Search
  • Follow NativePlanet
Share
» »ఏప్రిల్ నెలలో ఈ ప్రదేశాల్లో హాయిగా.. విహారిద్దామా...

ఏప్రిల్ నెలలో ఈ ప్రదేశాల్లో హాయిగా.. విహారిద్దామా...

వేసవి కాలం రానే వచ్చింది...ఇక రేపోమాపో పిల్లలకి కూడా సెలవులు వస్తున్నాయి. ఏమీ చేయాలి అని అనుకుంటున్నారా??

ఎండా కాలం, పిల్లలకు సెలవులు కాస్త తీరిక.. ఎటైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలన్న తపన చాలా మందిలో ఉంటుంది. పిల్లలతో కలసి ఎక్కడికైనా వెళ్ళాలానుకుంటున్నారా?? చల్లగా సేద తీరడానికో... సెలవుల్ని సరదాగా గడపడానికో... విహార యాత్రలకు వెళుతుంటాం. ప్లాన్‌ చేస్తుంటాం. మీకు తెలుసా? మీ విహార యాత్రని మరింత సౌకర్యంగా మార్చుకోవచ్చు. వెళ్లాలనుకున్న ప్రదేశాలపై ముందే ఓ అవగాహనకి రావచ్చు.

తక్కువ ఖర్చుతో కూడుకుని ఉండాలి. పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. అలా అనువుగా, సౌకర్యవం తంగా ఉండే టూరిస్ట్ ప్రదేశాలు మన దేశంలో కోకొల్లలు. ఈ ఏప్రిల్ మాసంలో ఈ ప్రదేశాలకు వెళ్లడం ద్వారా వాతావరణంలో చల్లదనం మాత్రమే కాదు ప్రతి వేసవిలోనూ పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రకృతి ఒడిలో సేదదీరడానికి, దైనందిన జీవితంలో ఒత్తిళ్లు, కష్టాలు మరచిపోవడానికి మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు కొత్త శక్తిని శరీరంలో, మనసులో నింపుకోడానికి ఈ ప్రదేశాలు వెళ్లి చూడాల్సిందే...

ఔలి ఉత్తరాఖండ్:

ఔలి ఉత్తరాఖండ్:

హిమాలయాలను చూడాలనుకునే వారు ఔలికి వెళ్లవచ్చు. చల్లని ప్ర‌కృతి అందాలు ఈ ప్రదేశంలో కనువిందు చేస్తాయి. త్రిశూల్ పీక్, చీనాబ్ లేక్, జోషిమఠ్, రుద్రప్రయాగ్, నంద ప్రయాగ్ వంటివి ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. స్కైయింగ్, స్నో బోర్డింగ్ ట్రెక్కింగ్, క్యాంపింగ్, స్నో మొబైలింగ్, ట్యూబింగ్, రోప్ వే వంటివి ఇక్కడి యాక్టివిటీలు. డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్ లేదా హరిద్వార్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటే ఇక్కడికి వెళ్లొచ్చు.

PC: nanda devi institute of adventure sports and outdoor education

డల్హౌసి:

డల్హౌసి:

డ‌ల్హౌసి... పురాత‌న భార‌తంలో విచ్చుకున్న వెస్ట‌ర్న్ ఫ్ల‌వ‌ర్‌. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం చంబ జిల్లాలో ఉంది డ‌ల్హౌసి. హిమాల‌యాల ప‌శ్చిమ శ్రేణుల్లో విస్త‌రించిన ప‌ర్వ‌త ప్రాంతం ఇది. బ్రిటిష్ గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ లార్డ్ డ‌ల్హౌసి నిర్మించిన ప‌ట్ట‌ణం. అందుకే ఈ ప‌ట్ట‌ణానికి డ‌ల్హౌసి అనే పేరు ఖాయ‌మైంది.ఈ ప్ర‌దేశం గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే... స్విట్జ‌ర్లాండ్‌కు మీనియేచ‌ర్ రూపం. ప‌చ్చ‌ద‌నం, మంచు తెల్ల‌ద‌నం ఒక‌దానితో ఒక‌టి పోటీ ప‌డుతున్న‌ట్లు ఉంటుంది. రోడ్ల నిర్మాణం నుంచి చ‌ర్చిలు, పెద్ద బంగ్లాలు, ఒక మోస్త‌రు భ‌వ‌నాల నిర్మాణం వ‌ర‌కు ప్ర‌తిదీ స్కాటిష్‌, విక్టోరియ‌న్ వాస్తు శైలిలోనే ఉంటుంది. స‌ముద్ర మ‌ట్టానికి దాదాపుగా రెండు వేల మీట‌ర్ల ఎత్తులో ఉంది డ‌ల్హౌసి ప‌ట్ట‌ణం.

PC: Aditya7861

శ్రీనగర్:

శ్రీనగర్:

సమ్మర్ లో ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో ఎంజాయ్ చేయడానికి శ్రీనగర్ ఉత్తమమైన ప్రదేశం. పూలతోటలు, ఉద్యానవనాలు, వాటర్ ఫ్రంట్స్, హౌస్ బోట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. దాల్ లేక్, నిషాత్ గార్డెన్, చష్మే షాహి గార్డెన్, షాలిమార్ బాగ్, దాచిగం నేషనల్ పార్క్, తులిప్ గార్డెన్, పరిమహఆల్ వంటి ప్రదేశఆలు ఇక్కడ చూడదగినవి. బోటింగ్, ఫిషింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, కయాకింగ్, క్యాంపింగ్, సైట్ సీయింగ్ ఇక్కడ యాక్టివిటీలు, శ్రీనగర్ ఏయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లకు నేరుగా చేరుకోవచ్చు.

