» »బెంగుళూరు నుండి మధురైకు ఒక వారాంతపు ప్రయాణం

బెంగుళూరు నుండి మధురైకు ఒక వారాంతపు ప్రయాణం

Posted By: Venkata Karunasri Nalluru

తమిళనాడులో గల వైగై నది ఒడ్డున ఉన్న ఒక చక్కని పురాతన నగరం మధురై.

మధురైలో రంగురంగుల గోపురాలు గల మీనాక్షి అమ్మవారి ఆలయం సులభంగా చేరుకోవచ్చును. గేట్వే టవర్లు ఇక్కడ ప్రసిద్ధి చెందింది.

టవర్ ప్రకాశవంతమైన రంగుల్లో లెక్కలేనన్ని సంఖ్యలలో గల వివిధ హిందూ మత దేవతలతో కప్పబడి ఉంటుంది. ఇటువంటి టవర్లు 14 వున్నాయి. ఈ 14లో నాలుగు తూర్పు, పడమర, దక్షిణ మరియు ఉత్తర ముఖాలు కలిగివున్నాయి. ఈ నాలుగింటిలో దక్షిణ గోపురం 170 అడుగుల ఎక్కువ పొడవైనది. తూర్పు ముఖానికి చెందిన టవర్ పురాతనమైనది.

మధురై మీనాక్షి అమ్మవారి దేవస్థానంకే కాకుండా వస్త్ర పరిశ్రమలకు మరియు మల్లెపూవులు మరియు రుచికరమైన వంటకాలకు కూడా ప్రసిద్ధి గాంచిన నగరం.

బెంగళూరు నుండి మధురైకు వారాంతంలో యాత్ర

స్టార్టింగ్ పాయింట్ : బెంగుళూరు

చేరుకోవలసిన ప్రదేశం : మధురై

సందర్శించడానికి గల ఉత్తమ సమయం : అక్టోబర్ నుండి మార్చి వరకు

మదురైకు ఎలా చేరుకోవాలి ?

విమాన ప్రయాణం : మధురైలో స్వంత విమానాశ్రయం ఉంది. మధురై నుండి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి.

రైలు ప్రయాణం : ప్రధాన రైల్వే హెడ్ మధురై జంక్షన్. ఇక్కడ నుండి బెంగళూరు, చెన్నై మరియు ఇతర అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడింది.

రోడ్డు మార్గం : మధురైకు రోడ్లు మార్గం కూడా బాగా అనుసంధానించబడింది. బెంగళూరు నుండి మధురై డ్రైవింగ్ దూరం 437 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు నుండి మధురై వైపు పుష్కలంగా బస్సులు తిరుగుతుంటాయి.

బెంగళూరు నుండి మధురైకు వారాంతంలో యాత్ర

PC : Wikipedia

రూట్ 1: బెంగళూరు - హోసూర్ - కృష్ణగిరి - ధర్మపురి - సేలం - నామక్కల్ - దిండిగల్ - మధురై, ఎన్ హెచ్ 44 మార్గం ద్వారా.

రూట్ 2: బెంగళూరు - హోసూర్ - కృష్ణగిరి - ధర్మపురి - సేలం - ఈరోడ్ - దిండిగల్ - మధురై, ఎన్ హెచ్ 544 మరియు ఎన్ హెచ్ 44 మార్గం ద్వారా.

రూట్ 3: బెంగళూరు - హోసూర్ - కృష్ణగిరి - ధర్మపురి - సేలం - అత్తూర్ - పెరంబలూర్ - తిరుచిరాపల్లి - మధురై, ఎన్ హెచ్ 38 మరియు ఎన్ హెచ్ 44 మార్గం ద్వారా.

ఎవరైతే రూట్ 1 ద్వారా మధురై చేరుకోవాలనుకుంటారో ఎన్ హెచ్ 44 మార్గం ద్వారా వారికి సుమారు 7 గంటలు పడుతుంది. ఈ రోడ్డు తమిళనాడు రాష్ట్రంలో గల సేలం మరియు దిండిగల్ వంటి కొన్ని ప్రధాన జిల్లా కేంద్రాల ద్వారా తీసుకువెళ్తుంది.

