకూలం. సాయంత్రం పొద్దు పోవు వరకు మాసిన గుడి సహజ ప్రకృతిలో వుండి పక్షుల ధ్వనులు ఆనందించవచ్చు. ఉదయం పెందలకడ పక్షుల ధ్వనులు విని వాటిని చూసి ఆనందించండి. అక్కడే మంచి బ్రేక్ ఫాస్ట్ చేసి, బెంగుళూరు కు బయలుదేరండి.
అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

అరణ్యాలలో సాహస పర్యటన

మాసిన గుడి నుండి బెంగుళూరు 235 కి. మీ. ల దూరం అంటే, డ్రైవింగ్ లో సుమారు 5-7 గంటలు పడుతుంది. సుమారుగా సాయంత్రం అయ్యే సరికి బెంగుళూరు చేరతారు. మీరు అనుభవించిన ఆనందాలు, చేసిన సాహస క్రీడలను నెమరు వేస్తూ చక్కని రోడ్డు మార్గంలో బెంగుళూరు చేరిపోతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X