Search
  • Follow NativePlanet
Share
» » బెంగుళూరు - నంది హిల్స్ - లేపాక్షి - ఒక్క రోజు రోడ్ ట్రిప్ !

బెంగుళూరు - నంది హిల్స్ - లేపాక్షి - ఒక్క రోజు రోడ్ ట్రిప్ !

ట్రావెల్ అనేటప్పటికి అందులో వినోదం తప్పక చూస్తారు. బెంగుళూరు నుండి లేపాక్షికి వయా నంది హిల్స్ రోడ్డు ప్రయాణం వినోదం కంటే కూడా సౌకర్యంకూడుకొన్నది . ఈ ప్రయాణంలో మీరు ప్రకృతిని దాని సహజ అందాలలో చూడవచ్చు. డైలీ రొటీన్ తో విసిగి పోయారా ? ఒక్క రోజు రిలాక్స్ అయి ఆనందించాలని అనుకుంటున్నారా ? మీ విలువైన టైం ను ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో గడపాలని అనుకుంటున్నారా ?ఈ ప్రశ్నలకు మీ సమాధానం 'అవును' అయితే, ఈ రోడ్ ట్రిప్ మీకు మీరు కోరినవన్నీ అందిస్తుంది. సుమారు 137 కి. మి. కల దూర ప్రయాణం చేయాలంట్, మీరు ఉదయం వేళ కొంచెం పెందలకడే జర్నీ మొదలు పెట్టాలి. సూర్యోదయానికి ముందు బెంగుళూరు రోడ్ లు ఖాళీ గా వుంటాయి. ప్రశాంతం మరియు ఎల్లపుడూ ఆహ్లాదంగా వుండే బెంగుళూరు వాతావరణం మీ ఈ రోడ్ జర్నీ కు మరింత సహకరిస్తుంది. మరి బెంగుళూరు నుండి లేపాక్షి కి నంది హిల్స్ మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి అనేది చూడండి

బెంగుళూరు - నంది హిల్స్ - లేపాక్షి - ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

రోడ్డు కు ఇరు పక్కలా సుందరమైన దృశ్యాలు కనపడతాయి. పచ్చటి భూమి, సగం నిద్ర కళ్ళ తో వీదులలో తిరిగే పిల్లలు, సగం సగం నిద్ర లేచిన పశువులు రోడ్డు పై నడవటం వంటివి మీరు ఒక గ్రామీణ ప్రాంతంలో వున్నామా అనే ఫీలింగ్ కలిగిస్తాయి.
-------------

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

....ప్రకృతి ఒక్క పెట్టున చల్ల గాలితో మిమ్ములను స్పర్శించి, తాజా గాలి అందిస్తుంది. మీరు మీ కారు లేదా ఇతర వాహనం నుండి దిగి వచ్చి ఆనందించాలని ప్రయత్నిస్తారు. కాని మీరు వెళ్ళవలసిన దూరం గుర్తుకు వచ్చి జర్నీ కొనసాగిస్తారు.
-------------

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

సూర్యోదయానికి పూర్వం నంది హిల్స్ వాతావరణం కూడా బెంగుళూరు వలెనె వుంటుంది. సన్నని ఉదయపు వేళ మంచు పొరలు, మేఘాలు చల్లటి గాలులు, అన్నీ కలిపి మీరు ఒక స్వర్గంలో వున్నామా అనిపించేలా చేస్తుంది.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

నంది హిల్స్ శిఖరం చేరాలంటే, కొండ చేరి నప్పటి నుండి కొంత దూరం నడవాలి. రాజకుమారుడి కథలలో వలే, అందమైన వాతావరణంలో చిన్న నడక సాగించండి.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

అక్కడ ఏర్పడే సూర్యోదయం చూస్తూ మీరు నడుస్తూంటే, అసలు మీరు ఎక్కడ వున్నామనేది మరచి ప్రకృతిని ఆనందిస్తారు. అసలైన ధ్యానం అనే మాటకు అర్ధం మీకు అక్కడ లభిస్తుంది. ఇక్కడ మీకు లభించే అనుభూతి మాటలలో చెప్పనలవి కాదు.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

