• Follow NativePlanet
Share
» »ఐ లవ్ యు చెప్పడానికి

ఐ లవ్ యు చెప్పడానికి

Written By: Beldaru Sajjendrakishore

ప్రేమ పదం జీవితంలో ఎంతో విలువైనది. తమ ప్రేమను ప్రేయసి లేదా ప్రియుడికి తెలియజేయడానికి ఎంతో మంది ఎన్నో రకాల విధానాలను అవలంభిస్తారు. అంతే కాకుండా మరి కొంత మంది ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ఎంచుకుంటారు. అలాంటి ప్రదేశాలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. ప్రేయసికి తన మనసులోని మాటను చెప్పడానికి అనువైన ప్రాంతాల జాబితాను ఇక్కడ ఇస్తున్నాం. వాటిలో మీకు ఇష్టమైన దానిని ఎంచుకుని సాధ్యమైనంత త్వరగా అక్కడికి వెళ్లి మీ మనసులోని ఐ లవ్ యు ను చెప్పేయండి.

పాము పడగ నీడన కప్ప..ఎంత శత్రువులైనా మిత్రులను చేసే క్షేత్రం

రజస్వలకాని వారు ఇక్కడ కుర్చొంటే...భీముడు వంటచేసి గుహ కూడా ఇక్కడే

ఈ ఆలయాన్ని దర్శిస్తేనే కాశి దర్శన ఫలితం, అప్పుడే సర్వ పాపాల నుంచి ముక్తి

ఎందుకు అక్కడికే వెళ్లాలనేది మీ సమాధానమైతే అక్కడి వాతావరణ పరిస్థితులు తప్పక మీ ప్రేయసి, లేదా ప్రియుడి మనస్సును మీకు దగ్గర చేస్తుందన్నది మా సమాధానం. 

ఊటి

ఊటి

1. ఊటి

Image Source:

ప్రేమ, ప్రేమికులు అంటే మొదట గుర్తుకు వచ్చేది ఊటినే. మధ్య తరగతి కుటుంబ నుంచి కాస్త ఉన్నత స్థాయి కుటుంబాల వరకూ వధువరులు ఈ ప్రాంతాన్నే తమ హనీమూన్ డెస్టిని కోసం ఎన్ను కొంటారు. ఏడాది మొత్తం హనీమూన్ కు అవసరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. మైసూరుకు 128 కిలోమీటర్లు, తమిళనాడులోని కొయంబత్తూర్ కు 86 కిలోమీటర్ల దూరంలోని ఊటికి దేశం మొత్తం నుంచి రవాణా సదుపాయం బాగా ఉంది.

2. శ్రీనగర్

2. శ్రీనగర్

2. శ్రీనగర్


Image source

చుట్టూ ఎతైన మంచు కొండలు, స్వచ్ఛమైన నీటిని కలిగిన సరస్సులు ప్రకృతి లోని అందాన్నంతటిని తనలోనే అమర్చుకున్న ఈ శ్రీనర్ లవర్స్ ను రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. చలికాలంలో కంటే వేసవి కాలంలో ఇక్కడ విహరించడానికి అనుకూలం. శ్రీనగర్ లోని సరస్సులో బోట్ పడవుల్లో విహరిస్తూప్రకృతిని ఆస్వాధింస్తూ ప్రేయసితో ఊసులాడటం మాటలకు అందని ఓ అద్భుత కావ్యమనడం అతిశయోక్తి కాదేమో.

3. సింమ్లా

3. సింమ్లా

3. సింమ్లా

Image source

నెచ్చలి చేతిలో చెయ్యి వేసి చల్లని పిల్లగాలులను ఆస్వధిస్తూ ముందుకు సాగుతుంటే తెల్లని మేఘాలను మనలను దాటుకుంటూ వెలుతుండటం ఎంత హాయిని గొలుపుతుందో కదా. కేవలం ప్రేమను వ్యక్తం చేయడానికే కాకుండా మీరు హనీమూన్ ట్రిప్ కోసం సింమ్లాను ఎంచుకుంటే ఇలాంటి ఎన్నో అనుభవాలు మీకు తరుచుగా ఈ నగరంలో ఎదురవుతాయి. హిమాలయ పర్వత సానువుల్లో భాగమైన ఈ నగరంలో ఒక్కొక్కసారి నాలుగు డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. ఆ చల్లని సమయంలో వెచ్చని కోరికలకు అంతే ఉండదేమో.