PC:Madhumita Das

కొడైకెనాల్:

కొడైకెనాల్:

కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఒక పీఠభూమి పైన ఉన్న ఈ పట్టణం తమిళనాడు లోని ది౦డుగల్ జిల్లలో ఉంది.ది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి. కోకర్స్ వాక్, బేర్ షోల జలపాతాలు, బ్ర్యాంట్ పార్కు, కొడైకెనాల్ సరస్సు, గ్రీన్ వ్యాలీ వ్యూ, సహజ చరిత్ర కలిగిన శేమ్బగానుర్ మ్యూజియం, కొడైకెనాల్ సైన్స్ అబ్జర్వేటరీ, పిల్లర్ రాక్స్, గుణ కేవ్స్, సిల్వర్ కాస్కేడ్, డాల్ఫిన్స్ నోస్, కురింజి అండవార్ మురుగన్ ఆలయం, బెరిజం లేక్ వంటివి కొడైకెనాల్ లోను, చుట్టుపక్కల ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ సందర్శించ దగిన అనేక చర్చిలు కూడా ఉన్నాయి.

PC: Flickr

తెక్కడి:

తెక్కడి:

కేరళలోని కుమ్లీ పట్టణానికి 4 కి. మీ. దూరంలో ఉంది ఈ తెక్కడి. ప్రకృతిని ఆశ్వాదించే పర్యాటకులకి తెక్కడి భూలోక స్వర్గమనే చెప్పాలి. తమిళనాడులోని మధురైకి 120 కి. మీ. దూరంలోను, కేరళలోని కొచ్చికి 180 కి. మీ. దూరంలోను, కొట్టాయం రైల్వే స్టేషన్‌కు 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘తెక్కడి' ప్రాంతం వన్యప్రాణుల నిలయంగా ప్రసిద్డికెక్కింది. ఆహ్లాదం, ఆనందం పొందాలనుకునేవారు జీవితకాలంలో ఒక్కసారైనా ‘తెక్కడి' అందచందాలను వీక్షించాల్సిందే.
తెక్కడికి వెళితే ముందుగా ఏనుగు స్వారీ చేయవలసిందే!!. మావటి చెప్పిన ప్రతి మాటా ఆది వినటం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత పెద్ద ఏనుగు ముందు మనిషి ఎంత?? అని మనకు అనిపిస్తున్నాకూడా మావటి చెప్పే మాటలని ఆది తూ. చా. తప్పకుండా పాటిస్తుంది.

PC:Sibyperiyar

వయానాడ్:

వయానాడ్:

కేరళలోని ముఖ్యమైన హిల్ స్టేషన్లలో వయనాడ్ ఒకటి. దాన్ని ‘గ్రీన్ ప్యారడైజ్' అని కూడా అంటారు. వ్యవసాయ క్షేత్రాలు, చిక్ని అడవులు, పచ్చటి కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యానికి స్వస్థత చేకూరుస్తుంది. వయల్ అంటే వరి పొలాలు. నాడు అంటే ప్రదేశం అని అర్థం. వయనాడ్‌కి దక్షిణాన 2100 మీటర్ల ఎత్తున చంబ్రా శిఖరం ఉంటుంది. అది ఎక్కడానికి శారీరక ధృఢత్వం ఉండాల్సిందే. కాని అది ఎక్కే అనుభవం ఎప్పటికీ మరువలేనిది. పైకి వెళ్లే కొద్దీ వయనాడ్ అందం విస్తృతమవుతూ పోతుంది. కొండ పైకి ఎక్కడానికి, దిగడానికి పూర్తిగా ఒక రోజంతా పడుతుంది. వయనాడ్ దగ్గర నీలిమల అనే ప్రాంతం ఉంటుంది. రకరకాల ట్రెక్కింగ్ దారులు, వివిధ రకాల అవకాశాలు ఉంటాయి. నీలిమల పైనుంచి చూస్తే పక్కనే కనిపించే మీన్‌ముట్టి జలపాతం అద్భుతంగా ఉంటుంది. ప్రత్యక్షంగా మీన్‌ముట్టి జలపాతాల దగ్గరికి కూడా వెళ్లచ్చు. ఊటీని, వయానాడ్‌ని కలుపుతూ గల రెండు కిలోమీటర్ల కొండ ప్రాంతం ఎక్కితే అతి పెద్ద మీన్‌ముట్టి జలపాతాల దగ్గరికి వెళ్లచ్చు. ఇంకో జలపాతం చేతాలయం. మీన్‌ముట్టి కంటె చిన్న జలపాతం. పలు జాతుల పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి. పక్షిపాతాళం, బ్రహ్మగిరి కొండల్లో పదిహేడు వందల మీటర్ల లోపలికి ఉంటుంది. లోతైన లోయల్లో వింత వింత రకాల పక్షులు, జంతువులు, కనీవినీ ఎరగని జాతుల మొక్కలు ఉంటాయి. పక్షిపాతాళం, మనంతవాడీ దగ్గర ఉంది. అడవి నుంచి ఏడు కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మన దేశంలోనే అతి పెద్ద డ్యామ్ బానాసుల సాగర్. వయనాడ్‌లో మసాలాలు, టీ, బాంబూ ఉత్పత్తులు, తేనె, హెర్బల్ ఉత్పత్తులు వంటివి కొనుక్కోవచ్చు.

Photo Courtesy: Vinayaraj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X