అక్కడ మీకు లభించే సూర్యోదయం దృశ్యం చూడకపోతే, మీరు నంది హిల్స్ కు వెళ్ళినా వృధా అని చెప్పవచ్చు. అంత అందమైన సూర్యోదయం మీకు అక్కడ లభిస్తుంది. ఇక ఆ ప్రదేశం ఆ సమయంలో భూమిపై గల స్వర్గం అన్నామంటే, మరి ప్రకృతి చేసే మాజిక్ మీరు గ్రహించండి.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

మీరు శిఖరం పై చేరిన వెంటనే, అక్కడ నుండి చూసే నగర దృశ్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఏనాటికైనా ప్రకృతి, మానవుడి కంటే కూడా బలమైనడనే మెసేజ్ ఇస్తుంది.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

కొండకు కింది భాగంలో, లేపాక్షి కి వెళ్ళే మార్గంలో భోగ నందీశ్వర టెంపుల్ కలదు. ఈ టెంపుల్ పూర్తిగా అందమైన ద్రావిడ శిల్ప శైలి లో నిర్మించబడినది. ప్రయాణంలో ముందుకు సాగే ముందు ఈ టెంపుల్ తప్పక దర్శించండి.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

చివరకు మీరు హైదరాబాద్ హై వే పైకి చేరుతారు. లేపాక్షి , హిందూపూర్ కు సమీపంగా వుంటుంది. లేపాక్షి లో మీరు వీరభద్ర స్వామి టెంపుల్ చూడవచ్చు. ఈ ప్రదేశం మత పరంగానే కాక, పర్యాటక ప్రాధాన్యత కూడా కలిగి వుంది. బెంగుళూరు కు ఇది 123 కి. మీ. ల దూరం. నంది హిల్స్ నుండి 79 కి. మీ. ల దూరం.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఈ దేవాలయంలోని వీరభద్రుడు మరియు అక్కడే కల అతి పెద్ద ఏక శిలలో చెక్కిన నంది విగ్రహం, మరొక అతి పెద్ద నాగలింగం మొదలైనవి, ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశంలో, చరిత్ర, ప్రకృతి, కళలు, శిల్ప సంపద అన్నీ కలవు. ఈ ప్రదేశం అసలు మీరు ఎక్కడ నుండి వచ్చారనేది కూడా మరపింప చేస్తుంది.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

లేపాక్షి లోని వీరభద్ర స్వామీ టెంపుల్, కూర్మ శైల అని పిలువబడే తాబేలు ఆకారం కల కొండపై కలదు. టెంపుల్ గోడలపై, అనేక కుడ్య చిత్రాలు చెక్కబడి కలవు. వాటిని చూడటంలో మీరు సమయం కూడా మరచి పోయే అవకాశం వుంది.
--

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఇక్కడ కల అద్భుత శిల్ప సంపద విజయనగర సామ్రాజ్యం నాటిది. దీని గురించి మనం చరిత్రలో కూడా చదువుకొని ఉంటాము. ఈ టెంపుల్ నిర్మాణంలో ప్రసిద్ధ శిల్పి విశ్వకర్మ ప్రధాన పాత్ర వహించాడని చెపుతారు.

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

టెంపుల్ చుట్టూ కల అవశేషాల మధ్య నడచి, నేటికి ఆనాటి శిల్ప కళల వైభవం గమనించవచ్చు. వింత అయిన స్తంభాలు, మరచి పోయిన నవ్వులు, గత కాల వైభవం, రాజ దర్పాలూ, అన్నీ కలిపి మీరు చేసిన ప్రయానికి సార్ధకత కలిగిస్తాయి. మధుర స్మృతులను మూట కట్టి మిమ్మల్ని వెనక్కు పంపుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X