4. మనాలి

4. మనాలి

4. మనాలి

Image source

ప్రేయసిని నులువెచ్చని గౌగిలోకి తీసుకుని ఐ లవ్ యూ చెప్పాలనుకునే వారి జాబితాలో హిమాచల్ ప్రదేశ్ లోని ఈ చిన్న పట్టణం కూడా తప్పకుండా ఉంటుంది. ఇందుకు ఇక్కడి భౌగోళిక పరిస్థితులు ప్రధాన కారణం. ఒక వైపున నదీ లోయలు, మరోవైపు ఆకాశాన్ని తాకే పర్వత శిఖరాలు, ఆ పర్వతాల్లో రంగురంగుల పుష్పాల వాటి వంటికి కొదువే ఉండదు. అందుకే సముద్రమట్టానికి 2050 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణానికి లవర్స్ క్యూ కడుతుంటాయి.

5. కేరళ

5. కేరళ

5. కేరళ

Image source

సముద్ర తీర ప్రాంతమైన ఈ రాష్ర్టం దేశంలో పర్యాటకంలో ముందుంటుంది. ఏకాంతంగా గడపాలనుకునే జంటలకు కేరళ సరైన ప్రాంతం. సగటు మధ్య తరగతి కుటుంబాల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకూ ప్యాకేజీలువారిగా ఇక్కడి సదుపాయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏకాంతానికి భంగం కలగకుండా గూడు పడవల్లో ప్రయాణించడం జీవితంలో పరిచిపోలేని అనుభవం. ఇక కేరళ వంటకాల్లో వేడి కోరికలను పెంచే గుణాలు ఉంటాయని చెబుతారు. అందుకే దక్షిణభారత దేశ రాష్టాల్లో చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయడానికే కాకుండా తమ హనిమూన్ ట్రిప్ లో కేరళ తప్పక ఉండేలా చూసుకుంటారు.

6.కాశ్మీర్

6.కాశ్మీర్

6. కాశ్మీర్

Image source

చల్లని వాతావరణానికి కాశ్మీర్ పెట్టింది పేరు. చుట్టూ మంచు పర్వతాల నడుమ నెచ్చలి నడుము చుట్టూ చేయిని వేసి నడుచుకుంటే వెళ్లాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. ఇలాంటి వారికి కాశ్మీర్ చక్కగా సరిపోతుంది. అంతేకాకుండా చిలిపి ఆలోచనలను రెట్టింపు చేసే స్వభావం కలిగిన కుంకుమపువ్వూ కూడా దొరుకుతుంది. అయితే చలికాలంలో కంటే వేసవి కాలంలో కాశ్మీర్ ను హనీమూన్ కోసం ఎన్ను కుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా గూడు పడవల్లో ప్రయాణం మంచి అనుభూతిని కలిగిస్తుంది.

7. డార్జిలింగ్

7. డార్జిలింగ్

7. డార్జిలింగ్


Image source

పశ్చిమ బెంగాల్ లోని ఈ పట్టణం సముద్ర మట్టానికి 6700 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి వాతావరణం, పరిసర ప్రాంతాలు ప్రేమికులతో పాటు కొత్త జంటలకు కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే హనిమూన్ ప్యాకేజ్ అందించే వారి జంటలకు డార్జిలింగ్ ను మొదటగా చెబుతారు. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఎప్పుడూ 15 డిగ్రీల సెంటీగ్రేట్ ను దాటదు. దీంతో ఏడాది మొత్తం డార్జిలింగ్ హనిమూన్ కు అనువుగా ఉంటుందనడంలో సందేహం లేదు.

8. గోవా

8. గోవా

8. గోవా


Image source

సముద్ర తీర ప్రాంతమైన గోవా కేవలం మనకే కాకుండా విదేశీయులకు కూడా అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతం అనడంలో సందేహం లేదు. ఇక చాలా మంది తమ తమ ప్రేమను వ్యక్తం చేయడానికే కాకుండా హనిమూన్ ట్రిప్ లో గోవా ఉండేలా చూసుకుంటారు. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు గిఫ్ట్ గా గోవాకు హనూమూన్ పంపిస్తుటాయి. ఇక్కడి హోటల్, రిసార్టులు కూడా ప్రతి వర్గం కోసం సదుపాయాలు కల్పిస్తున్నాయి.