బెంగళూరు నుండి మధురైకు వారాంతంలో యాత్ర

PC : Garrett Ziegler

దిండిగల్ బిరియానికి చాలా ప్రసిద్ధిచెందినది.

ఎవరైతే రూట్ 2 ద్వారా మధురై చేరుకోవాలనుకుంటారో వారికి ఎన్ హెచ్ 544 మరియు ఎన్ హెచ్ 44 ద్వారా సుమారు 8 గంటల సమయం పడుతుంది. ఎవరైతే రూట్ 3 ద్వారా మధురై చేరుకోవాలనుకుంటారో వారికి ఎన్ హెచ్ 38 మరియు ఎన్ హెచ్ 44 ద్వారా దాదాపు 9 గంటల సమయం పడుతుంది.

వారాంతంలో బెంగుళూరు నుండి శనివారం ఉదయం ప్రారంభమై ఒక రోజు గడిపిన తర్వాత తిరిగి అక్కడ్నుంచి ఆదివారం మధ్యాహ్నం బయల్దేరి రాత్రి నగరానికి చేరుకోవచ్చు.

బెంగళూరు నుండి మధురైకు వారాంతంలో యాత్ర

PC : Raj.sathiya

ధర్మపురి మరియు దిండిగల్ వద్ద చిన్న విరామాలు :

మీరు రూట్ 1 ని ఎంచుకున్నట్లయితే క్రిష్ణగిరి లేదా ధర్మపురి బ్రేక్ ఫాస్ట్ చేయటానికి మంచి ప్రదేశాలు. భోజనం అయితే దిండిగల్ మంచి ప్రదేశం. దిండిగల్ రుచికరమైన బిరియానీకి ప్రసిద్ధి చెందిన నగరం. కాబట్టి మీరు బిరియానీ కోసం దిండిగల్ వేణు బిర్యాని వద్ద ఆగి ఆస్వాదించవచ్చును.

మధురై గురించి :

మీరు మధురై చేరుకున్న తర్వాత మీనాక్షి అమ్మ వారి దేవస్థానంను సందర్శించిన తర్వాత ఆలయం లోపల దేవాలయ గోపురాలను అనేకం వీక్షించవచ్చును. ఇది చూసిన తర్వాత తప్పనిసరిగా మీరు వేయిస్తంభాల మంటపమును వీక్షించగలరు.

ఆలయం లోపల మరో ఆకర్షణ కిలికూడు మండపం (బర్డ్ కేజ్ కారిడార్). ఈ స్థలం దేవత మీనాక్షి పేరును ఉచ్ఛరించటానికి శిక్షణ ఇచ్చిన ఆకుపచ్చని రామ చిలుకలు ఉంచడానికి ఉపయోగిస్తారు. బోనులలో మీనాక్షి అమ్మవారి నామంను ఉచ్చరించే ఆకుపచ్చని రామచిలుకలను వీక్షించవచ్చును.

బెంగళూరు నుండి మధురైకు వారాంతంలో యాత్ర

PC : Jorge Royan

తిరుమలై నాయక్ ప్యాలెస్ ఒక తప్పక చూడవలసిన స్మారకం. పర్యాటక శాఖ కింగ్ తిరుమలై నాయకర్ యొక్క చరిత్రను ప్రతి రోజు ప్రదర్శన చేస్తుంది.

మధురై వీధుల్లో అలా నడుచుకుంటూ నామమాత్రపు ధరలకే వస్త్రాలను కొనుగోలు చేయవచ్చును.

మీరు భోజన ప్రియులైనట్లయితే రుచికరమైన మధురై స్ట్రీట్ ఫుడ్ తిని ఆనందించవచ్చును.

మరింత చదవండి :

మధురై