» »6 నెలలు కలిపితే ఇక్కడ ఒక రాత్రి !

6 నెలలు కలిపితే ఇక్కడ ఒక రాత్రి !

Written By: Venkatakarunasri

దేవతల భూమిగా భావించే హిమాచలప్రదేశ్ లో అనేక అద్భుత ఆలయాలు వున్నాయి. ప్రాచీన కాలం నుండి అదెంతో చరిత్రని, ఎన్నో రహస్యాలని తమలో దాచుకుని మనల్ని ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక మనం ఆలయాలను కొండలపై, పర్వతశిఖారాలపై దట్టమైన అడవులలో వుండటం చూసాం కానీ ఇక్కడ మాత్రం ఈ ఆలయం 8 నెలలపాటు నీటిలోనే మునిగివుంటుంది. మరి ఇలాంటి ఆలయాన్ని మీరు ఎప్పుడూ చూసివుండరు. ఈ ఆలయం ఇలా దశాబ్దాలుగా నీటిలో వున్నా ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే వుంది. మరి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు?ఎక్కడ వుంది?అనే వివరాలను ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

ఎక్కడ వుంది?

ఎక్కడ వుంది?

బాతూ కీ లడీ అనే అతి ప్రాచీన ఆలయం. 8 నెలలపాటు నీటిలోనే వుంటుంది. ఇది కాంగ్రా జిల్లాలో, హిమాచలప్రదేశ్ లో వుంది.

PC:youtube

మహారాణా ప్రతాప్ సాగర్

మహారాణా ప్రతాప్ సాగర్

అయితే ఈ ఆలయాలు 1970లో నిర్మించిన మహారాణా ప్రతాప్ సాగర్ అనే పోంగ్ డ్యాం లో జలసమాధిలో వున్నాయి. దాదాపు 8 నెలలపాటు నీటిలోనే వుండి కేవలం 4 నెలలు మాత్రమే ఇవి మనకు కనిపిస్తాయి.

PC:youtube

పౌరాణిక కథల ప్రకారం

పౌరాణిక కథల ప్రకారం

ఈ ఆలయాలను సందర్శించటానికి సందర్శకులు అక్కడికి బోట్ లలో వెళతారు. దాదాపు 50సంవత్సరాల నుండి ఇవి నీటిలోనే మునిగి ఉన్నాయి. అయితే ఇక్కడ వారి పౌరాణిక కథల ప్రకారం ఈ ఆలయంలో స్వర్గానికి వెళ్ళే మెట్లు వున్నాయని, వీటిని 5వేల సంవత్సరాలకు పూర్వం పాండవులు అజ్ఞాత వాసంలో వున్నప్పుడు నిర్మించారట.

PC:youtube

6నెలలు ఒక రాత్రి

6నెలలు ఒక రాత్రి

పాండవులు తమ అజ్ఞాత వాసంలో అనేక ప్రాంతాలలో శివఆలయాలను నిర్మించి, ఆ పరమశివుడ్ని పూజించారు. అయితే ఇక్కడ ఆలయాలతో పాటు స్వర్గానికి మెట్లమార్గాన్ని కూడా నిర్మించారని అయితే ఇది అంత సులభమయ్యింది కాదు వారు శ్రీక్రిష్ణుని భగవానుణ్ణి సాయంకోరగా శ్రీ కృష్ణుడు వారికి స్వర్గానికి మెట్ల మార్గాన్ని నిర్మించటానికి 6నెలలను ఒక రాత్రిగా మలుస్తాడు.

PC:youtube

అజ్ఞాతవాసం

అజ్ఞాతవాసం

ఇక వారు సూర్యుడినికానీ ఎలాంటి వెలుగును గానీ వారు చూడరాదని ఒక వేళ అలా గానీ జరిగితే వారు ఆ నిర్మాణాన్ని ఆపివేయాలి. లేక 6నెలలు గడువు ముగిసేసరికి వారు ఒకవేళ నిర్మాణం పూర్తి కాకపోయినా తిరిగి వారి అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తాడు శ్రీకృష్ణుడు.

PC:youtube

నిర్మాణం

నిర్మాణం

పాండవులు అందుకు అంగీకరించి నిర్మాణంలో మునిగిపోతారు.అయితే ఆ వూరిలో పనిచేసే మహిళ చాలా అర్ధరాత్రి వరకూ పనిచేస్తూ వుంటుంది.మరి తాను తన పని కోసం తెల్లవారుజామునే తిరిగి లేచి దీపాన్ని వెలిగిస్తుంది.

PC:youtube

సూర్యోదయం

సూర్యోదయం

ఆ దీపపు కాంతితో పాండవులు సూర్యోదయం కాబోతోందనిచెప్పి ఆ మెట్ల యొక్క నిర్మాణాన్ని ఆపివేస్తారు.ఆ విధంగా ఆ మెట్లు అనేవి సగంలోనే పూర్తికాకుండా ఆగిపోయాయని అక్కడివారు నమ్ముతారు.

PC:youtube

బాతూ కీ లడీ

బాతూ కీ లడీ

శ్రీకృష్ణుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాండవులు మెట్లమార్గాన్ని ఆపి వేసి తిరిగి వారి అజ్ఞాతవాసాన్ని కొన సాగిస్తారు. ఇక మహాభారత కాలంలో బాతు అనే రాళ్ళతో నిర్మించిన ఈ ఆలయాన్ని "బాతూ కీ లడీ" అనే పేరు రావటం జరిగింది.

PC:youtube

6 ఆలయాలు

6 ఆలయాలు

ఇక్కడ 6 ఆలయాలు వుంటాయి. మరి ప్రధానఆలయం కూడా ఉంటుంది. చిన్న ఆలయాలలో విష్ణు మొదలైన దేవతామూర్తులు వుంటారు.కానీ ప్రధాన ఆలయంలో మాత్రం పరమశివుని లింగం వుంటుంది.

PC:youtube

మరో అద్భుతం

మరో అద్భుతం

మరి ఇక్కడ వున్న మరో అద్భుతం ఏంటంటే సైంటిఫిక్ గా ఆలోచించని వారిని కూడా ఆలోచనలో పడేస్తుంది. ఏంటంటే సూర్యుని యొక్క చివరి కిరణాలు అనేవి శివుడి పాదాలను తాకుతాయి.

PC:youtube

ఆలయం నిర్మాణం

ఆలయం నిర్మాణం

ఆ శివుడి పాదాలు స్పృశించకుండా సూర్యుడు అస్తమించటమనేది జరగదంట.మరి ఆ విధంగా ఈ ఆలయం నిర్మాణం అనేది జరింగిందంట. ఇక 4నెలలపాటు భూమిపై ఈ ఆలయాలు వున్నంత కాలం సూర్యుని యొక్క చివరికిరణం అనేది స్వామిని స్పృశించిన తర్వాతే సూర్యుడు అస్తమించటం జరుగుతుంది.

PC:youtube

 7కి.మీ ల దూరంలో

7కి.మీ ల దూరంలో

ఇక్కడికీ 7కి.మీ ల దూరంలో వున్న భీముడు విసిరినరాయి వుందని ఆ రాయిని కొడితే రక్తం స్రవిస్తుందని అనేక కధనాలు కూడా ప్రచారంలో వున్నాయి.

PC:youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి కాంగ్రా వెళ్ళుటకు న్యూడిల్లీ, చండీఘర్ మీదుగా రోడ్డు మార్గం ద్వారా 34 గంటలు పడుతుంది.

విమానమార్గం ద్వారా 5 గంటల 45ని. లు పడుతుంది.

pc: google maps