9. కూర్గ్

9. కూర్గ్

9. కూర్గ్

Image source

కర్నాటకలో ప్రముఖ హిల్ స్టేషన్ అయిన కూర్గ్ కూడా లవర్స్ తో పాటు హనీమూన్ జంటలకు ఇష్టమైన పర్యటక ప్రాంతం అనడంలో సందేహం లేదు. చిరుజల్లుల్లో తడుస్తూ ప్రియ సఖితో నడవటం ఎవరికి ఆనందం కలిగించదు. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం చలికాలంలో కూడా హనిమూన్ జంటలను రారమ్మని ఆహ్వనం పలుకుతుంది. ఇక్కడ కూడా సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేట్ దాటదు.

10.లడక్

10.లడక్

10.లడక్

Image source


హిమాలయ ప్రాంతాలకు చెందిన ఈ పట్టణం సముద్ర మట్టానికి 9800 అడుగుల ఎత్తులో ఉంది. మిగిలిన హనిమూన్ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడికి కొత్త జంటలు వెల్లడం తక్కువే. ఇందుకు రవాణా సౌకర్యాల కొరతతో పాటు కొన్ని సమాజిక పరిస్థితులు కూడా కారణం కావచ్చు. అయితే ప్రకృతి తో పాటు సమాజిక పరిస్థితులు అనుకూలించినప్పుడు కొత్త జంటలు కాశ్మీర్ లోయ ప్రాంతంలోని లడక్ కు వెళ్లవచ్చు.

 11.ఖజురహో

11.ఖజురహో

11.ఖజురహో

Image source

ఖజురాహో ఖజురాహో ప్రదేశ అందాలు అద్భుతం. వర్ణించ నలవి కానివి. అక్కడ కల రాతి పై ప్రేమ గాధలు మీ మనసులను ఆనందింప చేస్తాయి. ఆమె లేదా అతను మీ ప్రేమకు దాసోహం అనేలా చేస్తాయి. మీ ప్రపోసల్ పెట్టేందుకు ఇది సరైన ప్రదేశం. దానికి ఆమె వ్యతిరేకం చెప్పదు. అంతే కాకుండా ఇక్కడి వెళ్లిన వారికి లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు కూడా చూపిస్తారు.

12. ఉదయ్ పూర్

12. ఉదయ్ పూర్

12. ఉదయ్ పూర్

Image source


భారత దేశంలో రాజస్థాన్ కు ఎడారి రాష్ట్రమన్న పేరు ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో అందమైన సరస్సులు ఉన్న ఉదయపూర్ కూడా ఉంది. ఈ ఉదయపూర్ ను సిటీ ఆఫ్ సన్ సెట్ (సూర్యాస్తమయ నగరం) మరియు సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్) అని కూడా పిలుస్తారు. స్థానికులు దీనిని శ్వేత నగరం అని కూడా అంటారు. ఉదయపూర్ ఉదయపూర్ నగరం ఎంతో గ్లామరస్ ప్రదేశం. మీ మనోభావాలను తెలియ పరచేందుకు ఈ ప్రదేశం సరైనది. మీరు తెలిపే ఐ లవ్ యు కు ఈ ప్రదేశం మంచి వాతావరణం కలిగి వుంది.

13. పాండిచ్చేరి

13. పాండిచ్చేరి

13. పాండిచ్చేరి

Image source

ఎంతో అందమైన పాండిచేరి బీచ్ లు మీ ప్రేయసి మదిని దోచేందుకు కొత్త జీవితం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని హంగులూ కలిగి వున్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాలంటైన్ రోజు నాటికి పాండిచేరి చేరి ఆనందించండి.

14. లక్ష ద్వీప్

14. లక్ష ద్వీప్

14. లక్ష ద్వీప్

Image source

లక్ష ద్వీప్ లక్ష ద్వీప్ దీవులు ఎల్లపుడూ, తాజా వాతారణం కలిగి ఉత్సాహం ఇచ్చేవిగా వుంటాయి. మంచి రొమాంటిక్ మూడ్ కలిగిస్తాయి. ప్రేయసీ అ లవ్ యు అంటూ మోకాళ్ళ పైనిలబడి సినిమా స్టైల్ లో ఒక గులాబి పూవు అందించండి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి